శ్రీ వినాయక విజయం(1979)



పల్లవి :



ఎవరవయ్యా...  ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..

ఎవరవయ్యా...  ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..

ఎవరవయ్యా... 



చరణం 1 :


ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని

ఆ నవులు పలికేవి ఏ వేద మంత్రాలో

వేల్పులందరిలోనా తొలి వేల్పువో ఏమో
పూజలలో మొదటి పూజ నీదేనేమో
పూజలలో మొదటి పూజ నీదేనేమో

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా.. 


చరణం 2 :


 చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో... ఎన్నెన్ని వింతలో...
ఎన్నెన్ని కోరికలు నిండి 
నే కన్న ఎన్నెన్నో స్వప్నాలు పండి..
చిన్నారి ఈ మూర్తివైనావో
ఈరేడు లోకాలు ఏలేవో
ఈరేడు లోకాలు ఏలేవో

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..


చిత్రం :  శ్రీ వినాయక విజయం(1979)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :   సుశీల

బుద్ధిమంతుడు (1969)




చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

హవ్వారే హవ్వా హైలేసో హహ్హ
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో
హవ్వారే హవ్వా...

చరణం 1:

పచ్చిమిరపకాయలాంటి పడుసు పిల్లరోయ్
దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్
పచ్చిమిరపకాయలాంటి పడుసు పిల్లరోయ్
దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్

వగలమారి చెప్పరాని పొగరుమోతురోయ్
ఆ వన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్
వగలమారి చెప్పరాని పొగరుమోతురోయ్
ఆ వన్నెలాడి ఉడుక్కుంటే వదలమోకురోయ్

హవ్వారే హవ్వా...హైలేసో..లెస్సో...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...

చరణం 2:

ఇంటికెళితె నిన్ను జూసి నవ్వుతుందిరో
దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో
ఇంటికెళితె నిన్ను జూసి నవ్వుతుందిరో
దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో

టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో
టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో
టెక్కంతా ఎగిరి పోయి ఎక్కీ ఎక్కీ ఏడ్చెరోయ్ ఓయ్ ఓయ్ ఓయ్

హవ్వారే హవ్వా...హైలేసో..హహ్హా...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...

చరణం 3:

చూడబోతె అవ్వాయి చువ్వ లాంటిదోయ్
జోడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్
చూడబోతె అవ్వాయి చువ్వ లాంటిదోయ్
జోడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్

జాంపండు లాంటి గుంట జట్టు గట్టరోయ్
అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరోయ్
జాంపండు లాంటి గుంట జట్టు గట్టరోయ్
అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరోయ్...

హవ్వారే హవ్వా హైలెస్సో అహ
హవ్వారే హవ్వా...హైలేసో..హహ్హా...
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వార మంతా హైలేసో..
హవ్వారే హవ్వా హైలేసో సో సో..సో...
దాని యవ్వారమంతా హైలేసో..
హవ్వారే...హహ్హా...


********* ********* ********
చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

వేయి వేణువులు మ్రోగేవేళా... ఆ... ఆ...
హాయి వెల్లువై పొంగేవేళా...
రాస కేళిలో తేలే వేళా...
రాధమ్మను లాలించే వేళ....

నను పాలింపగ నడచి వచ్చితివా..
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా...
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా

నను పాలింపగ నడచి వచ్చితివా.. ఆ హా హా...

చరణం 1:

అర చెదరిన తిలకముతో.. అల్లదిగో రాధమ్మా..
అర జారిన పైయ్యెదతో.. అదిగదిగో గోపెమ్మా..
ఎరుపెక్కిన కన్నులతో.. ఇదిగిదిగో సత్యభామా..
పొద పొదలో.. యెద యెదలో.. నీ కొరకై వెదకుచుండగా

నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...

చరణం 2:

కంసుని చెరసాలలో.. ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో.. ఖైదీవై పెరిగావు
కరకురాతి గుళ్ళలో.. ఖైదీవై నిలిచావు
ఈ భక్తుని గుండెలో.. ఖైదీగా.. ఉండాలనీ

నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...


********* ********* ********
చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం 1:

కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
మా రాధ అనురాగం మారనిది..
అది ఏ రాసకేళిలోన చేరనిది ..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం 2:

జిలుగు పైట లాగకురా...
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది

తోటలోకి రాకురా ..ఆ..ఆ..ఆ

చరణం 3:

రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
కన్నెవలపు సన్నజాజి వాడనిది..
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది..

తోటలోకి రాకురా... తుంటరి తుమ్మెదా ...గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది.. అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ


********* ********* ********
చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా
తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా
టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు .. 

చరణం 1:

ప్రియురాలి వలపులకన్నా నును వెచ్చనిదేదీ లేదని
ప్రియురాలి వలపులకన్నా నును వెచ్చనిదేదీ లేదని
నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ  ఆ ప్రేమ నగరుకే పోతాను .. పోతాను .. పోతాను
ఈ కామ నగరుకి రాను .. ఇక రాను

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు ..

చరణం 2:

ఇచ్చుటలో ఉన్న హాయి.. వేరెచ్చటనూ లేనే లేదని
ఇచ్చుటలో ఉన్న హాయి.. వేరెచ్చటనూ లేనే లేదని
లేటుగ తెలుసుకున్నాను.. నా లోటుని దిద్దుకున్నాను
ఆ ఆ స్నేహనగరుకే పోతాను .. పోతాను .. పోతాను
ఈ మోహనగరుకు రాను .. ఇక రాను

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు ..

