ఆనంద నిలయం (1971)



చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి:

పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే......

పదిమందిలో పాటపాడినా...


చరణం 1:

గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..
పదిమందిలో పాటపాడినా

ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....

చరణం 2:

ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే
పదిమందిలో పాటపాడినా...

నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......

పదిమందిలో పాటపాడినా...
అది అంకితమెవరో ఒకరికే
పదిమందిలో పాటపాడినా...

అమాయకురాలు (1971)

చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు.. బంగారు జోతుల దీవెనలు

సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు... చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు... బంగారు జోతుల దీవెనలు


చరణం 1 :


పాపాయి గెంతులు... తువ్వాయి చెంగులు
పాపాయి గెంతులు... తువ్వాయి చెంగులు
తూరీగలాగ దొరకదు.. 

పరుగులు తీస్తే పండుగ.. ఉరకలు వేస్తె వేడుక
మా జోతి చిందులే అందాల విందులు

సన్నజాజి పువ్వులు.. చందమామ కాంతులు... చిన్నారి పాపా నవ్వులు 


చరణం 2 :


తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను.. అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను
తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను... అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను
ఆడిన ఆట.... పాడిన పాట...
ఆడిన ఆట అల్లరి... పాడిన పాట పల్లవి.. మా జోతి మాటలే వరహాల మూటలు

సన్నజాజి పువ్వులు.. చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు


చరణం 3 :

ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు
ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు 
ఆనందమొసగే వరములు
ఇరుగుపొరుగు మెచ్చగా ఇంటిల్లిపాదికి నచ్చగా.. 
చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా


సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు
మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు.. బంగారు జోతుల దీవెనలు



**************** **************** ***********
చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :
ఓహో.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఆహా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

కొంటె పిల్లా....
కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది

బ్రహ్మచారీ....
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది
కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది 

చరణం 1 :


కవ్వించి నవ్వించు గడుసైనదానా.. ఈ వింత సిగ్గేల నీ మోములోన
నను చూసి నా రాజు కను సైగ చేసే నును సిగ్గు పరదాలు కనులందు వాలే
నీ తీపి కలలన్ని నిజమైన వేళ..
నీ తీపి కలలన్ని నిజమైన వేళ.. సరదాగ నాతోటి సరితూగ రావా
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది...  కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది


చరణం 2 :


చెలికాని అధరాల చిరునవ్వు నేనై.. నిండైన ప్రణయాలు పండించుకోనా
చెలి నీలి కురులందు సిరిమల్లె నేనై.. పరువాల మురిపాలు విరబూయ రానా
అందాల మన ప్రేమ బంధాలలోన...
అందాల మన ప్రేమ బంధాలలోన.. హృదయాలు పెనవేసి విహరించుదామా

కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది.. వంట ఇంటి కుందేలై చేత చిక్కింది
బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది.. కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది



**************** **************** ***********
చిత్రం: అమాయకురాలు (1971)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు
పైకెంతో చల్లని వారు.. తమరెంతో అల్లరివారు
నా మనసు దోచినారు

చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు
లల్లలల్ల ఒహో ఒహో లలల్లల

చరణం 1:

రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా
రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా
నా తోడు నీవై.. నీ నీడ నేనై.. కలవాలి కరగాలి కావాలి ఒకటిగా.. ఆ..ఓ..

చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు

చరణం 2:

రావాలి రావాలి సరియైన అదను.. ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు..
రావాలి రావాలి సరియైన అదను.. ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు
ఆలోగ నీవు ఆవేశ పడకు.. ఆకాశ సౌధాలు నిర్మించ రాదులే.. ఏ .. ఓ..

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు

చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు

చరణం 3:

అనురాగ బంధాలు సడలించవద్దు.. పెనవేయు హృదయాలు విడదీయవద్దు
అనురాగ బంధాలు సడలించవద్దు.. పెనవేయు హృదయాలు విడదీయవద్దు

నీ లేత వలపు ఆమోదమైన.. బంగారు స్వప్నాలు పండేది ముందెపుడో.. ఓ.. ఓ..

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు
చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు


**************** **************** ***********

చిత్రం: అమాయకురాలు (1971) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత: దాశరథి 
నేపధ్య గానం: సుశీల 


పల్లవి: 

ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ... 
పాడెద నీ నామమే గోపాలా 
పాడెద నీ నామమే గోపాలా 
హృదయములోనే పదిలముగానే 
నిలిపెద నీ రూపమేరా... 
పాడెద నీ నామమే గోపాలా 

చరణం 1: 

మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా 
మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా 
ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతు రారా 
పాడెద నీ నామమే గోపాలా 

చరణం 2: 

నీ మురళీ గానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా 
నీ మురళీగానమే పిలిచెరా 
పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై 
ఆ..... 
పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై 
నీ సన్నిధిలో జీవితమంతా ..కానుక చేసేను రారా 

పాడెద నీ నామమే గోపాలా 
హృదయములోనే పదిలముగానే 
నిలిపెద నీ రూపమేరా... 
పాడెద నీ నామమే గోపాలా...


**************** **************** ***********

చిత్రం: అమాయకురాలు (1971)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:

నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను
ఆ నవ్వులలో.. ఆ చూపులలో.. నిను కవ్వించేవాడెవ్వడో..

