సారంగ దరియా!!!

ఈరోజు లవ్ స్టోరి చిత్రం నుండి ఒక చక్కటి పాట మీ కోసం ,వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడ  చూడవచ్చు 






దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా 
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా!!!
దాని ఎడం భుజం మీద కడవా
దాని ఎజంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా!!!

కాళ్లకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్ గల్!
కొప్పులో మళ్ళే దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్!
నవ్వుల లేవురా ముత్యాల్ అది నవ్వితే వస్తై మురిపాల్!
నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్
మునిపంటితో మునిపంటితో మునిపంటితో 
రక్కితే పెదువుల్ ఎర్రగ ఐతది రా మన దిల్!
చురియా చురియా చురియా అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా!

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా 
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా!!!
దాని ఎడం భుజం మీద కడవా
దాని ఎజంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా!!!

రంగే లేని నా అంగీ జడ తాకితే ఐతది నల్లంగి
మాటల ఘాటు లవంగి మర్ల పడితే అది శివంగి
తీగలు లేని సారంగి వాయించబోతే అది ఫిరంగి
గుడియా గుడియా గుడియా అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటే రాదురా సెలియా దని పేరే సారంగ దరియా!
దాని సెంపల్ ఎన్నల కురియా
దాని సెవులకు దిద్దుల్ మెరియా
అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా!
దాని నడుం ముడతలే మెరియా పడిపోతది మగోళ్ల దునియా!
అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగ 
దరియా!

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా 
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా!!!
దాని ఎడం భుజం మీద కడవా
దాని ఎజంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా!!!

చిత్రం : లవ్ స్టోరీ
సంగీతం:పవన్ సి.హెచ్
సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ
గానం:మంగిలి

No comments:

Post a Comment