భీమ్లా నాయక్ (2022)




సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోళ్ల మేడాగాదు
గుర్రం నీళ్ల గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది

బెమ్మజెముడు చెట్టుకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఎగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులిపిల్ల

పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సోమ్లా గండు

నాయన పేరు సోమ్లా గండు
తాత పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టినపేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా

భీమ్లానాయక్

ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండు
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పు కొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లారీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించిన
ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే

భీమ్లానాయక్ భీమ్లానాయక్

ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడి ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లారీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్

గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లారి విహారం - పెట్రేగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తాలు దోస్తే


************** ***************** ************** ***********************


 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: చిత్ర

ఈసింత నన్నట్ట న న న న
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న న
ముద్దిస్తే మారాము సెయ్యవు

పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది
నాఇంటి పెనివిటివే
బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన
దేవుళ్ళ సరిసాటివే

నా బంగారి మావ…నా బలశాలి మావ
నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే
నా సుడిగాలి మావ

ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడి వేగాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు

గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

ఏ తల్లి కన్నాదో నిన్నూ
కోటి కలలకు రారాజై వెలిసినావంట
ఏ పూట పుట్టినావో నువ్వు
అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట

వెలకట్టలేనన్ని వెలుగుల్ని
నా కంట పూయించినావంట నువ్వు
ఎత్తు కొండమీది కోహినూరే గాదు
గుండెలోతు ప్రాణమైనా ఇస్తావు

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ



************** ***************** ************** ***********************

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్ 
గానం: అరుణ్ కౌండిన్య 

లాలా భీమ్లా
అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

గడ గడ గడ  గుండెలదర 
దడ దడ దడ  దున్నే బెదిరే 

అలగల గల గల గల లాలా
అలగల గల గల గల భీమ్లా (4)

అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 

పది పడగల పాము పైన 
పాదమెట్టిన సామి తోడు
పిడిగులొచ్చి మీద పడితే 
కొండ గొడుగు నెత్తినోడు

లాలా భీమ్లా
ఎద్దులోచ్చి మీద పడితే 
గుద్ది గుద్ది సంపినోడు
ఎదురొచ్చిన పహిల్వాన్ని 
పైకి పైకి ఇసిరినోడు 
లాలా భీమ్లా

లాలా భీమ్లా
అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

అలగల గల గల గల లాలా
అలగల గల గల గల భీమ్లా (4)

అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

భీమ్లా నాయక్
భీమ్లా నాయక్
భీమ్లా నాయక్


************** ***************** ************** ***********************

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, కుమ్మరి దుర్గవ్వ

కిందున్న మడుసులకా
కోపాలు తెమలవు
పైనున్న సామెమో
కిమ్మని పలకడు

దూకేటి కత్తులా
కనికరమెరుగవు
అంటుకున్న అగ్గీలోన
ఆనవాళ్లు మిగలవు

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సిగురాకు సిట్టడవి గడ్డ
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

పుట్టతేనే బువ్వ పెట్నా
సెలయేటి నీళ్లు జింక
పాలు పట్నా

ఊడల్ల ఉయ్యాల గట్టి
పెంచి నిన్ను ఉస్తాదల్లే
నించోబెట్నా

పచ్చన్ని బతికిత్తే నీకు
ఎల్లెల్లి కచ్చళ్ళ పడబోకు బిడ్డా

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సిగురాకు సిట్టడవి గడ్డ
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

అఖండ (2021)




చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి 
గానం: యస్.పి.బి.చరణ్ , యమ్.యల్.శ్రుతి

అడిగా…  అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా

చిన్న నవ్వే రువ్వి మార్చేసావే… నా తీరు నీ పేరుగా
చూపు నాకే చుట్టే కట్టేసావే… నన్నేమో సన్నాయిగా

కదిలే కలలే కాళ్లవాకిళ్ళలో కొత్తగా
కౌగిలి ఓ సగం పొలమారిందిలే వింతగా
అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా

సరిలేని సమారాలు సరిపోని సమయాలు తొలిసారి చూసాను నీతో
విడిపోని విరహాలు వీడలేని కలహాలు తెలిపాయి నీ ప్రేమ నాతో
ఎల్ల లెవీ లేని ప్రేమ నీకే ఇచ్చానులే నేస్తమా
వేళ్ళ లేనే నేనే నిన్నే ధాటి నూరేళ్ళ నా సొంతమా

