Showing posts with label Ismart Shankar. Show all posts
Showing posts with label Ismart Shankar. Show all posts

ఇస్మార్ట్ శంకర్ (2019)





వాని ఎద మీద ఉండేటి ఘమ ఘమ గంధాలు సంద మామయ్యలో
నా రైక ముడి మీద రాలిన సాలయ్య రంగ రామయ్యలో
దాని నడుముకి ఉండేటి బిళ్ళల మొలతాడు సంద మామయ్యలో
నా పట్టు కుచ్చుల కోకకంటిన సాలయ్య రంగ రామయ్యలో


సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక
పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట
జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా


ఉంటె దమ్ముంటే నీ పూల పక్క
ఏస్తా చల్లేసేయ్ నీ సెమట సుక్క
వస్తా తాగేస్తా నీ సోకె గటక
ఏస్తా ఏయిస్తా నీ తోటే గుటక
జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట
జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

సి సి సి సి సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక
పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక

ఏందిరా బాయి పోరి మీద పోరి ఉంది
అది ఇది కాద్ అదే ఇది
అది ఇది కాద్ అదే ఇది

పట్టుకొని జోకిస్తే చేటాకే నడుము
దిమాక్ ఖరాబ్ దిమాక్ ఖరాబ్
తట్టుకొని ఊపేస్తా పటాక్ అయ్యి తడుము
దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్
సత్తువని చూపిస్తే పిల్లోడ దినము
దత్తతనే ఇస్తారా మల్లెపూల వనము

ఇస్మార్ట్ ఏ ఈ శంకరు
పేల్చేస్తా నీ బంకరు
వస్తావా నా సెంటరు
చూస్తారా నీ టెంపెరు


అసలుకు నే కిరాకే నన్నే గెలక్కే
మసులుతుంది दिमगे నువ్వే ఫసక్కే

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట
జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా

సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక
పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక
“పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
ఒంపులలో దాచుంచా చెకుముఖి రాళ్ళు
దిమాక్ ఖరాబ్ దిమాక్ ఖరాబ్


నిప్పులనే పుట్టించు తాకించే వేళ్ళు
దిం దిం దిం దిం దిమాక్ ఖరాబ్
ఏన్నీళ్ళనే మింగేసి యమాగుంది ఒళ్ళు
తిన్నెలపై మంచేసా చలో జొన్న సేలు

ఇస్మార్ట్ ఏ ఈ శంకరు
సమరంలో యమకింకరు
అట్లయితే నువ్వు సూపరు

స్వర్గాలే మన ప్రోపరు
ముద్దులకే గిరాకే పొద్దు పోయాకే
ఒద్దు అంటే సిరాకే తెల్ల వారాకే

జిలెలమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట
జిలెలమ్మ జిట్ట నిన్నే తేలై కుట్టా
సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక
పిలగ పిలగ పిలగ పెట్టి పోరా సురక
గిరక గిరక గిరక ఇది సెద బాయి గిరక

ఉరక ఉరక ఉరక సొట్ట బుగ్గే కొరక



Starring: Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh
Music : Mani Sharma
Lyrics- Kasarla Shyam 
Singers : Keerthana Sharma, Saketh

************* ************** ************** **********

ముక్కు పోగు మెరుపులోన పొద్దు పొడిసే తూరుపులోన మైసమ్మ
ఎర్ర ఎర్రాన్ని సూరీడే నీ నుదుటన బొట్టయ్యే
సల్లని సూపుల తల్లి మాయమ్మ

అమ్మలగన్న అమ్మరన్న
పచ్చి పసుపు బొమ్మరన్న
యాప చెట్టు కొమ్మరన్న
ధూపమేసే దుమ్మురన్న
ఆషాడ మాసమన్న
అందులో ఆదివారమన్న
కొత్త కుండల బోనమన్న
నెత్తి కెత్తెను పట్నమన్న


యో సే యో సే 
హే బోనాలు రే
ఛలో ఛలో గండి మైసమ్మరో
యో సే యో సే 
హే బోనాలు రే
ఛలో ఛలో గండి మైసమ్మరో


హే రాయే రాయే
హే రాయే రాయే
అరె రాయే రాయే రాయే రాయే మైసమ్మ
బల్కంపేట ఎల్లమ్మవే
మా తల్లి బంగారు మైసమ్మవే
ఉజ్జయిని మాంకాళివే మాయమ్మ ఊరూర పోచమ్మవే


యో సే యో సే 
హే బోనాలు రే
ఛలో ఛలో గండి మైసమ్మరో
యో సే యో సే 
హే బోనాలు రే
ఛలో ఛలో గండి మైసమ్మరో


అరె రేవుల పుట్టిందమ్మ రేణుక ఎల్లమ్మ జెర్రిపోతుల తీసి జడల చుట్టింది
నాగు పాములా తీసి నడుమున కట్టింది ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎంట రాంగ
ఏడేడు లోకాలు


Album : Ismart Shankar
Music : Mani Sharma
Lyrics-Kasarla Shyam 
Singers :Rahul Sipligunj & Mohana Bhogaraju 


                                               ************* ************* ***********


ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. 
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. 
ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా .. 
ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయే

నా జీవితం
వదిలేసి వెళ్లనంది
జ్ఞాపకం..

మనసే మొయ్యలేనంతలా
పట్టి కొలవలేనంతలా 
విప్పి చెప్పలేనంతలా
హాయే కమ్ముకుంటోందిగా
ఏంటో చంటిపిల్లాడిలా
నేనే  తప్పిపోయానుగా
నన్నే వెతుకుతూ ఉండగా 
నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. 
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. 

సరికొత్త తడబాటే
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే
వదిలేసి ఒక్క మాటు రావా
మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో
బిడియాలు పారిపోవా ఎటువైపుకో
ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలా నవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మళ్ళీ పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా 
కాటుకళ్ళనే  తిప్పగా
నేనో రంగులరాట్నామై
చుట్టూ తిరుగుతున్నానుగా

తలనిమిరే చనువవుతా 
నువ్వు గాని పొలమారుతుంటే 
మాటే  నిజమైతే..
ప్రతిసారి పొలమారి పోతా..
అడగాలి గాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా..
ప్రాణం నీదని నాదని
రెండు వేరుగా లేవుగా
ఎపుడో కలుపుకున్నాం కదా
విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
విందాం ప్రేమలో గల గల
బంధం బిగిసిపోయిందిగా
అంతం కాదులే మన కథ

Music : Mani Sharma
Lyrics-Bhaskar Batla 
Singers :Anurag Kulkarni & Ramya Behara