మహర్షి (2019)


చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే (2)

ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే
ఈ చెలిమికే కాలమే చాలదే

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు (2)

చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
ఓ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
హో యే

ఆటలాగ పాటలాగ నేర్చుకుంటే రానిదంట
స్నేహమంటే ఏమిటంటే
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్లదంట
నేస్తమంటే ఏమిటంటే
కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా
ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం
నీలో ప్రతి వంటరి తరుణం చెరిపేస్తూ...

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే

గుర్తులేవి లేనినాడు బ్రతికినట్టు గుర్తురాదే
తియ్యనైన జ్ఞాపకాల్లా
గుండెలోన అచ్చ ఏమి సావాసాలే
బాధలేవి లేనినాడు నవ్వుకైనా విలువుండదే
కళ్ళలోన కన్నీళ్ళున్నా
పెదవుల్లో నవ్వు చెరగదు స్నేహం వల్లే
నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగ కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే




చిత్రం: మహర్షి (2019)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: శ్రీమణి

గానం: దేవి శ్రీ ప్రసాద్




                                     ************~~~~~~~~~~~~*****************








నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

నువ్వే నీ పంతం

నువ్వేలే అనంతం

ప్రతి నిశి మసై

నీలో కసే దిశై

అడుగేసెయ్

Missile'u లా...

ప్రతి శకం శతం

ప్రతి యుగం యుగం

నీ పేరే వినేంతలా

గెలుపు నీవెంటే పడేలా

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

Oh' నువ్వే నీ పంతం

నువ్వేలే అనంతం

నీదొక మార్గం

అనితరసాధ్యం

నీదొక పర్వం

శిఖరపు గర్వం

నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివుంటావు

నీ తలరాతను సొంతగ నువ్వే రాసుకుపోతున్నావు

ఓటమి భయమే ఉన్నోడెవడూ ఓడని రుజువే నువ్వు

గెలుపుకే సొంతం అయ్యావు

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

Ho' నువ్వే నీ పంతం

నువ్వేలే అనంతం

భవితకు ముందే

గతమే ఉందే

గతమొకనాడు

చూడని భవితే...

నిన్నటి నీకు రేపటి నీకు తేడా వెతికేస్తావు

మార్పును కూడా మారాలంటూ తీర్పే ఇస్తుంటావు

ఏవీ లేని క్షణమే అన్నీ నేర్పిన గురువంటావు

గెలుపుకే కధలా మారావు

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

నువ్వే నీ పంతం

నువ్వేలే అనంతం...




** **************** ********** **************

మహర్షి (2019) 

రచన: శ్రీమణి                                
సంగీతం: దేవి శ్రీప్రసాద్ 
గానం: శంకర్ మహదేవన్ 



భళ్ళుమంటూ నింగివొళ్ళు విరిగెను గడ్డి పరకతోన 
ఎడారి కళ్ళు తెరచుకున్నవేళన చినుకు పూలవాన!
సముద్రమెంత దాహమేస్తే వెతికేను ఊటబావినే 
శిరస్సువంచి శిఖరమంచు ముద్దిడే మట్టినేలనే...


పదరా.. పదరా.. పదరా !
నీ అడుగికి పదును పెట్టి పదరా! 
ఈ అడవిని చదును చెయ్యి మరి 
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా !

పదరా.. పదరా.. పదరా !
ఈ పుడమిని అడిగిచూడు పదరా !
ఈ గెలుపను మలుపు ఎక్కడను ? 
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా !


నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, 
ఈ పథమున మొదటడుగైరా,   
నీతరమిదిరా, అనితరమిదిరా అని చాటేయ్ రా! 



|| పదరా.. పదరా.. పదరా నీ అడుగికి ||
|| పదరా.. పదరా.. పదరా  ఈ పుడమిని ||


|| భల్లుమంటూ ||



కదిలే ఈకాలం, తన రగిలే వేదనికి, 
బదులల్లె విసిరిన ఆశల బాణం నువ్వేరా 
పగిలే ఇల హృదయం, తన యెదలో రోదనికి, 
వరమల్లె దొరికిన ఆఖరిసాయం నువ్వేరా!

కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక, 
విలపించేటి ఈభూమివొడి చిగురించేలా..! 


