ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..

పడి పడి లేచే మనసు  చిత్రంలోని ఒక చక్కని పాట మీ కోసం.వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడ చూడవచ్చు









చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్


ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీవంటూ లేకుంటే..

నీతో ప్రతి పేజీ నింపేశానే.. తెరవక ముందే పుస్తకమే విసిరేశావే..
నాలో ప్రవహించే ఊపిరివే.. ఆవిరి చేసి ఆయువునే తీసేశావే..

నిను వీడి పోనందీ నా ప్రాణమే..
నా ఊపిరిని నిలిపేది నా ధ్యానమే..
సగమేనే మిగిలున్నా.. శాసనమిది చెబుతున్నా..
పోనే.. లేనే.. నిన్నుదిలే...

ఏమైపోయావే.. నీవెంటే నేనుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..

ఎటు చూడు నువ్వే.. ఎటు వెళ్లెనే..
నేలేని చోటే నీ హృదయమే..
నువ్ లేని కల కూడా రానే రాదే..
కలలాగ నువ్ మారకే..
మరణాన్ని ఆపేటీ వరమే నీవే..
విరాహాల విషమీయకే..

ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..


No comments:

Post a Comment