చరణం 3:

మధుపాత్రకి ఎదలో ఇంక ఏమాత్రం చోటు లేదని
మధుపాత్రకి ఎదలో ఇంక ఏమాత్రం చోటు లేదని
మనసైన పిల్లే చెప్పింది .. మనసైన పిల్లే చెప్పింది
నా మనసంతా తానై నిండింది .. నా మనసంతా తానై నిండింది
నే రాగ నగరుకే పోతాను .. అనురాగ నగరుకే పోతాను .. పోతాను 

********* ********* ********


చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

జై శ్రీమద్రమారమణ గోవిందో హా... నాయనలారా
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ
భక్తి ముక్తి కావాలంటే మాధవ సేవా చెయ్యాలంటే....
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ

గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
భుక్తి శక్తి కావాలంటే.. మానవ సేవా చెయ్యాలంటే
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ

చరణం 1:

దేవుడి పేరిట దోపిడి చేసే దళారులెందరొ పెరిగారు
ముక్తి మత్తులో భక్తుల ముంచి సర్వం భొంచేస్తున్నారు
నోరులేని ఆ దేవుడు పాపం నీరు గారి పోతున్నాడు...అయ్యో..

గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ


చదువుల పేరిట గుమాస్తాలను తయారు చేస్తూ ఉన్నారు
ప్రభువుల్లాగ బ్రతికేవాళ్ళను బానిసలుగ చేస్తున్నారు
ఉద్యోగాలకు వేటలాడమని ఊళ్ళపైకి తోలేస్తున్నారు 
బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ

చరణం 2:

చదవకపోతే మనిషి రివ్వున చంద్రుడి పైకి ఎగిరేవాడా
గిర గిర తిరిగి వచ్చేవాడా
దేవుడు చల్లగ చూడకపోతే అక్కడ గల్లంతైపోడా
ఆనవాలు చిక్కేవాడా...

బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ

చరణం 3:

చదువులుసారం హరి యని.. హరి కూడా చదవాలని
చదువుల మర్మం హరి యని.. ఆ హరి కీ గురువుండాలని
హరియే సర్వశమని.....చదువే సర్వశమని
హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్ల గుద్ది చెప్పాడు

ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చొని చదివాడు
ఈ బడిలో కూర్చొని చదివాడు చదివాడు చదివాడు చదివాడు
చదివాడు చదివాడు

********* ********* ********

చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:

గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది
ఓ.. గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది

ఓ..గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది
గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది
ఓ.. గుండెలో తొలివలపు పండింది

చరణం 1:

నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది
తనువు సెలరేఖలై వెలిగింది
తనువు సెలరేఖలై వెలిగింది
చల్లా చల్లాని జల్లు కురిసింది

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది

చరణం 2:

కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతే... 
గోరింక తానింక గూడు కట్టకపోతే 
కొమ్మా యెంతో చిన్న బోతుంది...
కొమ్మా యెంతో చిన్న బోతుంది

ఓ..గుట్టమీద గువ్వ కూసింది
నా గుండెలో తొలివలపు పండింది
ఓ..గుట్టమీద గువ్వ కూసింది

చరణం 3:

సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది
సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది
మనసైన జవరాలే వలచింది...
మనసైన జవరాలే వలచింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
మనుగడే ఒక మలుపు తిరిగింది...
ఊ...ఊ

బొబ్బిలి రాజా (1990)




చిత్రం : బొబ్బిలి రాజా (1990)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, జానకి 



పల్లవి :

హా.. హహహా...
హా.. హహహా...
హాహహహా..ఉమ్మ్..ఉమ్మ్హు..
హాహహహా..ఉమ్మ్..ఉమ్మ్హు..



వద్దంటే వినడే పోకిరి..  ముద్దుల్లో ఒకటే కిరికిరి
అర్జెంటుగా ఆహా.. ఓహో.. అనిపించగా
అందాలలో మందారాలే తెంచేసినాడే 

వద్దంటే విననే రామరి...
వద్దంటే విననే రామరి...  ఒళ్ళంత ఒకటే ఆవిరి



చరణం 1 :


ఈ మంచుగాలి కొట్టి...  వేధించు వేడిపుట్టి
ఒళ్ళంత పాకిందమ్మో...  ఓహో..
కవ్వించు కాంక్ష పుట్టి...  నా సిగ్గు వెన్నుతట్టి
నీ వెంట పంపిందయ్యో 

ఎవరెస్ట్ నైనా కరిగించవా...  శివమెత్తు నిట్టూర్పులో
ఎవరడ్డమైనా ఎదురించవా...  యువజంట పట్టింపులు
రాణి యువరాణి ముడివీడుతున్న కైపు చూపులు


అబ్బబ్బబ్బబ్బా..
వద్దంటే విననే రామరి.. ఒళ్ళంత ఒకటే ఆవిరి
దేహాలలో మన సందేహాలే తగ్గించగా
తాపాలలో అహ...  సంతాపాలే తప్పించుకోగా


వద్దంటే వినడే పోకిరి
వద్దంటే వినడే పోకిరి... ముద్దుల్లో ఒకటే కిరికిరి 


చరణం 2 :



పెళ్ళిడు ముంచుకొచ్చి.. అల్లాడు ఆశ రెచ్చి.. అల్లేసుకొమ్మందయ్యో
పిల్లాడి పంచకొచ్చి.. కిల్లాడి పిచ్చి పెంచి.. ఒళ్ళోకి రమ్మందమ్మో 


మంచాల మైకం దించేయనా ఒయ్యారి లంచాలతో
పొంచున్న దాహం దించేయనా విరజాజి వర్షాలతో
కాని తొలి బోణీ రవి చూడలేని కన్నే మోజుతో



అబ్బబ్బబ్బబ్బా..
వద్దంటే విననే రామరి.. ఒళ్ళంత ఒకటే ఆవిరి
దేహాలలో మన సందేహాలే తగ్గించగా
తాపాలలో అహ...  సంతాపాలే తప్పించుకోగా


వద్దంటే వినడే పోకిరి
వద్దంటే వినడే పోకిరి... ముద్దుల్లో ఒకటే కిరికిరి 

**************** ************* ************ ********

చిత్రం : బొబ్బిలి రాజా (1990)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి :


చెమ్మ చెక్క.. చెమ్మ చెక్క.. జున్ను ముక్క చెంపనొక్క
నిమ్మ చెక్క.. నిమ్మ చెక్క.. నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో... కోరింది కోసి అందుకో

రాణీ...I love you..
రాజా...I love you..