పదరా.. పదరా.. పదరా !
ఈ హలమును భుజముకేత్తి పదరా,  
ఈ నేలను ఎదకు హత్తుకుని 
మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా 

పదరా.. పదరా.. పదరా ! 
ఈ వెలుగును పలుగుదించి పదరా 
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా..!

నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం, 
చినుకల్లె మొదలై,  ఉప్పెన కాదా ఈ కధనం, 
నీలో ఈజడికి, చెలరేగే అలజడికి, 
గెలుపల్లె మొదలై, చరితగా మారే నీ పయనం,
నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసాక,
నువ్వు లక్ష్యమని, తమ రక్షవని నినదించేలా!  

పదరా.. పదరా.. పదరా !
నీగతముకు కొత్త జనన మిదిరా, 
నీ ఎత్తుకు తగిన లోతు ఇది 
తొలి పునాది గది తలుపు  తెరిచి పదరా! 

పదరా.. పదరా.. పదరా !
ప్రతోక్కరి కథవు నువ్వు కదరా 
నీ ఒరవడి భవిత కలల వొడి 
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా..! 

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం, 
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం 


ఉషస్సు ఎంత ఊపిరిచ్చిపెంచిన కాంతిచుక్కవో 
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో....!



********** ************* ************ ************* **************



చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి  
గానం : రాహుల్ సిప్లిగంజ్, మానసి 

ఏవో గుస గుసలే
నాలో వలసే విడిసీ
వలపే  విరిసే  ఎదలో

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

కొండవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దినా పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి
నా మానసిట్టా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడ గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా
నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ
మనసు దానినల్లే తూనీగ
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కలలు బాగా

పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల పుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే

పిల్లోడా గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే


  

******** ************ ************ ***************** ************


 నువ్వని, ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువ్వనుకుంది
ఇది కాదుగా నువ్వెతికింది
ఏదని బదులేదని, ఒక ప్రశ్నలా నిలుచున్నావా
కాలమే వెనుతిరగనిది
ఇవ్వదు నువ్వడిగినది

ఏ వేలో పట్టుకుని
నేర్చేదే నడకంటే
ఒంటరిగా నేర్చాడా ఎవడైనా
ఓ సాయం అందుకొని
సాగేదే బ్రతుకంటే
ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా
పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా
నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా...

నువ్వని, ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువ్వనుకుంది
ఇది కాదుగా నువ్వెతికింది
ఏదని బదులేదని, ఒక ప్రశ్నలా నిలుచున్నావా
కాలమే వెనుతిరగనిది
ఇవ్వదు నువ్వడిగినది

ఓ' ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిదా
నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలయ్యిందా
ఇన్నాళ్ళూ ఆకాశం ఆపేసిందా
ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా
గెలుపై ఓ గేలుపై నీ పరుగే పూర్తైనా
గమ్యం మిగిలే ఉందా...

రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా
ఎన్నడూ నిను మరువనిది
ఎప్పుడూ నిను విడువనిది
ఓ' ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా
గుండెలో గురుతయ్యినది
గాయమై మరి వేచినది

లోకాలే తలవంచి
నిన్నే కీర్తిస్తున్నా
నువ్ కోరే విజయం వేరే ఉందా
నీ గుండె చప్పుడుకే
చిరునామా ఏదంటే
నువ్ మొదలయ్యిన చోటుని చూపిస్తోందా
నువ్వొదిలేసిన నిన్నలలోకి అడుగే సాగేనా
నువ్ సాధించిన సంతోషానికి అర్ధం తెలిసేనా...


  ******** ******************* ****************** *************



 ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా
ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా
ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా...
మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...
మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...

ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
నిస్వార్థమెంత గొప్పదో ఈ పథము ఋజువు కట్టదా
సిరాను లక్ష్యమొంపదా చిరాక్షరాలు రాయదా
నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా
నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలాదా...
మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...
మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...