కననీ విననీ సుప్రభాతాల సావాసమా
సెలవే కోరని సిగ్గులోగిళ్ల శ్రీమంతమా

అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ వాని గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా

సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు కలబోసి కదిలాయి నాతో
మనిషేమో సెలయేరు మనసేమో బంగారు సరిపోవు నూరేళ్లు నీతో

ఇన్ని నాళ్లూ లేనే లేదే నాలో నాకింత సంతోషమే
మల్లె జన్మే ఉంటె కావా లంట నీచెంత ఏకాంతమే

కదిలే కలలే కాళ్లవాకిళ్ళలో కొత్తగా
కౌగిలి ఓ సగం పొలమారిందిలే వింతగా

అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా


********************************** **********************************


 
చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శంకర్ మహదేవన్, సిద్దార్థ్ మహదేవన్, శివం మహదేవన్

భో శంభో... శివ శంభో...
ఖం ఖం కంగుమంది శంఖం
కడగమంది పంకం చావుకైన జంకం
ధం ధం ధర్మభేరి శబ్ధం
చెయ్యమంది యుద్ధం దేనికైన సిద్ధం
హే.. భయంకర లోకం నీ త్రయంబకం
రా.. మయస్కర నీ సరికే పురాంతకం
రా.. హరొంహర జటాధర 
జయించరా పరాత్పరా

భమ్ అఖండ భమ్ భమ్ అఖండా
లోక నాయకో  పాతరా
భూమిపై రాతి జెండా 

భమ్ అఖండ భమ్ భమ్ అఖండా
రాగ జ్వాలమై పాతరా
దీనులా కళ్ళ నిండా

భో శంభో... శివ శంభో...
భో శంభో... హర హర స్వయంభో (2)

వీడెవడో హరోం హర
వాడెవడో హరోం హర
ఈ తలది ఆ తలది 
నరుకురా నరుకురా
వేళ్ళు విరిచే శివోమ్ హర
కాళ్ళు విరిచే శివోమ్ హర
కీళ్లు విరిచే తోలు విరిచే
నరుకురా నరుకురా

భమ్ అఖండ  భమ్ అఖండా
లోక నాయకో  పాతరా
భూమిపై రాతి జెండా 

భమ్ అఖండ భమ్ అఖండా
రాగ జ్వాలమై పాతరా
దీనులా కళ్ళ నిండా

రం రం పాలనేత్ర ద్వారం
తెరుచుకుంటే ఘోరం
తాలదింక తిమిరం
జం జం తాండవాల తజ్యం
మోగుతుంటే తధ్యం
బ్రోవులింక దగ్ధం
ఈ ధరాతలం గుండెల్లో హలా హలం
రా దహించగా నీవే మహాలయం
రా త్రిశులివై కపాలివై
యుగానివై అఘోరివై

భమ్ అఖండ భమ్ అఖండా
లోక నాయకో  పాతరా
భూమిపై రాతి జెండా

భమ్ అఖండ భమ్ అఖండా
రాగ జ్వాలమై పాతరా
దీనులా కళ్ళ నిండా


********************************** **********************************

 
చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: గీతామాధురి, సాహితీ చాగంటి, సత్యయామిని, అదితి భావరాజు

కియ్యా కియ్యా జాదూ కియ్యా
దియ్యా దియ్యా దిల్ దే దియ్యా
మయ్యా మయ్యా మామ మియ్యా
అయ్యా బాలయ్యా..!!

తియ్య తియ్య కారలయ్య
రయ్యా రయ్యా మారాలయ్యా
తయ్యా తయ్యా తయ్యారయ్యా
అయ్యా బాలయ్యా..!!

కియ్యా కియ్యా జాదూ కియ్యా
దియ్యా దియ్యా దిల్ దే దియ్యా
మయ్యా మయ్యా మామ మియ్యా
అయ్యా బాలయ్యా..!!

తియ్య తియ్య కారలయ్య
రయ్యా రయ్యా మారాలయ్యా
తయ్యా తయ్యా తయ్యారయ్యా
అయ్యా బాలయ్యా..!!

హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా
కొబ్బరికాయ కొట్టనా బావయ్యా
హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా
కొబ్బరికాయ కొట్టనా బావయ్యా

కత్తులే దూసే కృష్ణదేవరాయ
కళ్ళతో సేసేయ్ కృష్ణుడంటి మాయ
మత్తుగా సూత్తే పోయినాది సోయ
మొత్తంగా నీకే నేను పడిపోయా

ఎయ్, కాళ్ళాగజ్జా కంకాలయ్యా
ఏగుసుక్కై ఎలగాలయ్యా
కాళ్ళు కలిపి స్టెప్పెయ్ అబ్బాయా

యా యా యా యా… జై బాలయ్య
యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
యా యా యా యా… జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా

యా యా యా యా… జై బాలయ్య
యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
యా యా యా యా… జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా
(బాలయ్య బాలయ్య బాలయ్య)



********************************** **********************************


 
చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: మోహన భోగరాజు 

జయ శంకర అభయంకర కాశీపుర శంభో
లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో

అమ్మే లేని జన్మే నీది, ఈషా
అమ్మే లేని జన్మే నీది, ఈషా
ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
ఓ, ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష

పొత్తీ పేగే కత్తిరించే వేళా
ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా

జయ శంకర అభయంకర కాశీపుర శంభో
లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో

నటరాజ విరాజమాన
కాల సర్ప భూషణ
పినాక పాణి పల్లవా
ప్రచండ చండ ధారినాం
రాతి వాతి కాపురాధి నాధ ఫాలలోచనాం
పటారూప కంఠలుంఠ విశ్వనాధ పాహిమాం

ఇచ్చావయ్యా జంట నోముల పంటా
కంటి ముందే కాలరాస్తానంటే ఎట్టా
ధర్మం కోసం దూరం అయితే ఒకడూ
దైవం అంటూ దారే మారేనొకడూ

అమ్మా అంటూ పిలిచే వాడే లేకా
ఎందుకంటా సామీ జన్మ సావు రాకా

ఓం హరహరా రా నరవరా రా
పతుతరా పలకరా పరాత్పరా

ఓం నటదొరా రా జఠాధర రా
జితకరా పరాచకాలు ఆపరా
ఓం శరవరా రా వరధరా రా
లయకరా చరాచరా చలించరా

ఓం పురహరా రా ఇహపరా రా
కృతకరా కటాక్షభిక్షనీయరా

విక్రాంత్ రోణా (2022)



చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మంగ్లీ, నకాష్ అజీజ్

గడ గడ గడ గడ
గడాంగ్ రక్కమ్మ
గడాంగ్ రక్కమ్మ

హే బాగున్నారా అందరు - గడాంగ్ రక్కమ్మ
మీ కోసం నేను హాజరు
రింగ రింగ రోజులంగా ఏసుకొచ్చాలే 
నచ్చి మెచ్చే నాటు సరుకు తీసుకొచ్చాలే

రా రా - రక్కమ్మ
రా రా - రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక

కోర మీసం నేను కొంటె సరసం నువ్వు
మన మందు మంచింగ్ కాంబినేషన్ హిట్టమ్మా 
చిట్టి నడుమే నువ్వు సిటికినేలే నేను
నిన్ను ముట్టకుండా వదిలిపెట్టేదెట్టమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా 

రా రా - రక్కమ్మ
రా రా - రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక

పిస్తోలు గుండల్లే దూకేటి మగాడే ఇష్టం
ముస్తాబు చెడేలా ముద్దుటలాడేవో కష్టం
అయ్యో ఎందుకో నా కన్ను నిన్ను
మెచ్చుకున్నది
నా వెన్ను మీటే ఛాన్స్ నీకు ఇచ్చుకున్నది

నువ్వు నాటు కోడి బాడీ నిండా వేడి
నిన్ను చూస్తే థర్మామీటర్ దాక్కుంటాదమ్మ
లలలాలి పాడి కాళ్ళ గజ్జలాడి
సలవా పలవరింతలు నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో

రా రా - రక్కమ్మ
రా రా - రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక

*********** ************* ************* *************


చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ ప్రకాష్ 

లాలీ జో లాలీ లాలీ
అన్నదీ చల్లని గాలి, మ్ మ్

లాలీ జో లాలీ లాలీ
అన్నదీ చల్లని గాలి
పాటలో పరిసరాలు
మరచిపోవాలి, మరచిపోవాలి

చందమామ వెన్నెలంత
నీకే కానుక
పక్క మీది పువ్వయ్యింది
నింగి తారక

వెండిరంగు దారాలల్లి
వెన్నెలమ్మ ఊయల వేసే
వెచ్చగా నిదురపోవే
రాజకుమారి… నా రాజకుమారి

బూచి బాబు వస్తాడని భయమా
బుజ్జి తల్లి నీ తోడై నేను లేనా
పిచ్చికల రానిస్తాన కన్నమ్మా
దూరముంచలేనా ఏ చీకటైనా

చింతలేని ముఖము అలా
చిందనివ్వు పున్నమి కల
ప్రాణాలైదూ నీకు కాపాలా

మేఘమాల కరిగి
చినుకైనా క్షణమిది
పచ్చనాకు పైనా
మెరిసిందే చిరు తడి

ఆకసాల వాకిలి దాటి
నేలతల్లి దోసిలి చేరే
నీటిబొట్టు పాడిన పాటే
ముత్యాల లాలీ, ముత్యాల లాలీ

జీవితాన నువ్వున్నావు చాల్లే
కంటితడిని తుడిచే కొన వేలై
వెంట వెంట వస్తా… నీ వెనకాలే
పాదాలతో కదిలే జత నీదై

ఊసుపోని అలకవైనా
పలుకుల చిలకవైనా
నీ సవ్వడే నాకు సందడి

సద్దు చేయకుండ నిలిపానే ఊపిరి
జాగు చేయకుండా నిదరోగ, రా మరి

చప్పున రెప్పలు మూసి
చెయ్యవే కలల స్వారి
నిండుగా నిదురపోవే
చిట్టి చిన్నారి, చిట్టీ చిన్నారి
చిట్టి చిన్నారి, మ్ మ్

********** *********** ************
చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సంజిత్ హెగ్డే, చిన్మయి శ్రీపాద, బి. అజినేష్ లోకనాథ్, అనూప్ బండారి 

హేయ్ ఫకీరా హేయ్ ఫకీరా
డుక్కు డుక్కు బండి
దూసుకెల్లే బండి
ఎక్కు ఎక్కమంటూ రమ్మన్నది

ఎత్తి కుదేస్తూనే ఎత్తుకెళ్ళి
నిన్ను ఊరు చేరుస్తుంది

వెలిగించ రారా నా కంటి చీకటి
రా రా కుమారా నీ గూటికి

హేయ్, పిల్లగాడు వచ్చాడయ్యా ఊరికి
వచ్చాడిన్ని నాళ్ళకి వచ్చాడెన్నో ఏళ్ళకి
హ హ… బహు పరాక్

హేయ్ ఫకీరా ఈ ఊరు నీకు దోస్తే
హేయ్ ఫకీరా ఈ నేల నీకు దోస్తే
హేయ్ ఫకీరా సలాం సలాం నమస్తే
హే నీ రాకకీ

డుక్కు డుక్కు బండి
దూసుకెల్లే బండి
ఎక్కు ఎక్కమంటూ రమ్మన్నది
ఎత్తి కుదేస్తూనే ఎత్తుకెళ్ళి
నిన్ను ఊరు చేరుస్తుంది

ఇచటే పొదిగి ఉంది
చిన్నతనపు అడుగుజాడ
నిన్నిలా గుర్తుపట్టి
పలకరించే గాలి కూడా
జతగా జ్ఞాపకంగా వెంట తిరిగే
గతము నీడా టెన్ టు ఫైవ్

పుట్టినూరు మట్టిలోన ఇంద్రజాలముంది
ఎంతలేసి వయసునైనా
బాల్యమల్లే మార్చుతుంది

నువు రాకముందరే
ఈ అమ్మ ఆవిరై పోయిన
వస్తావుగా నువు కడసారి చూపుగానైనా

హే పిల్లగాడు వచ్చాడయ్యా ఊరికి
వచ్చాడిన్ని నాళ్ళకి… వచ్చాడెన్నో ఏళ్ళకి
హ హ… బహు పరాక్

హేయ్ ఫకీరా ఈ ఊరు నీకు దోస్తే
హేయ్ ఫకీరా ఈ నేల నీకు దోస్తే
హేయ్ ఫకీరా సలాం సలాం నమస్తే
హే నీ రాకకీ


