ముద్దుల మొగుడు (1997)


చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: బాలకృష్ణ, మీనా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో
చెంగు దాటగా చెమ్మ చెక్కలాట
జోరుగుండదా జోడు గువ్వలాట
పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

కుర్రదాన కుశలమా కుతకొచ్చే పరువమా
గుట్టుదాటే ఘుమ ఘుమ కట్టుకోరా ప్రియతమా
ఈడే కోడై ఈలేసినా జాబిల్లోస్తుందా
జాబిళ్ళమ్మా కౌగిళ్ళలో జాగారిస్తుందా
గడప దాటని అందం కడప చేరినదా
మొదటిచూపుకు మొహం మొటిమ లేసినదా
పావడాల చెట్టుమీద పాలపిట్ట లాడుతుంటే పాపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

దోచుకున్నా దొరకవు దాచుకున్నా మెరుపులు
కస్సుమన్నా కదలవు కమ్ముకున్న వలపులు
ముద్దింటమ్మ ఆకళ్లలో ముప్పూట జరిగే
చేరింతమ్మ కుచ్చిళ్ళలో సిగ్గంతా ఎగిరే
తలుపు మూసిన తాపం తణుకు చేరినదా
మధుర మన్మధ బాణం ఆధరమడిగినదా
పాలపుంతలన్ని తోడు పాయసాలు జుర్రుకున్న గోపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో
చెంగు దాటగా చెమ్మ చెక్కలాట
జోరుగుండదా జోడు గువ్వలాట
పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా

********** ********* ***********

చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

సాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో
దాని ఒంటినిండ ఓబరాల షేపురో
అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో
వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో

మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే
మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే

సాహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హోయ్

కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే
కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే హఁ
కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే
కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే
పొరపాటు చేశాక తిప్పలు మన చుట్టూ ఉంటాయి కప్పలు
అలవాటు ఐతేనే ఇప్పుడు అవుతుంది మేళాల చప్పుడు

యాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హాయ్

వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు
వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు
ఆఁ చెలి తోడు కోరింది గుప్పెడు గిలిపెట్టే నా గుండె చప్పుడు
చలికాలం చంపెంగ నిప్పులు జరిగింది ఆ లగ్గమిప్పుడు

యమహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బబ్బబ్బబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో
దాని ఒంటినిండ ఓబరాల షేపురో
అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో
వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో

మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే
మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే

సాహో...

********** ********* ***********

చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని

కానిమ్మంటే కాకా పట్టి మళ్ళొస్తాలే చి పాడంటూ సింగారాలు
చిక్కానంటే సిగ్గమ్మత్తా వెళ్ళొస్తాను చొక్కాకంటే సిందూరాలు
రావే తల్లి అంటే రాదు గోల లీవే లేనే లేదు చారుశీల
అట్టే యిట్టె వచ్చే అబ్బలాల పుట్టించొద్దు అగ్గి మూల మూల
పెదవే మధువై రుచులడిగే మదిలో గదిలో శృతి చెరిగే
మనసులు కలిసిన మాఘమాసంలో

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని

అందాలన్నీ కౌగిళ్ళల్లో కర్పూరాలై తంటాకొచ్చే తాంబూలాలు
నచ్చేవన్ని గిచ్చంగానే మందారాలు పైటల్లోనా తంబురాలు
బావా బావా నీతో బంతులాట ఒళ్ళో కొస్తానంటె వంగతోట
అమ్మా నాన్నా అట అడుకుంటా అమ్మా అబ్బా అంటే తగ్గనంటా
మనసే అడిగే మధుమసం సొగసే కడిగే హేమంతం
మిస మిస వయసున మీగడొస్తుంటే

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే

ప్రేమనగర్ (1971)

చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  సుశీల


పల్లవి :


ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా  


చరణం 1 :


కూలికెళ్తే నాకే రారా.. చేను వున్నాది

కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది

కూలికెళ్తే నాకే రారా.. చేను ఉన్నాది

కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది

ఇంకేడకైనా ఎల్లావంటే..ఏ.. ఏ..ఇంకేడకైనా ఎల్లావంటే

నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు

నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా 

 

చరణం 2 :


ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు

వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు

ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు

వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు

నీ చపల బుద్ది సూపావంటే..ఏ... ఏ..

మనిషి నాకు దక్కవింక.. మంచిదాన్ని కాను ఆనక

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

 

చరణం 3 :


పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు

రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు

పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు 

రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు

నే తెల్లవార్లు మేలుకుంటే.. నే తెల్లవార్లు మేలుకుంటే 

ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని

ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని

ఈది ఈది.. కుళ్ళుకుంటాది       

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా


***** ******** *************


చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


తాగితే మరచిపోగలను... తాగనివ్వదు

మర్చిపోతే తాగగలను... మరువనివ్వదు


మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే ...


