పల్లవి :
బంజారే... బంజారే...
బంజారే బంజో ఓనారే బంజా
ఓ నారే ఆ నారే ఓనారే బంజా
॥బంజారే॥
చరణం : 1
చుక్కపొద్దూ లేచామమ్మా చందమామ
సద్ది సంకన కట్టామమ్మా చందమామ
ఎలపట దాపట ఎడ్లను కట్టి కర్రునాగలి భుజానబెట్టి
సెమట చుక్కలు జల్లి సేలు సెలకలు దున్ని
రాజనాలు పంచా... ఓ...
రేలారే రేలారాయిలర రేలారే
॥బంజారే॥
చరణం : 2
అడవితల్లి బిడ్డలమమ్మా చందమామ
అన్నెం పున్నెం ఎరగనోళ్లం చందమామ
కొండల్ని ఏలేటి మత్తుల్ని నరికి
బల్లకట్టునే పల్లకీ చేసి (2)
గలగల పారేటి గోదారి ఒడిచేర్చి కలప సాగనంపా
॥రేలారే॥ ॥బంజారే॥
చరణం : 3
కొండోళ్లు కోయోళ్లు గోను జాతోళ్లం చందమామ
మారేడు నేరేడు పళ్లను ఏరాం చందమామ
అడ్డాకు తునికాకు ఆకుల్ని కోసి చెట్టుమీద తేనెపట్టును తీసి
ఇప్పబట్టి పెట్టి గుక్క గుక్క తాగి జాతరలే చేశాం
॥రేలారే॥ ॥బంజారే॥
చిత్రం : ఎర్ర సైన్యం(1994)
గానం,సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
తారాగణం : ఆర్ నారయణమూర్తి

No comments:
Post a Comment