ఒంటరిగా ఉన్నా నువ్వే

విజ్జూ,
ఉదయించే సూర్యుడిలో నువ్వే,
వికసించే పువ్వులో నువ్వే,
ప్రవహించే నదిలో నువ్వే,
వీచే గాలిలోనూ నువ్వే ,
నా మది నిండా నవ్వే నువ్వు...

ఎందరిని చూసినా నువ్వే,
అరే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే,
నా ప్రతి అడుగులోనూ నువ్వే,
నా ఆలోచనలన్నిట్లోనూ నువ్వే,
నా కనుల నిండా నవ్వే  నువ్వు..


ఒంటరిగా ఉన్నా నువ్వే ,
ఎందరి మధ్యన ఉన్నా నువ్వే,
నా ఆనందలోనూ నువ్వే,
నా ప్రతి బాధలోనూ తోడువి నువ్వే,
నా ఓదార్పువి నవ్వే నువ్వు ..
 

నా ధైర్యం నువ్వే,
నా పొగరూ నువ్వే,
నా కోపం నువ్వే ,
నా కన్నీరువీ నువ్వే,
నా ప్రతిబింబం నువ్వే,
నా కమ్మని కలవి నువ్వే,


తనువు విడిచే రోజు వరకు నా తోడువి నువ్వే,
నేల తల్లి ఒడి చేరు వరకు  నా ఒడిలో నువ్వే,
ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం నువ్వే,
ప్రతిరొజూ ప్రేమిస్తూ ప్రతి నిమిషం ఆరాధిస్తా ..

                       
                                    విజయా కిరణ్



















No comments:

Post a Comment