సూపర్ స్టార్ కృష్ణ




1960 ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ లో ప్రముఖనటుడు అక్కీనేని నాగేశ్వరరావు గారికి పౌరసన్మానం జరుగుతుంది..అక్కినేనిగారికి బ్రహ్మరథం పడుతున్నారు జనం.. ఆ కోలాహలం చూసి తనూ సినీ యాక్టర్ అయి జనాలచేత ఇలాగే గుర్తింపు తెచ్చుకోవాలను కున్నాడు ,ఆ కాలేజ్ బియస్సీ డిగ్రీ చదువుతున్న ఘట్టమనేని.శివరామక్రిష్ణమూర్తి అనే యువకుడు.
అనుకున్నదే తడువుగా మద్రాసు బయలుదేరాడు..అప్పటికే తెనాలి వాస్తవ్యులైన గుమ్మడి, జగ్గయ్య లాంటివారు సినిమాలలో గుర్తింపు తెచ్చుకొని వున్నారు. వారిని కలిసాడు ఆ యువకుడు...నీకు వయస్సు తక్కువనీ, ఇంకో రెండు సంవత్సరాలు ఆగి రమ్మని సలహా ఇచ్చారు వారు.మళ్ళీ తెనాలి వచ్చిన అతను ప్రజానాట్యమండలిలో చేరి నాటకాలు ,జానపదనృత్యం చేయడం మొదలు పెట్టాడు..ఇంతలో యల్ వి ప్రసాద్ తనయుడు ఆనందరావు "కొడుకులు-కోడళ్ళు"సినిమా తీస్తూ కృష్ణమూర్తిగారికి కబురు పంపారు..స్క్రీనింగ్ టెష్ట్అయిన తరువాత ఒక పాత్ర కు ఆయనను ఎంపిక చేశారు.. కొద్దిరోజులు జరిగిన షూటింగ్ జరిగి ఎందుకనో ఆగిపోయింది... జగ్గయ్య గారు పదండి ముందుకు అనే సినిమాలో చిన్నపాత్ర ఇచ్చారు..తర్వాత కులగోత్రాలు అనే సినిమాలో చిన్నపాత్రలో నటించాడు..అయినా గుర్తింపు రాలేదు.
ఇందులో 1964 లో ఆదుర్తి.సుబ్బారావుగారు "తేనేమనసులుసినిమా తీస్తూ కృష్ణమూర్తికి ఆఫర్ ఇచ్చాడు. విశ్వనాథ్ దగ్గర డైలాగ్స్ , హీరాలాల్ దగ్గర నత్యం శిక్షణలు ఇప్పించాడు ఆదుర్తి.. కృష్ణమూర్తి -కృష్ణ" అయ్యాడు... తేనె మనసులు 100 రోజులాడింది. అయినా కృష్ణగారికి సినిమాలు రాలేదు...మద్రాసులో శోభన్ బాబు గారితో కలిసి నాటకాలు వేయసాగాడు.

1965లో డూండేశ్వరరావు దర్శకత్వంలో "గూఢాచారి 116 :సినిమాలో హీరోగా అగ్రిమెంట్ కుదిరింది...ఇదే మొదటి జేమ్స్ బాండ్ సినిమా.. తెలుగులో.. 1966లో రిలీజ్ అయిన ఈ సినిమా కృష్ణగారి చరిత్రనే మార్చేసింది. ఆంథ్రాజేమ్స్ బాండ్ గా పేరు తెచ్చింది..అలాగే మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు సినిమాతో కృష్ణగారు యాక్షన్ హీరోగా స్థిరపడిపోయారు.. రోజుకి 16 గంటలు షూటింగ్ లోనే గడిపేవారు ఆయన.. 1969_72 లో ఏకాకంగా 62 సినిమాలలో నటించి రికార్డ్ సృష్టించారు కృష్ణగారు.
మొదటి ఈష్టమన్ కలర్ , మొదటి సినీస్కోప్ ,మొదటి 70Mm చిత్రాలలో నటించిన గొప్పతనం వీరిదే.. ఆంథ్రప్రదేశ్ లో అత్యథిక అభిమాన సంఘాలున్న హీరో కూడా ఇతనే..
"అల్లూరి.సీతారామరాజు"తెలుగు సినీచరిత్రలోనే ఒక గొప్పసినిమా గా నిలిసిపోయింది. 1962నుండి 2012 వరకు అప్రహితంగా కోనసాగాలు సినీపరిశ్రమలో కృష్ణగారు.
1965 లో ఇందిరా గారితో మొదటి వివాహం,1969లో విజయనిర్శలగారితో రెండో వివాహం జరిగింది. ఇద్దరు కొడుకులు,, ముగ్గురు కూతుర్లు.
కృష్ణగారు స్వతహాగా చాలామంచిహృదయం గలవారు.. ప్రకృతి వైపరిత్యాలు జరిగినప్పుడు సినీపరిశ్రమలో మొదట స్పందించేది కృష్ణగారే..
ఎంతోమంది కళాకారులకు చేయూతనిచ్చారు..నిర్మాతలు పారితోషికం ఎగగొట్టినా ఏమీ అనేవారుకాదు.. దర్శకులను ఇబ్బందిపెట్టి ఎరగరు..మంచి క్రమశిక్షణ కలవారు..1989లో ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు.
1942 మే 31 పుట్టిన కృష్ణగారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ

ఆత్మబలం (1964)




చిత్రం: ఆత్మబలం (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓహో హొహూఎఓ హో...
పరుగులు తీసే నీ వయసునకూ పగ్గం వేసెను నా మనసూ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

చరణం 1:

ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు
ఓహోయని పలికెను నీ వలపు
ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు
ఓహోయని పలికెను నీ వలపు
ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు
తియతీయగ మారెను నా తలపు ఒహొహొహొ హొహొహొ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

చరణం 2:

తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవూ
అహ దోబూచాడెను నా నగవూ
దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు
దోరదోరగ పండెను నీ మరులూ
ఒహొహొహొ హొహొహొ

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

చరణం 3:

లేదనిపించే నీ నడుము అహహా నాదనిపించెను ఈ క్షణము ఒహో
లేదనిపించె నీ నడుము నాదనిపించెను ఈ క్షణము
ఉందో లేదో ఈ జగము
ఉందువు నీవు నాలో సగము
ఇది నిజము కాదనుము

