ప్రతిరోజు పండగే (2019)


చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కె.కె.
గానం : శ్రీకృష్ణ

మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే
తనవారే వస్తుంటే
అలుపింక మరిచాడే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే

పదిమంది ఉండగా
ప్రతిరోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే

మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే

గలగల మాటల సడిలో
బరువిక తేలిక పడెలే
ఇరుకుగ మారితె గదులే
చురుకుగ ప్రాణమే కదిలే
మనమంతా కలిసుంటే
కలతున్నా మరిచేనే
మనమంతా వెనకుంటే
మరణాన్నే గెలిచేనే

మిము కలవగా తెగ కలవరం
అసలిది కదా ఒక సంబరం
ఒక వరసలా కదిలిన క్షణం
ఇక తెలియదే ఒంటరితనం

ఎన్నాళ్ళకో రారు కన్నోళ్ళిలా
వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా
ఇల్లంతా మారింది సందళ్ళుగా
మీరంతా ఉండాలి వందేళ్ళిలా

మనవారే వెనకుంటే
మరణాన్నే మరిచేలే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే

పదిమంది ఉండగా
ప్రతిరోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతిరోజు పండగే


*********** ************* *************
చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్  
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : విజయ్ ఏసుదాస్ 

చిన్నతనమే చేరరమ్మంటే
ప్రాణం నిన్నవైపే దారితీస్తోందే
అడుగులైతే ఎదరకైనా
నడకమాత్రం వెనకకే
గడిచిపోయిన జ్ఞాపకాలతో
గతము ఎదురౌతున్నదే

చెరిగిపోనేలేదే మరపురానేరాదే
చివరి మలుపున నిలచి పిలిచిన
స్మృతుల చిటికెన వేలు
వదలని చెలిమిగా
ఊహలే ఉప్పొంగుతున్నవిలా
ముగియని కథలతో
మది మేలుకున్నదిలా

తాతగా తలపండినా
తండ్రి తనమే ఎండున
ఒడిని దిగి కొడుకెదిగినా
నాన్న మురిపెము తీరునా 
 వయసు వాలిన సందె వాలున
చేతికందిన ప్రియవరం
మనవడై తన పసితనమ్మును
వెంట తెచ్చిన సంబరం
కొత్త ఊపిరి కాగా
మనసు ఊయలలూగా
తర తరమ్ముల పాటు ఇంకని
వంశ ధారగ మారి కడలిని కలియని
జీవనదిగా పారుతుంది కదా
కంచికి చేరు కథగా ముగిసిపోదు కదా 

*********** ************* *************
చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్. థమన్ 
సాహిత్యం : కె.కె.
గానం : సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ

లవ్ యూ అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసలే రాదు
హీ ఈస్ సో కూల్..
హీ ఈస్ సో క్యూట్..

ఫేక్ అనిపించే టైపసలే కాదూ
బ్రేకప్ చెప్పే వీలసలు లేదు
హీ ఈస్ సో హాట్
హీ ఈస్ సో క్యూట్

ఏమి తక్కువంట సూడు
టిప్పు టాపుగున్నాడు
టిక్కు టాకులోన చూసి ఫ్లాటయ్యాడు
వన్నా సీ యూ అంటూ 
సెవెన్ సీస్ దాటివచ్చాడు

ల్యాండు అయ్యిఅవ్వగానే 
బ్యాండు ఎంట తెచ్చినాడు
నీ హ్యాండు ఇవ్వమంటు
నీస్ బెండు చెసి
విల్ యూ మ్యారీ మీ అన్నాడు
డు..డు..డు..డు..డు..

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా సింధూరం నువ్ పెడతావా

మచో మ్యాన్ మా బావా
పేచీలే మానేవా
కటౌటే చూస్తూనే
కట్టింగే ఇస్తావా

హ్యాండ్సమ్మే మా బావా
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే
తెగ చీపైపోయాడా

ఓ బావా…. ఓ బావా…

లవ్ యూ అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసలే రాదు
హీ ఈస్ సో కూల్
హీ ఈస్ సో క్యూట్

నిదరే పోడు ఏమీ తినడు
నువ్వే కావాలంటాడు
నిన్నే చూసి ప్రతీ రోజుని
శుభముగ ప్రారంభిస్తాడు
తినె పప్పులోన బీరు కలుపుతాడు
తన పప్పి లోన నిన్ను వెతుకుతాడు
నీ పేరే పలికే.. నిన్నే తలిచెనే..
అక్కా నమ్మే.. అతనే జెమ్మే..

మచో మ్యాన్ మా బావా
పేచీలే మానేవా
కటౌటే చూస్తూనే
కట్టింగే ఇస్తావా

హ్యాండ్సమ్మే మా బావా
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే
తెగ చీపైపోయాడా

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా సింధూరం నువ్ పెడతావా

No comments:

Post a Comment