మజిలీ (2019)


























పల్లవి:

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమ
చిలిపిని తలపులో
తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా
నిన్నుకోరుకుందిరా సుందరా

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమ
చిలిపిని తలపులో
తెలిసినది వలపులో మధురిమా

చరణం: 1
నీ ప్రేమలో ఆ రాధనై నే నిండుగా మునిగాక
నీకోసమే రాశానుగా నా కళ్లతో  ప్రియలేఖ
చేరునో చేరదో తెలియదు ఆ కానుక
ఆశనే వీడక వెనక పడెను మనసు పడిన మనసే

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా

చరణం: 2
ఉన్నదిరా ఉంటానురా నీ నీడలో కడదాకా
కన్నీటితో కార్తీక పూ దీపాన్నిరా నువులేక
దూరమే భారమై కదలదు నా జీవితం
నీవు నా చేరువై నిలిచెనసలు మధుర క్షణములెపుడో

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమ
చిలిపిని తలపులో
తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా
నిన్నుకోరుకుందిరా సుందరా




చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: చిన్మయి శ్రీపాద

జగదీకవీరుని కథ (1961)





చిత్రం: జగదేకవీరుని కథ (1961) 
సంగీతం: పెండ్యాల 
గీతరచయిత: పింగళి 
నేపధ్య గానం: ఘంటసాల 

పల్లవి : 

శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి... 
శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ.. 
శివానందలహరి..శివశంకరీ.. 


చరణం 1 : 


చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ 
చంద్రకళాధరి ఈశ్వరీ.. 
కరుణామృతమును కురియజేయుమా.. 
మనసు కరుగదా.. మహిమ జూపవా.. 
దీనపాలనము చేయవే.... ఏ .. 
శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ.. 
శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి..శివశంకరీ... 
శివశంకరీ... శివా....నంద...లహరీ...శివశంకరీ... 
శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ.. 


చరణం 2 : 

చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా.. 
మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా.. 
చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా.. 
రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప 
చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస.. 
సరిమ గరి మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప.. 
మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని.. 
సని పని పమ..పమ..గమరి సనిస.. 
సని పని పమ..పమ..గమరి సనిస.. 
సరి మపని దానిస.. సరి మపనిదానిస..సరిమపని దానిస... 
చంద్రకళాధరి ...ఈశ్వరీ..ఆ..ఆ..ఆ.. 
చంద్రకళాధరి...ఈశ్వరీ...శివశంకరీ..శివశంకరీ... 


తోం..తోం..తోం..దిరిదిరితోం.. దిరిదిరితోం....దిరిదిరితోం.. 
దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం.. 
దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా.. 


దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం.. 
దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం.. 


చరణం 3 : 


దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి 
నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి 
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం.. 

నినినిని..నినినిని..దనిని..దనినిని..దప 
పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని.. 
సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని 
నిసస..నిసస..నిద..దనిని దనిని దప.. 
నిని దద..ససనిని..రిరిసస..గగరిరి.. 
గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస.. 

రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ... 
నినిని రిరిగరిమా... 
రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ.. 
సరి సస..మప మమ..సరి సస..సససస.. 
సరి సస...పని పప... సరిసస... సససస.. 
మప మమ... పని దద...మపమ...పనిద.. 
మపమ..పనిద..పదపప..సరి సస.. 
ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ.. 
పపప..దదద...నినిని..ససస..రిరిరి.. 
గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 
శివశంకరీ..




*********** ************ ********

చిత్రం: జగదేకవీరుని కథ (1961) 
సంగీతం: పెండ్యాల 
గీతరచయిత: పింగళి 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి : 

మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే 
ఆ..మమతలు వెలెసెనులే... 
మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే 
ఆ..మమతలు వెలెసెనులే... 

చరణం 1 : 

ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే మనకిది మంచిదిలే 
ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే మనకిది మంచిదిలే 

ఆ..మంచిది అయినా కొంచెమైనా వంచన నీదేలే 
ఆ..అయినా మంచిదిలే... 


మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే 
ఆ..మమతలు వెలెసెనులే... 

చరణం 2 : 

ఇది మోహన మంత్రమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే 
ఇది మోహన మంత్రమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే 

ఆ..మేలే అయినా మాల్యమైన జాలము నీదేలే 
ఆ..అయినా మేలేలే.. 

మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే 
ఆ..మమతలు వెలెసెనులే...