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహహ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

********************** ************** ***********

చిత్రం: ఆత్మబలం (1964) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: సుశీల 


పల్లవి: 

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను 

చరణం 1: 

కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి 
కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి 
రెండూ లేక పండురేకులై ఎందుకు నాకీ కనుదోయి 
ఇంకెందుకు నాకీ కనుదోయి 

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను 

చరణం 2: 

కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని 
కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని 
నిలువుగ నన్ను దోచుకుంటివి నిరుపేదగ నే 
నిలిచిపోతిని నిరుపేదగ నే నిలిచిపోతిని 

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను

********************** ************** ***********

చిత్రం: ఆత్మబలం (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

తెల్లవారనీకు ఈ రేయిని... తీరిపోనీకు ఈ తీయనీ హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని..
తీరిపోనీకు ఈ తీయనీ హాయిని...తెల్లవారనీకు ఈ రేయిని...

చరణం 1:

నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని..
ఆ కైపులో లోకాలే మరువనీ...
నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని..
ఆ కైపులో లోకాలే మరువనీ..

మనసులో మనసునై మసలనీ..
మనసులో మనసునై మసలనీ..
నీ మనిషినై మమతనై మురిసిపోనీ...

తెల్లవారనీకు ఈ రేయిని..
తీరిపోనీకు ఈ తీయని హాయిని..తెల్లవారనీకు ఈ రేయిని..

చరణం 2:

నీ కురులే చీకటులై కప్పివేయని..
ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోని..
నీ కురులే చీకటులై కప్పివేయని..
ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోని..

నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ..
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ
తడియారని హృదిలో నను మొలకలెత్తని..ఈ..ఈ..
తెల్లవారనీకు ఈ రేయిని..
తీరిపోనీకు ఈ తీయనీ హాయిని...తెల్లవారనీకు ఈ రేయిని

చరణం 3:

మల్లెపూల తెల్లదనం మనసు నిండని
అల్లరి పడుచుదనం కొల్లబోనీ..
మల్లెపూల తెల్లదనం మనసు నిండని
అల్లరి పడుచుదనం కొల్లబోనీ..

కొల్లగొన్న మనసే నా ఇల్లని
కొల్లగొన్న మనసే నా ఇల్లని
చల్లగా కాపురమూ ఉండిపోనీ...

తెల్లవారనీకు ఈ రేయిని... తీరిపోనీకు ఈ తీయని హాయిని..
తెల్లవారనీకు ఈ రేయిని..

********************** ************** ***********


చిత్రం: ఆత్మబలం (1964) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

చిటపట చినుకులు పడుతూ ఉంటే.. 
చెలికాడె సరసన ఉంటే.. 
చెట్టాపట్టగ చేతులు పట్టి 
చెట్టు నీడకై పరుగిడుతుంటే... 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 

ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే.. 
మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే.. 
మెరుపు వెలుగులో చెలి కన్నులలో 
బిత్తర చూపులు కనపడుతుంటే.. 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 

చరణం 1: 

కారు మబ్బులు కమ్ముతు ఉంటే ...కమ్ముతు ఉంటే..ఓ..ఓ.. 
కళ్ళకు ఎవరూ కనపడకుంటే...కనపడకుంటే ఆ.. 
కారు మబ్బులు కమ్ముతు ఉంటే ...కమ్ముతు ఉంటే..ఓ..ఓ.. 
కళ్ళకు ఎవరూ కనపడకుంటే...కనపడకుంటే ఆ 


జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే 
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే 
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ... 

చరణం 2: 

చలి చలిగా గిలివెస్తుంటే..ఆ హా హా 
గిలిగింతలు పెడుతూ ఉంటే..ఓహోహో... 
చలి చలిగా గిలివెస్తుంటే..ఆ హా హా 
గిలిగింతలు పెడుతూ ఉంటే.. 

చెలి గుండెయిలో రగిలే వగలే 
చెలి గుండెయిలో రగిలే వగలే 
చలిమంటలుగా అనుకుంటే... 
చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ... 

చిటపట చినుకులు పడుతూ ఉంటే.. 
చెలికాడె సరసన ఉంటే.. 
చెట్టాపట్టగ చేతులు పట్టి 
చెట్టు నీడకై పరుగిడుతుంటే... 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ 
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

********************** ************** ***********

చిత్రం: ఆత్మబలం (1964) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయీ 

బుల్లి కారున్న షోకిల అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయ 
బుల్లి కారున్న షోకిల అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 

చరణం 1: 

వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి 
సొగసులతో ఓరఓర చూపులొస్తాయ 
వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి 
సొగసులతో ఓరఓర చూపులొస్తాయి 
చూపులతో లేని పోని గీరలొస్తాయి 
ఆ గీరలన్ని జారిపోవు రోజులొస్తాయి 

బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 

కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి 
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి 
కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి 
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి 
పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి 
ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయీ... ఈ... 

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 

చరణం 2: 

మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి 
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి 
మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి 
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి 
కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి 
తొలినాడే చల్లబడి పోవునమ్మాయి 

బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 

కళ్ళు చూసి మోసపోయి కలవరించకు 
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు 
కళ్ళు చూసి మోసపోయి కలవరించకు 
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు 
ఇస్తేను హృదయమెంతో మెత్తనైనది 
ఎదురుతిరిగితే అదే కత్తి వంటిదీ... ఈ... 

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి

********************** ************** ***********

చిత్రం: ఆత్మబలం (1964) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

ఎక్కడకి పోతావు చిన్నవాడా... 

ఎక్కడకి పోతావు చిన్నవాడ 
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ 

ఎక్కడకి పోతావు చిన్నవాడ 
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ 

చరణం 1: 

కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్లలేవు 
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు 
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్లలేవు 
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు 

మనసు మనసు తెలిసినాక మారలేవు 
మనసు మనసు తెలిసినాక మారలేవు 
మారినా మనిషిగా బతకలేవు 

చరణం 2: 

నన్నిడిచి నువ్వెళితే నీవెంట నేనుంట 
నిన్నిడిచి నేవెళితే నువు బతకలేవంట 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 
నన్నిడిచి నువ్వెళితే నీవెంట నేనుంట 
నిన్నిడిచి నేవెళితే నువు బతకలేవంట 

ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా 
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా 
ప్రేమంటే ఇంతేరా పిచ్చివాడా 

ఎక్కడకి పోతావు చిన్నదానా 
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా 
ఎక్కడకి పోతావు చిన్నదానా 
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా 

చరణం 3: 

హా..పాడు ఊ.. పాడు... 

