పల్లవి:
ఓ.. ఓ.. ఓ.. ఓ...
సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే
నడిరేయి జాములో తడి లేని సీమలో...
సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే
చరణం 1:
బతుకే బరువు ఈ నేలకి.. కరుణే కరువు ఈ నీటికి
వెలుగే రాదు ఈ వైపుకి.. శ్వాసే చేదు ఈ గాలికి
ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి
ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి
నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు
అందాల చిలక అపరంజి మొలక అల్లాడకే అంతగా
పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్ని కరిగించగా
చరణం 2:
ఏవైపునందో ఏమో మరి జాడే లేదే దారి దరి
ఏమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి
నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని
నీకళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని
పరుగాపని పాదలతో కొనసాగని నీ యాత్రని
శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య
ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా

చిత్రం: అంతఃపురం (1999)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: జానకి
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: జానకి
**************** ****************** *********************
పల్లవి:
కళ్యాణం కానుంది కన్నె జానకికీ
కళ్యాణం కానుంది కన్నె జానకికీ..
వైభోగం రానుంది రామచంద్రుడికీ
వైభోగం రానుంది రామచంద్రుడికీ
దేవతలే దిగి రావాలి.. జరిగే వేడుకకీ
రావమ్మా సీతమా.. సిగ్గు దొంతరలో
రావయ్యా రామయ్యా.. పెళ్ళి శోభలతో
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రంలాగా
ఊరేగే పువ్వుల్లో.. చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే..ఏ.. అన్నీ నీ కోసమే..ఏ..ఏ
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రంలాగా
చరణం 1:
లలల.. లలలల..
నాలో ఎన్ని ఆశలో.. అలల్లా పొంగుతున్నవీ
నీతో ఎన్ని చెప్పినా.. మరెన్నో మిగులుతున్నవీ
కళ్ళల్లోనే వాలీ.. నీలాకాశం అంతా.. ఎలా ఒదిగిందో
ఆ గగనాన్ని ఏలే.. పున్నమి రాజు ఎదలో.. ఎలా వాలాడో
నక్షత్రలన్నీ ఇలా కలలై వచ్చాయీ
చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా..
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రంలాగా
చరణం 2:
ఇట్టే కరుగుతున్నది.. మహాప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నది.. ఎలా కాలాన్ని ఆపడం
మదిలా మంటే.. నేడు తీయని శృతిగా మారి.. ఎటో పోతుంటే
కావాలంటే చూడు.. ఈ ఆనందం మనతో.. తను వస్తుందీ..
ఈ హాయి అంతా.. మహా భద్రంగా దాచి
పాపాయి చేసి.. నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే.. నీ చేతికియ్యలేనా..
ఆకాశం అంతఃపురమయ్యిందీ.. నాకోసం అందిన వరమయ్యిందీ
రావమ్మా మహరాణి.. ఏలాలీ కాలాన్నీ
అందీ ఈ లోకమే.. అంతా సౌందర్యమే..ఏ..
ఆకాశం అంతఃపురమయ్యిందీ.. నాకోసం అందిన వరమయ్యిందీ
చిత్రం: అంతఃపురం (1999)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర
**************** ****************** *********************
పల్లవి:
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
చరణం 1:
గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ....
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ....
అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే .. ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహా జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
చరణం 2:
కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ....
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ....
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ.. మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం
చిత్రం: అంతఃపురం (1999)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర, ఇళయరాజా
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర, ఇళయరాజా
**************** ****************** *********************
No comments:
Post a Comment