ఇన్ స్పెక్టర్ భార్య (1970)


చిత్రం :  ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం :  కె.వి. మహదేవన్
నేపధ్య గానం :  మోహన్ రాజ్, సుశీల 


పల్లవి : 

రాధను నేనైతే... నీ రాధను నేనైతే
రాధను నేనైతే... నీ రాధను నేనైతే

నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా
నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా 

చరణం 1 :

తోటనిండా.. మల్లియలు తుంటరి పాటల తుమ్మేదలు
తోటనిండా.. మల్లియలు తుంటరి పాటల తుమ్మేదలు

అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె
అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె
మల్లెలు సవరించు పై ఎదలు

గడసరి చినవాడు తోడుగ ఉంటే కరగును నును సిగ్గు పరదాలు...
గడసరి చినవాడు తోడుగ ఉంటే కరగును నునుసిగ్గు పరదాలు...
చిలిపిగ నను నీవు చేరుకుంటే.. జల జల పొంగును పరువాలు

రాధవు నీవైతే.. నా రాధవు నీవైతే
నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా 

చరణం 2 :

రాధ అంటే.. ఎవ్వరదీ
మాధవు పాదాల.. పువ్వు అది
రాధ అంటే.. ఎవ్వరదీ
మాధవు పాదాల.. పువ్వు అది
అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే
అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే
ఆమె మనసు పూచేది

తీయగ సోకే పిల్లగాలికి.. పూయని పువ్వే ఉంటుందా
తీయగ సోకే పిల్లగాలికి.. పూయని పువ్వే ఉంటుందా
కన్నుగీటే వన్నెకానికి.. కరగని జవ్వని వుంటుందా

రాధను నేనైతే... నీ రాధను నేనైతే
నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా 

No comments:

Post a Comment