పాడమంటే పాడేది పాట కాదు 
ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు 

పాడమంటే పాడేది పాట కాదు 
ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు 
పాడమంటే పాడేది పాట కాదు 
ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు 

ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదూ 
పువ్వైనా నవ్వేనా నీకోసం పూయదు 
ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా 
నీ చూపులను ఓపలేను పిల్లవాడా 

ఎక్కడికి పోలేనూ చిన్నదానా 
నీ చూపుల్లో చిక్కుకుంటి పిల్లదానా 
ఎక్కడికి పోలేనూ చిన్నదానా 
నీ చూపుల్లో చిక్కుకుంటి పిల్లదానా

అమరశిల్పి జక్కన (1964)



చిత్రం: అమరశిల్పి జక్కన (1964) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

నిలువుమా నిలువుమా నీలవేణీ 
నీ కన్నుల నీలినీడ నా మనసు నిదురపోనీ 
నిలువుమా నిలువుమా నీలవేణీ 

చరణం 1: 

అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా 
అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా 
తడబడే అడుగుల నటనల మురిపింపులా 
తడబడే అడుగుల నటనల మురిపింపులా 

సడిసేయక ఊరించే... 
సడిసేయక ఊరించే... ఒయారపు ఒంపులా 
కడకన్నుల ఇంపులా గడసరి కవ్వింపులా 
నడచిరా నడచిరా నాగవేణీ 
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ 

చరణం 2: 

అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయశీ.. 

అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి 
అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి 
నా ఊర్వశి రావే రావే అని పిలువనా 
నా ఊర్వశి రావే రావే అని పిలువనా 

ఆ సుందరి నెర నీటూ నీ గోటికి సమమౌనా 
నా చెలి నిను మదీ దాచుకోనీ 

నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ..

******* ************ ************ ************
చిత్రం: అమరశిల్పి జక్కన (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

నగుమోము చూపించవా గోపాలా
నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

చరణం 1:

ఎదుట … ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట...
ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట ...
ఎదుట వెన్నెల పంట... ఎదలో తీయని మంట...
ఇక సైపలేను నీవే నా... ముద్దుల జంట
నగుమోము చూపించవా గోపాలా…..

చరణం 2:

వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ...
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ...
మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల..
నగుమోము చూపించవా గోపాలా ….

చరణం 3:

కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య...
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య...
నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య...
నగుమోము చూపించవా గోపాలా …

నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ


******* ************ ************ ************
చిత్రం: అమరశిల్పి జక్కన (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:

ఏదో..ఏదో..
ఏదో.. గిలిగింత...ఏమిటీ వింత..ఆ..
ఏమని అందును... ఏనాడెరుగను ...
ఇంత పులకింత..ఆ..ఆ...కంపించె తనువంత

ఏదో..ఏదో.. ఏదో.. గిలిగింత...ఏమిటీ వింత..
ఏమని అందును... ఏనాడెరుగను ...
ఇంత పులకింత.....కంపించె తనువంత

చరణం 1:

వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే..ఏ..ఏ..
అహ.....ఆ...ఆ...ఆ...ఆ...
వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే..
నీవు తాకినా నిముషమందె నా యవ్వనమ్ము పూచే..ఏ..ఏ..

ఏదో..ఏదో..

కన్ను కన్ను కలిసే...బంగరు కలలు ముందు నిలిచే..
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
కన్ను కన్ను కలిసే...బంగరు కలలు ముందు నిలిచే..
పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిసే...ఏ..ఏ..ఏ...

ఏదో..ఏదో..

చరణం 2:

గానమైన నీవే..నా ప్రాణమైన నీవే...
గానమైన నీవే..నా ప్రాణమైన నీవే...
నన్ను వీణగా మలచుకొనెడు గంధర్వ రాజు వీవే...

ఏదో..ఏదో..

నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ..
నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ..
యుగయుగాలు నీ నీలి కనుల సోయగము చూడనీవే..ఏ..ఏ...

ఏదో..ఏదో..
ఏదో.. గిలిగింత...ఏమిటీ వింత..
ఏమని అందును... ఏనాడెరుగను ...
ఇంత పులకింత...ఆ..ఆ....కంపించె తనువంత

ఏదో..ఏదో..


******* ************ ************ ************
చిత్రం: అమరశిల్పి జక్కన (1964) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: ఘంటసాల 

పల్లవి: 

ఓహో ఓ ఓ.... 
ఓహోహో.... 
ఓ ఓ.... 

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో 
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఓ .. ఓ .. 

చరణం 1: 

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి 
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి 
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ..ఈ నల్లని రాలలో 

చరణం 2: 

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు 
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు 
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే.... 
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు ..ఈ నల్లని రాలలో.. 

చరణం 3: 

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును 
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును 
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ..ఈ నల్లని రాలలో..

******* ************ ************ ************

చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..

అందాల బొమ్మతో ఆటాడవా..
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..

అందాల బొమ్మతో ఆటాడవా

చరణం 1:

కనులు చేపలై గంతులు వేసె..
మనసు తోటలో మల్లెలు పూసె..
దోసిట వలపుల పూవులు నింపీ..
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ..

అందాల బొమ్మతో ఆటాడవా...

చరణం 2:

చల్ల గాలితో కబురంపితిని ...
చల్ల గాలితో కబురంపితిని...
చందమామలో వెదకితి నోయీ...
తార తారనూ అడిగితి నోయీ....
దాగెద వేలా? రావోయీ...

అందాల బొమ్మతో ఆటాడవా...

చరణం 3:

నల్లని మేఘము జల్లు కురియగా...
నల్లని మేఘము జల్లు కురియగా...
ఘల్లున ఆడే నీలినెమలినై....
నిను గని పరవశమందెద నోయీ...
కనికరించి ఇటు రావోయీ...

అందాల బొమ్మతో ఆటాడవా..
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..
అందాల బొమ్మతో ఆటాడవా...

