గోదావరి (2006)



చిత్రం: గోదావరి (2006) 
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: గాయత్రి 

పల్లవి: 

నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీరమణ 
ఆ..ఆ..మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా 

రామ చక్కని సీతకి అరచేత గోరింట 
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట 
రామ చక్కని సీతకి 

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే 
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే 
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో 
రామ చక్కని సీతకి 


చరణం 1: 


ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే 

చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పే 
నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడు 
రామ చక్కని సీతకి 


చరణం 2: 

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా 
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే 
చూసుకోమని మనసు తెలిపె మనసు మాటలు కాదుగా 


చరణం 3: 


ఇందువదన కుందరదనా మందగమనా భామా 
ఎందువలన ఇందువదన ఇంత మదనా... ప్రేమ


************ *************** *************

చిత్రం : గోదావరి (2006) 
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్ 
గీతరచయిత : వేటూరి 
నేపధ్య గానం :  ఉన్నికృష్ణన్, చిత్ర 



పల్లవి: 

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా 
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా 
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా 
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా 

చరణం 1: 

చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు 

అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు 
కన్నీరైనా గౌతమి కన్నా 
తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా 
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా 



చరణం 2: 


నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా 
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా 

గతమేదైనా స్వాగతమననా 

నీ జతలోనే బ్రతుకనుకోనా రాముని కోసం సీతలా 

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా 

నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా 
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా 
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా


************ *************** *************

చిత్రం: గోదావరి (2006)

సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: చిత్ర, , శంకర్ మహదేవన్

పల్లవి:


రార రారా రార రారె రార రారా రార రా

రార రారా రార రారె రార రారా రార రా హో

విధిలేదు తిధిలేదు ప్రతిరోజూ నీదేలేరా

పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా
ఈదేశం అందించే ఆదేశం నీకేరా...
నీశంఖం పూరించే ఆవేశం రానీరా..
రేపూ మాపూ నీవేరా...

మనసా గెలుపు నీదేరా.... మనిషై వెలిగిపోవేరా...

తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా... నీదేరా

చరణం 1:


మనసులోనే మార్గముంది తెలుసుకోరా ఇకా.. ఆ...

గురిలేని దేని బాణమింక చేరుకోదూ ఎలా?
ప్రతిరోజు నీకొక పాఠమె చదువుకుంటూ పదా
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా
రార రారా రార రారె రార రారా రార రా

మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా

ఆ ఆ ఆ.....

చరణం 2:


ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా

ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైనా రాముడైనదీ ప్రేమ కోసం కదా
ప్రతిజీవితం ఓ వెలుగు నీడలా బొమ్మలాటే కదా

మనసా గెలుపు నీదేరా

మనిషై వెలిగిపోవేరా...

************ *************** *************


చిత్రం: గోదావరి (2006) 

సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 


షడ్జమాం భవతి వేదం 

పంచమాం భవతి నాదం 
శృతి శిఖరే నిగమ ఝరే స్వరలహరే 


సా స పా ప ప ప ప మ రి స స ని స 

సా స పా ప ప ప ప మ ద ప ప 
సా స పా ప ప ప ప మ రి స స ని స 
సా స పా ప ప ప ప మ ని ద ప 



ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి 

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి 
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి 
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి 
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా 
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు యెదురీతేగా 

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి 
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి 

చరణం 1: 

సావాసలు సంసారలు చిలిపి చిలక జోస్యం 
వేసే అట్లు వెయ్యంగానె లాభసాటి బేరం 
ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం 

ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం 

ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ? 
నది వూరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాదా 


చరణం 2: 

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు 
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు 
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి 
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి 
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు 
అల పాపి కొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా


************ *************** *************

చిత్రం: గోదావరి (2006)

సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సునీత

పల్లవి:


అందంగా లేనా అస్సలేం బాలేనా

నీ ఈడూ జోడూ కాననా
అలుసైపోయానా అస్సలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా

చరణం 1:


కనులు కలపవాయే మనసు తెలుపవాయే

పెదవి కదపవాయే మాటవరసకే
కలికిచిలకనాయే కలతనిదురలోయే
మరవలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వొచ్చి అడగాలి అన్నట్టు
నే బెట్టు చేశాను ఇన్నాళ్లుగా

చరణం 2:


నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా

కనులకబురు తెచ్చా తెలుసు నీకది
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు
మహా తెలియనట్టు నటన ఏలది
వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే
ఏనాడు తాకేసి తరిమేసి పోలేదుగా

No comments:

Post a Comment