మంచిమనసుకు మంచిరోజులు (1958)

అనుకున్నదొక్కటి
చిత్రం :  మంచిమనసుకు మంచిరోజులు (1958)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: ఘంటసాల

సాకీ :

వేళగాని వేళలో ఊరు విడిచి దూరంగా...
కారెక్కి ఒంటిగా...
గాలిమేయ వచ్చిన బూచి... నంగనాచీ


పల్లవి :

అనుకున్నదొక్కటి...  అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే...  బుల్‌బుల్ పిట్ట
అనుకున్నదొక్కటి...  అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే...  బుల్‌బుల్ పిట్ట

గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే


అనుకున్నదొక్కటి...  అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే...  బుల్‌బుల్ పిట్ట


చరణం 1 :

చల్లని వెన్నెల కాస్తుంటే... చల్లగా ఇంట్లో నేనుంటే
తలుపుమూసి చెప్పకనే... ఏ...ఏ..ఏ..ఏ..
దౌడేసిన రాకాసి... ఓ...  రాకాసి

అనుకున్నదొక్కటి...  అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే...  బుల్‌బుల్ పిట్ట
అనుకున్నదొక్కటి...  అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే...  బుల్‌బుల్ పిట్ట


చరణం 2 :


ఏ బస్తీ కిలాడీ...
నా పేరే పల్లెటూర్ వస్తాదు రౌడీ
నీ తెలివంతాజూసి నను గెలిచావా... లేడీ
చిక్కావు చేతిలో కేడీ షోకైన... లేడీ అహ్హహ్హహా..


అనుకున్నదొక్కటి...  అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే...  బుల్‌బుల్ పిట్ట
అనుకున్నదొక్కటి...  అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే...  బుల్‌బుల్ పిట్ట


గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే


అనుకున్నదొక్కటి...  అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే...  బుల్‌బుల్ పిట్ట


************ ************ **************

రావే నా చెలియా
చిత్రం :  మంచిమనసుకు మంచిరోజులు (1958)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:

కోమల కవితా తార.. ప్రేమ సుధా ధారా
మనోహర తార.. నా మధుర సితార... ఆ..ఆ..

రావే నా చెలియా రావే నా చెలియా
చెలియా... నా జీవన నవ మాధురి నీవే...
నా జీవన నవ మాధురి నీవే....
రావే నా చెలియా..

చరణం 1:

నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై
నీ ఎల నవ్వుల పూచిన వెన్నెల... వెలుగును వేయి చందమామలై...

నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే...
నీ చిరు గాజుల చిలిపి మ్రోతలే...
తోచును అనురాగ గీతాలై...
తోచును అనురాగ గీతాలై...

రావే నా చెలియా.. చెలియా.. రావే నా చెలియా

చరణం 2:

నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే
నీ అందియల సందడిలోన... నా ఈ డెందము చిందులు వేయునే..

నీ కను గీటులె వలపు పాటలే... ఎ..ఆ..ఆ..ఆ..ఆ..
నీ కను గీటులె వలపు పాటలే... నీ కడ సురలోక భోగాలే...
నీ కడ సురలోక భోగాలే...

రావే నా చెలియా రావే నా చెలియా
చెలియా నా జీవన నవ మాధురి నీవే
రావే.. రావే.. రావే.. రావే.. నా చెలియా

************ ************ **************

చిత్రం :  మంచిమనసుకు మంచిరోజులు (1958)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత : సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం : బాలసరస్వతి

పల్లవి:

ధరణికి గిరి భారమా... గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా... కనిపెంచే తల్లికి పిల్ల భారమా

ధరణికి గిరి భారమా... గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా... కనిపెంచే తల్లికి పిల్ల భారమా

చరణం 1:

మును నే నోచిన నా నోము పండగా..
నా ఒడిలో వెలిగే నా చిన్ని నాయనా..
పూయని తీవెననే అపవాదు రానీక...
పూయని తీవెననే అపవాదు రానీక...
తల్లిననే దీవెనతో తనియించినావయ్య...

తరువుకు కాయ భారమా... కనిపెంచే తల్లికి పిల్ల భారమా
ధరణికి గిరి భారమా... గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా... కనిపెంచే తల్లికి పిల్ల భారమా

చరణం 2:

ఆపద వేళల అమ్మమనసు చెదరునా...
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా...
పిల్లల కనగానే తీరేనా.. స్ర్తీ విధి
పిల్లల కనగానే తీరేనా.. స్ర్తీ విధి
ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా...

తరువుకు కాయ భారమా... కనిపెంచే తల్లికి పిల్ల భారమా
ధరణికి గిరి భారమా... గిరికి తరువు భారమా
తరువుకు కాయ భారమా... కనిపెంచే తల్లికి పిల్ల భారమా

No comments:

Post a Comment