శుభలగ్నం (1994)



                                     పొరుగింటి మంగళ గౌరి

పల్లవి:
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నగానట్రా టి.వీ గట్రా కొనుక్కున్నారు
మనకి మల్లే ఎవరు ఉన్నారూ?
ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళూ?
మనబతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడె ఉంది
పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దె
పొరుగింటి పుల్లకూర తెగమెచ్చుకోవద్దే
నెత్తిన పెట్టుకు చూసే మొగుడూ నీకూ ఉన్నాడే
అందని పళ్ళకు అర్రులు చాచీ అల్లరిపడొద్దే
మనకిలేక అదో ఏడుపా..
పరులకుంటె మరో ఏడుపా...
ఎందుకె ఇట్టా రోజూ మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు


చరణం 1:

ఓ... ఓ...
కాంతమ్మగారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ
జీతం
నేతచీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు ఉండే
అందం నీ సొంతం
ఉత్తిమాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
ఉన్నదానితోనె మనం సద్దుకుంటే మంచిదిగా
కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష
లక్షణం
సంపదలోనే లేదు సంతోషం
చంపకె నన్నూ నీ డాబు కోసం
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
చరణం 2:

ఓ...ఓ...
పలానా వారి మిసెస్ అంటు అంతా మెచ్చుకుంటే మీకే
గొప్ప కాదా
ఆ బోడి పదవికనీ అప్పో సొప్పో చెయ్యమంటే ఊళ్ళో
పరువు పోదా
కాణీకి కొరగానీ పరువూ ఓ పరువేనా
మగాణ్ణి తూచేదీ వాడి పర్సు బరువేనా
డబ్బులేని దర్పమెందుకూ అయ్యో చేతగాని
శౌర్యమెందుకూ
నీకు మొగుడయే యోగ్యత మనిషికి లేదే
ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు ఏడిసారు
నగానట్రా టి.వీ గట్రా కొనుక్కున్నారు
మనకిలేక అదో ఏడుపా
పరులకుంటె మరో ఏడుపా
మనబతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడె ఉంది
ఎందుకె ఇట్టా రోజూ మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు


చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

**************** **************** ********************

చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు


చిలకా ఏ తోడు లేక ఎటెపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటీ ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాకా
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెశాక

గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
వెలుగుల్నె వెలివెసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహాలం పొందావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలొ తడిసీ కనుమరుగైనావే

కొండంత అండ నీకు లేదింక కొండంత అండ నీకు లేదింక
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరీచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాసితో
అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువ్వు కను తెరిచాకా
తీరం కనబడదే ఇంకా



No comments:

Post a Comment