అగ్గి పిడుగు (1964)


చిత్రం :  అగ్గి పిడుగు (1964)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : ఘంటసాల, జానకి

పల్లవి:

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది

హాయ్...
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది


చరణం 1:


కనులలో నీ కనులలో.. నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో.. నా కోరికలూరినవీ

ఆహ.. ఆహ... ఆ..
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది.. గిలిగింతగ తోచినది


ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

చరణం 2:

ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు

ఆహ.. ఒహో.. ఆ..
నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు.. మంత్రించివేయకు

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ... ఆహ... ఆహ... అహ... 
ఊహూహు.. హూ..హుహు.. 

పుణ్యభూమి నా దేశం నమోనమామి...


నేడు  స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి సంర్భంగా మేజర్ చంద్రకాంత్ సినిమా నుండి 💐💐💐





చిత్రం : మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : జాలాది
నేపధ్య గానం : బాలు

పల్లవి :

పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి
పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి
నన్ను కన్న నా దేశం నమోనమామి
అన్నపూర్ణ నా దేశం సదాస్మరామి
మహా మహుల కన్నతల్లి నా దేశం
మహోజ్వలిత చరితగన్న భాగ్యోదయ దేశం... నా దేశం
పుణ్యభూమి నాదేశం నమోనమామి
ధన్యభూమి నాదేశం సదాస్మరామి


చరణం 1 :

అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే
మానవతుల మాంగల్యం మంటగలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన
మహావీరుడు... సార్వభౌముడు...


అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన్న
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన్న
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు
నారుపోశావా.. నీరుపెట్టావా.. కోతకోశావా.. కుప్పనుర్చావా
ఒరేయ్ తెల్లకుక్కా... కష్టజీవుల ముష్టిమెతుకులు
తినే నీకు ఎందుకు కట్టాలిరా శిస్తు


తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా
అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్యపోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు


పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి
నన్ను కన్న నా దేశం నమోనమామి
అన్నపూర్ణ నాదేశం సదాస్మరామి


చరణం 2 :

అదిగదిగో... అదిగదిగో...
ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో
మన అగ్గిపిడుగు అల్లూరి... అగ్గిపిడుగు అల్లూరి...
ఎవడురా నా భరతజాతిని కప్పమడిగిన తుచ్ఛుడు
ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగుజీవులు భగ్గుమంటె ఉడకు నెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా
అన్నా ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టిముట్టి
మందిమార్బలమెట్టి మరఫిరంగులెక్కుపెట్టి
వందగుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందేమాతరం... వందేమాతరం
వందేమాతరం... వందేమాతరం
వందేమాతరం అన్నది ఆ ఆకాశం


చరణం 3 :

అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ
అఖండ భరతజాతి కన్న మరో శివాజీ
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వాతంత్య్ర భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహిందని నడిపాడు
గగన శిలలకెగసి కనుమరుగైపోయాడు
జోహార్ జోహార్... సుభాష్ చంద్రబోస్
జోహార్ జోహార్... సుభాష్ చంద్రబోస్
గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం
సాధించే సమరంలో అమరజ్యోతిలై వెలిగే
ధ్రువతారల కన్నది ఈ దేశం
చరితార్థుల కన్నది నా భారతదేశం... నా దేశం


పుణ్యభూమి నాదేశం నమోనమామి
ధన్యభూమి నాదేశం సదాస్మరామి
నన్ను కన్న నా దేశం నమోనమామి
అన్నపూర్ణ నాదేశం సదాస్మరామి

నందమూరి తారక రామారావు

నందమూరి తారకరాముని కి జయంతి నివాళి


వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. అభిమానులు షార్ట్ అండ్ స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు. నేడు ఆయన జయంతి. నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా...రాజకీయ వేత్తగా....ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలుపించుకున్న మహానటుడు ఎన్టీఆర్.


తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, వెండితెర వేలుపు నందమూరి తారక రాముడు. పేరు లొనే దైవత్వాన్ని 'తార' ని నింపుకుని వెండితెర మీద కృష్ణుడు, రాముడు ఒకటేమిటి యుగపురుషుల్లోని ప్రతి పాత్రకి ప్రాణం పోసిన ఘనత విశ్వవిఖ్యాత నట సార్వభౌములు తారక రామునిదే. ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే.. కృష్ణుడు ఆయనే.

అందమైన రూపం ఆకర్షణీయమైన వాక్చాతుర్యం ఆయన సొంతం. రైతు కుటుంబం లో పుట్టి పాలు అమ్ముకుని స్థాయి నుంచి ప్రజల్ని పాలించే స్థాయి దాకా కష్టే ఫలి అనే నానుడిని నిజం చేసే విధంగా సాగింది ఆయన ప్రస్థానం. సినీ రంగం లో అందం తో పాటు అభినయం కలగలిపి ఆనాటి సినీ రంగాన్ని తనదైన శైలిలో ఏలిన నట చక్రవర్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ నుంచి ఆడపడుచులు మా ఎన్టీవోడు అనే స్థాయికి ఎదిగిన అభిమానం ఆయన. తెలుగు వారిని మదరాసి నుంచి ఆంధ్రుడు అని ప్రపంచానికి చాటిన తెలుగింటి రాముడు. దేవుని పాత్రలే కాదు నెగిటివ్ రోల్స్ అయిన దుర్యోధనుడు రావణుడు పాత్రలకు గౌరవం తెచ్చిన ఏకైక హీరో ఎన్టీఆర్.

జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో నటించటం కాదు జీవించిన నటులు వారు. ఆయా పాత్రల్లో అద్భుతంగా నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు యుగపురుషుడు ఆ తారక రాముడు.

మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్‌టిఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి. మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత ఎన్‌టిరామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.

మనవరాలు గా నటించిన శ్రీదేవి ఆయన జత కడితే ఇలాంటి పెయిర్ ఇంకోటి వస్తుందా అని హిట్ మీద హిట్ చేసి నీరాజనాలర్పించారు. ఎప్పటికీ తరగని వర్ఛస్సు ఆ దైవంశ సంభూతుడికి మాత్రమే సాధ్యం. హీరోయిన్ గా అంజలి గారు, వాణిశ్రీ, సావిత్రి గారు ఆయన పక్కన అహో అనిపిస్తే జయసుధ, జయప్రద, లత వంటి వారి పక్కన ఈయన సూపర్ అనిపించారు. బొద్దుగా, అందంగా గంభీరమైన వర్ఛస్సు, సింహం లాంటి నడక ఎటువంటి వారిని అయినా థియేటర్ కి రప్పించేదంటే అతిశయోక్తి కాదు. రాజసం, రూపం తేజో స్వరూపం, మాట గంభీరం ఇదే కదా ఎన్టీవోడు అంటే.

