ఆరాధన (1976)



చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: మహమ్మద్ రఫీ, జానకి


పల్లవి:

నేడే ..తెలిసింది.. ఈనాడే తెలిసింది

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే...ఏ...
కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
తీయని పాటకు ప్రాణం వస్తే ...ఏ...
తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

చరణం 1:

ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని
ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని
ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని
ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని
అది వలచే దొకసారే ననీ ...ఆ వలపే విడిపో లేనిదనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...

చరణం 2:

ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...
ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...

మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని
మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని
శిలలకైన ఆ గానం... పులకింతలు కలిగించేననీ
శిలలకైన ఆ గానం ...పులకింతలు కలిగించేననీ
అది జతగా నను చేరాలని ..నా బ్రతుకే శృతి చేయాలని

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది ...
తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది..


**************** ********************************** *****************


చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: జానకి


పల్లవి:

నీకేలా.. ఇంత నిరాశా...
నీకేలా.. ఇంత నిరాశా

నీకేలా.. ఇంత నిరాశా
నీకేలా.. ఇంత నిరాశా
నీ కన్నులలో కన్నీరేల
అంతా దేవుని లీల
అంతా దేవుని లీల
నీకేలా.. ఇంత నిరాశా..
నీకేలా.. ఇంత నిరాశా

చరణం 1:

ఆశ నిరాశలు దాగుడుమూతల
ఆటేలే ఈ లోకం.. ఆటేలే ఈ లోకం

కష్ట సుఖాల కలయికలోనే
ఉన్నదిలే మాధుర్యం.. జీవిత మాధుర్యం

చీకటి కొంత.. వెలుతురు కొంత
ఇంతే జీవితమంతా.. ఇంతే జీవితమంతా
నీకేలా.. ఇంత నిరాశా... నీకేలా.. ఇంత నిరాశా

చరణం 2:

నీ మదిలోని వేదనలన్నీ
నిలువవులే.. కలకాలం
నిలువవులే.. కలకాలం

వాడిన మోడు పూయక మానదు
వచ్చును.. వసంతకాలం
వచ్చును.. వసంత కాలం

నీతో నడచి నీడగ నడిచే
తోడుగ నేనున్నాను.. నీ తోడుగ నేనున్నాను
నీకేలా.. ఇంత నిరాశా.. నీకేలా.. ఇంత నిరాశా

*********** ********************** ************************


చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: మహమ్మద్ రఫీ

పల్లవి:

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...ప్రియతమా...

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

చరణం 1:

ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను

తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై 

చరణం 2:

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను

వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

No comments:

Post a Comment