అల్లరి ప్రియుడు (1993)



చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, చిత్ర    

పల్లవి : 

ఉత్తరాల ఊర్వశి...ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత... వేడి వెన్నెల
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా

గీత గోవిందుడు...  వీనులో విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజా...  ఘుమాఘుమాలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ


చరణం 1 :  

పువ్వులెన్నొ విచ్చినట్టుగా చెలీ...  నవ్వగానె నచ్చినావులే
చుక్కలెన్నొ పుట్టినట్టుగా ప్రియా...  చూసుకోరా పట్టి కౌగిలీ
ఖవాలీల కన్నులతోనే...  జవానీల జాబులురాసే
జగడమొకటి సాగిందోయమ్మో...
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే పాలగా...

దోరసోకు తోరణాలు...  కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద హంసలేఖ రాసినా...

ఉత్తరాల ఊర్వశి... ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
అలా అలా అదెంత వేడి వెన్నెలా
నిజానికీ ఇదంత ఒట్టు నీదయా..



చరణం 2 :


సమ్ముఖాల రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా అదే అందగత్తె గొప్పకాదులే

పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నొ కవ్విస్తుంటే
హృదయమొకటి పుట్టిందోయమ్మా...
సరాగాల సంపెగల్లో పరాగాల పండిస్తుంటే
పరువమొకటి వచ్చే వాంఛలా...
కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడె
జుంటి తేనె మత్తులోన కొంటెవేణువూదినా

గీతగోవిందుడూ...  వీనులోవిందుడూ
రాగమాలతోనె రాసలీలలాడగా
మజా మజా మజా...  ఘుమాఘుమాలయా...
నిజానికీ ఇదంత...  ఒట్టు నీదయా...

ఉత్తరాల ఊర్వశి...  ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడివెన్నెలా...
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా... 

******************* ************************** ******************* ******************
చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వెన్నెలకంటి
నేపథ్య గానం :  బాలు, చిత్ర  



పల్లవి : 

ప్రణయమా నీ పేరేమిటి ... ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా..  తెలుపుమా

ప్రణయమా నీపేరేమిటి...  ప్రళయమా 


చరణం 1 :


ప్రేమ కవితా గానమా... నా ప్రాణమున్నది శ్రుతి లేక
గేయమే ఎద గాయమైనది...  వలపు చితిని రగిలించగా
తీగచాటున రాగమా...  ఈ దేహమున్నది జత లేక
దాహమారని స్నేహమై...  ఎద శిథిల శిశిరమై మారగా

ఓ హృదయమా... ఇది సాధ్యమా...
రెండుగ గుండే చీలునా... ఇంకా ఎందుకు శోధన
రెండుగ గుండే చీలునా... ఇంకా ఎందుకు శోధన


తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా 




చరణం 2 : 


ప్రేమసాగర మధనమే...  జరిగింది గుండెలో ఈ వేళ
రాగమన్నది త్యాగమైనది...  చివరికెవరికీ అమృతం
తీరమెరుగని కెరటమై...  చెలరేగు మనసులో ఈ వేళ
అశ్రుధారలే అక్షరాలుగా...  అనువదించెనా జీవితం

ఓ ప్రాణమా... ఇది న్యాయమా
రాగం అంటే త్యాగమా... వలపుకు ఫలితం శూన్యమా
రాగం అంటే త్యాగమా... వలపుకు ఫలితం శూన్యమా


తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా 

******************* ************************** ******************* ******************
చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు, చిత్ర   



పల్లవి : 

అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే..ఇదే..కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక...  జనించు రోజు

అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు  


చరణం 1 :

మాట పలుకు తెలియనిది...  మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయి...  కవితలు రాసే మౌనమది..ఈ.. ఈ.. ఈ

రాగల రోజుల ఊహలకి... స్వాగతమిచ్చే రాగమది
 శ్రుతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది..ఈ.. ఈ.. ఈ

ఋతువుల రంగులు మార్చేది...  కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది...  మనసున కదిలిన మృదునాదం

కలవని దిక్కులు కలిపేది...  నింగిని నేలకి దింపేది
అదే కదా వారధి క్షణాలకే సారధి...  మనస్సనేది

అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు



చరణం 2 : 


చూపులకెన్నడు దొరకనిది...  రంగురూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు...  స్వప్నాలెన్నో చూపినది..ఈ.. ఈ.. ఈ
వెచ్చని చెలిమిని పొందినది...  వెన్నెల తరగల నిండు మది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది..ఈ.. ఈ.. ఈ

చేతికి అందని జాబిలిలా...  కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కొయిలలా...  కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి...  అమృత వర్షిణి అనిపించే
అముల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది

అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు

******************* ************************** ******************* ******************
చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  భువనచంద్ర
నేపథ్య గానం :  బాలు, చిత్ర   



పల్లవి : 

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై... తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే... చెప్పకనే...  చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని  

చెప్పకనే  చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని

చరణం 1 :

చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే...
మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా 

పదాలతోనే వరించనా... సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా... సుఖాల వీణ శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల... రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే

చెప్పకనే ... చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని 


చరణం 2 : 


తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ

తెల్లారనీకే వయ్యారమా ... అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా... సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు... నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై వొడిలో...  ఒదిగిన క్షణమే

చెప్పకనే... చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని


******************* ************************** ******************* ******************
చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, చిత్ర   


పల్లవి : 

ఆహ హాహా హాహా..ఆహా హాహా
ఆహ హాహా హాహా..హహహా హహహా
హహహా..హహహా..హాహా
ఆఆ ఆఆఆఆ..ఆఆ ఆఆఆఆ..ఆఆహాహ

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా... నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లుమన్న మువ్వే నువ్వా 

పడుచుదనపు గడసు వలపు  పాటవు నువ్వా..వా..వా  

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా..రోజాపువ్వా..పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా...  పువ్వే నువ్వా..నవ్వే నువ్వా


చరణం 1 :

గులాబి గు..గు..గు..
గులాబి గు..గు..గు 

చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా
కన్నె  పువ్వా... కన్నె  పువ్వా
వెన్నెలవాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా ... చిందే రవ్వా పొద్దే నువ్వా
గుండెచాటు ప్రేమలెన్నొ పోటుమీద చాటుతున్న రోజాపువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా... ఆ..ఆ.. ఆ..ఆ


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా... నవ్వేనువ్వా

చరణం 2 : 
గులాబి గు..గు..గు..
గులాబి గు..గు..గు 


ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వ జాజే నువ్వా
గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజాపువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా

రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దు పెట్టకుండ గళ్లుమన్న  మువ్వే నువ్వా
పడుచుదనపు గడసువలపు  పాటవు నువ్వా..వా..వా  

రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా...నవ్వే నువ్వా


******************* ************************** ******************* ******************

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర   



పల్లవి :
అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా... బాపు గీసిన చిత్రమా
తెలుపుమా..  తెలుపుమా...  తెలుపుమా


పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మధురా నగరమా... కృష్ణ సాగర కెరటమా
తెలుపుమా...  తెలుపుమా...  తెలుపుమా


చరణం 1 :

ఏ రవీంద్రుని భావమో...  గీతాంజలి కళ వివరించే
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
సంగీతమా....  నీ నింగిలో...
విరిసిన స్వరములే ఏడుగా... వినబడు హరివిల్లెక్కడ
తెలుపుమా...  తెలుపుమా...  తెలుపుమా
అందమా నీ పేరేమిటి అందమా..
తెలుపుమా... పరువమా నీ ఊరేమిటి పరువమా


చరణం 2 :

భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా

ఓ కావ్యమా...  నీ తోటలో నవరస పోషనే గాలిగా
నవ్వినా పూలే మాలగా పూజకే సాధ్యమా....  తెలుపుమా



అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా... బాపు గీసిన చిత్రమా
తెలుపుమా..  తెలుపుమా...  తెలుపుమా


******************* ************************** ******************* ******************

చిత్రం :  అల్లరి ప్రియుడు  ( 1993 )
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర   


పల్లవి :

ఏం పిల్లది ఎంత మాటన్నది
ఏం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది

బాగున్నది కోడె ఈడన్నది
ఈడందుకే వీధి పాలైనది
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది 

ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది


చరణం 1 :

శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి ... సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి...  అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది

ఇనుకొని ఆరాటం ఇబ్బంది ... ఇడమరిసే ఈలెట్టా వుంటుంది
ఎదలోన ఓ మంట పుడుతుంది...  పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది

చిరు ముద్దుకి ఉండాలి చీకటి అంది..
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది

చరణం 2 :

సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ ... పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు
సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి...  మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు

ఉత్సాహం ఆపేది కాదంట...  ఉబలాటం కసిరేస్తే పోదంట
ఉయ్యాల జంపాల కథలోనే 'ఉ ' కొట్టే ఉద్యోగం నాదంట

వరసుంటే వారంతో పని ఏముంది
ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది
మళ్ళీ కావాలన్నా మనసు ఉన్నది

అమ్మో.. ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది
సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది... కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది

No comments:

Post a Comment