అన్న’ ఎన్టీఆర్. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్.
ఆయన ఈ భూమి మీద లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు.




నాటకాలతో అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందారు రామారావు.  అతనిలోని నటుడ్ని గుర్తించిన  ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు ‘పల్లెటూరిపిల్ల’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో  ‘మనదేశం’ సినిమా లో అవకాశం రావడంతో దానిలో నటించారు. అలా.. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం ‘మనదేశం’ అయ్యింది. 1949లో వచ్చిన ఆ మూవీలో ఒక పోలీస్ ఇన్స్ స్పెక్టర్ పాత్ర పోషించారు. ఆ తర్వాత  1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే ఏడాది విజయా ప్రొడక్షన్ సంస్థ ఎన్టీఆర్, జానకి హీరోహీరోయిన్లుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘షావుకారు’ నిర్మించారు. ఎన్టీఆర్ తొలి ఇరవై ఏళ్లలోనే 200 సినిమాలు చేసారు. యేడాదికి సగటున 10 చిత్రాలు ఆయనవి విడుదలయ్యేవి.




విజయా సంస్థ తో కుదిరిన ఒప్పందంతో  ఎన్టీఆర్ ఆ బ్యానర్ కు ఆస్థాన నటుడయ్యారు.  1951లో కె.వి.రెడ్డి డైరెక్షన్ లో విజయా వారు నిర్మించిన ‘పాతాళ భైరవి’ నటుడిగా ఎన్టీఆర్‌కు తిరుగులేని స్టార్ డమ్ తీసుకొచ్చింది. 1956లో విడుదలైన ‘మాయాబజార్’లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికాడు.  వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేసారు. ఈ తరువాత ఎన్టీఆర్ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించి మురిపించాడు. అంతర్నాటకాల్లో కలపి మొత్తంగా 30కి పైగా చిత్రాల్లో కనిపించారు.




రామారావు తొలిసారిగా రాముని గెటప్‌లో 'చరణదాసి' అనే సాంఘిక చిత్రంలో కనిపించాడు. రామారావు శ్రీరాముని గెటప్‌లో పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు... తమిళంలో  తీసిన 'సంపూర్ణరామాయణం’లో.  ఆ తర్వాత 1963లో విడుదలైన ‘లవకుశ’ సినిమా.. రాముడిగా ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టింది.




1959లో ఎవియమ్ వారు నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు జీవం పోసారు రామారావు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ ఎన్ఎటి పై నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు. అందులో రావణుడిగా నటించి మెప్పించాడు. ఈ తర్వాత ‘వేంకటేశ్వర స్వామి మహత్యం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో వేంకటేశ్వరుడిగా మెప్పించాడు. ఆయన నటంచిన చిత్రాల్లో దాదాపు 97 శాతం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం విశేషం. తెలుగులో ఇలాంటి రేర్ రికార్డు ఎవరికీ లేదు. అంతేకాదు ఆయన సినిమాలు మళ్లీ రిలీజైతే.. మళ్లీ మొత్తం పెట్టుబడి తిరిగి రాబట్టగలగడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.




పౌరాణికాలే కాదు జానపద సినిమా హీరోగా ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. 1977లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవిరాముడు’తో ఎన్టీఆర్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. అదే ఏడాది విడుదలైన ‘దాన వీర శూరకర్ణ’ ను ఎవరూ మరిచిపోలేరు. అందులో ఆయన పోషించిన  శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితర సాధ్యమనే చెప్పాలి. అంతేకాదు దాదాపు 4 గంటల నిడివి కలిగిన ఈ సినిమాను ఎలాంటి కోతలు పెట్టకుండా విడుదల చేసి అఖండ విజయం సాధించింది.




ఆ తర్వాత 1979 లో య‌న్టీఆర్ ‘శ్రీమద్విరాట్ విరాట్ పర్వం’లో 5 పాత్రలు పోషించి  మెప్పించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణ, , దుర్యోధన, కీచక, అర్జున, బృహన్నల పాత్రల్ని అవలీలగా పోషించి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు. అంతకు ముందు ‘జగదేకవీరుని కథ’లో శివ శంకరి పాటలో ఐదు పాత్రల్లో తొలిసారి కనిపించారు. అలాగే యన్టీఆర్ స్టార్‌గా వెలుగు తున్న దశలోనే  తాత, తండ్రి, మనవడు పాత్రల్లో ‘కులగౌరవం’ అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేసారు. పేకేటి శివరాం దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యన్టీఆర్ నటించిన అరుదైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాల్ని లెక్కలేనన్ని పోషించారు యన్టీఆర్.


‘మన దేశం’ చిత్రం యన్టీఆర్ నటించిన ఆఖరి మాస్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తరువాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతూ ఉండగానే యన్ఠీఆర్  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సమ్రాట్ అశోక’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ లాంటి  చారిత్రక ,పౌరాణిక  చిత్రాలు తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు.



యన్టీఆర్ తన 44 ఏళ్ళ సినీ జీవితంలో  13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెర పై చెరగని ముద్ర వేసారు. అంతేకాదు హిందీలో ‘నయా ఆద్మీ’ ‘చండీరాణి’ అనే రెండు సినిమాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించారు.ఇక  గతేడాది ఆయన జీవితంపై ఆయన తనయుడు ‘ఎన్టీఆర్ కథానాాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించాడు. ఇక ఆయన జీవిత చరమాంకంలో జరిగిన రాజకీయాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రూపొందించాడు. ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోలేదు.



I Am a Very Good Girl Song ...