చెమ్మ చెక్క.. చెమ్మ చెక్క.. జున్ను ముక్క చెంపనొక్క
నిమ్మ చెక్క.. నిమ్మ చెక్క.. నమ్మకంగ తిమ్మిరెక్క




చరణం 1 :


మారుమూల సోకు చేర లేఖ రాయనా
సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా
తేరిపార చూడనీ దోర ఈడునీ
చీర చూరు దాటనీ వేడి ఊహనీ
వెక్కిరించు వన్నెలన్ని కొల్లగొట్టుకోనీ
కళ్ళతోటి కత్తరించు కన్నె గజ్జెలన్నీ
రా...గారంగా.. సై రా...సారంగా..

చెమ్మ చెక్క.. చెమ్మ చెక్క.. జున్ను ముక్క చెంపనొక్క
నిమ్మ చెక్క.. నిమ్మ చెక్క.. నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో.. కోరింది కోసి అందుకో

రాణీ...I love you..
రాజా...I love you.. 




చరణం 2 :


ఈటెలాంటి నాటు చూపు నాటుకున్నదీ
అలవాటులేని చాటు చోట మాటుకున్నదీ

ఈదలేను యవ్వనం ఆదరించవా
మీదవాలు మోజుతో స్వాగతించవా

రంగరంగ వైభవాల మంచమేలుకోవా
గంగపొంగు సంబరాల రంగుతేలనీవా
ఈ...ఏకంతం.. రాణీ...హహ కైలాసం..


చెమ్మ చెక్క.. చెమ్మ చెక్క.. జున్ను ముక్క చెంపనొక్క
నిమ్మ చెక్క.. నిమ్మ చెక్క.. నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో... కోరింది కోసి అందుకో
రాణీ...I love you.. రాజా...I love you..
రాణీ...I love you.. రాజా...I love you..



**************** ************* ************ ********


చిత్రం : బొబ్బిలి రాజా (1990) 
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర 


పల్లవి :


బలపం పట్టి భామ బళ్ళో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా
పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా ఓహో పాడుకుంటా
అం అః అంటా అమ్మడూ హొయ్యారే హొయ్యారే హొయ్
కమ్మహా ఉండేటప్పుడూ
బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో

సరసమింక ఎక్కువైతే చచా చిచీ తప్పదయ్యో
అప్పుడే ఇంక ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో
అచ్చులే అయ్యా ఇప్పుడూ హొయ్యారే హొయ్యారే హొయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ  
 
 
చరణం 1 :

ఎట్టాగుందె పాపా తొలి చూపే చుట్టుకుంటే
ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే

ఉండుండి ఎటంచో ఒక నవ్వే తాకుతోంది
మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది

ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా
నాక్కూడా కొత్తేనయ్యో ఏంచేద్దాం ఈపైన
కాస్తైనా ఖంగారు తగ్గాలి కాదనను ఏంచేసినా


సరసమింక ఎక్కువైతే చచా చిచీ తప్పదయ్యో
అప్పుడే ఇంక ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో
అం అహా అంటా అమ్మడూ హొయ్యారే హొయ్యారే హొయ్
కమ్మహా ఉండేటప్పుడూ అరరె హో హో హో హో


చరణం 2 :


తుప్పల్లో తుపాకీ సడి ఎట్టా రేగుతుందో
రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో

కొమ్మల్లో కు కూలే మన స్నేహం కోరుతుంటే
కొండల్లోయకోలే మనమెట్టా ఉన్నామంటే

అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
ఎవరెవరో అత్తా మామా వరసెట్టా తెలిసేనే
అందాకా ఆమర్రి అత్తమ్మ... ఈమద్ది మామనుకో

బలపం పట్టి భామ బళ్ళో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా
పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా ఓహో పాడుకుంటా
అచ్చులే అయ్యా ఇప్పుడూ హొయ్యారే హొయ్యారే హొయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ
పిచ్చి బుజ్జాయీ అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో


బలపం పట్టి భామ బళ్ళో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా
అప్పుడే ఇంక ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో
అం అః అంటా అమ్మడూ హొయ్యారే హొయ్యారే
హల్లుల్లో హల్లో ఎప్పుడూ
తనన తన తానననా తందానన్నా తందానన్న
తనన తన తానననా తందానన్నా తందానన్న
తందన్న తందానన్నానా హొయ్యారే హొయ్యారే హొయ్
తందన్న తందానన్నానా ఓ ఓ ఓ

**************** ************* ************ ********

చిత్రం : బొబ్బిలి రాజా (1990)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, జానకి 


పల్లవి :

కన్యాకుమారీ..  కనపడదా దారి..
కయ్యాలమారీ పడతావే జారి..
పాతాళం కనిపెట్టేలా... ఆకాశం పనిపెట్టేలా
ఊగకేమరి... మతిలేని సుందరీ

జిమిచకు... జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

గోపాలబాలా... ఆపర ఈ గోలా
ఈ కైపు ఇలా... ఊపర ఉయ్యాలా..
మైకంలో మయసభ చూడు... మహారాజా రాణా తోడు..
సాగనీ..మరీ..సరదాల గారడీ

జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..


చరణం 1 :


కొండలూ..గుట్టలూ..చిందులాడే  తదిగినతోమ్
వాగులూ..వంకలూ..ఆడిచూసే... కథ చెపుదాం

తూనీగ రెక్కలెక్కుదాం..సూరీడు పక్క నక్కుదాం
ఊదేటి కొమ్ము వెదుకుదాం..బంగారు జింకనడుగుదాం

చూడమ్మా... హంగామా...
అడివంతా... రంగేద్దాము
సాగించేయ్... వెరైటీ పోగ్రాం..
కళ్ళవిందుగా... పైత్యాల పండుగా

జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

ఆహా..కన్యాకుమారీ..
కనపడదా దారి..ఉహు..
కయ్యాలమారీ పడతావే జారి
మైకంలో మయసభ చూడు..మహారాజా రాణా తోడు..
సాగనీ..మరీ..సరదాల గారడీ

జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

చాజజా జాంచకు జకుం..హా..ఏహే..
హై..హేహే..జకు జకు జకు
జా జా జా జాంచకు జాజా



చరణం 2 :



డేగతో ఈగలే ఫైటు చేసే చడుగుడులో
చేపలే చెట్టుపై పళ్ళుకోసే గడబిడిలో
నేలమ్మ తప్పతాగెనూ... ఏమూలో తప్పిపోయేనో
మేఘాల కొంగు పట్టుకో..తూలేటి నడక నాపుతూ
ఓయమ్మో..మాయమ్మో..
దిక్కుల్నే ఆటాడించే..చిక్కుల్లో గందరగోళం..
ఒళ్ళు ఊగగా..ఎక్కిళ్ళు రేగగా

జింకుచకు జింగుచకు జా
చా..జింకుచకు జింగుచకు జా
జాజజా జాంచకు జకుం..హా..ఏహే..
హై..హేహే..జకు జకు జకు
జా జా జా జాంచకు జాజా


ఏయ్..గోపాలబాలా..ఓయ్..ఆపర ఈ గోలా
ఈ కైపు ఇలా..హహహ..ఊపర ఉయ్యాలా..
ఓయ్..పాతాళం కనిపెట్టేలా..హా..
ఆకాశం పనిపెట్టేలా..ఊగకే మరి..ఆ..
మతిలేని..సుందరీ...ఆ ఆ..
జాజజా జాంచకు జకుం..హా..ఏహే..

హై..హేహే..జకు జకు జకు
జా జా జా జాంచకు జాజా
సాగనీ..మరీ..సరదాల గారడీ
జిమిచకు..జిమిచకు జా..
చకు..జిమిచకు..జిమిచకు జా..

అగ్ని సంస్కారం (1980)





పల్లవి :
ఆ.. ఆ.. హహా.. ఆ ఏహేహే..హేహే.. లాలాలాలాలా మంచున తడిసిన మల్లికవో... మానసవీణా గీతికవో మంచున తడిసిన మల్లికవో... మానసవీణా గీతికవో అందాలన్నీ ఆలాపనగా పలికే రాగమాలికవో అందని జిలిబిలి తారకవో... జీవనసంధ్యా దీపికవో అందాలన్నీ ఆలాపనగా పలికే రాగమాలికవో అందని జిలిబిలి తారకవో... జీవనసంధ్యా దీపికవో
చరణం 1 :
తొలితొలి వలపుల తొలకరి మెరుపులు నిలకడగా నిలిచిపోనీ నా చెలి పెదవుల జాబిలి ఋతువులు మనుగడగా మలుచుకోనీ నీ తేనెలొలుకు తీపి పలుకు నాలో పులకింతగా మిగిలిపోనీ మంచున తడిసిన మల్లికవో... జీవనసంధ్యా దీపికవో
చరణం 2 :
వేసిన అడుగుల వెన్నెల మడుగుల వేసవులే మరచిపోనీ మాయని మమతల రాయని కవితల వెల్లువలో మునిగిపోనీ నీ చూపు నిలుపు చుక్క పొడుపు నాలో చలిమంటగా రగిలిపోనీ మంచున తడిసిన మల్లికవో... జీవనసంధ్యా దీపికవో చిత్రం : అగ్ని సంస్కారం (1980) సంగీతం : ఎం. జనార్ధన్ గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : బాలు, సుశీల

స్రవంతి (1985)





చిత్రం: స్రవంతి (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం:  ఎస్.పి. బాలు,  సుశీల
నటీనటులు: శరత్ బాబు, సుహాసిని మణిరత్నం, అరుణ ముచ్చర్ల, మోహన్
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాతలు: కె.కేశవరావు, జయకృష్ణ
విడుదల తేది: 16.01.1985

పల్లవి:
మౌనం ఆలాపన.. మధురం ఆరాధన
దొరికే దేవుని పరిచయం..కలిగే జీవన పరిమళం
కాలమా నిలిచిపో... కావ్యమై మిగిలిపో
తొలి రేయి నీడలో... హో

మౌనం ఆలాపన... మధురం ఆరాధన

చరణం: 1
కలలే నిజమై.. పది కాలాల బంధాలు ముందుంచగా...
యుగమే క్షణమై.. అనురాగాల హరివిల్లు అందించగా...

దివిలో మెరిసే ఆ నక్షత్ర నాదాలు వినిపించగా
మధుమాసానికి పూల ఉగాది..  శతమానానికి ప్రేమే నాంది
హే వసంతాలు సొంతాలుగా చేసుకో....
మందహాసాల మందార పూదోటలో...
ఆ...ఆ...ఆ..

మౌనం ఆలాపన... మధురం ఆరాధన

చరణం: 2
ఇహమో పరమో తీపి కన్నీటి కెరటాలు పొంగించగా
శుభమో సుఖమో... తేనె వెన్నెల్లో తెల్లారి పోతుండగా
ఒరిగే తులసీ మౌన గంధాల గానాలు వినిపించగా

కనివిని ఎరుగని సంగమ వేళ.. గుప్పెడు మనసుల ఆశల హేల
లేత చిరునవ్వునే పాపగా పెంచుకో ....
రాలు కుసుమాల రాగాలనే తెలుసుకో...
ఆ..ఆ...ఆ..

మౌనం ఆలాపన... మధురం ఆరాధన
దొరికే దేవుని పరిచయం... కలిగే జీవన పరిమళం
కాలమా నిలిచిపో... కావ్యమై మిగిలిపో...
తొలి రేయి నీడలో...
మౌనం ఆలాపన...మధురం ఆరాధన


*****   *****  ******


చిత్రం: స్రవంతి (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు

పల్లవి:
నవ్వుతూ వెళ్ళిపో ... నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో... తావిలా మిగిలిపో
వేసవిలో మల్లెలా ... వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా

నవ్వుతూ వెళ్ళిపో ... నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో... తావిలా మిగిలిపో

చరణం: 1
మురిపించే చిరునవ్వే పసిపాపలలో అందమూ...
పకపకలాడే పాపల నవ్వే బాపూజీకి రూపమూ...

పగనైన ప్రేమించు ఆ నవ్వులు
శిలనైన కరిగించు ఆ నవ్వులు
వేకువలో కాంతిలా... వేదనలో శాంతిలా...
చిరకాలం నవ్వాలి స్వాతిలా.. ఆరని జ్యోతిలా..

నవ్వుతూ వెళ్ళిపో ...నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో...తావిలా మిగిలిపో

చరణం: 2
ఉదయించే తూరుపులో కిరణాలన్ని నవ్వులే...
వరములు కోరే దేవుడికిచ్చే హారతి కూడా నవ్వులే...

మృతినైన గెలిచేటి ఈ నవ్వులు.. నీ పేర మిగిలేటి నీ గురుతులు
నవ్వులతో సంతకం... చేసిన నా జీవితం...
అంకితమే చేస్తున్నా కవితలా... తీరనీ మమతలా...

నవ్వుతూ వెళ్ళిపో ... నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో... తావిలా మిగిలిపో
వేసవిలో మల్లెలా ... వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా

విజేత (1985)





చిత్రం: విజేత (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చురంజీవి, భానుప్రియ, జె వి.సోమయాజులు, శారద
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 23.10.1985

పల్లవి:
ఆ.. ఆ..
ఎంత ఎదిగి పోయావయ్యా...
ఎదను పెంచుకున్నావయ్యా...
స్వార్థమనే చీకటి ఇంటిలో
త్యాగమనే దీపం పెట్టి...

ఎంత ఎదిగి పోయావయ్యా... ఆ..ఆ...ఆ..
ఎదను పెంచుకున్నావయ్యా... ఆ..ఆ..ఆ..ఆ

చరణం: 1
ముక్కు పచ్చలారలేదు నలుదిక్కులు చూడలేదు
ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా
మచ్చలేని చంద్రుడి మనసు వెచ్చనైన సూర్యుడి మమతా
నీలోనే చూశామయ్యా  నీకు సాటి ఇంక ఎవరయ్య ఆ.. ఆ..

ఎంత ఎదిగి పోయావయ్యా... ఆ..ఆ..ఆ.. ఓ ఓ

చరణం: 2
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన...
నీకు నీవు రాసుకున్న నుదిటి గీత భగవథ్గీత

Greater love hath no man than this..
that a man lay down his life for his people..

అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట
దేవుడనే వాడు ఒకడుంటే  దీవించక తప్పదు నిన్ను..

జీవేన శరదాంశతం
భవామ శరదాంశతం
నందామ శరదాంశతం


********   ********   *********


చిత్రం: విజేత (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

పల్లవి:
హే...హే హే హే హే...
ఓ..లలలలాల...

జీవితమే ఒక పయణం
యవ్వనమే ఒక పవనం
వేగం వలపు రాగం ఎంత మధురం
పోదాం చేరుకుందాం ప్రేమ తీరం

హే..హే... హే... జీవితమే ఒక పయణం

చరణం: 1
లయలో  నీ లయలో  నీ వయ్యారమే చూడనా
జతలో  నీ జతలో  నీ అందాలు వేటాడనా
వడిలో నీ వడిలో   పూల ఉయ్యాలలే ఊగనా
వలపే నా గెలుపై ప్రేమ జండాలు ఎగరేయనా

ఈ లోకమే... మన ఇల్లుగా
పట్టాలే కలిపేసి చెట్టపట్టాలు పట్టెయ్యనా

జీవితమే ఒక పయణం..

చరణం: 2
ఎగిరి  పైకెగసి  నే తారల్ని తడిమెయ్యనా
తారా దృవతారా  నీ తళుకుల్ని ముద్దాడనా
రాణి  మహరాణి  నా పారాణి దిద్దేయ్యనా
బోణీ  విరిబోణి  తొలిబోణీలు చేసేయ్యనా
మేఘాలలో... ఊరేగుతూ
మెరుపుల్లో చినుకుల్లో సిగ్గంత దోచేయ్యనా

జీవితమే ఒక పయణం

చరణం: 3
అలల ఊయలలా నిను ఉర్రుతలూగించనా
తడిసే  నీ ఎదలో నే తాపాలు పుట్టించనా
మురిసే నవ్వులలో ఆణిముత్యాలు పండించనా
మెరిసే కన్నులలో నీలి స్వప్నాలు సృష్టించనా
కెరటాలకే ఎదురీదుతూ
వెన్నెల్లా నావల్లో  ఈ సంద్రాలు దాటెయ్యనా

జీవితమే ఒక పయణం యవ్వనమే ఒక పవనం
వేగం వలపు రాగం ఎంత మధురం
పోదాం చేరుకుందాం ప్రేమ తీరం

హే.. హే హే హే హే హే హే
ఓ..లలలలలాలా...


********  ********  ********


చిత్రం: విజేత (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

పల్లవి:
యాయ యాయ యాయ యాయ...
యాయ యాయ యాయ యాయ...

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా
కాదు బిడియాలకు వేళా
లేరా సయ్యాటకు రారా
పరువాలకు పాడర జోల....

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా

చరణం: 1
కూకుంటే కునుకొస్తాది
కునుకొస్తే.. హ.. కలలొస్తాయి
తానాలు ఆడేస్తున్నా తాపం తగ్గదురా
దీపాలు పెట్టారంటే ప్రాణం నిలవదురా
మల్లెల మబ్బులు ముసిరే వేళ
ఊహకు ఉరుములు పుట్టే వేళ
చినుకంత ముద్దాడి పోరా....

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా

చరణం: 2
పగటేల చలి వేస్తాది
నడిరేయి ..హా.. గుబులొస్తాది
పక్కంత దొర్లేస్తున్నా పరువం ఆగదురా
ఒల్లంత నిమిరేస్తున్నా వలపే తీరదురా
మొటిమలు మొగ్గలు పుట్టే వేళ
బుగ్గకు ఎరుపులు పట్టె వేళ
ఎదనిండ అదిమేసుకోరా

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన.. అబ్బా..  నా గుండె గిల గిలలాడిందమ్మా
కాదు బిడియాలకు వేళా
లేరా సయ్యాటకు రారా
పరువాలకు పాడర జోల....

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా
లోలోన నా గుండె గిల గిలలాడిందమ్మా

మయూరి (1985)





చిత్రం: మయూరి (1985)
సంగీతం: ఎస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి
నటీనటులు: సుధా చంద్రన్, శుభకర్, నిర్మలమ్మ
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 1985

పల్లవి:
గౌరీ శంకర  శృంగం
నరనారీ సంగమ రంగం
ఇది నటనకు  సోపానం
కళలకు కళ్యాణం               

చరణం: 1
పాదపూజకై మందారమైనా
నాద మధువుతో మంజీరమాయె
దేవతార్చనకు ఏకీర్తనైనా
జీవితాంతమి  రస నర్తనాయె
వాజ్జయమే వచనం
ఆంగికమే భువనం         
 
ఆకాశాలలో తారలన్ని
ఆహార్యాలుగా అందుకుంటూ
కైలాసాల శిఖరాగ్రాలందు
కైవల్యాలు   చవిచూసే వేళలో

చరణం: 2
పడమటెండల పారాణి తూలె
సంధ్యారాగాలతో ఊసులాడె
కొలనులు నిదరోవు  కార్తీక వేళ
కలువలలో తేనె గిలిగింతలాయె
సకల కళా శిఖరం నర్తనమే మధురం 

కాశ్మీరాలలో పూల గంధం
కేదారాలలో  సస్యగీతం
శివలాస్యాల శృంగారాలెన్నో
అంగాంగాల విరబూసే వేళలో       


******   ******   *******


చిత్రం:  మయూరి (1985)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. జానకి

పల్లవి:
గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఇది నటనకు సోపానం... కళలకు కళ్యాణం

గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం: 1
పాదపూజకై మందారమైనా
నాద మధువుతో మంజీరమాయె
దేవతార్చనకు ఏ కీర్తనైనా
జీవితాంతమీ రస నర్తనాయె

వాఙ్మయమే వచనం...  ఆంగికమే భువనం
వాఙ్మయమే వచనం...  ఆంగికమే భువనం

అకాశాలలో తారలన్నీ... ఆహార్యాలుగా అందుకుంటూ
కైలాసాల శిఖరాగ్రాలందు... కైవల్యాలు చవిచూసే వేళలో

గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం: 2
పడమటెండల పారాణి తూలె... సంధ్యారాగాలతో ఊసులాడే
కొలనులు నిదరోవు కార్తీక వేళ... కలువలలో తేనె గిలిగింతలాయె
సకల కళా శిఖరం...  నర్తనమే మధురం
సకల కళా శిఖరం...  నర్తనమే మధురం

కాశ్మీరాలలో పూల గంధం... కేదారాలలో సస్యగీతం
శివలాస్యాల శృంగారాలెన్నో... అంగాంగాల విరబూసే వేళలో

గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఇది నటనకు సోపానం... కళలకు కళ్యాణం
గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ



*****  *****  *****


చిత్రం:  మయూరి (1985)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, ఎస్. జానకి

పల్లవి:
మౌనం గానం మధురం మాధురాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో

మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం

చరణం: 1
చైత్ర పవనాలు వీచే
మైత్రి గంధాలు పూచేను
వయసు ముంగిళ్ళు తీసి.వలపులే ముగ్గులేసేను
సుమ వీధుల్లో భ్రమరాలెన్నో
చెలి కన్నుల్లో భ్రమలేన్నెన్నెన్నో ఆ...ఆ...
సాగేనులే శ్రుతిలో కృతిగా

మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం

చరణం: 2
అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను
ముదిత పాదాల మువ్వే మువ్వ గోపాల పాడేను
అవి మోహాలో మధు దాహలో
చెలి హాసాలో తొలి మాసాలో ఆ...ఆ....
హంసధ్వనీ కళలే కలగా

మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో

మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం


******   ******  *****


చిత్రం:  మయూరి (1985)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, ఎస్. పి. శైలజ

పల్లవి:
ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం
ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం...

చరణం: 1
ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
శిలలోనీ ఆ గౌతమే పొంగగా...

పాట పాటలో తను చరణమైన వేళా
కావ్య గీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే...

