చిరుగాలే వింజామర

శ్రీదేవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.  వీడియో ఇక్కడ చూడవచ్చు  

చిత్రం :  శ్రీదేవి (1970)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :



చిరుగాలే వింజామర.. చిట్టిపపే కెందామర..
చిలకమ్మా .. ఆ... పాడింది..
చెవిలో జోల... జోజో బాల...


చిరుగాలే వింజామర...  


చరణం 1 :


మా ఇంట వెలసింది శ్రీదేవి...
మా ఇంట వెలసింది శ్రీదేవి...
తాను మౌనాన తెరచింది కెమ్మౌవి..
రతనాల నవ్వులే కురిశాయి..
రంగారు మురిపాలే మెరిశాయి...


చిరుగాలే వింజామర... చిట్టిపాపే కెందామర..
చిలకమ్మా ..ఆ... పాడింది..
చెవిలో జోల... జోజో బాల...


చరణం 2 :


నిదురలో పాపాయి పలవింతలు...
అవి ఎదలోన తల్లికి పులకింతలు..
నిదురలో పాపాయి పలవింతలు...
అవి ఎదలోన తల్లికి పులకింతలు..


ఆ తల్లిలో మధుర భావనలు
అందాల పాపకి దీవెనలు
చిరుగాలే వింజామర...


చరణం 3 :


ఉయ్యాలలో బోమ్మ నీ తమ్ముడే..
నీ ఊహ పండించు ఆ దేవుడే...
కోరికల తోటలా చిగురింతలు..
అవి కుసుమించు దినదినం వేయింతలు...


చిరుగాలే వింజామర...చిట్టిపాప కెందామర
చిలకమ్మా పాడింది...చెవిలో జోల ..జో..జో ..బాల



No comments:

Post a Comment