ఈరోజు  లిటిల్ సోల్జర్స్ చిత్రం నుండి ఒక చక్కటి పాట మీ కోసం ,వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడ  చూడవచ్చు 





I'm a very good girl tell me all teacher my dear brother
అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister
I'm a very good girl tell me all teacher my dear brother
అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister
brush చేసుకుంటా నేను close-up తో 
నీళ్లోసుకుంటా నేను liril soap తో 
breakfast చేస్తా నేను bread jam తో 
school కెల్లిపోతా నేను uniform లో 
I'm a good girl...  I'm a good girl... 
 I'm a good girl...

బన్నీ వస్తుంది జాగర్తగుండండి 
ఫన్నీగా చూస్తుంది ఏదో చేస్తుంది 
run away somehow...లేకపోతే danger
గప్ చుప్ గా దాక్కోండి ఎక్కడైనా  

Bunny is a bad girl we don't want her విన్నావా మిస్టర్ 
పాడుపళ్ళ దెయ్యం దాన్ని చూస్తే భయ్యం 
damn your sister
పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా 
mischief చెయ్యకుండా ఉండలేదుగా 
గిచ్చి ఏడిపించకుండా వెళ్లిపోదుగా 
అందర్నీ వెక్కిరించి నవ్వుతుందిగా 
she's a bad girl... she's a bad girl...
she's a mad girl...

 ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా 
 ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా.. నీకిది అలవాటా 
వద్దంటూ ఉన్నా వస్తావే వెంటా .. నా పరువుంటుందా 
ఉన్న ఒక్క చెల్లినీ ..ఇంత చిన్నపిల్లనీ
నువ్విలా తిట్టినా కొట్టినా 
నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా .. చక్కనీ బొమ్మనే ఇవ్వనా 
what a really nice plane...తీసుకొని దీన్ని thank you చెప్పుకో 
I'm not a naughty girl తెల్సుకో సన్నీ ...ఇప్పుడైనా ఒప్పుకో 

టన్నుల కొద్దీ ... పెన్సిళ్లన్నీ...
టన్నుల కొద్దీ పెన్సిళ్లన్నీ స్వాహా చేస్తావే 
తినవే తల్లీ అంటూ ఉన్నా అన్నం తినవేమే
బన్నీ పేరు చెబితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే
దాని brother అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే
సన్నీ మాట నమ్మకు అన్నీ ఉత్త కోతలు .. promise mummy
చిన్నదాన్ని కనకే  అంత కోపమొద్దులే .. please excuse me
ఇదో పెద్ద drama .. దీన్ని బాగా తందామా
ఇది parents కి పరీక్ష .. ఇది brother కి శిక్ష
దీనికి antibiotic లేదా .. దీనికి నీరసం రాదా
దీంతో మాట్లాడను .. దీంతో ఆట్లాడను
ఇదో సైతాన్ .. ఇదో తూఫాన్
ఇదో .. నా బంగారు పాప


చిత్రం: లిటిల్ సోల్జర్స్ 
సాహిత్యం : సిరివెన్నెల 
సంగీతం :శ్రీ కొమ్మినేని   
గానం : బాలు, దీపిక ,క్రిష్ణకాంత్  

శివశంకరీ..శివశంకరీ..

ఘంటసాల పాటల్లోని ఆణిముత్యాలను ఏరడం, సముద్రం దగ్గర నిల్చొని చెమ్చాలతో నీళ్లు లెక్క పెట్టినట్లు వుంటుంది. అందులోని ఒక ఆణిముత్యాన్ని ఈ రోజు గుర్తు చేసుకుందాం,జగదేక వీరుని కథ నుండి ఒక చక్కటి పాట మీ కోసం..వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడ  చూడవచ్చు 💐💐💐





చిత్రం: జగదేకవీరుని కథ (1961) 
సంగీతం: పెండ్యాల 
గీతరచయిత: పింగళి 
నేపధ్య గానం: ఘంటసాల 

పల్లవి : 

శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి... 
శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ.. 
శివానందలహరి..శివశంకరీ.. 


చరణం 1 : 


చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ 
చంద్రకళాధరి ఈశ్వరీ.. 
కరుణామృతమును కురియజేయుమా.. 
మనసు కరుగదా.. మహిమ జూపవా.. 
దీనపాలనము చేయవే.... ఏ .. 
శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ.. 
శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి..శివశంకరీ... 
శివశంకరీ... శివా....నంద...లహరీ...శివశంకరీ... 
శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ.. 


చరణం 2 : 

చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా.. 
మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా.. 
చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా.. 
రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప 
చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస.. 
సరిమ గరి మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప.. 
మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని.. 
సని పని పమ..పమ..గమరి సనిస.. 
సని పని పమ..పమ..గమరి సనిస.. 
సరి మపని దానిస.. సరి మపనిదానిస..సరిమపని దానిస... 
చంద్రకళాధరి ...ఈశ్వరీ..ఆ..ఆ..ఆ.. 
చంద్రకళాధరి...ఈశ్వరీ...శివశంకరీ..శివశంకరీ... 


తోం..తోం..తోం..దిరిదిరితోం.. దిరిదిరితోం....దిరిదిరితోం.. 
దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం.. 
దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా.. 


దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం.. 
దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం.. 


చరణం 3 : 


దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి 
నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి 
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం.. 

నినినిని..నినినిని..దనిని..దనినిని..దప 
పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని.. 
సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని 
నిసస..నిసస..నిద..దనిని దనిని దప.. 
నిని దద..ససనిని..రిరిసస..గగరిరి.. 
గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస.. 

రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ... 
నినిని రిరిగరిమా... 
రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ.. 
సరి సస..మప మమ..సరి సస..సససస.. 
సరి సస...పని పప... సరిసస... సససస.. 
మప మమ... పని దద...మపమ...పనిద.. 
మపమ..పనిద..పదపప..సరి సస.. 
ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ.. 
పపప..దదద...నినిని..ససస..రిరిరి.. 
గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 
శివశంకరీ..