*********** ************ ********

చిత్రం : జగదేకవీరుని కథ (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : పి.లీల, సుశీల

పల్లవి :

జలకాలాటలలో కలకల పాటలలో
యేమి హాయిలే హలా... అహ యేమి హాయిలే హలా
జలకాలాటలలో కలకల పాటలలో
యేమి హాయిలే హలా... అహ యేమి హాయిలే హలా

ల ల లా ల లా..లలలాలాల లా లా లలా


చరణం 1 :

ఉన్నది పగలైనా, అహ వెన్నెల కురిసేనే
ఒహొహోహోహొ ఓహో..
ఉన్నది పగలైనా.. అహ వెన్నెల కురిసేనే
అహ వన్నె చిన్నెలా కన్నె మనసులో సన్న వలపు విరిసే
అహ వన్నె చిన్నెలా కన్నె మనసులో సన్న వలపు విరిసే

జలకాలాటలలో కలకల పాటలలో
యేమి హాయిలే హలా... అహ యేమి హాయిలే హలా

చరణం 2 :

తీయని రాగమేదో మది హాయిగ పాడేనే
అహహహ అహహ అహహ..అహహ
తీయని రాగమేదో మది హాయిగ పాడేనే
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలుపే..


జలకాలాటలలో కలకల పాటలలో
యేమి హాయిలే హలా... అహ యేమి హాయిలే హలా





*********** ************ ********

చిత్రం: జగదేకవీరుని కథ (1961)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి :

ఓ.....దివ్య రమణులారా ...
నేటికి కనికరించినారా ....కలకాదు కదా సఖులారా...

ఓ సఖి ...ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని
ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని... ఓసఖి

కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ...ఓ...ఓ..
కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ....
కనుల విందు చేసారే కనుల విందు చేసారిక ధన్యుడనైతిని నేనహ..

ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని... ఓసఖి

చరణం 1 :

నయగారములొలికించి... ప్రియరాగము పలికించి
నయగారములొలికించి... ప్రియరాగము పలికించి
హాయినొసుగు ప్రియలేలే ......హాయినొసుగు ప్రియలేలే....
మరి మాయలు సిగ్గులు ఏలనే....

ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని... ఓసఖి

చరణం 2 :
కను చూపులు ఒక వైపు...మనసేమొ నా వైపు
కను చూపులు ఒక వైపు...మనసేమొ నా వైపు
ఆటలహొ తెలిసెను...ఏ...ఏ...
ఆటలహొ తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె...

ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని...


*********** ************ ********

చిత్రం: జగదేకవీరుని కథ (1961)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి :

ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ
ప్రేమగానము సోకగానే భూమి స్వర్గమె ఐనదీ
భూమి స్వర్గమె ఐనది

చరణం 1 :

ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
ఆ.. ఆ .. ఆ..
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీవశమైనదీ
మనసు నీవశమైనది...

ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ 

చరణం 2 :
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
ఆ.. ఆ .. ఆ..
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
తలపులేవో రేగి నాలో
చాల కలవర మైనదీ
చాల కలవరమైనది...


ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ 



వాగ్ధానం (1961)



చిత్రం :  వాగ్ధానం (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :   సుశీల


పల్లవి :

బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బంగరు నావ బ్రతుకు బంగరు నావ

దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవ
బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ



చరణం 1 :


అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
కదలిపోవు కాలచక్రమాగిపోవునా
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ

బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ


చరణం 2 :


అనురాగం వెన్నెలలు అంతరించినా
అనురాగం వెన్నెలలు అంతరించినా
ఆశలన్ని త్రాచులై కాటు వేసినా
జీవితము జీవించి ప్రేమించుటకే
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ

బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ



చరణం 3 :


కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
ఆ... ఆ... ఆ... ఆ
కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
వలపన్నది విఫలమై విలపించుటకా
దొరకబోని వరము బ్రతుకు మరణించుటకా
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ

బంగరు నావ...   బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ


******* *********** ************

కాశీపట్నం చూడర బాబు
చిత్రం :  వాగ్ధానం (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :

ఓహో నిలబడితే పడిపోయే నీరసపు నీడవంటి బీదవాడా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
మనిషిగా బ్రతికేందుకు కనీస అవసరాలైనా లేనివాడా

అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!

కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
అల్లో లక్షణ అని అల్లాడే..  పల్లెల దుస్థితికేమి జవాబు
అల్లో లక్షణ అని అల్లాడే.. పల్లెల దుస్థితికేమి జవాబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు



చరణం 1 :


నిరాశతోను నిస్పృహలోను...  తెరువెరుగని నిరుపేదలు
మురికి గుంటలు ఇరుకు కొంపలు నిండిన చీకటి పేటలు
పాడు రోగాలు మోసుకు తిరిగి...  ప్రజలను చంపే ఈగలు
కరువు బరువు పరితాపాలు...  కలిసి వెరసి మన పల్లెలు

కాశీపట్నం చూడర బాబు..  కల్లా కపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లా కపటం లేని గరీబు


చరణం 2 :


శరీరాల్లో అరచాటాకైనా రక్తం లేని దరిద్రులనే
పీల్చుకు తింటాడు దోమరాక్షసుడు...
వాడి దుంప తెగ
మేడల్లో మిద్దెల్లో నివసించే వారి జోలికైనా పోడు గదా
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!
వైద్య సహాయం అసలే లేదు ఉన్నా దొరకవు మందులు
డాక్టర్ కోసం వెతికే లోగా...  రోగులు గుటుక్కుమందురు
నెత్తురు పీల్చే వృత్తి పరులే మన గ్రామాలకు కామందులు
దొరలూ దోమలు పల్లె జనాలను పంచుకు నంచుకు తిందురు

కాశీపట్నం..హోయ్ హోయ్
కాశీపట్నం చూడర బాబు...  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు...  కల్లాకపటం లేని గరీబు


చరణం 3 :


ప్రజలతో సమానంగా కష్టసుఖాలను పంచుకుంటామంటారు మన వినాయకులు
అవునవును
సుఖాలన్నీ తమకు దక్కించుకుని కష్టాలన్నీ మనకు వదిలేస్తారు
ఊ.. ఊ.. ఊ..అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!

ఎవరో వచ్చి సాయం చేస్తారనుకోవడమే పొరపాటు
పదవులు వస్తే ప్రజను మరవడం బడా నాయకుల అలవాటు
మనలో శక్తి మనకే తెలియదు అదే కదా మన గ్రహపాటు
తెలిసి కలిసి నిలిచిన నాడు ఎదుటివాడికది తలపోటు

కాశీపట్నం..ఓ హోయ్
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
అల్లో లక్షణ అని అల్లాడే పల్లెల దుస్థితికేమి జవాబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు


******* *********** ************

చిత్రం :  వాగ్ధానం (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల


పల్లవి :


పాహి రామప్రభో వరదా శుభదా
పాహి దీన పాలా ఆ....

వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా రామా...
వెలుగు చూపవయ్యా
ఆ....

చరణం 1 :

మాహాత్ములైనా దురాత్ములైనా
మనుజులపేరనే మసలేరయ్యా
మాహాత్ములైనా దురాత్ములైనా
మనుజులపేరనే మసలేరయ్యా
అందరికీ నీ అభయం కలదని
అనుకోమందువ దేవా... ఆ...
అనుకోమందువ దేవా ఆ...

వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా..



చరణం 2 :


ఆ...ఆ...ఆ...
నేరక చేసిన కారణమున
మా నేరము నేరము కాకపోవునా
నేరక చేసిన కారణమున
మా నేరము నేరము కాకపోవునా
కన్నీరే ఆ కలుషమునంతా కడిగివేయునా రామా...ఆ...
కడిగివేయునా రామా...ఆ..

వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా...


చరణం 3 :

ఆ...ఆ...ఆ...
కలరూపేదో కలవో లేవో
ఆ...ఆ...ఆ..
కలరూపేదో కలవో లేవో
ఎద ఉన్నది ఈ వేదనకేనో
ఏది అన్నెమో ఏది పున్నెమో ఎరుగలేము శ్రీరామా...ఆ..
ఎరుగలేము శ్రీరామా...ఆ..ఆ..

వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా..


******* *********** ************

చిత్రం :  వాగ్ధానం (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  కరుణశ్రీ , శ్రీ శ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


శ్రీ నగజా తనయం సహృదయం
శ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం సహృదయం

శ్రీరామ భక్తులారా!! ఇది సీతాకళ్యాణ సత్కథ.
నలభై రోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను.
అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది...
నాయనా.. కాస్త పాలు మిరియాలు...
చిత్తం.... సిధ్ధం

చరణం 1 :

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనించీ విచ్చేసిన వీరాధి వీరులలో..
అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్యసుందరమూర్తి.. ఆహా! అతడెవరయ్యా అంటే..