నా చూపులు గారడి చేసినా.. నా నవ్వులు పూలై పూచినా..
ఏ ఒక్కరికో అవి దక్కునులే.. ఆ టక్కరి దొంగవు నీవేలే

చరణం 1:

నీ మోమే ఒక చంద్రబింబం.. దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం..
నీ మోమే ఒక చంద్రబింబం..
ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి..
ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి..
ఎందరు యువకులు తొందరపడి నిన్నెత్తుకుపోతారో.. నేనేమైపోతానో...

అహ..హ....
నా చూపులు గారడి చేసినా.. నా నవ్వులు పూలై పూచినా..
ఏ ఒక్కరికో అవి దక్కునులే.. ఆ టక్కరి దొంగవు నీవేలే

చరణం 2:

మగసిరిగల సొగసైన దొరవు.. అందుకు సరిపడు సిరులెన్నో కలవు...
మగసిరిగల సొగసైన దొరవు..
నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి
నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి
చక్కని పడుచుల.. చెక్కెలి తళుకుల చిక్కుకుపోతావో.. నీ చెలినే మరచేవో..

ఊ..హ..హ..
నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను
ఆ నవ్వులలో ఆ చూపులలో.. నిను కవ్వించేవాడెవ్వడో...

చరణం 3:

చిగురించిన ఈ అనురాగం.. వికసించునులే కలకాలం
చిగురించిన ఈ అనురాగం..
నీ వలపే నేనై.. నా వెలుగే నీవై
కమ్మని మమతల బంగరు మేడల కలలే కందామా..
కలలే కందామా..

ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా..

అదృష్ట జాతకుడు (1971)



చిత్రం  :  అదృష్ట జాతకుడు (1971)
సంగీతం  :  టి. చలపతిరావు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  సుశీల


పల్లవి :



చిరు చిరు నవ్వుల శ్రీవారు.. చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా.. కిమ్మనరు.. రమ్మనరు
కిమ్మనరు... రమ్మనరు



చరణం 1 :



చల్లగాలి పిలిచింది..  జాజి తీగె పలికింది
చల్లగాలి పిలిచింది..  జాజి తీగె పలికింది
కన్నెతార సైగలలో.. చందమామ సాగింది.. చందమామ సాగింది

చిరు చిరు నవ్వుల శ్రీవారు.. చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు.. రమ్మనరు
కిమ్మనరు.. రమ్మనరు



చరణం 2 :



పూల బాల రమ్మంది.. రాగాల తుమ్మెద ఝుమ్మంది
పూల బాల రమ్మంది.. రాగాల తుమ్మెద ఝుమ్మంది
వెండి పూల వెన్నెలలో నిండు హాయి విరిసింది.. నిండు హాయి విరిసింది

చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు.. రమ్మనరు
కిమ్మనరు.. రమ్మనరు


చరణం 3 :



లేత కోరిక పెరిగింది.. రేయి సగమే మిగిలింది
లేత కోరిక పెరిగింది.. రేయి సగమే మిగిలింది
సరసా లెరిగిన మావారే... ఉలకక పలకక ఉన్నారే.. ఉలకక పలకక ఉన్నారే


చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా..  కిమ్మనరు.. రమ్మనరు..  కిమ్మనరు..రమ్మనరు

అత్తలూ కోడళ్లు (1971)


చిత్రం : అత్తలూ కోడళ్లు (1971)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : బాలు , సుశీల

పల్లవి :


చీరకు రవికందమా?...  రవికకు చీరందమా ?
చీరకు రవికందమా?... రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా 

చీరకు రవికందమా?.. రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా

చరణం 1 :


పైటకొంగు చుట్ట చుట్టి పైటన్నం గంపనెట్టి 
పైటకొంగు చుట్టచుట్టి పైటన్నం గంపనెట్టి
కోక కాస్త ఎత్తికట్టి గట్టుమీద నడుస్తుంటె 
కోక కాస్త ఎత్తికట్టి గట్టుమీద నడుస్తుంటె

నడక అందమా ? ఆ నడుము అందమా ? 
నడక అందమా ? ఆ నడుము అందమా ?

చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా
చిలకమ్మా ఒక్కమాట అడుగమ్మా


చరణం 2 :


పైరగాలి వీస్తుంటే.. పంటచేలు వూగుతుంటే
పైరగాలి వీస్తుంటే, పంటచేలు వూగుతుంటే
ముందు ముందు పంట తలచి మురిసిపోతు నువ్వుంటే
ముందు ముందు పంట తలచి మురిసిపోతు నువ్వుంటే

నువ్వు అందమా? నీ గర్వమందమా?
నువ్వు అందమా ? నీ గర్వమందమా ?

చీరకు రవికందమా ? రవికకు చీరందమా ?
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మా 


చరణం 3 :


ముద్ద నేను పెడుతుంటే  నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద నేను పెడుతుంటే  నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు కొసరి నేను కోరుతుంటే

కోరికందమా? ... నీ కోపమందమా ?
నా కోరికందమా? ... నీ కోపమందమా ?

చీరకు రవికందమా? ... రవికకు చీరందమా ?