చరణం 1:


ఒకరికిస్తే మరలి రాదూ ..ఓడిపోతే మరిచిపోదూ

ఒకరికిస్తే మరలి రాదూ ..ఓదిడిపోతే మరిచిపోదూ

గాయమైతే మాసిపోదూ ... పగిలిపోతే అతుకుపడదూ


మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..మనసు గతి ఇంతే 


చరణం 2:


అంతా మట్టేనని తెలుసూ... అదీ ఒక మాయేనని తెలుసూ

అంతా మట్టేనని తెలుసూ ... అదీ ఒక మాయేనని తెలుసూ

తెలిసీ వలచీ విలపించుటలో ... తీయదనం ఎవరికి తెలుసూ 

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే...మనసు గతి ఇంతే


చరణం 3:


మరుజన్మ ఉన్నదో లేదో ...ఈ మమతలప్పుడేమౌతాయో

మరుజన్మ ఉన్నదో లేదో ... ఈ మమతలప్పుడేమౌతాయో

మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా


మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే




***** ******** *************


చిత్రం  :  ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. 



నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. 


చరణం 1:


నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి

నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి



నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి 

నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి

తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి..

హ హ హ హ హ... డోంట్ కేర్...


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. 


చరణం 2:


మనసులు దాచేటందుకు పైపై నవ్వులు ఉన్నాయి

మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి

ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి

ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..

డోంట్ కేర్.... 


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..  


చరణం 3:


మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి

పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి

బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్

బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్

అగ్గిపుల్ల గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసేయ్..

డ్రైవ్ ది డెవిల్ అవుట్..హ హ హ హ హ హ... 


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..  డోంట్ కేర్....




***** ******** *************



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా

తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా

కదలి వచ్చింది.. కన్నె అప్సరా

వచ్చి నిలిచింది.. కనుల ముందరా..


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా

తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా

కదలి వచ్చింది.. కన్నె అప్సరా

వచ్చి నిలిచింది.. కనుల ముందరా..


చరణం 1:


తెలుగువారి ఆడపడుచు ఎంకిలా


ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా

ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా


గోదారి కెరటాల గీతాల వలే నాలో

పలికినది..... పలికినది.... పలికినది

చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా

కడలి వచ్చింది కన్నె అప్సరా

వచ్చి నిలిచింది కనుల ముందరా


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...



చరణం 2:


రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి

ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి

ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి


లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు

వెలసినవి..... వెలసినవి... వెలసినవి...

వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా

కదలి వచ్చింది కన్నె అప్సరా

ఎదుట నిలిచింది కనుల ముందరా


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...


***** ******** *************




చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


కడవెత్తుకొచ్చిందీ... ఈ ఈ ఈ... కన్నెపిల్ల.. ఆ ఆ..

అది కనపడితే చాలు నా గుండె గుల్ల

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల


కాడెత్తుకొచ్చాడూ...ఊ ఊ ఊ... గడుసుపిల్లడు.. ఊ ఊ..

వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు


చరణం 1:


పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి

పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి

పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి

వెళుతుంటే...చూడాలి..

వెళుతుంటే చూడాలి దాని నడక

అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక


కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల


చరణం 2:


చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు

చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు

బిరుసైన..కండరాలు..

బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు

వస్తుంటే.. చూడాలి

వస్తుంటే చూడాలి వాడి సోకు

వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు


కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు


చరణం 3:


తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి

అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు

తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి

అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు


దున్నుతుంటే ...చూడాలి

దున్నుతుంటే చూడాలి వాడి జోరు

వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు


కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు



చరణం 4:


నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు

వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది

నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు

వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది


చూస్తుంటే చాలు దాని సోకు మాడ

పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ


కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు



***** ******** *************



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల


పల్లవి:


ఆ... ఆ... ఆ... ఆ...


ఎవరో రావాలి..

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి


ఎవరో రావాలి....

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి..

ఎవరో రావాలి....


చరణం 1:


మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..

మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..

మరిచి పోయిన మమత లాగ...

మరిచి పోయిన మమత లాగ... మమతలుడిగిన మనసు లాగ

మాసిపో.. తగునా...

ఎవరో రావాలి....


చరణం 2:


ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..

ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..

కొనగోట మీటిన చాలు...

కొనగోట మీటిన చాలు... నీలో కోటి స్వరములు పలుకును..


ఎవరో రావాలి.....



చరణం 3:



రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు

రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు

శక్తి మరచి.. రక్తి విడచి...

శక్తి మరచి.. రక్తి విడచి... మత్తు ఏదో మరగినావు

మరిచిపో... తగునా...


ఎవరో రావాలి....

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి..

ఎవరో రావాలి.... 




***** ******** *************



చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  ఘంటసాల


పల్లవి:


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఈ భగ్న హృదయం ..ఈ అగ్ని గుండం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం 


చరణం 1:


ప్రేమభిక్ష నువ్వే పెట్టీ

ఈ పేద హృదయం పగులగొట్టీ

పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు

నువ్వివనిదీ తాకలేనూ ..ఇంకెవరినీ అడుగలేనూ

బ్రతుకు నీకు ఇచ్చాను.. చితిని నాకు పేర్చావు


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం ??


చరణం 2:


ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ

నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ

కూలిపోయి ధూళిలో కలసిపోనీ ...కాలిపోయి బూడిదే మిగలనీ


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం 


చరణం 3:


మమత నింపమన్నానూ .. మనసు చంపుకొన్నావూ

మధువు తాగనన్నాను .. విషం తాగమన్నావూ

నీకు ప్రేమంటే నిజం కాదూ ...నాకు చావంటే భయంలేదూ

నీ విరహంలో బ్రతికానూ ...ఈ విషంతో మరణిస్తానూ ...మరణిస్తానూ..  

గీతాంజలి (1989)


చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు
నటీనటులు: నాగార్జున, గిరిజా షెట్టర్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: సి. ప్రవీణ్ కుమార్ రెడ్డి, పి.ఆర్.ప్రసాద్, సి.యల్. నరసా రెడ్డి
విడుదల తేది: 10.05.1989

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి

నా...జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ... సవ్వడే సన్నగా ఉండాలని
కోరనా గుండెనే కోరిక
కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో
తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవి

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
ఓ పాపా లాలి

ఓ... మేఘమా ఉరమకే ఈ పూటకీ
గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ... కోయిలా పాడవే నా పాటని
తియ్యని తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో
సెలయేరుల అలపాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి





*********  *********  *********




చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర ,  యస్. పి. బాలు

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏలగాని నీడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే రేపు లేదులే
వీడుకోలిదే వీడుకోలిదే

నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాదలొచ్చినా ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ ఈ ప్రేమ

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికి ప్రశ్న రాసలీలకి
ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి
ఆ అణాలు ఆశకి తాజమహలు శోభకి
పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధికన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే
కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ ఈ ప్రేమ

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది నీకసి
నింగీ నేల తాకేవేళ నీవే నేనై పోయే క్షణాల
లేదు శాసనం లేదు బందనం
ప్రేమకే జయం ప్రేమదే జయం





*********  *********  *********




చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం

మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం

ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం
సై అంటే సయ్యాటలో... హే హే
మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢీ ఆటలో

నేడేరా నీకు నేస్తము, రేపే లేదు
నిన్నంటే నిండు సున్నరా, రానే రాదూ
ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే
తక తకధిమి తకఝణు

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం

పడనీరా విరిగి ఆకాశం విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేనులే... హో..హో
నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే

ఓ మాట, ఒక్క బాణము, మా సిద్దాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే
తక తకధిమి తకఝణు

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం

మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
తకిట తకిట తకధిమి తకధిమి తక
తకిట తకిట తకధిమి తకధిమి తక
తకిట తకిట తకధిమి తకధిమి తక
తకిట తాం తాం తాం తాం తాం




*********  *********  *********




చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా (2)

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల నా యెద స్వరాల సంపద
తరాల నా కథ  క్షణాలదే కదా
గతించి పోవు గాధ నేననీ...

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో

శుఖాలతో పికాలతో ధ్వనించినా మధూదయం
దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరినా ఉగాది వేళలో
గతించి పోని గాధ నేననీ...

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా (2)





**********   *********   *********




చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, జానకి

ఓం నమః నయన శృతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో...
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో...

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా
కాలము లేనిదై గగనము అందగా
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి ఓం

ఓం నమః నయన శృతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో...
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో...





**********   *********   *********




చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు
దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

చరణం: 1
వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి
వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు
దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

చరణం: 2
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు  ఉడుకు వయసు
దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే





**********   **********  *********




చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ...ఓ...ఓ...ఓ...
నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా
నా ఊరేది... ఏది,  నా పేరేది... ఏది
నా దారేది... ఏది,  నా వారేరి...
ఓ...ఓ...ఓ...ఓ...

ఏనాడో ఆరింది నా వెలుగు నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు నీ వరమే నన్నుడుగు
మోహిని పిచాసి నా చెలిలే
శాఖిని విసూచి నా సఖిలే
మోహిని పిచాసి నా చెలిలే
శాఖిని విసూచి నా సఖిలే
విడవకురా వదలనురా ప్రేమేరా నీ మీదా

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిశాచ భేతాళ
మారి జంభం జదంభంభం

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా

నీ కబళం పడతా నిను కట్టుకు పోతా
నీ భరతం పడతా నిను పట్టుకు పోతా
ఆ...ఆ... ఓ... ఓ...

ఢాకిరి ఢక్కా ముక్కల చక్కా ఢంభో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటను వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కల చొక్కా అంబో అనిపిస్తాన్
నక్కను తొక్కేస్తాన్ చుక్కలు కక్కిస్తాన్
రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
అస్త్రాయా ఫట్  ఫట్ ఫట్ ఫట్
వస్త్రాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్

భూపోల మసజస తతగా శార్దూలా

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా

నీ కబళం పెడతా నిను కట్టుకు పోతా
నీ భరతం పెడతా నిను పట్టుకు పోతా
ఎ... ఎ... ఏ... ఏ...

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో