బాడీగార్డ్ (2012)

 ఎవ్వరో... ఎవ్వరో... నను

పల్లవి :
హలో ...
ఎవ్వరో... ఎవ్వరో... నను తియ్యని గొంతుతొ
పిలిచిందెవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో... తన మాటల తేనెలు
పంచిందెవ్వరో
మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో
తనది ఏ పోలికరో పోల్చునది ఎవ్వరో
చిలిపి సిరి మువ్వరో కలిపి తను ఎవ్వరో
ఏమో ఏమో.... నా గుండెతొ గుసగుసలాడిందెవ్వరో
హే... ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో... ఈ దాగుడు మూతలు
ఆడేదెవ్వరో

చరణం : 1
హే.. హే... ఎంతలా ఏమార్చినా ఊరూ పేరూ జారవే
నిన్నిలా నే మరచినా నువు మాత్రం నను వీడవే
అందగాణ్ణి అంటావే మరి అందకుండ ఉంటావే
హే.. ఆ ప్రాణ వాయువల్లే నువుకూడ కానరావే
ఇంతిలా నన్నుఊరిస్తావే నువ్వెంత అందానివే
ఆ అందం కళ్ళకు కట్టేదెవ్వరో తన చిరునామా
చూపెట్టేదెవ్వరో
చరణం : 2
ఏ.. ఏ... నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే
తక్షణం నీవెవ్వరో తెలియదు అనిపిస్తావులే
నన్ను నువ్వు చూస్తావే మరి నిన్ను
నువ్వు దాస్తావే
హే.. అరె నిన్ను చూడాలని మైమరచి పోవాలని
నా ఒళ్ళే కళ్ళై వలేస్తున్నా ఆచూకి చిక్కవులే
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో ఆ చక్కెర
పలుకుల టక్కరి ఎవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో.... అరె ఇందరిలో ఆ సుందరి
ఎవ్వరో

చిత్రం : బాడీగార్డ్ (2012)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
రచన : శ్రీ మణి
గానం : కార్తీక

No comments:

Post a Comment