సుపుత్రుడు (1971)



చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:
చిలకమ్మా పిలిచింది... గోరొంకా పలికింది
చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 1
ఉరిమేటి మబ్బులే... చిరుజల్లు కురిసేది
చెఱలాడు మనసులే... చెలిమితో కలిసేది
ఉరిమేటి మబ్బులే... చిరుజల్లు కురిసేది
చెఱలాడు మనసులే... చెలిమితో కలిసేది

చినదాని బుగ్గలకు... సిగ్గెపుడు వచ్చేది
చినదాని బుగ్గలకు... సిగ్గెపుడు వచ్చేది
అనుకోని వలపులూ... అప్పుడే తెలిసేది 

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 2
ఎఱ్ఱ ఎఱ్ఱగా పూచింది... దానిమ్మ పువ్వు
కుఱ్ఱతనమంతా ఒలికావు... కులుకుల్లోనువ్వు
చలిగాలి వీచింది... ప్రాణాలు జివ్వని
అది గిలిగింత పెట్టితే..అనుకొంటి నువ్వని 

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 3
ఆ కొండ ఈ కోన... కలిశాయి మంచులో
నీరెండ తోచింది... నీవున్న తావులో
ఆ కొండ ఈ కోన... కలిశాయి మంచులో
నీరెండ తోచింది... నీవున్న తావులో
ఊగింది మనపడవ... వయ్యారి కొలనులో
ఊగింది మనపడవ... వయ్యారి కొలనులో
సాగాలి మనబ్రతుకు... ఈ తీపి ఊపులో

చిలకమ్మా పిలిచింది... గోరొంకా పలికింది
చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది


******   ******   ******


చిత్రం:  సుపుత్రుడు (1971)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఒ హో హో... వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ... వై కాంట్ యు మారి
యు..నో..నో..నో..

ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..నో..నో..

చరణం: 1
నడవకు నడవకు అంతజోరుగా... నడుస్తాను నీకేం?
నాకేం..హహహా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ

నడవకు నడవకు అంతజోరుగా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ

చూడకు చూడకు అంత కోరగా
నీ చూపులోని ఎరుపు నాకు కైపులాగ తోస్తుంది
నన్నేదో చేస్తుంది..అహా

ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..సిల్లి..

చరణం: 2
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే... కాళ్ళబేరమూ
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే... కాళ్ళబేరమూ

ఈ రుసరుసలూ... గుసగుసలూ... ఎందుకమ్మాయి
ఈ రుసరుసలూ... గుసగుసలూ... ఎందుకమ్మాయి
ఇంక పస ఉంటే వేసుకొందం.., రోజూ లడాయి
ప్రతి రోజూ లడాయి

వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
అబబబభా..

చరణం: 3
బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..

బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..

ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
నీవు ఎగతాళికి చేస్తే అది వెంటబడేను
నీ అంతేదో... చూసేను..ఏయ్..

ఒ హో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..


******   ******   ******


చిత్రం:  సుపుత్రుడు (1971)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను

నన్నే వలచి నా మేలు తలచి..
నన్నే వలచి నా మేలు తలచి..
లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి
ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను

చరణం: 1
తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా...
వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా
యుగయుగాలు నిన్నే వరియించనా
నా సగము మేన నిన్నే ధరియించనా..

ఏమివ్వను నీకేమివ్వను.. నా మనసే నీదైతే ఏమివ్వను

ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను

చరణం: 2
నీ కన్నుల వెలుగులే తారకలై... నయన తారకలై
నీ నవ్వుల జిలుగులే చంద్రికలై... కార్తీక చంద్రికలై
జగమంతా నీవే అగుపించగా...
నీ సగము మేన నేనే నివసించగా

ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను
నిన్నే వలచి నీ మేలు తలచి...
నిన్నే వలచి నీ మేలు తలచి
బ్రతుకే నీవై పరవశించు చెలినీ... నీ జాబిలినీ

ఏమడుగను ఇంకేమడుగను.. నీ మనసే నాదైతే ఏమడుగను
ఆహాహా... ఆహాహా... ఆహాహహా...

చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు.

శ్రీ కృష్ణుడు  మీద నాకు ఎంతగానో నచ్చిన  ఒక చక్కని  పాట మీ కోసం.వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడచూడవచ్చు .







చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..     
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు.. 
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ  కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
మన గండాలు దాటించు నల్లవాడు    

తారంగాలు ఆడేవాడు   
పిల్లనగ్రొవి ఊదేవాడు  
వచ్చాడమ్మ వెన్నల దొంగోడు  


తారంగాలు ఆడేవాడు   
పిల్లనగ్రొవి ఊదేవాడు 
వచ్చాడమ్మ వెన్నల దొంగోడు   

చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు 


పడగలు తొక్కిన పిల్లాడమ్మ  
మడుగున ఆడిన గడుసొడమ్మ
వచ్చాడమ్మ గొవుల గొపన్నా
వాడు.. కొండను ఎక్కిన అల్లరి బుల్లోడు  

చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు 
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు

చీరలు దోచిన చిన్నోడమ్మా  
గారెడి చేతల పిడుగోయమ్మ   
వచ్చాడమ్మ  కిటుకుల కిట్టయ్యా 
చీరలు దోచిన చిన్నోడమ్మా   
గారెడి చేతల పిడుగోయమ్మ    
వచ్చాడమ్మ  కిటుకుల కిట్టయ్యా 

చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు


బావకు బుద్ధులు చెప్పినవాడు 
భామల పాలిట ప్రేమలవాడు  
వచ్చాడమ్మ రాధాక్రిష్ణయ్యా   
బావకు బుద్ధులు చెప్పినవాడు 
భామల పాలిట ప్రేమలవాడు   
వచ్చాడమ్మ రాధాక్రిష్ణయ్యా   
వాడు వేణువులూడె వెన్నెల కన్నయ్యా 

చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు

మామకు తగ్గ అల్లుడువాడు  
చెల్లినికాచిన అన్నయ్యాడు
వచ్చాడమ్మ అందరి క్రిష్ణయ్యా  
మామకు తగ్గ అల్లుడువాడు  
చెల్లినికాచిన అన్నయ్యాడు
వచ్చాడమ్మ అందరి క్రిష్ణయ్యా  

చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు 

చక్రం పట్టి తిప్పేవాడు    
అమ్మకు విశ్వం చూపినవాడు 
వచ్చడమ్మా ముద్దుల క్రిష్ణయ్యా  
చక్రం పట్టి తిప్పేవాడు    
అమ్మకు విశ్వం చూపినవాడు 
వచ్చడమ్మా ముద్దుల క్రిష్ణయ్యా   
వాడు డోకాలన్ని కాచేవాడు

చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు

గురువాయూరు క్షేత్రంలోన  
గురువై వున్నాడమ్మవాడు 
చందన గంధపు సుందరుడోయమ్మా   
గురువాయూరు క్షేత్రంలోన  
గురువై వున్నాడమ్మవాడు 
చందన గంధపు సుందరుడోయమ్మా 
వాడు గురువాయూరు దేవుడు అయినాడు 

చూడరండమ్మా వచ్చాడమ్మ  కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు..
రేపల్లె వాడల్ని.. ఏలువాడు
  

సంబరాల రాంబాబు (1970)




చిత్రం :  సంబరాల రాంబాబు (1970)
సంగీతం : వి. కుమార్
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :
మామా... చందమామా... వినరావా... నా కథ 
మామా... చందమామా... వినరావా... నా కథ
వింటే మనసు ఉంటే... కలిపేవూ నా జత
మామా... చందమామా... 

చరణం 1 :

నీ చల్లని కిరణాలలో జగమంతా మురిసెనే
నాలోన లోపమేమో నా మనసే కుమిలెనే
అందరికీ ఆనందం అందించే జాబిలి
నాపైన నీకేలా రాదాయే జాలి 

మామా... చందమామా... వినరావా... నా కథ
వింటే మనసు ఉంటే.. కలిపేవూ నా జత
మామా... చందమామా... 

చరణం 2 :

మచ్చ నీకు ఉన్నా...  లెక్క చెయ్యరే
ముచ్చటైన నీ వెన్నెలనే మెచ్చుకుందురందరూ
మచ్చలేని నన్ను...  వెక్కిరింతురే
పిచ్చిదానినంటూ నాపై లేని మచ్చ వేసేరు

నిజము తెలిపినా వినరు..  మనసు తెలుసుకోలేరు
నీవుకాక నా వెతలన్నీ వినేవారు ఎవ్వరు
వినేవారు ఎవ్వరు... 

మామా... చందమామా... వినరావా... నా కథ
వింటే మనసు ఉంటే.. కలిపేవూ నా జత
మామా... చందమామా... 



******** ********** * ************* *********
చిత్రం :  సంబరాల రాంబాబు (1970)
సంగీతం : వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  బాలు,  సుశీల 

పల్లవి :

మామా... చందమామా... వినరావా...నా కథ

మామా చందమామా... వినరావా నా కథ
వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత
మామా... చందమామా ... 

చరణం 1:

నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు...
నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు...

నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు
నువు లేక నువు రాక.. విడలేవు కలువలు...
జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు.... 

మామా చందమామా... వినరావా నా కథ
వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత
మామా... చందమామా ... 
చరణం 2 :

మింటిపైన నీవు ఓంటిగాడివై.. అందరికీ వెన్నెల పంచ
రేయంత తిరగాలి
ఇంటిలోన నేను ఒంటిగాడినై.. అందరికీ సేవలు చేయ
రేయి పవలు తిరగాలి

లేరు మనకు బంధువులు... లేరు తల్లిదండ్రులులేరు మనకు బంధువులు... లేరు తల్లిదండ్రులుమనను చూసి అయ్యోపాపం... అనేవారు ఎవ్వరుఅనేవారు ఎవ్వరు...

మామా చందమామా... వినరావా నా కథ
వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత
మామా... చందమామా 


******** ********** * ************* *********
చిత్రం :  సంబరాల రాంబాబు (1970)
సంగీతం :  వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  పిఠాపురం, సుశీల  

పల్లవి :

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...
మిమ్మల్నే...
పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...

పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా..
పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా..
చీకటి పడితే పక్కకి చేరి రాజీ కొస్తాడు
కోరిన చీరలు ఇస్తాడు...

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...


పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే...
ఆండాళ్ళూ...
పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే..

తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే..
తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే..
జీతం కాస్తా సినిమాకైతే మిగిలిదేముందే?
చీరకు మిగిలేదేముందే...  

పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే...

చరణం 1 :

పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...
పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...
తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు
తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు
వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా
వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా
ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకి అందం తెచ్చారా....
నా ముక్కుకి అందం తెచ్చారా....
ఉద్యోగం ఒక మెట్టు దాటనీ కోరినదిస్తా నీకూ
ఇష్టం లేదని చెప్ప కూడదా ఎందుకు లెండి సాకు....  

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...

చరణం 2 :

మాటలతోటీ రెచ్చ గొట్టకే నన్నూ....
బెదిరింపులకు లొంగే దాన్ని కానూ...
కోపం వస్తే మనిషిని కాను నేనూ...

ఏం చేస్తారు..?
చెవులు మెలేస్తా..!! ఇంకేంచేస్తారు..?
దుంప తెంపేస్తా..!! ఆ తరువాతా..!!
తాట వొలుస్తా...!! హా హ హ హా....!!! 

