చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా
ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ
ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా
చరణం 1 :
కూలికెళ్తే నాకే రారా.. చేను వున్నాది
కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది
కూలికెళ్తే నాకే రారా.. చేను ఉన్నాది
కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది
ఇంకేడకైనా ఎల్లావంటే..ఏ.. ఏ..ఇంకేడకైనా ఎల్లావంటే
నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు
నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది
ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా
చరణం 2 :
ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు
వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు
ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు
వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు
నీ చపల బుద్ది సూపావంటే..ఏ... ఏ..
మనిషి నాకు దక్కవింక.. మంచిదాన్ని కాను ఆనక
ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా
చరణం 3 :
పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు
రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు
పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు
రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు
నే తెల్లవార్లు మేలుకుంటే.. నే తెల్లవార్లు మేలుకుంటే
ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని
ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని
ఈది ఈది.. కుళ్ళుకుంటాది
ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా
ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ
ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా
***** ******** *************
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి:
తాగితే మరచిపోగలను... తాగనివ్వదు
మర్చిపోతే తాగగలను... మరువనివ్వదు
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే ...
చరణం 1:
ఒకరికిస్తే మరలి రాదూ ..ఓడిపోతే మరిచిపోదూ
ఒకరికిస్తే మరలి రాదూ ..ఓదిడిపోతే మరిచిపోదూ
గాయమైతే మాసిపోదూ ... పగిలిపోతే అతుకుపడదూ
మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..మనసు గతి ఇంతే
చరణం 2:
అంతా మట్టేనని తెలుసూ... అదీ ఒక మాయేనని తెలుసూ
అంతా మట్టేనని తెలుసూ ... అదీ ఒక మాయేనని తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో ... తీయదనం ఎవరికి తెలుసూ
మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే...మనసు గతి ఇంతే
చరణం 3:
మరుజన్మ ఉన్నదో లేదో ...ఈ మమతలప్పుడేమౌతాయో
మరుజన్మ ఉన్నదో లేదో ... ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా
మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే
***** ******** *************
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి:
నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్..
నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్..
చరణం 1:
నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి
నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి
నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి
తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి..
హ హ హ హ హ... డోంట్ కేర్...
నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది..
చరణం 2:
మనసులు దాచేటందుకు పైపై నవ్వులు ఉన్నాయి
మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి
ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి
ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..
డోంట్ కేర్....
నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది..
చరణం 3:
మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి
బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్
బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్
అగ్గిపుల్ల గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసేయ్..
డ్రైవ్ ది డెవిల్ అవుట్..హ హ హ హ హ హ...
నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్....
***** ******** *************
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి:
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..
చరణం 1:
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాల వలే నాలో
పలికినది..... పలికినది.... పలికినది
చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా
కడలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...
చరణం 2:
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు
వెలసినవి..... వెలసినవి... వెలసినవి...
వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
ఎదుట నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...
***** ******** *************
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
కడవెత్తుకొచ్చిందీ... ఈ ఈ ఈ... కన్నెపిల్ల.. ఆ ఆ..
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కాడెత్తుకొచ్చాడూ...ఊ ఊ ఊ... గడుసుపిల్లడు.. ఊ ఊ..
వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
చరణం 1:
పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి
పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి
పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి
వెళుతుంటే...చూడాలి..
వెళుతుంటే చూడాలి దాని నడక
అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
చరణం 2:
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు
బిరుసైన..కండరాలు..
బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు
వస్తుంటే.. చూడాలి
వస్తుంటే చూడాలి వాడి సోకు
వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
చరణం 3:
తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
దున్నుతుంటే ...చూడాలి
దున్నుతుంటే చూడాలి వాడి జోరు
వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
చరణం 4:
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
చూస్తుంటే చాలు దాని సోకు మాడ
పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
***** ******** *************
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
ఆ... ఆ... ఆ... ఆ...
ఎవరో రావాలి..
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి
ఎవరో రావాలి....
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి..
ఎవరో రావాలి....
చరణం 1:
మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..
మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..
మరిచి పోయిన మమత లాగ...
మరిచి పోయిన మమత లాగ... మమతలుడిగిన మనసు లాగ
మాసిపో.. తగునా...
ఎవరో రావాలి....
చరణం 2:
ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..
ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..
కొనగోట మీటిన చాలు...
కొనగోట మీటిన చాలు... నీలో కోటి స్వరములు పలుకును..
ఎవరో రావాలి.....
చరణం 3:
రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు
రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు
శక్తి మరచి.. రక్తి విడచి...
శక్తి మరచి.. రక్తి విడచి... మత్తు ఏదో మరగినావు
మరిచిపో... తగునా...
ఎవరో రావాలి....
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి..
ఎవరో రావాలి....
***** ******** *************
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి:
ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఈ భగ్న హృదయం ..ఈ అగ్ని గుండం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం
చరణం 1:
ప్రేమభిక్ష నువ్వే పెట్టీ
ఈ పేద హృదయం పగులగొట్టీ
పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివనిదీ తాకలేనూ ..ఇంకెవరినీ అడుగలేనూ
బ్రతుకు నీకు ఇచ్చాను.. చితిని నాకు పేర్చావు
ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం ??
చరణం 2:
ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ ...కాలిపోయి బూడిదే మిగలనీ
ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం
చరణం 3:
మమత నింపమన్నానూ .. మనసు చంపుకొన్నావూ
మధువు తాగనన్నాను .. విషం తాగమన్నావూ
నీకు ప్రేమంటే నిజం కాదూ ...నాకు చావంటే భయంలేదూ
నీ విరహంలో బ్రతికానూ ...ఈ విషంతో మరణిస్తానూ ...మరణిస్తానూ..
No comments:
Post a Comment