రఘురాముడూ.. రమణీయ వినీల ఘనశ్యాముడూ...
రమణీయ.. వినీల.. ఘనశ్యాముడూ...
వాడు నెలరేడు.. సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీలనేలురా
వాని నగవు రతనాల జాలురా
వాని కనులు మగమీలనేలురా
వాని నగవు రతనాల జాలురా
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్గొనెడు మరోమరుడు.. మనోహరుడు రఘూరాముడూ

సనిదని సగ రిగరి రిగరి సగరి రిగరి సగగరి సనిదని
సగగరి సని రిసనిస రిసనిస నిదపమగరి రఘురాముడూ...

సనిస సనిస సగరిరిగరి సరిసనిస పదనిస
సనిగనినిస సనిరిసనిదని నిదసనిదపమ గ మ స
నినినినినినిని పస పస పస పస
సప సప సప తద్దిం తరికిటతక
రఘురాముడూ.. రమణీయ వినీల ఘనశ్యాముడూ....

శభాష్! శభాష్!

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి
సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో..

ఎంత సొగసూగాడే... ఎంత సొగసూగాడే... మనసింతలోనె దోచినాడే...
ఎంత సొగసూగాడే...
మోము కలువరేడే.. ఏ.. ఏ.... మోము కలువరేడే ...
నా నోము ఫలము వీడే...
శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే... ఎంత సొగసూగాడే



చరణం 2 :

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా
అక్కడ స్వయంవర సభామంటపంలో జనకమహీపతి సభాసదులను జూచి

అనియెనిట్లు ఓయనఘులార! నా యనుగుపుత్రి సీతా
వినయాధిక సద్గుణ వ్రాతముల విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువమీరగ వరించి మల్లెలమాలవైచి పెండ్లాడు ఊ ఊ....

అని ఈ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట
మహావీరుడైన రావణాసురుడు కూడా
"హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము
దీనిని స్పృశించుటయే మహాపాపము"
అని అనుకొనినవాడై వెనుదిరిగిపోయాడట

తదనంతరంబున
ఇనకులతిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత


చరణం 3 :

పెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనె
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము
ఒక నిమేషమునందె నయము జయమును
భయము విస్మయముగదురా ఆ ఆ...

శ్రీమద్రమారమణ గోవిందో .... హరి
భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది
మరొక్కసారి...
జై శ్రీమద్రమారమణ గోవిందో... హరి

భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు.. అంతట...

భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె పృథుగుణమణి సంజాతన్ భాగ్యోపేతన్ సీతన్
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె...
శ్రీమద్రమారమణ గోవిందో.... హరి


******* *********** ************
వన్నె చిన్నెలన్నీ ఉన్న
చిత్రం :  వాగ్ధానం (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే.. ఉత్త ఆడదానివే


చరణం 1 :

తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
కళ్ళెంపట్టీ...కళ్ళెంపట్టి కళ్ళనుకట్టి
నడిపే మొనగాడుండాలీ

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడదానివే


చరణం 2 :

అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని
అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని
తూకంవేసీ....తూకంవేసి.. పాకంచూసి
డెందం ఒకరికె ఇవ్వాలి
వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే


చరణం 3 :

అందం డెందం కలిపీ.. ఆనందం అర్థం తెలిపే
అందం డెందం కలిపీ.. ఆనందం అర్థం తెలిపే
అతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి

వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే


******* *********** ************
చిత్రం :  వాగ్ధానం (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :


ఊ..ఉ...ఉ...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ..ఆ..ఆ..ఆ...


చరణం 1 :

ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
అహ..హా..ఆ..
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొంద్దాము అందని ఆకాశమే...

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...


చరణం 2 :

ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
అహ..హా..ఆ..
ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో...
మేఘాలలో వలపు రాగాలలో....
దూర దూరాల స్వర్గాల చేరుదమా....

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...

చరణం 3 :

ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అహ..హా..ఆ..
ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అందాలనూ తీపి బంధాలను...
అందాలనూ తీపి బంధాలను...
అల్లుకుంద్దాము డెందాలు పాలించగా...


నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...