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా... హా హ హ హా

శ్రీదేవి (1970)



చిత్రం :  శ్రీదేవి (1970)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు,  జానకి  



పల్లవి :

రాశాను ప్రేమలేఖలెన్నో... దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే... దివిలోన తారకలాయే నీ నవ్వులే

రాశాను ప్రేమలేఖలెన్నో...  దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే...  దివిలోన తారకలాయే నీ నవ్వులే

చరణం 1 :

కొమ్మల్లో కోయిలమ్మా.. కోయ్ అన్నది
కొమ్మల్లో కోయిలమ్మా కోయ్ అన్నది... నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది... చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది


రాశాను ప్రేమలేఖలెన్నో...  దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే...  దివిలోన తారకలాయే నీ నవ్వులే


చరణం 2 : 

నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో...  ఊహూ.. 
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో...  హా
నాలోని సోయగమంతా విరబూసెలే... 
నాలోని సోయగమంతా విరబూసెలే... మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే


రాశాను ప్రేమలేఖలెన్నో...  దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే...  దివిలోన తారకలాయే నీ నవ్వులే


చరణం 3 :
ఊ..ఊ..ఊ..ఊ...ఊ... ఆ... ఆ...
అందాలా పయ్యెద నేనై ఆటాడనా... ఆ..... 
కురులందు కుసుమం నేనై చెలరేగనా.... ఆ....
నీ చేతుల వీణను నేనై పాట పాడనా... నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

రాశాను ప్రేమలేఖలెన్నో...  దాచాను ఆశలన్ని నీలో  

ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ......

******** ************ *************


చిత్రం :  శ్రీదేవి (1970)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


చిరుగాలే వింజామర.. చిట్టిపపే కెందామర..
చిలకమ్మా .. ఆ... పాడింది..
చెవిలో జోల... జోజో బాల...

చిరుగాలే వింజామర...  

చరణం 1 :

మా ఇంట వెలసింది శ్రీదేవి...
మా ఇంట వెలసింది శ్రీదేవి...
తాను మౌనాన తెరచింది కెమ్మౌవి..
రతనాల నవ్వులే కురిశాయి..
రంగారు మురిపాలే మెరిశాయి...

చిరుగాలే వింజామర... చిట్టిపాపే కెందామర..
చిలకమ్మా ..ఆ... పాడింది..
చెవిలో జోల... జోజో బాల...


చరణం 2 :

నిదురలో పాపాయి పలవింతలు...
అవి ఎదలోన తల్లికి పులకింతలు..
నిదురలో పాపాయి పలవింతలు...
అవి ఎదలోన తల్లికి పులకింతలు..

ఆ తల్లిలో మధుర భావనలు
అందాల పాపకి దీవెనలు
చిరుగాలే వింజామర...


చరణం 3 :

ఉయ్యాలలో బోమ్మ నీ తమ్ముడే..
నీ ఊహ పండించు ఆ దేవుడే...
కోరికల తోటలా చిగురింతలు..
అవి కుసుమించు దినదినం వేయింతలు...

చిరుగాలే వింజామర...చిట్టిపాప కెందామర
చిలకమ్మా పాడింది...చెవిలో జోల ..జో..జో ..బాల

విజయం మనదే (1970)



చిత్రం :  విజయం మనదే (1970)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :

ఓ దేవి ఏమి కన్నులు నీవి
ఓ దేవి ఏమి కన్నులు నీవి
కల కల నవ్వే కలువలు
అవి కాముని పున్నమి చలువలు
ఓ దేవి ఏమి కన్నులు నీవి
వాడిపోయే వీడిపోయే
కొలనులోని కలువపూలు
నా నయనాలా చాలు చాలు చాలూ...
ఓ దేవి ఏమి కన్నులు నీవి


చరణం 1 :

ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు
అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు
ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు
అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు
రూపమే కాని రుచియే లేని పగడాలు
రూపమే కాని రుచియే లేని పగడాలు
తేనియలూరే తియ్యని పెదవికి సరి రావు సరిరావు
చాలు చాలు చాలు...

ఓ దేవి ఏమి కన్నులు నీవి


చరణం 2 :

కులుకుల నడకల కలహంసలు కదలాడెనా
నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా
కులుకుల నడకల కలహంసలు కదలాడెనా
నల నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా
దివికీ భువికి వంతెన వేసెను నీ సోగసు
దివికీ భువికి వంతెన వేసెను నీ సోగసు
అల్లరి పిల్లకు కళ్ళెం వేసెను నీ మనసు నీ మనసు
చాలు చాలు చాలు...

ఓ దేవి ఏమి కన్నులు నీవి
ఓ రాజా రసికతారసి రాజా

లక్ష్మీ కటాక్షం (1970)


చిత్రం :  లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  చిల్లర భావనారాయణరావు
నేపధ్య గానం :  జానకి 

పల్లవి :


శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు
దివ్వెనూదగ వద్దు... బువ్వనెట్టొద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు
తొలిసంజ మలిసంజ నిదురపోవద్దు
మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు
మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు

చరణం 1 :

ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట
కల్లలాడని ఇంట... గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లొ... పసుపు గడపల్లో
పూలల్లో... పాలల్లో...
పూలల్లో... పాలల్లో... ధాన్యరాశుల్లో
మా తల్లి మహాలక్ష్మి  స్థిరముగానుండు
మా తల్లి మహాలక్ష్మి  స్థిరముగానుండు

********** ************ ***********

చిత్రం :  లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల 

పల్లవి :

ఆహా...హ....అహ...హ...
అహ...హ.....ఓహో...ఓ...ఓ...
ఆహ....హ.....హా......

రా...వెన్నెల దొరా....కన్నియను చేరా
రా...కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ..ఆ

రా..వెన్నెల దొరా....కన్నియను చేరా...
రా..కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ...ఆ..   

చరణం 1 :

ఈ పాల వెన్నెలలోన...నీ నీలి కన్నులలోనా..
ఈ పాల వెన్నెలలోన...నీ నీలి కన్నులలోనా..
ఉన్నానులేవే ...ప్రియతమా....ఆ..ఆ

నీ మగసిరి నగవులు...చాలునులే...
నీ సొగసరి నటనలు చాలునులే...నీ మనసైన తారను నే కానులే...

రా..వెన్నెల దొరా...వింత కనవేరా..
రా..చిలకవౌరా...అలిగినదిలేరా...ఆ...ఆ..ఆ.. 

చరణం 2 :

ఈ మబ్బు తెరచాటేలా...ఈ నింగి పయణాలేలా...
ఈ మబ్బు తెరచాటేలా...ఈ నింగి పయణాలేలా...
ఎద నిండిపోరా...చందమా....ఆ...ఆ..

నీ పగడపు పెదవుల...జిగి నేనే...
నీ చెదరని కౌగిలి ...బిగి నేనే...
నా ఎద నిండ నీవే నిలిచేవులే....

రా..వెన్నెల దొరా....కన్నియను చేరా...
రా..కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ...ఆ..

రా..వెన్నెల దొరా...వింత కనవేరా..
రా..చిలకవౌరా...అలిగినదిలేరా...ఆ...ఆ..ఆ..

********** ************ ***********


చిత్రం :  లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల 

పల్లవి :

అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే
నీ రూపులలోన.. నీ చూపులోన
ఏ రాచకళలో మెరిసేనని

అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే
ఏ కొంటె మరుడో.. గంధర్వ వరుడో
నా కళ్ళలోన నవ్వేనని
అమ్మమమ్మో తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే  

చరణం 1:

కులికే వయసే పులకించి పోగా
పోంగు ఆగుతుందా... ఎదలో కదిలే పొంగు ఆగుతుందా

కులికే వయసు పులకించి పోగా
పొంగు ఆగుతుందా.. ఎదలో కదిలే పొంగు ఆగుతుందా

పువ్వల్లే మారిపోయి.. ముద్దుల్లో తేలిపోయి
పువ్వల్లే మారిపోయి.. ముద్దుల్లో తేలిపోయి
కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా

అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే
నీ రూపులలోన.. నీ చూపులోన
ఏ రాచకళలో మెరిసేనని
అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే 

చరణం 2 :

వలచే జాబిలి ఇలపైన రాగ
కలువ దాగుతుందా.. విరిసే మురిసే.. తలపు దాగుతుందా

వలచే జాబిలి ఇలపైన రాగ
కలువ దాగుతుందా.. విరిసే మురిసే.. తలపు దాగుతుందా

తీగల్లే అల్లుకొంటే..ఆహ..
గుండెల్లో జల్లుమంటే..ఓహో..
తీగల్లే అల్లుకొంటే..ఆహ..
గుండెల్లో జల్లుమంటే..ఓహో..
దాచినా దోర వలపు దాగుతుందా

అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే
ఏ కొంటె మరుడో.. గంధర్వ వరుడో
నా కళ్ళలోన నవ్వేనని
అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే 

మాయని మమత (1970)



చిత్రం :  మాయని మమత (1970)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  ఘంటసాల 

పల్లవి :


రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం
రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం

రాలిన సుమాలు ఏరుకొని...  జాలిగ గుండెల దాచుకోని
ఈ దూరపు సీమలు చేరుకొని
రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం


చరణం 1 :

వాకిటిలో నిలబడకు...  ఇంక నాకై మరిమరీ చూడకు .. చూడకువాకిటిలో నిలబడకు...  ఇంక నాకై మరిమరీ చూడకు

ప్రతి గాలి సడికి తడబడకు...  పదధ్వనులని పొరబడకుకోయిలా కోయలే… గూడు గుబులై పోయేలే….
రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం



చరణం 2 :

పగలంతా నా మదిలో మమతలు సెగలై లో లో రగులునులే
నిద్రరాని నిశినైనా నాకు నిష్టుర వేదన తప్పదులే
పోనీలే… ఇంతేలే.. గూడు గుబులై పోయేలే ..

రానిక నీకోసం సఖీ... రాదిక వసంత మాసం…రాదిక వసంత మాసం

************************* ********************************


చిత్రం :  మాయని మమత (1970)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

కనులు మాటలాడునని.. ఈ...
మనసు పాట పాడునని.. ఈ...

కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు

కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లగ విన్నాను.. అది కనుగొన్నాను ఈనాడు



చరణం 1:

మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ... ఆ.... ఆ... ఆ...ఆ... ఆ...

మెత్తగ సాగే మేనితీగ మెలికలు తిరిగితె.. ఒక అందం
ఆ మేనితీగ వలపుల పందిట అల్లుకుంటే.. ఒక అందం
మలయానిలమున చెలి ముంగురుల మబ్బులూగితే.. ఒక అందం
ఆ ముంగురులే చెలికాణి మోముపై ముసురుకుంటే.. ఒక అందం
అదే... ముద్దులొలికే అనుబంధం...

కనులు మాటలాడునని.. మనసు పాట పాడునని
కవితలల్లితి ఇన్నాళ్ళు.. అది కనుగొన్నాను ఈనాడు


చరణం 2:

వేచిన కలువ వెన్నెల జల్లుల విరిసిపోతే.. మధురానందం
ఆ కలువ చెలువ నెలరాయునిలో కరిగిపోతే.. మహదానందం
జగములనేలే చంద్రవదనతో ఎగిసిపోతే.. దివ్యానందం
ఎగిసి ఎగిసి పులకించిన మనసులు ఏకమైతే.. రసానందం...
అదే... యుగయుగాల అనుబంధం...

