శ్రీవారికి ప్రేమలేఖ (1984)

చిత్రం :  శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు   

పల్లవి :

తననం తననం తననం

గమప మపని దనిసా.....
సనిదప సనిదప
దపగరి దపగరి
సనిద నిదప దపగ పగరిస సా పా గరి సా
సా సా సా సా
రీ రీ రీ రీ
గా గా గా గా
పా పా పా పా

సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధృవతార
సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధృవతార
వీణవై... వేణువై... మువ్వవై... వర్ణమై...
వీణవై.. జాణవై.. వేణువై... వెలధివై
మువ్వవై.. ముదితవై.. వర్ణమై.. నా స్వర్ణమై
నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె

సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధృవతార
నెలవంక పల్లకిలొ ఇల్లవంక దిగిరావె
సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధృవతారా

చరణం 1 :

అరుణం అరుణం ఒక చీరా.... అంబరనీలం ఒక చీరా
అరుణం అరుణం ఒక చీరా... అంబరనీలం ఒక చీరా

మందారంలో మల్లికలా ఆకాశంలో చంద్రికలా
అందాలన్నీ అందియలై.. శృంగారంలో నీ లయలై
అందాలన్నీ అందియలై.. శృంగారంలో నీ లయలై
అలుముకున్న భూతావిలా.. అలవికాని పులకింతలా
హిందోళ రాగ గంధాలు నీకు ఆందోళికా సేవగా

ఆ....ఆ....ఆ....ఆ....
సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధృవతార
నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధృవతార


చరణం 2 :



హరితం హరితం ఒక చీరా... హంసల వర్ణం ఒక చీరా
హరితం హరితం ఒక చీరా... హంసల వర్ణం ఒక చీరా
శాద్వరాన హిమదీపికలా.. శరద్వేళ అభిసారికలా

చరణాలన్నీ లాస్యాలై... నీ చరణానికి దాస్యాలై
అష్టపదుల ఆలాపనే... సప్తపదుల సల్లాపమై
పురివిప్పుకున్న పరువాల పైట సుదతినేవీవగా ఆ....

ఆ.....ఆ.....ఆ.....ఆ.....ఆ.....
సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధృవతార
నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధృవతారా...

************************ ***************** *******************

 శ్రీవారికి ప్రేమలేఖ (1984)
లిపిలేని కంటి బాస
చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి     


పల్లవి :

లిపిలేని కంటి బాస .. తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా... ఇలా... చదవనీ.. నీ రేఖనీ.. ప్రణయలేఖని

బదులైన లేని లేఖ .. బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా... ఇలా... రాయనీ.. నా లేఖనీ.. ప్రణయరేఖని

లిపిలేని కంటి బాస .. తెలిపింది చిలిపి ఆశ

చరణం 1 :

అమావాస్య నిశిలో.. కోటి తారలున్న ఆకాశం
వెలుగుతు ఉంది వేదన తానై .. విదియనాటి జాబిలి కోసం

వెలుగునీడలెన్నున్నా.. ఆ.. ఆ.. వెలగలేని ఆకాశం...ఊ..
లలలా..ఆ .. ల...ల...లా ఆ ఆ ఆ... తనన తనన తనన తనన
ఎదుగుతు ఉంది వెన్నెల తానై .. ఒక్కనాటి పున్నమి కోసం

లిపిలేని కంటి బాస .. తెలిపింది చిలిపి ఆశ

చరణం 2 :



అక్షరాల నీడలలో నీ జాడలు చూచుకునీ
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని

నీకంటికి పాపను నేనై .. నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే.. గడియ వేసుకున్నాను
ఘడియైన నీవు లేక.. గడపలేక ఉన్నాను

బదులైన లేని లేఖ .. బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా... ఇలా... రాయనీ.. నీ రేఖనీ.. ప్రణయరేఖని
లిపిలేని కంటి బాస.. తెలిపింది చిలిపి ఆశ


************************ ***************** *******************

 శ్రీవారికి ప్రేమలేఖ (1984)
మనసా తుళ్ళిపడకే
చిత్రం :  శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  జానకి   


పల్లవి :

మనసా తుళ్ళిపడకే.. అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో?
ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో?
తొందరపడితే అలుసే మనసా..... తెలుసా

మనసా తుళ్ళిపడకే... అతిగా ఆశపడకే

చరణం 1 :

ఏమంత అందాలు కలవనీ ..... వస్తాడు నిన్ను వలచి?
ఏమంత సిరి ఉంది నీకనీ ..... మురిసేను నిన్ను తలచి?
చదువా? ..... పదవా? ..... ఏముంది నీకు?
తళుకు ..... కులుకు ..... ఏదమ్మ నీకు..
శ్రుతిమించకే నీవు మనసా...


మనసా తుళ్ళిపడకే.. అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో?
ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో?
తొందరపడితే అలుసే మనసా..... తెలుసా

మనసా తుళ్ళిపడకే... అతిగా ఆశపడకే

చరణం 2 :



ఏ నోము నోచావు నీవనీ ..... దొరికేను ఆ ప్రేమఫలము
ఏ దేవుడిస్తాడు నీకనీ ..... అరుదైన అంత వరము

మనసా వినవే మహ అందగాడు
కనుకా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా...

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా ..... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

************************ ***************** *******************

శ్రీవారికి ప్రేమలేఖ (1984)
తొలిసారి మిమల్ని చూసింది
చిత్రం :  శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  జానకి   

సాకి
శ్రీమన్ మహారాజ! మార్తాండ తేజా!
ప్రియానందభోజా! మీ శ్రీచరణాభోజములకు
ప్రేమతో నమస్కరించి.. మిము వరించి
మీ గురించి ఎన్నో కలలు కన్న.. కన్నెబంగారు
భయముతో.. భక్తితో.. అనురక్తితో.. శాయంగల విన్నపములూ.. ఊ... ఊ...

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ
మసక చీకటి మద్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభముహూర్తానా....

పల్లవి :
తొలిసారి మిమల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు
ఎన్నెన్నో కథలు

జో అచ్చుతానంద.. జో జో ముకుందా..
లాలి పరమానంద.. రామ గోవిందా
జో జో...

అనుపల్లవి :

నిదురపోనీ కనుపాపలకు జోల పాడలేక..
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక...
ఇన్నాళ్లకు రాస్తున్నా
ఉహు.. ఉహు... ప్రేమలేఖ

తొలిసారి మిమల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు.. ఎన్నెన్నో కథలు

చరణం 1 :



ఏ తల్లి కుమారులో తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు

ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ
నా మనసును దోచినా చోరులు మీరు

వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి.. చప్పున బదులివ్వండి

తొలిసారి మిమల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు... ఎన్నెన్నో కథలు

చరణం 2 :

తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలో ఎనెన్నో మంటలు రేపే
ఆ... అబ్బా..
సూర్యుడు చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిటూర్పుకు జాబిలి వాడే
ఆహ్....  ఆహ్
నీ జతనే కోరుకొని లతలాగా అల్లుకొనే
నాకు మీరు మనసిస్తే.. ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి... ఇప్పుడే బదులివ్వండి

తొలిసారి మిమల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు... ఎన్నెన్నో కథలు

No comments:

Post a Comment