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం

చరణం: 2
ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీ హస్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై

ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పధమై
తుంబుర వర నారద మునులూ జనులూ కొలిచే ఈ పాదం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం
ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం


******   ******  ******


చిత్రం:  మయూరి (1985)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, ఎస్. జానకి

పల్లవి:
అందెలు పిలిచిన అలికిడి లో అణువణువున అలజడులూ
యద పదమొకటౌ లాహిరిలో... ఎన్నడు ఎరగని వురవడులూ
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..

చరణం: 1
ఉత్తరాన ఒక ఉరుము వురిమినా ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఉత్తరాన ఒక ఉరుము వురిమినా ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఒక కదలిక చిరు మెదలిక..గిలిగింతగ జనియించగా
ఒక కదలిక చిరు మెదలిక..గిలిగింతగ జనియించగా
నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా
అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా పాడనా

ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..

చరణం: 2
మేఘ వీణ చలి చినుకు చిలికినా మేను లోన చిరు అలలు కదలినా
మేఘ వీణ చలి చినుకు చిలికినా మేను లోన చిరు అలలు కదలినా
ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా
ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా
సుగమ నిగమ సుధ ఎదల పొంగగా వరదలాగా ఉప్పొంగనా
సుగమ నిగమ సుధ ఎదల పొంగగా వరదలాగా ఉప్పొంగనా
వరాళి ఎదలొ స్వరాల రొదలో స్వరము పాడనా ఆడ నా

ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..

ఆలాపన (1985)





చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి


కలిసె ప్రతి సంధ్యలో కలిగె పులకింతలో
కలిసె ప్రతి సంధ్యలో కలిగె పులకింతలో
నాట్యాలన్ని కరగాలి
నీలో నేనె మిగలాలి
నాట్యాలన్ని కరగాలి

నీలో నేనె మిగలాలి
కలిసె ప్రతి సంధ్యలో పలికె ప్రతి అందెలో

పొంగిపోద సాగరాత్మ నింగికి
చేరుకోద చంద్ర హృదయం నీటికి
పొంగిపోద సాగరాత్మ నింగికి
చేరుకోద చంద్ర హృదయం నీటికి
సృష్టిలోన ఉంది ఈ బంధమే
అల్లుకుంది అంతటా అందమే
తొణికే బిడియం తొలగాలీ
వణికే అధరం పిలవాలీ
కలిసె ప్రతి సంధ్యలో పలికె ప్రతి అందెలో

మేనితోనె ఆగుతాయి ముద్రలు
గుండె దాక సాగుతాయి ముద్దులు
మేనితోనె ఆగుతాయి ముద్రలు
గుండె దాక సాగుతాయి ముద్దులు
వింత తీపి కొంతగా పంచుకో
వెన్నెలంత కళ్ళలొ నింపుకో
బ్రతుకె జతగా పారాలీ
పరువం తీరం చేరాలీ
కలిసె ప్రతి సంధ్యలో పలికె ప్రతి అందెలో

కలిసె ప్రతి సంధ్యలో పలికె ప్రతి అందెలో
నాట్యాలన్ని కరగాలి
నీలో నేనె మిగలాలి
నాట్యాలన్ని కరగాలి
నీలో నేనె మిగలాలి
కలిసె ప్రతి సంధ్యలో కలిగె పులకింతలో



*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి

ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం
అడుగుల సడె మయూరం అడుగుకొ వయ్యారం
పలికిన పదం సరాగం జరిగెలె పరాగం
ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం

రేగె రాగలన్ని నాలొ ఉయ్యాలూగెలే
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే
రేగె రాగలన్ని నాలొ ఉయ్యాలూగెలే
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే
నాలోన లీలగా నాదస్వరాలుగా
పూసింది లాలసా పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో రేరాని వెన్నెల్లలో
ఈ మోహమెందాక పోతున్నదో
ఈ దేహమింకేమి కానున్నదో
వలపులె పిలువగ

ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం

పూలె తేనైపోయి నాలొ వాగై పొంగెలే
నిన్నె నిన్నె కోరి నాట్యాలనె చేసెలే
పూలె తేనైపోయి నాలొ వాగై పొంగెలే
నిన్నె నిన్నె కోరి నాట్యాలనె చేసెలే
నా పాణ్పు పంచుకో ఈ బాధ తీర్చిపో
శివరాతిరవ్వనీ ఈ రాతిరీ
తేనెళ్ళు పొంగాలి చీకట్లలో కమ్మని కౌగిళ్ళలో
నీ తోడు కావాలి ఈ జన్మకీ నే నీడనౌతాను నీ దివ్వెకీ
పెదవులో మధువుల

ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం
అడుగుల సడె మయూరం అడుగుకొ వయ్యారం
పలికిన పదం సరాగం జరిగెలె పరాగం
ప్రియతమ తమ సంగీతం విరిసె సుమములై వసంతం


*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

ఆరు ఋతువుల భ్రమణమున్నా అఖండం కాలాత్మా
ప్రకృతీ పురుషుల మిధునమున్నా అతీతం పరమాత్మా
ఎన్ని బహుముఖ రీతులున్నా ఏకం తదేకం రసైకం నాట్యాత్మా
తాం ధీం తోం తక్కిట తకధిమి తకఝను తకధీం
తోం నం ధీంకిట తకధిమి తకఝను తక ధిధిత్తాం
తకతకిట తకధిమి ధింతత్తాం తకతకిట తకధిమి
తక్కిటతక తోంకిటతక నంకిటతక ధీంకిటతక తరికిట తరికిట
తక్కిటతక తోంకిటతక నంకిటతక ధీంకిటతక తరికిట తరికిట త
తధిత్తరికిట తోకిట నంకిట
ధిత్తరికిట తోంకిట నంకిట
తధిత్తరికిట తోకిట నంకిట
తధిత్తరికిట తోకిట నంకిట
ధిత్తరికిట తోకిట నంకిట
తధిత్తరికిట తోకిట నంకిట
తధిత్తరికిట తోకిట నంకిట థం

నటరాజు నయనాలు దీవించగ
ఆ నటరాజు నయనాలు దీవించగా
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నాట్య సుధానిధి అర్పించనా
నటరాజు నయనాలు దీవించగ
ఆ నటరాజు నయనాలు దీవించగా

తకధిమితాం కిటతకథాం తకథజం ధిమిథజం జనుథజం తరికిటతకథాం
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి
నెలకొన్న లలితేందు మౌళీ
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి
నెలకొన్న లలితేందు మౌళీ
గలసీమ నాగేంద్ర హారావళీ
తన కీర్తి తారావళి
గలసీమ నాగేంద్ర హారావళీ
తన కీర్తి తారావళి
నగములదర నభములదర జలధులెగుర జగతిచెదర
హరహరయని సురముని తటికుదువ
ధీంగినతోం తధీంగినతోం తధీంగినతోం

నటరాజు నయనాలు దీవించగ
ఆ నటరాజు నయనాలు దీవించగా
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నాట్య సుధానిధి అర్పించనా
నటరాజు నయనాలు దీవించగ
ఆ నటరాజు నయనాలు దీవించగా

తకధిమి తకఝను తకిటతంతం త్రిభువన భూర్నిత ఢమరునాదం
ఝనుతక ధిమితక కిటతధీంధిం ముఖరిత రజత గిరీంద్రమూర్ధం
తకిట తంతం చలిత చరణం ఝనుత తంతం జ్వలిత నయనం
తకిటధీం లయధరం తకిటధీం భయకరం
తకిటధీం లయధరం తకిటధీం భయకరం
తకిటధీం లయధరం భయకరం
చండ విజ్రుంభిత శాంభవ బింబం శైలసుతా పరితోషిత రూపం
ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ యఘణధం
ధన ధన ధన ధన ధన ధన ధన ధన తగనఝం
యనగణ ధనఘణ పఘనఝం
యనగణ పనఘణ రగనఝం
యగనమగనం జగనగగనం ఖగనపగనం రగనజగనం
యగమగ జగగన తగఫగ రగజన
యగన మగన జగన ఖగన ఫగన గఝం

నగరాజ నందిని అభవార్ధ భాగిని
నగరాజ నందిని అభవార్ధ భాగిని
రుధిరాప్థ జిహ్వికా రూక్షరుద్రాక్షిక
రుధిరాప్థ జిహ్వికా రూక్షరుద్రాక్షిక
క్షుద్రప్రణాషిని భద్రప్రదాయిని
క్షుద్రప్రణాషిని భద్రప్రదాయిని
మదమోహకామప్రమత్తదుర్ధమచిత్త మహిషరాక్షసమర్ధినీ
మహిషరాక్షసమర్ధినీ మహిషరాక్షసమర్ధినీ



*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

నిదురించు వేళ గస నిస గస నిస గనిదనిమ
హృదయాంచలానా
అలగా పొంగెను నీ భంగిమ గద సని స
అది రూపొందిన స్వర మధురిమ సని దని స
ఆ రాచ నడక రాయంచకెరుక
ఆ రాచ నడక రాయంచకెరుక
ప్రతి అడుగు శృతిమయమై
కణకణమున రసధునులను మీటిన

ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

నీ రాకతోనె
ఈ లోయలోనె గస నిస గస నిస గనిదనిమ
అనువులు మెరిసెను మని రాసులై
మబ్బులు తేలెను పలు వన్నెలై
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకృతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన

ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలొ కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై


*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో
ఉదయినిగా నాలొ జ్వలించె వర్ణాల రచన
నాలొ జనించె స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే

అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపనా
రాగాలు తీసె ఆలోచనా
ఝరుల జతల నాట్యం అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలొ గళ మధువులడిగె గానం
నిదురలేచె నాలొ హృదయమే

ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో
ఆవేశమంతా ఆలాపనేలే

వన కన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలిసంజకన్న
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురివిడిన నెమలి పించం
ఎదలు కలిపి నాలొ విరి పొదలు వెతికె మోహం
బదులు లేని ఏదో పిలుపులా

ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో
నాలొ జ్వలించె వర్ణాల రచన
నాలొ జనించె స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే


*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా

నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన

మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం


*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, బి.వసంత, పి.సుశీల

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

మునిజన మానసమోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానసమోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాథల రంజిలు బృందావనం
గోపాలుని మ్రుదుపద మంజీరము బృందావనం
గోపాలుని మ్రుదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా, ముకుందా, మురారీ
కృష్ణా ముకుందా మురారీ
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే


*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చె వాడినేది అడిగేది
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చె వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది

తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది

 

కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది

తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది

గిరిబాలతో తనకు కళ్యాణ మొనరింప దరిచేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖ ప్రీతి కొరేటి ఉక్కు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కొపి తిక్క శంకరుడు

ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చె వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది


*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితె ఎన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితె ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన ఎదపై సిరి మువ్వల సవ్వడి నీవై
నర్తించగ రావేలా
నిను నే కీర్తించే వేళ

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితె ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో

అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగము

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితె ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో



*******   *******   *******


చిత్రం: ఆలాపన (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్న
పొరుగూరికి చేరిపోతున్న ఓ గువ్వల చెన్న
కథమారే రోజులు కోరేరూ ఓ గువ్వల చెన్న
కలతీరే దారులు వెతికేనూ ఓ గువ్వల చెన్న

గుళ్ళో నిను చూడలేకున్న ఓ గువ్వల చెన్న
గుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వల చెన్న
ఏ సీమలొ తిరుగాడిన ఓ గువ్వల చెన్న
నీ దీవెనలందిచాలన్న ఓ గువ్వల చెన్న