రన్ రాజా రన్ (2014)



చిత్రం: రన్ రాజా రన్ (2014)
సంగీతం: గిబ్రాన్
సాహిత్యం: శ్రీమణి
గానం: గోల్డ్ దేవరాజ్


అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
బెత్తెడంటి నడుము పిల్ల పుత్తడి బొమ్మ రా
గోళీల్లాంటి కళ్లతోటి గోల్ మారు పోరి రా
హేయ్ ఘాగ్ర చోళి వేసుకున్న ఆగ్రా తాజ్ తాను రా

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్‌వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్‌బుల్లి

చలాకీ.. పరిందా కావాలా మిరిందా
బుజ్జి మేక చేతనున్న కన్నె పిల్లలా
బుల్లి అడుగులేసె బుజ్జి కుక్క పిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న టెడ్డీ బేరులా
బుజ్జి బుజ్జి మాటలాడు చంటి పాపలా
హేయ్ అచ్చంగా అందంగా దోస్తీ చేసే మస్తాని
సాయంత్రం రమ్మంది వెళ్ళి మళ్ళీ వస్తానే

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్‌వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్‌బుల్లి

రూపంలో.. ఏంజెల్ రా కోపంలో.. డేంజర్ రా
ముక్కు మీద కోపమున్న తిక్క పిల్ల రా
ముక్కుసూటి మాటలాడు కొంటె పిల్ల రా
తియ్యనైన పాటపాడు హమ్మింగ్ బర్డు రా
పంచులేసి పరువు తీసె బబ్లి గర్లు రా
లడాయే వచ్చిందో లడికి భలే హుషారే
బడాయే కాదంట మేరే బాత్ సునోరే

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి

అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్‌వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్‌బుల్లి





*********    *********   *********




చిత్రం: రన్ రాజా రన్ (2014)
సంగీతం: జిబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిన్మయి

వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా..
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా..
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది

 నాలోనే ఉన్నా తెలియలేదు ఏ సడి లేని అలజడి
గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి
నీవైపు పరుగులు తీసిందిలా
ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసిది
నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి
నీ చెంత చేరుకుంది ఈ రోజిలా
చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైనా
గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా
నిన్నల్లో నేనే నేనా నిన్నిల్లా ప్రేమిస్తున్నా
నీ మాయ దయ వలనా..

ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ
ఐ ఆమ్ ఇన్ లవ్ బేబీ ఐ ఆమ్ ఇన్ లవ్

నీ పేరు పలికే పెదవి నేడు
పులకరింతల పువ్వయ్యింది
నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది
నా చుట్టూ లోకం నీలా కనిపిస్తోంది
నీ జంట నడిచే అడుగు చూడు
గాల్లోన తేలే గువ్వయింది
నువ్వంటే తెలిసే కొద్ది
నీలో నిను కలిసే కొద్ది
నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తోంది
నీ నీడలోనే నాకు ఆనందముంది
నూరేళ్ళకూ నేను నీలోన బంధీ
ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక
నీలోన సగమవనా....

వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా..
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా..
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా ఆరాట పడుతోంది

కూతురు కోడలు (1971)

చిత్రం :  కూతురు కోడలు (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, వసంత 

పల్లవి :

గాజులు ఘల్లనగానే జాజులు ఘుమ్  ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

తుమ్మెద ఝుమ్ ఝుమ్మనగానే తెమ్మెర రా రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే 


చరణం 1 :


నీ కాటుక కన్నుల సొగసు...  నీ చెంగున దూకే వయసు
నన్నెంతో తొందరచేసే... నీ కౌగిట బందీ చేసే

వెచ్చని వెన్నెలలోన...  విచ్చిన కలువను చూసీ 
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

చరణం 2  :


నీ కదిలే పెదవులు చూసి...  నా మెరిసే చెక్కిలి మురిసి
నీ వెచ్చని ఒడిలో చేరి...  నా వయసే పొంగెను నేడే

కోయిల కోయనగానే కొమ్మలు ఓయనగానే   
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

చరణం 3 :


నలనల్లని ఆకాశంలో...  తెలతెల్లని మేఘంలాగా
నల్లని ఆకాశంలో తెలతెల్లని మేఘంలాగా
నీ నీలికురులలో విరిసే మరుమల్లెలు నావే నావే

నీ హృదయపు పందిరిమీద పెనవేసిన మమతల తీగ
హృదయపు పందిరిమీద...  పెనవేసిన మమతల తీగ
విరబూసిన వలపుల పూలే ఏ నాటికి నావే నావే 

గాజులు ఘల్లనగానే...  జాజులు ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే...  అది నీవే అనుకున్నాలే

తుమ్మెద ఝుమ్మనగానే...   తెమ్మెర రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

లలలాలాలాలాలల.... లలలాలాలాలాలలలలా



కళ్యాణ మంటపం (1971)

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల


పల్లవి : 

సరిగమ పదనిసానిదప మగరిస...  అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై...  ఎదురై

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై...  ఎదురై

పలికే వారుంటే...
సరిగమ పదని సానిదప మగరిసని


చరణం 1 :

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమవిధాత... జీవననేత ప్రేమవిధాత
అను గుడిగంట విను ప్రతి జంట

సరిగమ పదని సానిదప మగరిసని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే


చరణం 2 :


తీగా తీగా పెనగీ పెనగీ
రాగ ధారగా సాగీ సాగీ

తీగా తీగా పెనగీ పెనగీ
రాగ ధారగా సాగీ సాగీ
జీవన గంగావాహిని కాదా
జీవన గంగావాహిని కాదా
అను ప్రతి జంట విను గుడిగంట
సరిగమ పదని సానిదప మగరిసని

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై ... ఎదురై

పలికే వారుంటే...
సరిగమ పదని సానిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే


*********** ************* *************

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల


పల్లవి : 


ఏడవకే చిన్నారి పాపా... చిట్టి పాపా..ఆ
చూడలేనే కన్నీరు పాపా..
ఆ....  ఆ....  ఆ....
నీవు పెరగాలి మరవాలి శోకం..రేపు పాడాలి ఆనంద గీతం
ఆ..ఆ..... ఆ....ఆ..ఆ..... ఆ...... ఆ..ఆ..ఆ



చరణం 1 :

కారు మేఘాల చీకట్ల క్షోభ... నేడేనమ్మా..
రేపు శతకోటి కిరణాలశోభ... నీదేనమ్మా..
ఆశలన్నీ....పూచునమ్మా..
ఆశలన్నీ... పూచునమ్మా ....
కాంతులీన కాలిపోవు దీపమౌదు తృప్తిగాను....  తల్లీ..


జీవింతు నీ కొరకు..మళ్ళీ
ఏడవకే చిన్నారి పాపా..చిట్టి పాపా చూడలేనే కన్నీరు పాపా 


చరణం 2 :

నిన్ను లతలాగ కన్నీట తడిపీ...పెంచేనమ్మా..
రక్తమాంసాల త్యాగాల ఎరువు... వేసేనమ్మా..ఆ
చిగురు వేసి విరులు పూచి... చిగురు వేసి విరులు పూచి
మూడుపూవులారుకాయలగుచు నీవు నవ్వవలెను
తల్లీ..ఈ.. ఈ..జీవింతు నీ కొరకు మళ్ళీ 

ఏడవకే చిన్నారి పాపా... చిట్టి పాపా
చూడలేనే కన్నీరు పాపా...
నీవు పెరగాలి మరవాలి శోకం... రేపు పాడాలి ఆనంద గీతం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్  



*********** ************* *************

 చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల


పల్లవి : 


కృష్ణా.... నా మొర వినవా నను దయగనవా..
కన్నె బ్రతుకు కాపాడరావా..
ఈ ఘోరబలి ఆపించలేవా... ఆపించలేవా..

నా మొర వినవా.. నను దయగనవా
దీనులబ్రోచే దైవము కావా..
ఏనాడైనా వరమడిగితినా
ఈ వరమైనా ఈయగలేవా....  కృష్ణయ్యా కరుణించవయ్యా


చరణం 1 :

ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా
ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా
ఓటమి కలిగే ఆశలు తొలగే..ఈ ఘోరానికె తలవంచె
జగమింతేనా... బ్రతుకింతేనా..

నా మొర వినవా నను దయగనవా



చరణం 2 :


మగువను లోకం బానిస చేయగ... మౌనం పూనావా..
తాళికి తరుణిని దూరం చేయగ.. జాలే మరిచావా..
న్యాయం విడిచావా..ఘోరం తలిచావా..
వినవేలా... శిలవేనా... రావేలా... కృష్ణా


*********** ************* *************

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :

పిలిచే వారుంటే.. పలికేను నేను
పిలిచే వారుంటే.. పలికేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేను నేను
కనుపాప అద్దాన కదిలేను నేను.. ఆ....ఆ.....ఆ....


పలికేవారుంటే.. పిలిచేను నేను
పలికేవారుంటే.. పిలిచేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే
కనుపాప అద్దాన కదిలేది నీవే ఆ....ఆ.....ఆ....


చరణం 1 :

ఏ నాటిదో ఈ బంధము.. మన అనుబంధము.. ఆ...ఆ... ఆ...
ఏ నాటిదో ఈ బంధము.. మన అనుబంధము
కలకాలము నిలవాలిలే.. మన అనురాగము
గోదారిలా నేడు ఉరికేను మనసు.. 

నీ పిలుపు వినగానే.. పులకించె బ్రతుకు పులకించె బ్రతుకు
పిలిచే వారుంటే.. పలికేను నేను 

హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే
కనుపాప అద్దాన కదిలేది నీవే ఆ....ఆ.....ఆ....


చరణం 2 :


నీ రూపమే నా దైవమై నను మురిపించెలే ఆ....ఆ..ఆ.. 
నీ రూపమే నా దైవమై నను మురిపించెలే
నా అందమే అరవిందమై నిను పూజించెలే 
నీ మనసులో నాకు చోటుంటే చాలు
నా బ్రతుకులో విరియు నవనందనాలు.. నవనందనాలు


పలికేవారుంటే.. పిలిచేను నేను
హృదయాన ఉయ్యాల ఊగేను నేను...
కనుపాప అద్దాన కదిలేను నేను
ఆ....ఆ......ఆ......


చరణం 3 :


కలగన్నదే నిజమైనది చెలి ఔనన్నది
సొగసున్నదీ... గుణమున్నదీ చెలి నాదైనది 

అడుగుల్లో అడుగేసి నడవాలి మనము
మన మొకటి కాగానే మారాలి జగము
అడుగుల్లో అడుగేసి నడవాలి మనము
మన మొకటి కాగానే మారాలి జగము 

మన మొకటి కాగానే మారాలి జగము
మారాలి జగము.. మారాలి జగము.. మారాలి జగము


*********** ************* *************

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల 


పల్లవి :

చుక్కలు పాడే..  శుభ మంత్రం
దిక్కులు నిండే దివ్య మంత్రం
ఎక్కడనో.. ఎపుడో.. ఎవరో పలికిన వేద మంత్రం
ఇక్కడనే.. ఇపుడే.. ఎవరో.. నా చెవిలో ఊదిన మంత్రం.. మధు మంత్రం
చుక్కలు పాడే.. శుభ మంత్రం 


చరణం 1 :

రెక్కలపై ఆ గువ్వల జంట ... రేకులలో ఆ పువ్వుల జంట
రెక్కలపై ఆ గువ్వల జంట...  రేకులలో ఆ పువ్వుల జంట
సాగుచునే.. ఊగుచునే..  మధుర మధురముగ మక్కువగా.. చదువుకునే ఆనంద మంత్రం 

చుక్కలు పాడే శుభ మంత్రం


చరణం 2 :


కన్నులు ఒక పరి మూసుకొని.. నీవన్నది మరి మరి తలచుకొని
కన్నులు ఒక పరి మూసుకొని.. నీవన్నది మరి మరి తలచుకొని
ఒక్కతినే.. నే నొక్కతినే.. అదే పనిగనే సదా మనసులో ఆలపించే ప్రియ మంత్రం 

చుక్కలు పాడే శుభ మంత్రం


చరణం 3 :

కోవెల దైవం పిలిచే దాకా.. ఆవలి ఒడ్డున నిలిచే దాకా
కోవెల దైవం పిలిచే దాకా.. ఆవలి ఒడ్డున నిలిచే దాకా
నాలోనే లోలోనే..  నాతి చరామి.. నాతి చరామి.. అన్న ఆ  ప్రాణ మంత్రం  

చుక్కలు పాడే శుభ మంత్రం దిక్కులు నిండే దివ్య మంత్రం
ఎక్కడనో..  ఎపుడో.. ఎవరో పలికిన వేద మంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో.. నా చెవిలో ఊదిన మంత్రం మధు మంత్రం
చుక్కలు పాడే శుభ మంత్రం