చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: ఎస్. ఏ. రాజ్ కుమార్, చిత్ర
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
కళ్లకి కాటుక పెడతా ఈ చల్లని చూపులకి
బాషికమే నే కడతా ఈ నుదుటన ఆశలకి
ఈ పచ్చని నూరేళ్ళకు నే మొక్కేను ముక్కోటి దేవుళ్ళకు
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
పగలే చుక్కలు పొడుచుకు వచ్చి నేలకు చేరెనురా
చాపకు రెక్కలు మొలుచుకువచ్చి నింగికి ఎగెరెను రా
పెళ్లంటే అయో వప్పని వాడు అరె పల్లకి ఎక్కి ముచ్చట చూసి
పసిపాపే ముత్తైదై కనుపాపే కన్నమ్మై
ఈ అన్నకి పెళ్లే చేసే పేరంటాలైయ్యిందా
అనురాగం అన్నయ్యై మమకారం చెల్లెమ్మై
ఈ బంధం వందెళ్ళయ్యే వదినమ్మే చేరిందా
ఈ పందిట్లోనే మహారాణిని మీ అన్నయ్య పదాల పారాణి ని
స్వర్గమొచ్చి మనవాకిట్లో ఈనాడు వాలేనమ్మ
ఒక రెమ్మకి విరిసే పువ్వులం ఒక పెదవిపై మురిసే నవ్వులం
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
నన్ను నువ్వూ మరచినా వదిన నెపుడూ మరవకు
ఇంటి ఆలిని మరచినా కంటి వెలుగును మరవకు
రెండు కళ్ళు మీరు నాకు రెప్పనేనని మరవకు
ఈ ఇల్లే వెయ్యిల్లై ఈ బ్రతుకే వేయ్యేళ్లై
అనందం విందులు చేసి ఆకాశం అందేను
గతజన్మల పుణ్యాల వరమల్లే వచ్చావో
ఉగ్గుపాలు తాగిన గిన్నెకు నువు పెళ్లి పెద్దైనావు
నువ్వు చుక్క పెడితే చాలు నా బుగ్గన
అరుంధతి చుక్కే ఇచ్చు శుభ దీవెన
అమ్మలేని ఈ ఇంట్లో మా వదినమ్మే అమ్మవుతుంది
ఈ జంటకు శతమానము
ఈ జన్మకు మా జత మానము
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము
దేవతలే దీవించే ఈ సౌభాగ్యము
మంగళ హారతులిస్తా ఈ గువ్వల జంటకి
చెడు కన్నుల దిస్టిని తీస్తా మా అన్నా వదినలకి
ఈ పచ్చని నూరేళ్ళకి నే మొక్కేను ముక్కోటి దేవుళ్ళకు
సీతాకోక చిలుకల చెల్లి పాట సాహిత్యం
చిత్రం: పుట్టింటికి రా.. చెల్లి (2014)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: శ్రీహర్ష
గానం: మనో, చిత్ర
గాజులు బావా గాజులు బావా రంగులు గాజుల తెచ్చావా
రంగులు గాజులు తెచ్చావా
రాజానగరం రంగంపేట మల్లెలు గాజులు తెచ్చావా
మల్లెలు గాజులు తెచ్చావా
ఈ గోరింటాకు పండిన చేతికి ఎర్రని గాజులు వేస్తావా
సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
సీతాకోక చిలుకల పెళ్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
ప్రాణమైన ఇస్తానమ్మ నీ నిండు నవ్వులకి
తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు
అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు
అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు
సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
ముద్దుల మూటలు కట్టి బాబే చల్లగ నవ్వాలి
అన్నకు బంగరు పాపే పుట్టి కోడలు అవ్వాలి
అన్నా చెల్లి అనుబంధాల చుట్టరికం
కోటి కోటి జన్మలు దాటి వరమవనీ
వడిని నింపుకోవమ్మ పసుపు కుంకుమా
నోము పండునోయమ్మ అన్న ప్రాణమా
కనుల విందు చేసేటి బుజ్జి బాబుకి
దిస్టి చుక్క నేనౌతా జన్మ జన్మకి
వెన్నెల తోటే పందిల్లేసే వైకుంఠపు వైభోగం
వాత్సల్యాలే వాయణమిచ్చే శోభనిచ్చు సౌభాగ్యం
అల్లారు ముద్దమ్మాయి అక్షింతలు
ఇక త్వరలోనే ఈ ఇంట్లోన కేరింతలు
ఊయాలలో ఉపానమ్మా నిన్నపుడు
ఆ ఉయ్యాలే బాబుకి అవుతా నేనిపుడు
ఊయాలలో ఉపానమ్మా నిన్నపుడు
ఆ ఉయ్యాలే బాబుకి అవుతా నేనిపుడు
సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
సూర్యుడేమొ ఊయలందు పూలబంతిగా
మచ్చలేని చందమామ ఆటబొమ్మగా
తారలొచ్చి హారమేసి హారతియ్యగా
నీలి మబ్బు జోల పాడే నీకు లాలిగా
వియ్యపురాలు వియ్యంకులమై రేపు మేము వస్తాము
పిల్లని ఇచ్చే వాళ్ళము అయినా పెత్తనాలు చేస్తాము
భయమొద్దు లేవమ్మా ఇవి బెదిరింపులే
నా మేనల్లుడు పెళ్లికి కూడా నే పెద్దలే
మన అమ్మ చలువై పుట్టావు నువ్వపుడు
నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుందిపుడు
మన అమ్మ చలువై పుట్టావు నువ్వపుడు
నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుందిపుడు
సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి
సీతారాములు వస్తారంట పేరంటానికి
ప్రాణమైన ఇస్తానమ్మ నీ నిండు నవ్వులకి
తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు
అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు
అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు
అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు