ఎగిరే పావురమా (1997)

చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సునీత


పల్లవి :

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో.. మత్తు మత్తు ఎన్నియల్లో
ఎవరంటే ఎట్టమ్మా...  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా.. ఆ.. ఆ

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ

చరణం 1:

తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు

నా.. ఆ..ఆ కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మా... ఆ... ఆ... ఆ
హాయమ్మా వలపులే తొలిరేయమ్మా వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాటేస్తే

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా..  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ

చరణం 2 :

తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలజడి చిలికాడే చినవోడు

నా కంటి పాపకు కొంటె కలలను అలికాడే అతగాడు
వంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మా... ఆ... ఆ... ఆ...
ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శుభలగ్నమేనాడో

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ



********** ********** ************


చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం  :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  చిత్ర


పల్లవి :

ఆ... ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ...
ఇంకా చెప్పాలా వంకాయేనండీ

ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ .. మోజే తీరనిదీ


చరణం 1 :

అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ...ఈ...
ఆ......
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా.. ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు

ఆహా ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ


చరణం 2 :

లేత వంకాయలతో వేపుడు చేసేదా...
మపద...దనిసరి రిగరిగగరిస...నిసగప...
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా

ఆహా... ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ... మోజే తీరనిదీ
తాజా కూరలలో... రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా... వంకాయేనండీ
ఆ.....


********** ********** ************


చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం :  ఎస్.వి.కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు




పల్లవి :

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
చరణం 1 :

నేలనోదిలిన గాలి పరుగున.. ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను.. వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల.. తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి.. స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ


చరణం 2 :

బావ మమతల భావ కవితలే... శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు... సుముహుర్తం రావాలి
ఏడు అడుగుల జోడు నడకలు... ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని.. అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు.. ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

No comments:

Post a Comment