Showing posts with label కోడెనాగు (1974). Show all posts
Showing posts with label కోడెనాగు (1974). Show all posts

కోడెనాగు (1974)



చిత్రం  :  కోడెనాగు (1974)
సంగీతం  :  పెండ్యాల
గీతరచయిత  :  మల్లెమాల
నేపధ్య గానం  :  ఘంటసాల, సుశీల 

పల్లవి :

సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. జన్మ జన్మ ఋణానుబంధ సంగమం...

సంగమం... సంగమం
ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమం...
సంగమం... సంగమం...
అనురాగ సంగమం.. ఆనంద సంగమం

చరణం 1 :


పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం.... 
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం.... 
సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం  ఆగి చూచు సంగమం.. 
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం..  ఆగి చూచు సంగమం

సంగమం... సంగమం.... 
అనురాగ సంగమం... ఆనంద సంగమం

చరణం 2 :


నింగి నేల.. నింగి నేల ఏకమైన నిరుపమాన సంగమం  
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం.. ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం.. నిలిచిపోవు సంగమం 
.
సంగమం....సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం


చరణం 3 :


జాతికన్న నీతి గొప్పది.. మతము కన్న మమత గొప్పది.
జాతికన్న నీతి గొప్పది.. మతము కన్న మమత గొప్పది...
మమతలు.. మనసులు ఐక్యమైనవి...
ఆ ఐక్యతే మానవతకు అద్దమన్నవీ...  అద్దమన్నవీ...

సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం


********* *************** ***************************
చిత్రం : కోడెనాగు (1974)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల 

పల్లవి :

కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...
నా కథ విందువా

చరణం 1 :


బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
అన్న అనుమాటతో అన్ని తుంచేశావు
పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి
ఉరితాడు నా మెడకు వేయించినావు

కథ విందువా...నా కథ విందువా


చరణం 2 :


తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
కసటు కోరిక మగని రూపాన నిలిచింది
నీ పేరు మెదలిన మధురాధరము పైన
చిరు చేదు చిలికింది... జీవితమె మారింది
చిరుచేదు చిలికింది... జీవితమె మారింది 

కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...నా కథ విందువా

చరణం 3 :


శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
తాళినే ఎగతాళి చేసింది ధనము
కాముకుల కాహుతైపోయింది మానము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము

కథ విందువా... నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...నా కథ విందువా



********* *************** ***************************
చిత్రం : కోడెనాగు (1974)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : ఘంటసాల 

పల్లవి :

ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి
ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి..
ఇదే చంద్రగిరి...  శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి... 

చరణం 1 :
తెలుగుజాతి చరితలోన  చెరిగిపోని కీర్తి సిరి చెరిగిపోని కీర్తి సిరి
తెలుగు నెత్తురుడికించిన వైరులకిది మృత్యువు గరి
ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి...   ఇదే చంద్రగిరి 

చరణం 2 :


తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో
తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము
ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా..ఆ... ఆ.. ఆ.. ..ఆ... ఆ.. ఆ
ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా
వెలసిన దిట స్వర్గము .. వెయ్యేళ్ళకు పూర్వము...  వెయ్యేళ్ళకు పూర్వము
ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి.. ఇదే చంద్రగిరి


చరణం 3 :


ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు
రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు
ఈ మహలే కవి గాయక పండిత జన మండల మొకనాడు
ఈ శిధిలాలే గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు
గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు...  ఈనాడు....