**** ************** *************

చిత్రం: విక్రాంత్ రోణా (2022)  
సంగీతం: బి. అజనేష్ లోక్ నాథ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి & Ve.మదన్ కుమార్ 
గానం: హర్షిక దేవనాథ్ , దీపక్ బ్లూ, బి. అజినేష్ లోకనాథ్, అనూప్ బండారి 

రాత్రి గుర్రం మీద స్వారి
వీచే గాలి జతగా చేరి
కొల్లగొట్టే బందిపోటు
చీకటిలో దొంగలాగా

గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ

గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ

నిత్యం అన్నం తినిపిస్తూనే
బూచోదోస్తాడు అనింది అమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ

వేటగాళ్లు అంతా మాయం
గర్జిస్తూనే అడవి సింహ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ
గుమ్మ బంద గుమ్మ గుమ్మ

మెరుపులు తర తర బడెలే
గగనముకే గడగడలే
భయముకే అలజడి మొదలే
వచ్చాడు తలొంచరా

వాల్తేరు వీరయ్య(2023)




వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ బాస్ పార్టీ

నువ్వు లుంగీ ఎత్తుకో హెయ్
నువ్వు షర్టు ముడేస్కో హెయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో హెయ్
బాసొస్తుండు బాసొస్తుండు

నువ్వు లైట్లేస్కో హెయ్
నువ్వు కలర్ మార్చుకో హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో హెయ్
బాసొస్తుండు బాసొస్తుండు

డీజే వీరయ్య

హే క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
షరా షరా మామూలే

హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే
కొత్తగ ఉండదు ఏ మూలే

బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
రీచ్ పెద్దగ ఉండదులే

క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే
మాస్ పెద్దగ పండదులే

అరె వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హూ

డీజే వీరయ్య

నువ్వు బాటిల్ అందుకో హెయ్
నువ్వు గ్లాసందుకో హెయ్
నువ్వు సుక్కేస్కో హెయ్
బాసొచ్చిండు కిక్కిచ్చిండు

హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే
హీటే ఉండదు ఎందుకులే

గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదిలే
సిల్లీ సిల్లీగుంటదిలే

టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
ప్రైవసీ అస్సలు ఉండదులే

పెంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే
రెంటే చాలా అయితదిలే

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హూ

నువ్వు డప్పందుకో హెయ్
నువ్ డోలందుకో హెయ్
నువ్ బూరందుకో హెయ్
ఎయ్ బాసొచ్చిండు రాఫ్ఫాడిస్తుండు

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ ఓయ్

డీజే వీరయ్య హా హా హా
అదిరిపోనాది పార్టీ పార్టీ పార్టీ


చిత్రం : వాల్తేరు వీరయ్య(2023)
సంగీతం :దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం :దేవి శ్రీ ప్రసాద్ 
గానం: హరి ప్రియ,అజిజ్ ,దేవి శ్రీ ప్రసాద్ 



శ్రీరస్తు-శుభమస్తు (1981)

చిత్రం : శ్రీరస్తు-శుభమస్తు (1981)
సంగీతం : జె. వి. రాఘవులు   
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల   

పల్లవి :

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి
కవ్వింతల నుంచి కౌగిలింతల దాక
కౌగిలింతల నుంచి కల్యాణం దాకా


శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి 
కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి
కవ్వింతల నుంచి కౌగిలింతల దాక
కౌగిలింతల నుంచి కల్యాణం దాకా

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి
కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

చరణం 1 : 

ప్రేమకు వచ్చే పెళ్ళీడు... పెద్దలు మెచ్చే మా జోడు
లగ్గం కుదిరేదెన్నటికో... పగ్గాలెందుకు ముద్దాడు
ప్రేమకు వచ్చే పెళ్ళీడు... పెద్దలు మెచ్చే మా జోడు
లగ్గం కుదిరేదెన్నటికో... పగ్గాలెందుకు ముద్దాడు
మనసు మనసు మనువాడె... మనకెందుకులే తెరచాటు
నీ అరముద్దులకే విజయోస్తు... నీ అనురాగానికి దిగ్విజయోస్తు

శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి
కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి