శ్రీనివాస కళ్యాణం (2018)

చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం


కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం (2)

రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన
శివధనువు విరిచాకే వధువుమధి గెలిచాకే
మోగింది కళ్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం
శ్రీరామ చంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి అందాల రమణి
వినగానే కృష్ణయ్య గీతామృతం
గుడిదాటి కదిలింది తనవెంట నడిచింది
గెలిచింది రుక్మిణి ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ
విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే
కళ్యాణ కలలొలికినాడమ్మ
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
ఋణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేద మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచ భూతాలు
కొలువైన మండపాన
వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది
స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది
జన్మంటు పొంది జన్మివ్వలేని
మనుజునకు సార్ధక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం

No comments:

Post a Comment