మా నాన్న నిర్దోషి (1970)

చిత్రం :  మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి:

movies
అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా..
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా..
ఆ...ఆ...ఆ..ఆ..
ఆ...ఆ...ఆ..ఆ..
ఆ...ఆ...ఆ..ఆ..

అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా.. ఆ.. ఆ.. ఆ
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా


చరణం 1:

కదలే పూలగాలి.. నా ఎదపై తేలి తేలి ఈ ఈ
కదలే పూల గాలి .. నా ఎదపై తేలి తేలి
ఏ కథలో తెలుపసాగే.. ఏ కలలో పలుకసాగే

ఆ తీయ్యని గాధల రాధవు నీవే ప్రియా ఆ ఆ...
నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...

అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా..
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా..

చరణం 2:

మదిలో రాగ మాలా.. నవమధువై పొంగు వేళా ఆ ఆ
నా తనువే పల్లవించే.. అణువణువే పరవశించే

ఆ గానములో నను లీనము కానీ ప్రియా ఆ ఆ ఆ
నీ ప్రాణము లో ఒక ప్రాణము కానీ ప్రియా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...

అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా
ఆ ఆ అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
ఊ ఊ ఊ ఊ
ఊ ఊ ఊ ఊ

మనసు-మాంగల్యం (1970)

చిత్రం :  మనసు-మాంగల్యం (1970)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

ఏ శుభ సమయంలో.. ఈ కవి హృదయంలో
నీ కాలి అందెలు మ్రోగినవో.. ఎన్నెన్ని ఆశలు పొంగినవో

ఏ శుభ సమయంలో .. ఈ చెలి హృదయంలో
నీ ప్రేమ గీతం పలికిందో.. ఎన్నెన్ని మమతలు చిలికిందో

అహ..అహ...అహ..అహ
అహాహ హాహహ.. హా.. హా.. హా

చరణం 1:

కలలో నీవే ఊర్వశివే.. ఇలలో నీవే ప్రేయసివే
కలలో నీవే ఊర్వశివే.. ఇలలో నీవే ప్రేయసి వే
ఆ..ఆ..నీడే లేని నాకోసం.. తోడై ఉన్న దేవుడవే
నీడే లేని నాకోసం.. తోడై ఉన్న దేవుడవే

చిక్కని చీకటిలోనా.. అతి చక్కటి జాబిలి నీవే

ఏ శుభ సమయంలో...ఓ...ఓ...ఓ...

చరణం 2:

మనిషై నన్ను దాచావు.. కవివై మనసు దోచావు
మనిషై నన్ను దాచావు.. కవివై మనసు దోచావు
నిన్నే గెలుచుకున్నాను.. నన్నే తెలుసుకున్నాను
నిన్నే గెలుచుకున్నాను.. నన్నే తెలుసుకున్నాను

పందిరి నోచని లతకు.. నవ నందనమైతివి నీవే

ఏ శుభసమయములో...ఓ..ఓ..ఓ..

చరణం 3:

నీలో విరిసి హరివిల్లు.. నాలో కురిసే విరిజల్లు
నీలో విరిసి హరివిల్లు.. నాలో కురిసే విరిజల్లు

ఆ...ఆ...ఆ..కనులే కాంచె స్వప్నాలు.. నిజమై తోచే స్వర్గాలు
కనులే కాంచె స్వప్నాలు.. నిజమై తోచే స్వర్గాలు

నవ్వుల ఊయలలోని.. నా యవ్వన శోభవు నీవే
ఏ శుభసమయంలో.. ఈ చెలి హృదయంలో
ఈ ప్రేమ గీతం పలికిందో..ఎన్నెన్ని మమతలు చిలికిందో
అహ..అహ...అహ..అహ
అహాహ హాహహ.. హా.. హా.. హా.. హా

మంచి రోజు (1970)


చిత్రం :  మంచి రోజు (1970)
సంగీతం :  ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్

పల్లవి:

చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?
చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?

చిలకమ్మ నువ్వైన చెప్పే...  తనకోసమే నేననీ
చెప్పాలనుంది చెప్పేదెలా...  సిగ్గెందుకో నాకిలా?

చరణం 1:

ఆ చూపు మెరుపు..ఆ మేని విరుపు.. కలనైన మరచేదెలా?
ఆ చూపు మెరుపు..ఆ మేని విరుపు.. కలనైన మరచేదెలా?
పులకించి వయసు.. పిలిచింది పిలుపు.. వినకుంటే కలిసేదెలా?

ఆ... ఆ... ఆ.. చెప్పాలనుంది చెప్పేదెలా సిగ్గెందుకో నాకిలా

చరణం 2:

అందాల కొమ్మ అపరంజి బొమ్మ...  నా చేతికందాలిగా
అందాల కొమ్మ అపరంజి బొమ్మ... నా చేతికందాలిగా
నా మూగ మనసు ఇకనైన తెలిసి... నా చెంత చేరాలిగా..

ఆ.. ఆ.. ఆ... చెప్పాలనుంది చెప్పేదెలా ... సిగ్గెందుకో నాకిలా?
చిలకమ్మ నువ్వైన చెప్పే ... తనకోసమే నేననీ
చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?

బాలరాజు కథ (1970)


చిత్రం :  బాలరాజు కథ (1970)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల



పల్లవి :

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు
వద్దు.. వద్దు... వద్దు

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు
వద్దు... వద్దు... వద్దు

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు


చరణం 1 :


పైసా అంటే పలకని దేవుడు పిల్లలు కొల్లగ ఇస్తాడు
పైసా అంటే పలకని దేవుడు పిల్లలు కొల్లగ ఇస్తాడు
దరిద్రాన్ని జత చేస్తాడు

సంతులేనిదే స్వర్గం లేదని ఏ మగవాడూ అనుకోడు
సంతులేనిదే స్వర్గం లేదని ఏ మగవాడూ అనుకోడు
ఇడుగో మొనగాడున్నాడు
ఇడుగో మొనగాడున్నాడు

ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు


చరణం 2 :

ఇలాగ జనాభా పెరుగుతు ఉంటే సాపాటు సంగతి ఏలాగు?
ఇలాగ జనాభా పెరుగుతు ఉంటే సాపాటు సంగతి ఏలాగు?
సంతానమంతా దిగజారు

రెక్కల కష్టం.. చేసే వాళ్ళకు
రెక్కల కష్టం చేసే వాళ్ళకు బతుకంతా హాయిగ జరుగు
రెక్కల కష్టం చేసే వాళ్ళకు బతుకంతా హాయిగ జరుగు
ఇంతమందైతే ఏలాగు? మరింత మందైతే ఏలాగు?

వద్దు వద్దు వద్దు
ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు


చరణం 3 :

సినిమాలకు పోవాలంటే సైన్యమంతా తయారు
సినిమాలకు పోవాలంటే సైన్యమంతా తయారు 

ఒక్కరు వెనుకాడరు మీరుకూడ హాజరు
ఒక్కరు వెనుకాడరు మీరుకూడ  హాజరు

కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయామారు
కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయామారు
ఆ దెబ్బతో తారుమారు.. ఆపవయ్యా నీ జోరు


వద్దు... వద్దు... వద్దు
ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు


చరణం 4 :


గంపెడు పిల్లలు కన్న కుచేలుడు కుయ్యో మొఱ్ఱో అన్నాడు
గంపెడు పిల్లలు కన్న కుచేలుడు కుయ్యో మొఱ్ఱో అన్నాడు

పస్తులెన్నో పడుకున్నాడు
శ్రీకృష్ణుడు భగవానుడు వచ్చి అప్పుడు ఆదుకున్నాడు
శ్రీకృష్ణుడు భగవానుడు వచ్చి అప్పుడు ఆదుకున్నాడు
ఇప్పుడు మనకెవడున్నాడు?


ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు
వద్దు... వద్దు... వద్దు



************* **************** ********

చిత్రం:  బాలరాజు కథ (1970)
సంగీతం:  కె.వి. మహదేవన్
గీతరచయిత:  ఆరుద్ర
నేపధ్య గానం:  సుశీల


పల్లవి:

మహబలిపురం మహబలిపురం మహబలిపురం
భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు

మహబలిపురం మహబలిపురం మహబలిపురం
భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహబలిపురం మహబలిపురం మహబలిపురం

చరణం 1:

కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు
కంచి రాజధానిగా పాలించాడు
ఇది మంచిరేవు పట్నం గా కట్టించాడు

తెలుగుసీమ శిల్పులుని రప్పించాడు
తెలుగుసీమ శిల్పులుని రప్పించాడు
పెద్ద శిలలన్ని శిల్పాలుగా మార్పించాడు
మహబలిపురం మహబలిపురం మహబలిపురం

చరణం 2:

పాండవుల రథాలని పేరుపడ్డవి
ఏకాండి శిలలనుండి మలచపడ్డవి
పాండవుల రథాలని పేరు పడ్డవి
ఏకాండి శిలలనుండి మలచపడ్డవి

వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి
వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి
తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి
తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి
మహబలిపురం మహబలిపురం మహబలిపురం

మహిషాసురమర్ధనం... గోవర్ధనమెత్తడం
మహిషాసురమర్ధనం... గోవర్ధనమెత్తడం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం
మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం

పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి
మహబలిపురం మహబలిపురం మహబలిపురం

చరణం 3:

పాశుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపస్సు
పాశుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపస్సు

సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను
సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను
ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను
ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను
మహబలిపురం మహబలిపురం మహబలిపురం

సంద్రంలో కలసినవి కలసిపోయేను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను
సంద్రంలో కలసినవి కలసిపోయేను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను

దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం
పాదాలను కెరటాలు కడుగును నిత్యం
మనుషుల పాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం
పాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం

మహబలిపురం మహబలిపురం మహబలిపురం
భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు
మహబలిపురం మహబలిపురం మహబలిపురం


************* **************** ********

చిత్రం :  బాలరాజు కథ (1970)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  కొసరాజు
నేపధ్య గానం  :  ఘంటసాల, సుశీల

పల్లవి:

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

చరణం 1:

ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు

అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు..
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ …

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

చరణం 2:

మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు

లోకులు చూచి తరించుటకు … లోకులు చూచి తరించుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు… పలుగాకుల బొజ్జల పెంచుటకు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

చరణం 3:

మహమ్మదీయులు పిలిచే దేవుడు .. క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు...  గోవిందా .. గోవిందా
శ్రీశైలంలో మల్లికార్జునుడు .. వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లికార్జునుడు .. వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా

సర్వవ్యాపి నారాయణుడు ... సర్వవ్యాపి నారాయణుడు.. ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా .. తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా

ఆఁ అట్టా రండి దారికి …

అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు .. మీరొక్క దెబ్బతో తేల్చారు ..
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు ..మీరొక్క దెబ్బతో తేల్చారు
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు ..ఏ రాతికి మొక్కను వచ్చారు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం