సీతామాలక్ష్మి (1978)




చిత్రం :  సీతామాలక్ష్మి (1978)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

నువ్విట్ట.. నేనిట్ట... కూకుంటే.. ఇంకెట్టా
తెల్లారిపోయేదెట్టా.. హా.. ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..
నువ్విట్ట.. నేనిట్ట... కూకుంటే.. ఇంకెట్టా


నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా
ఈ ఊపు ఆపేదెట్టా..హా.. నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..
నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా  



చరణం 1 :


సిటికెంత నవ్వంట.. సికిలింత పువ్వంట..
ఆ పువ్వు కోసుకొంటే.. ఏ.. ఆపేది ఎవరంట..

చీకట్లో సింగారం.. సిటికేసే యవ్వారం..
చీకట్లో సింగారం.. సిటికేసే యవ్వారం..
నీ పొగరంత అణిగేదెట్ట.. ఈ పొగరాని సెగలే సంత

నువ్విట్ట.. నేనిట్ట.. కూకుంటే.. ఇంకెట్టా
ఈ ఊపు ఆపేదెట్టా..హా.. నీ దుడికి కాసేపు ఓపేదెట్టా..
నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా   

చరణం 2 :


మసకేస్తే మనసంట.. మనసైతే వరసంట
ఈ ఘడియా గడిపేదట్ట... ఆ గడియా తీసేదెట్ట

ఆ ఘడియా రానీకు నన్నిడిసి పోమాకు...
ఆ ఘడియా రానీకు నన్నిడిసి పోమాకు...
తొలి పొద్దు పొడిచిదంటే.. చలి తీరిపోయేదెట్ట...  ఎట్ట..


నీకిట్ట.. నాకిట్టా.. రాసుంటే ఇంకెట్టా
తెల్లారిపోయేదెట్టా.. హా.. ఈ ఉడుకు చల్లారిపోయేదెట్టా..
నువ్విట్ట.. నేనిట్ట... కూకుంటే.. ఇంకెట్టా




********************* **********************
చిత్రం :  సీతామాలక్ష్మి (1978)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం..
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే.. శ్రీలచ్చిమవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..

సీతాలు సింగారం..ఊమ్మ్... 


చరణం 1 :


కూసంత నవ్విందంటే పున్నమి కావాలా...
ఐతే నవ్వనులే..ఏ..ఏ

కాసంత చూసిందంటే కడలే పొంగాలా...
ఇక చూడనులే ..ఏ.. ఏ

కూసంత నవ్విందంటే పున్నమి కావాలా..
కాసంత చూసిందంటే కడలే పొంగాలా..

ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాలా
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాలా..
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాలా... ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే ..భగవంతుడవతారం
మనసున్న మందారం... 


చరణం 2 :


లలల్లలా..లాలాలాలా..లలలాలా..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను..
ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ

చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను..
ఎగిరొస్తాలే.. ఏ.. ఏ..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి... వెలిగించాలా
నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. ఉండిపోవాలా
నువ్వంటుంటే.. నేవింటుంటే.. వెయ్యేళ్ళూ బ్రతకాలా.. ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..
లలలాల..లలలా..లలలా...




********************* **********************
చిత్రం :  సీతామాలక్ష్మి (1978)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :

మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా...
మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
ఏమో..ఏమనునోగాని ఆమని...ఈవని..

మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ..కోయిల పలికేనా  


చరణం 1 :


తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా... తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా ..సయ్యాటలా.. సయ్యాటలా.. తారాటలా

వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు... బిడియాలు..
పొంకాలు... పోడుములు..
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి.. గడసరి...

మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ...కోయిల పలికేనా


చరణం 2 :


ఒకరి ఒళ్ళు ఉయ్యాలా.. వేరొకరి గుండె జంపాల..
ఉయ్యాలా.. జంపాల.. జంపాల.. ఉయ్యాలా
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా... వేరొకరి గుండె జంపాల

ఒకరి పెదవి పగడాలో.. వేరొకరి కనుల దివిటీలో..
ఒకరి పెదవి పగడాలో.. వేరొకరి కనుల దివిటీలో..

పలకరింతలో... పులకరింతలో...
పలకరింతలో... పులకరింతలో..
ఏమో ఏమగునో గాని ఈ కత.. మన కత..


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
ఏమో..ఏమనునోగాని ఆమని...ఈవని...

మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ...కోయిల పలికేనా...




********************* **********************
చిత్రం  :  సీతామాలక్ష్మి (1978)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  సుశీల

పల్లవి :

పదే పదే పాడుతున్నా... పాడిన పాటే
పదే పదే పాడుతున్నా... పాడిన పాటే
అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే

పదే పదే పాడుతున్నా... పాడిన పాటే
అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే
పదే పదే పాడుతున్నా... పాడిన పాటే  


చరణం 1 :
ఇది అనగనగ కథ కాదు.. అందమైన జీవితం
కన్నె వయసు చిలకమ్మ.. వెన్న మనసు గోరింక..
కలసి కట్టుకొన్న కలల గూడు.. ఒకనాడు..  

చిలకమ్మా ఎగిరిపొయే గోరింకను విడిచీ...
గోరింకా కన్నీరింకా... వగచే ఇది తలచి
చిలకమ్మా ఎగిరిపొయే గోరింకను విడిచీ...
ఆ.ఆ. గోరింకా కన్నీరింకా... వగచే ఇది తలచి

ఆమనులే వేసవిలైతే ఎవరిని అడగాలి
దీవెనలే శాపాలైతే ఎందుకు బ్రతకాలి
మనసన్నది చేయని పాపం.. మనసివ్వడమే ఒక నేరం
మనిషైనా మాకైనా.. అనుభవమొకటే..ఏ..ఏ...

పదే పదే పాడుతున్నా పాడిన పాటే....
అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే
పదే పదే పాడుతున్నా... పాడిన పాటే 

చరణం 2 :

రామా లీల ప్రేమజ్వాలా రగిలిన బ్రతుకేలే
రాలు పూత బంగరు సీత మిగిలిన వలపేలే...
రామా లీల ప్రేమజ్వాలా రగిలిన బ్రతుకేలే
ఆ..ఆ...రాలు పూత బంగరు సీత మిగిలిన వలపేలే

మనసు పడ్డ మనిషే దేవుడు శిలగా నిలిచాడూ...
చూపులకే ఊపిరి పోసి చీకటి కోలిచాడూ...
ఎడారిలో కోయిల ఉన్నా ఆ దారికి రాదు వసంతం...
మనిషైనా మాకైనా.. అనుభవమొకటే...

పదే పదే పాడుతున్నా పాడిన పాటే....
అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే
పదే పదే పాడుతున్నా... పాడిన పాటే...


********************* **********************


చిత్రం :  సీతామాలక్ష్మి (1978)
సంగీతం  :   కె.వి. మహదేవన్
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  సుశీల, వాణీ జయరాం


పల్లవి :

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే

ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...


చరణం 1 :

ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం..

ఆ సుప్రభాతాలు... ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు ...మమ్మేలుకోడు
ఏ పాట నే పాడను...

చరణం 2 :

తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి

రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ

ఆ... రామలాలికి.. ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ..

ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...


చరణం 3 :

చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట

ఎందుకో ..ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు


గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే
ఎందుకో ..ఎందుకో...నా మీద అలిగాడు చెలికాడు...

కలలు చెదిరినా పాటే... కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను...

జాతర (1980)




చిత్రం :  జాతర (1980)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  ఎస్. పి. శైలజ

పల్లవి:  

మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...ఓ...
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...

చరణం 1: 

పెళ్ళిపీఠపైన ఏ రాజు దాపునా...
చూపుచూపులోనా నూరేళ్ళ దీవన
ఆ సమయమందు నేను...
ఆ సమయమందు నేను... ఈ బిడియమోపలేను... 

గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో.. 

చరణం 2:

వెన్నెళ్లనడుగు.. మరుమల్లెనడుగు..
ఇల్లాలి మనసే కడు చల్లన...
వెన్నెళ్లనడుగు.. మరుమల్లెనడుగు..
ఇల్లాలి మనసే కడు చల్లన...

ఈ గుండెనడును.. నిట్టూర్పునడుగు..
ఈ గుండెనడును.. నిట్టూర్పునడుగు..
తొలిరేయి తలపే నులివెచ్చన...
తొలిరేయి తలపే నులివెచ్చన...

గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో.. 

చరణం 3:

మా ఊరు తలచుకుంటూ నీతోటి సాగనీ
నిన్ను తలచుకుంటూ నా ఊరు చేరనీ
ఈ రాకపోకలందే...
ఈ రాకపోకలందే... నను రేవు చేరుకోనీ...

గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...

********************* ******************
చిత్రం: జాతర (1980) 
సంగీతం: జి.కె. వెంకటేశ్ 
గీతరచయిత: ఆరుద్ర 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

హేయ్....వలపులు పొంగి హుషారు చేస్తే 
ఉలకవా పలకవా ఈ సొంపులే చిలకవా 
ఉబికిన తలపులు భలె భలె హడావిడి
 ఆనందించాలీ... అది నీకే పంచాలీ...

వలపులు పొంగి హుషారు చేస్తే 
ఉలకవా పలకవా నీ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలె హడావిడి 
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ...

చరణం 1: 

ఆశలు మురిపించే ఏల ఏదో ఏడి ఏదేదో ఏడి.. కోరింది జోడి 
వలపు ఉయ్యాలగ మారె మన లోపల.. లోలోపలా 

ఆ..ఆహా..ఆ..ఆ...హ హా..హా.. 
తాపము చెలరేగే వేళ నువ్వే వచ్చి 
మనసే ఇచ్చి.. మది చల్లార్చాలీ 
వలపు ఉయ్యాలగా మారె మన లోపల.. లోలోపలా 

వలపులు పొంగి హుషారు చేస్తే 
ఉలకవా పలకవా.. నీ సొంపులే చిలకవా 
ఉబికిన తలపులు భలె భలె హడావిడి 
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ 

చరణం 2: 

దోచనా నా కోసం నీవు దాచిన సొగసు
నీ చల్లని మనసు.. నులివెచ్చని వయసు 
ఈ గోదారి నా మాట ఔన్నన్నది కరిగిపొమ్మన్నదీ 

ఆ..ఆహా..ఆ...హే..లా.లా..లా.లా..ఆ.. హా..హా.. 

చూసుకో మన ఇద్దరి జంట.. పూపొదరింట
 అహ.. వలపుల పంట.. అని నేనంటా 
ఈ గోదారి నా మాట ఔన్నన్నది.. కరిగిపొమ్మన్నది 

వలపులు పొంగి హుషారు చేస్తే 
ఉలకవా పలకవా.. నీ సొంపులే చిలకవా 
ఉబికిన తలపులు భలె భలె హడావిడి 
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ...
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ...

యుద్ధంశరణంగచ్ఛామి (2017)




చిత్రం : యుద్ధంశరణంగచ్ఛామి (2017)
సంగీతం : వివేక్ సాగర్  
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ    
గానం : ట్రేసీ థార్టన్

అదేదో మాయల్లే 
అలా అలా అల్లిందా 
ఎద ఎదో లోయల్లో 
ఇలా జారింది మెల్లగా 

ఆ ఆ ఆకాశం వాలే 
కళ్ళలోన దాగితే 
చూపుల్లో చూపే 
అలాగే మెరుపు తీగల్లె 

ఆ అందాలే 
అమర్చి చూపిందా 
సూదల్లే గుండె 
గుచ్చి గుచ్చి చంపుతూ

కంగారే దాహంగా మారిందా 
గుటక వేసి చూస్తుంటే 
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
అయ్యో ఊహలతో సద్దుకుందిగా 

అయ్యో అయ్యో చెయ్యి జారుతున్నా 
ప్రాణం తానే అందుకుందా 
ఏదో ఏదో హాయి చేరుతున్నా 
తీరే కొత్తగా తోచిందా 

సైగలో దాగిన భావం తెలియాలంటే 
భాషకే అందని విధంగా మనమే చేరి 
ఈ పెదవిపై తాకేలా 

మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
అయ్యో ఊహలతో సద్దుకుందిగా 
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం 
ఏదో ఊహలతో సద్దుకుందిగా

హిట్లర్ (1996)




చిత్రం : హిట్లర్ (1996)
సంగీతం : కోటి
గీతరచయిత : సిరివెన్నెల 
నేపధ్య గానం : బాలు, చిత్ర

కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే,
కన్నా ఇలా నిన్నే చూడగా ఓ...
అన్నీ నువ్వై భారం మోయగా

ఈ బరువెే నీ చదువై ఎదిగిన పసికూన
ఓ...

కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే,
కన్నా ఇలా నిన్నే చూడగా ఓ...
అన్నీ నువ్వై భారం మోయగా

అమ్మలోని లాలన, నాన్నలోని పాలన,
అంది పుచ్చుకున్న ఈ అన్న నీడలో
కొమ్మ చాటు పూవ్వులై, కంచె చాటు పైరులై,
చిన్ని పాపలందరు ఎదుగు వేళలో
ముసిరే నిశిలో నడిచే దిశలో
నెత్తురుతో నిలిపావే ఆరని దీపాన్ని
ఓ...
కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే,
కన్నా ఇలా నిన్నే చూడగా
అన్నీ నువ్వై భారం మోయగా

దారిచూపు సూర్యుడా, జోలపాడు చంద్రుడా,
నీవు కంటనీరు పెడితే నిలవలేమురా
నీరు కాదే అమ్మలు, తీరుతున్న ఆశలు,
ఇన్నినాళ్ళ భారమంతా కడుగుతున్నవే

ఒడిలో ఒదిగే రుణమై ఎదిగే
మరుజన్మానికి నిను కని పెంచే అమ్మౌతామయ్యా

మీ నవ్వే వెన్నల వెలుగమ్మా
నా ఎదలో కాంతుల కొలువమ్మా

ఏ దైవమో దీవించాడు, మా అన్నగా దిగి వచ్చాడు
ఏ జన్మలో రుణమో తీర్చగా ఓ...
మా కోసమే ప్రాణం పంచగా
ఏ పుణ్యం మా కోసం ఈ వరమిచ్చిందో

మీ నవ్వే వెన్నల వెలుగమ్మా
నా ఎదలో కాంతుల కోలువమ్మా

****************** **********************
చిత్రం : హిట్లర్ (1996)
సంగీతం : కోటి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :

నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ... అంటనీరా నా మేస్త్రి
నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ... అంటనీరా నా మేస్త్రి

అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి

మొగుడు మొగుడని అంటే స్త్రీ...  మొదలు పెడితే.. వన్ టూ త్రీ
ఒంపు సొంపుల యంగోత్రి... కాలు జారకే ఖంగోత్రి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి

చరణం 1 :

అందమైన మాట అడ్డు...  శోకులమ్మ సొంత బొడ్డు..
జివ్వుమన్న రవ్వ లడ్డు...  

ఆభ్ఛ్ లు లేని Z... ఏపుగున్న బుగ్గ రెడ్డు...
లేతగున్న నీటి బొట్టు

అలక కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు... నిప్పు రాజుకుంటుంటే
పలక బలపం లవ్వులవ్వులవ్వుమంటు... ప్రేమ దిద్దుకుంటుంటే
అలక కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు... నిప్పు రాజుకుంటుంటే
పలక బలపం లవ్వులవ్వులవ్వుమంటు... ప్రేమ దిద్దుకుంటుంటే

తనువే పలికే కసి కవ్వాళి... నరమే వొణికే ఎద మనాలి
తెరలే తెరిచి పద తెనాలి... పదవే పొదకి పసి మరాళి

అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి

నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే ఖంగోత్రి


చరణం 2 :

రాజమండ్రి రేవు కాడ.. రంగసాని మేడ కాడ.. రాతిరేల రంభదంట
నాయుడోరి ఇంటికాడ నల్లతుమ్మ సెట్టు నీడ ఎన్నెలంత ఎంకిదంట

అడిగేదడుగు అల్లిబిల్లి కన్నె తీగ పూలు పిందేలేస్తుంటే
వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చ బెట్టి.. వెన్నుపూస దాస్తుంటే
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నె తీగ పూలు పిందేలేస్తుంటే
వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చ బెట్టి.. వెన్నుపూస దాస్తుంటే

జగడం రగడం జత జవాని... పరువం పలికే ప్రియభవాని
తొలిగా పడితే చెలి నిషానీ... జరిగే జతులే యమ కహానీ 

అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి
అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి

నడక కలిసిన నవరాత్రి... సిగ్గు పడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే ఖంగోత్రి

అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి.. అబిబ్బి
ఏయ్... అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి.. అబ్బిబ్బి

హేమా హేమీలు (1979)

 


చిత్రం  :  హేమా హేమీలు (1979)
సంగీతం  :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల   

పల్లవి :

ఏ ఊరు?... నీదే ఊరు?
ఏ ఊరు..ఏ వాడ అందగాడా
మా ఊరు వచ్చావు సందకాడ

ఆకాశంలో ఉన్న చందమామని
నీ కోసం దిగివచ్చిన మేనమామని
ఆకాశంలో ఉన్న చందమామనీ
నీ కోసం దిగివచ్చిన మేనమామనీ
వరస కలుపుకొందామా.. సరసమాడుకొందామా
ఏ ఊరు..నీదే ఊరు
ఏ ఊరు..ఏ వాడ అందగాడా
మా ఊరు వచ్చావు సందకాడ

లు లు లూ..లు లు లూ..
హా..హే..లు లు లూ..
హా..హా..లు లు లు.. 

చరణం 1 :

నీలిమబ్బు కోక చుడతా.. తోక చుక్క రైక పెడతా
నీలిమబ్బు కోక చుడతా.. తోక చుక్క రైక పెడతా
నాపేన చంద్రహారం నీకు చేయిస్తా
ఏమిస్తావూ? ఊ..ఊహూఊ..నన్నేం చేస్తావు?


మీ ఊళ్ళో చుక్కలు దులిపి... మా ఊళ్ళో గుక్కలు తడిపి
మీ ఊల్లో చుక్కలు దులిపి... మా ఊల్లో గుక్కలు తడిపి
ప్రేమిస్తే.. పెగ్గుకటి ఇస్తా..  ముద్దొస్తే.... ముద్దర వేస్తా..

పడుచందం పందిరివేస్తా..పందిట్లో విందులు చేస్తా..
పడుచందం పందిరివేస్తా..పందిట్లో విందులు చేస్తా..

ఏ..ఊరు..నీదే ఊరు..
ఏ ఊరు..ఏ వాడ..అందగాడా
మా ఊరు వచ్చావు సందెకాడ

లు లు లూ.. లులుల్లూ లు లు లూ
లు లు లూ..లులుల్లూ లు లు లూ
హా..హే..ఆ..హే..లు లు లూ... 


చరణం 2 :

మల్లెలతో అల్లరి పెడతా... వెన్నెలతో ఆవిరి పడతా
మల్లెలతో అల్లరి పెడతా... వెన్నెలతో ఆవిరి పడతా
అందాల ఆగ్రహారం నీకు రాసిస్తా..
ఏం చేస్తావో? ఉహు..హూ..హూ.... నన్నేం చేస్తావో?

నింగిలాగ నేలకి వంగి..నీరులాగ మబ్బున దాగి
నింగిలాగ నేలకి వంగి..నీరులాగ మబ్బున దాగి
గెలిపిస్తే... ఉరుమై వస్తా..జడిపిస్తే... పిడుగైపోతా
వరదొస్తే వంతెన వేస్తా.. సరదాగా సంకెల వేస్తా
వరదొస్తే వంతెన వేస్తా.. సరదాగా సంకెల వేస్తా

ఏ..ఊరు..నీదే ఊరు
ఏ ఊరు..ఏ వాడ..అందగాడా
మా ఊరు వచ్చావు సందెకాడ


******** ************ ***************** ***********


చిత్రం : హేమా హేమీలు (1979)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ  

పల్లవి :

నువ్వంటే నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నువ్వంటే నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం

నేనంటే ఎందరికో ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం
నేనంటే ఎందరికో ఇష్టం

Red Lion Red Lion... Reach us to Red Lion 

చరణం 1 :

జూ... జూ... లలలా...ల...
జూ... జూ...

నీ పేరంటే... ఎందరికో... భయం
నీ తోడుంటే... నాకేమో ప్రియం
నీ పేరంటే... ఎందరికో... భయం
నీ తోడుంటే... నాకేమో ప్రియం

నీ మాటే మధురసం... నీ నడకే పాదరసం
నీ మాటే మధురసం..హహ..హా... నీ నడకే పాదరసం

మధురసం కోరుకుంటే... మరేమి పరవాలేదు
పాదరసం తాగావంటే... ప్రాణానికే నష్టం

నేనంటే ఎందరికో ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం

నువ్వంటే నాకెంతో ఇష్టం... Is it?
జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నువ్వంటే నాకెంతో ఇష్టం

Red Lion Red Lion... Reach us to Red Lion 

చరణం 2 :

పా..పప... లలలా...లల...
పా... పప...

నీ సొగసంటే... ఎందరికో.. నిషా.. అది చూస్తుంటే... నాకేమో తమాషా
నీ సొగసంటే... ఎందరికో... నిషా.. అది చూస్తుంటే... నాకేమో తమాషా

నీ పరువం నాగిని... అది నీతోనే ఆగనీ
నీ పరువం నాగిని... అది నీతోనే ఆగనీ
మాటలతో కవ్విస్తే... మనసు ఊరుకోదు
తాపం మరింత పెరిగితే... తట్టుకోవడం కష్టం

నువ్వంటే నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే నీ చూపంటే.. మరీ మరీ ఇష్టం

నేనంటే ఎందరికో ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం
నువ్వంటే నాకెంతో... ఇష్టం... 


******** ************ ***************** ***********


చిత్రం  :  హేమా హేమీలు (1979)
సంగీతం  :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల    

పల్లవి :

నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోపతాపాలకు... ఆ తీపి శాపాలకు
ఈ కోపతాపాలకు ... ఆ తీపి శాపాలకు .. అందించనా నీకు హరిచందనాలు?

నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు 

చరణం 1 :

కోటేరులాంటి ఆ కొస ముక్కు... ప్రొద్దు నిద్దర లేచినట్టు ఆ బొట్టు
మిసమిసలు పసిగట్టి కసిపట్టి బుసకొట్టే... పగడెత్తు పైటున్న ఆ చీరకట్టు

జిగినీల జాకెట్టు... సొగసైన లాకెట్టు
జిగినీల జాకెట్టు.. హో .. సొగసైన లాకెట్టు... 
విడిచి పెడితే బెట్టు... నా మీద ఒట్టు 



నీ కొంటె కవితకి... నీరాజనాలు
ఆ వాడి చూపుకు... అభివందనాలు
ఈ ఆపసోపాలకు... ఆ విరహ తాపాలకు...
ఈ ఆపసోపాలకు... ఆ విరహ తాపాలకు .. అందించనా నేను సుస్వాగతాలు? 

నీ కొంటె కవితకి... నీరాజనాలు
ఆ వాడి చూపుకు... అభివందనాలు 

చరణం 2 :

నీ వలపే ...ఉసి గొలుపు... నా చెలిమే చేయి కలుపు
పొలిమేరలో పిలుపు... పులకింతలే రేపు...

జడలోని మల్లికలు...జవరాలి అల్లికలు
చలి పెంచే కోరికలు... జాబిలితో కలయికలు

ఈ ఆరుబయటా ... అందాల అల్లరులు
ఈ పూట నాలో పలికించే... కిన్నెరలు
కలిసిపోనా ఏరు నీరై... నేనింక నీవై .. నీవింక నేనై...

నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు

సీతారాములు (1980)





చిత్రం :  సీతారాములు (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :

హేయ్ బుంగమూతి బుల్లెమ్మా.. దొంగ చూపు చూసింది
ఆహా.. బుంగమూతి బుల్లెమ్మా.. దొంగ చూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటురాయి.. అబ్బా..
చురుక్కు చురుక్కు మంటొంది.. పగలు ..రేయి
చురుక్కు చురుక్కు మంటొంది.. పగలు.. రేయి

కోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ ఏశాడు
కోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ ఏశాడు
కోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ ఏశాడు
ఆ చేతిలో ఏముందో ఆకురాయి..
అబ్బా చురుక్కు చురుక్కు మంటోంది.. పగలు.. రేయీ..
చురుక్కు చురుక్కు మంటోంది.. పగలు.. రేయీ..


చరణం 1 :

మరుమల్లె తీగలాగ..నిలువెల్లా చుట్టేస్తుంది
అణువణువు నాలో నిండీ..మనసంతా పండిస్తుందీ
మనసులో ఏముందో అంత గారం..నన్ను..
కొరుక్కు..కొరుక్కు తింటోంది..ఆ సింగారం..ఓ..
కొరుక్కు..కొరుక్కు తింటోంది..ఆ సింగారం

వద్దన్న ఊరుకోడు..కలలోకి వచ్చేస్తాడు
మొగ్గలంటి బుగ్గలమీద..ముగ్గులేసి పోతుంటాడు
ముచ్చటలో ఏముందో చెప్పలేను..అబ్భా..
ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేనూ..

అహా..బుంగమూతి బుల్లెమ్మా..దొంగచూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటూరాయి..
అబ్భా.. చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ..అహా
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ


చరణం 2 :


చుక్కల్లో చక్కదనం..వెన్నెల్లో చల్లదనం
అడుగడుగున అందిస్తుందీ..చిరునవ్వులు చిలికిస్తుందీ
నవ్వుల్లో ఏముందో ఇంద్రధనుస్సు..అబ్భా
ఖలుక్కు ఖలుక్కు మంటోంది నాలో వయసూ

ఉడికించే రాతిరిలో..ఊరించే సందడిలో
బాసలనే పానుపు చేసి..ఆశలనే కానుకచేసి
స్వర్గాలు చూడాలి ఆ మనసులో..నేను..
ఇరుక్కు ఇరుక్కు పోవాలి ఆ గుండెలో

కోడెకారు చిన్నోడు..చేతిలో చెయ్ ఏసాడు..
ఆ చేతిలో ఏముందో..ఆకురాయి..అబ్బా..అబ్బా
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ


******************* ********************************
చిత్రం :  సీతారాములు (1980)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు,  సుశీల   

సాకీ :

వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
నిరుపమ శుభగుణలోల నిరతజయాప్రదశీల
వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జనని.. జయ జయ జయ...


పల్లవి :


పలికినది... పిలిచినది ...
పరవశమై నవమోహనరాగం

పలికినది... పిలిచినది ...
పరవశమై నవమోహన రాగం
పలికినది ....పిలిచినది.. 

చరణం 1 :

గగనాంగనాలింగనోత్సాహియై... 
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
గగనాంగనాలింగనోత్సాహియై ...
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై..
మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...
మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...
మనసులు వీసిన ప్రేమ గంధమై ....
పలికినది... పిలిచినది.. 
పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది.. 

చరణం 2  :


గంగా తరంగాల సంగీతమై... కమణీయ రమణీయ యువగీతమై
గంగా తరంగాల సంగీతమై... కమణీయ రమణీయ యువగీతమై

కలిమికి లేమికి తొలి వివాహమై...కలిమికి లేమికి తొలి వివాహమై..
యువతకు నవతకు రసప్రవాహమై...
పలికినది పిలిచినది... పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది.. 


చరణం 3 :

మలయాద్రి పవనాల అలాపనై ...మధుమాస యామిని ఉద్ధీపనై ...
మలయాద్రి పవనాల అలాపనై ...మధుమాస యామిని ఉద్ధీపనై...
అనురాగానికి ఆది తాళమై..అనురాగానికి ఆది తాళమై ...ఆనందానికి అమర నాదమై...
పలికినది పిలిచినది... పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..


******************* ********************************
తొలి సంధ్య వేళలో (female)
చిత్రం :  సీతారాములు (1980)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  సుశీల  


పల్లవి :


తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం....

తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం.... 

చరణం 1 :

జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం.. ఆ.. ఆ... ఆ..
జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం

గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం.. దొరికే ఒక హృదయం..
ఆ హృదయం సంధ్యారాగం.. మేలుకొలిపే అనురాగం.. 


తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం.... 


చరణం 2 :


సాగరమే పొంగుల నిలయం.. 
దానికి ఆలయం సంధ్యా సమయం



వచ్చే ప్రతికెరటం..చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం.. అది అంటదు ఆకాశం..
ఆ ఆకాశంలో ఒక మేఘం.. మేలుకొలిపే అనురాగం
 
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం.... 


******************* ********************************
చిత్రం :  సీతారాములు (1980)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  బాలు 


పల్లవి :


తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో...  వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం.... 


తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో...  వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం.... 


చరణం 1 :



జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం.. ఆ.. ఆ... ఆ..
జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం


గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం

వెదికే ప్రతి ఉదయం.. దొరికే ఒక హృదయం..
ఆ హృదయం సంధ్యారాగం.. మేలుకొలిపే అనురాగం.. 


తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం.... 


చరణం 2 :


సాగరమే పొంగుల నిలయం.. దానికి ఆలయం సంధ్యా సమయం
సాగరమే పొంగుల నిలయం.. దానికి ఆలయం సంధ్యా సమయం

వచ్చే ప్రతికెరటం.. చేరదు అది తీరం
వచ్చే ప్రతికెరటం.. చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం.. అది అంటదు ఆకాశం..
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం 


తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం.... 



******************* ********************************

చిత్రం :  సీతారాములు (1980)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  బాలు, జయప్రద 


పల్లవి :


ఊఁ... ఉహు...హు... హుహు...

ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది..
ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది..

ఇల్లు ఊడ్చాలి.. కళ్ళాపు చల్లాలి.. 
నీళ్ళు తోడాలి.. ఆపై కాఫీ కాయాలీ..ఈ..
ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది.. 


చరణం 1 :

హబ్బ.. ప్లీజ్.. ఒక్క గంటండీ..

గంటా గంటని అంటూ ఉంటే లోనుంచీ ఆకలి మంటా..
మంటా మంటని గిజ గిజమంటే అమ్మానాన్నతో తంటా..
మంటను మరి చేసి తలుపులు మూసేసీ..
దుప్పటి ముసుగేసి సరిగమ పాడేసి..
ఆఫీసుకి నామం పెడితే ఆడబాసుతో తంటా..

హూఁ  'Who is that రాక్షసి'
ఉన్నది ఒక శూర్పణఖా.. లేటైతే నొక్కును నా పీకా..
ఆపై ఇచ్చును ఒక లేఖా.. ఆ లేఖతో ఇంటికి రాలేకా..
నలిగి నలిగి.. కుమిలి కుమిలి.. చచ్చి చచ్చి.. బ్రతికి బ్రతికి..
అయ్యబాబోయ్..
అందుకే..

ఏమండోయ్ శ్రీమతిగారూ.. లేవండోయ్ పొద్దెక్కింది.. హబ్బా.. 

చరణం 2 :


కాఫీ.. కాఫీ..
కాఫీ కాఫీ అంటూ ఉంటే ఉలకరు పలకరు ఏంటంటా...
వంటా వార్పు చేసేది ఇంటికి పెళ్ళామేనంటా...
అఫ్కోర్స్ నాకు రాదే.. ఒక్కసారి చేసి చూపించండీ...

మ్మ్.. పాలను మరిగించీ.. గ్లాసులో పోసేసి
పౌడరు కలిపేసీ.. స్పూనుతో తిప్పేసి
వేడిగ నోటికి అందిస్తే..

నాన్సెన్స్.. చక్కెర లేదు..
హబ్బా.. అరవకు అరవకు ఓ తల్లీ..
అరిస్తె ఇల్లే బెంబెల్లీ.. ఇరుగూపొరుగూ బయల్దేరి
నిన్నూ నన్నూ చూసెళ్ళి...
ఇంటా బయటా.. ఊరూ వాడా.. గుస గుసలాడేస్తే
నిజంగా..
నీతోడు అందుకే..

ఏవండోయ్ శ్రీమతిగారు.. ఆగండోయ్ చల్లారండీ..

సాహస వీరుడు సాగర కన్య (1996)




చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: మనో, చిత్ర


మల్లెపూల తోరణాలు కట్టవే రావమ్మా
బంతిపూల బాసికాలు కట్టవే కావమ్మా
మురిపాల ముగ్గులెట్టి సిరి చుక్క బుగ్గనెట్టి
మనువాడేటి సమయన జతలో కసి కథలే రసికతలై

పల్లవి:
హబ్బా పెట్టమంది పెట్టమంది పిల్లా శ్రావణమాసంలో పెళ్ళికి లగ్గం
మల్లెల మంచంలో మన్మధ లంచం

హబ్బా కొట్టమంది కొట్టమంది పిల్లా బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం
జారిన సిగ్గుల్లో జాజుల తాళం

ఓయ్ చుర్రుమనే చూపులుతోటి
కస్సుమనే కాటులతోటీ

ఓయ్ చుర్రుమనే చూపులుతో కస్సుమనే కాటులతో
చురక తగిలి శృతి పెరిగితే

తాళి రెడీ కట్టు మరి,డోలు రెడీ కొట్టు మరి

చరణం: 1
సాగరకన్య నీదే సాహసవీరా రార పెళ్ళికుమారా పల్లకి నీదేరా

సాహ్సవీరా, పెళ్ళి కుమారా

చేపల కళ్ళ పిల్ల చక్కెర బిళ్ళా ఇల్లా సొగసుల ఖిల్లా దోచేయ్నా

చక్కెర బిళ్ళ, సొగసుల ఖిల్లా

అందిస్తా సంద్రమంటి అందాలన్నీ
కౌగిలిగింతల కమ్మని వింతలలో

కన్నులలో కాటుకనై కొప్పులలో మల్లికనై
ఒడిని ఒరిగి ఒదిగిపోతే

చరణం: 2
పల్లవి కట్టీ ఆపై చరణం కట్టీ ఆపై తాళం తట్టి
పదనిస పాడాలి

సా రి గ మ మ పా ద ని సా సా

తబలా పట్టీ తకధిమి దరువులు కొట్టీ ఆపై ముద్దులు పెట్టీ
ముచ్చటలడాలి

తన్నననానా తానననానా

పెళ్ళైతే శోభనాల పేరంటమే
పండును చెండును దిండును పంచడమే
కలలన్నీ తలుపుతీసి అలలన్నీ పరుపులేసి
కడిలి ఒడిని కరిగిపోతె


****** ****** *******


చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి.బాలు, చిత్ర

పల్లవి:
ఘడియ ఘడియకో ముద్దు ఘనమైన ముద్దు అబ్బా అహా
తడవ తడవకో ముద్దూ తడిరేపు ముద్దు అబ్బా ఆహా
తీపి తీపి తేనే ఎంగిళ్ళతో...
తాళలేని లేత అధరాలపై

కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
కిస్స్ కిస్స్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ

కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
ఎనివేర్ కిస్స్ మీ
ఎవ్రీవేర్ కిస్స్ మీ
కిస్స్ కిస్స్ మీ


చరణం: 1
నా చిట్టి బుగ్గమీద పెట్టుకున్న ముద్దు సెగలు రేపితే
నీ పైటచెంగు చాటు పొంచి ఉన్న ముద్దు వయ్యారంగా వాటెయ్మంది
ఓ రాలుగాయి ముద్దు రైకలోన దూరి చనువు కోరితే
నా వయసు రగిలి ముద్దు నాకు వద్దన్నదీ
మగసిరి ముద్దులో ఎంతో సుఖమున్నదీ
సొగసరి ముద్దులై చానాలని అన్నది
ముద్దు ఇంత గొప్పదా
పెదవికి అది తప్పదా

కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
కిస్స్ కిస్స్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ

చరణం: 2
నీ నంగనాచి ముద్దు దొంగలాగ వచ్చి నడుము తడిమితే
నీ కొంటె కొంటె ముద్దు కోకమీద వాలి ఉయ్యాలల్లే ఊపేసింది
ఓ బుల్లి ఒంపులోన చిక్కుకున్న ముద్దు జగడమాడితే
ఆ చిలిపి తగువు పెంచు ముద్దు హాయన్నది
తడిపొడి ముద్దులో ఏదో రుచి ఉన్నది
చెదరని ముద్దులో చాలా కథ ఉన్నది
ముద్దు ఇంత గొప్పదా
మధనుడి గురి తప్పదా


***** ***** *****


చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, యమ్.యమ్.కీరవాణి

మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా
జలాల లాలి పాటలో
జనించు ప్రేమ బాటలో
జలదరింతలో వింతగా జరిగేను సంగమం

మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా

గల గల గల మిల మిల మిల
జల జల జల తళ తళ తళ
కనుల తెరల కలల అలల
కిల కిల కిల కిల కిల కిల లల లల లల లల లలలా

ఓ హలా ఇలా
అలల పల్లకీతో తోరణాలు మణులు కురియదా
తరంగ తంగ వాలుతళుకు తెలిసెలే
ఓ సఖీ చెలీ
వలపు సాగరాల వడ్డుకోరి నీటి నురగనై
స్పృశించ గాలి వీతగాలు వనికెలే
నీటు చీర జారుతున్న నిషిరాత్రిలో
గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో
ఇద్దరం ఈదుతూ ఏ తీరమో చేరితే
మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమనే

మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా

ఓ ప్రియా ప్రియా
ఎదలు ఒక్కసారి పక్కతాళ జతులు కలుపద
నరాలు నాగవల్లి సాగి నడుమున
నా లయా క్రియా
తెలిసి తామరాకు తల్లడిల్లి తాళమేయగా
సరోజమైన సోకు తాకి చూడనా
ప్రేమలోతు అందుకోనిదే తాపము
హంసలాగ పైన తేలు ఈ ఆభము
చాపలా మారితే గాళాన్ని వేసెయ్యనా
నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్ ముద్దుగా

మీనా - ఏమ్మా
మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా

జానకిరాముడు (1988)




చిత్రం : జానకిరాముడు (1988)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల 

పల్లవి  :

అదిరింది మావా అదిరిందిరో
ముదిరింది ప్రేమ ముదిరిందిరో
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు.. ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిరో... వలపు జోరు తేలాలిరో

అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లీ కుదిరిందిలే
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు... ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిలే... వలపు జోరు తేలాలిలే


చరణం 1 :

ఆకులిస్తా పోకలిస్తా... కొరికి చూడు ఒక్కసారి
ఆశలన్ని వరసపెట్టి... తన్నుకొచ్చి గిల్లుతాయి

బుగ్గమీద పంటిగాటు... పడుతుంది ప్రతిసారి
సిగ్గుచీర తొలగిపోయి... నలుగుతుంది తొలిసారి

మాపటేల మేలుకున్న కళ్ల ఎరుపు తెల్లవారి
మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరీ మరీ

ఒకసారి కసిపుడితే... మరుసారి మతిచెడితే
వయసు పోరు తీరాలిరో.... వలపు జోరు తేలాలిలే

అదిరింది పిల్లా అదిరిందిలే
కుదిరింది పెళ్లీ కుదిరిందిలే
ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు... ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిరో... వలపు జోరు తేలాలిరో


చరణం 2 :

పూలపక్క ముళ్లలాగ... మారుతుంది ఎప్పుడంట
పూనుకున్న కౌగిలింత... సడలిపోతే తప్పదంట

మొదటిరేయి పెట్టుబడికి... గిట్టుబాటు ఎప్పుడంట
మూడునాళ్ల ముచ్చటంతా... డస్సిపోతే గిట్టదంట

రేయి రేయి మొదటిరేయి... కావాలంటే ఎట్టాగంట
సూరీడొచ్చి తలపుతడితే... తియ్యకుంటే చాలంట
తొలిరేయి గిలిపుడితే... తుదిరేయి కలబడితే


వయసు పోరు తీరాలిరో... వలపు జోరు తేలాలిలే
అదిరింది పిల్లా అదిరిందిరో
కుదిరింది పెళ్లీ కుదిరిందిరో

ఉడుకు పుట్టి ఇన్నినాళ్లు... ఉగ్గబట్టి ఉండబట్టి
వయసు పోరు తీరాలిలే... వలపు జోరు తేలాలిరో
తాన తాన తానాననా... తాన తాన తానాననా


*************************** *****************************

చిత్రం: జానకిరాముడు (1988)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు.. ఏడేడు జన్మాలు…

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు…

నీ చరణం కమలం

చరణం 1:

మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు
మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు

అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు
అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు
ఎదుటే నిలిచిన చాలు.. ఆరారు కాలాలు…

చరణం 2:

జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు
జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు
అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు
అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు
ఎదురై పిలిచినా చాలు.... నీ మౌన గీతాలు



*************************** *****************************
చిత్రం: జానకిరాముడు (1988) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

హా తానానె తననానా 
ఆ..... 

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా 
పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మ జన్మలా 

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా 
పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మ జన్మలా 

నా గొంతు శృతిలోనా... ఆ...నా గుండె లయలోనా 

చరణం 1: 

ఒక మాట పదిమాటలై అది పాట కావాలనీ 
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ 
అన్నిటా ఒక మమతే పండాలని 
అది దండలో దారమై ఉండాలనీ 
అన్నిటా ఒక మమతే పండాలని 
అది దండలో దారమై ఉండాలనీ 
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ.... 
పాడవే.. పాడవే.. కోయిలా 
పాడుతూ పరవశించు జన్మజన్మలా 

నా గొంతు శృతిలోనా...ఆ.. నా గుండె లయలోనా 

చరణం 2: 

ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ 
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడినీ చేరాలనీ 
కోరికే ఒక జన్మ కావాలనీ 
అది తీరకే మరు జన్మ రావాలనీ 
కోరికే ఒక జన్మ కావాలనీ 
అది తీరకే మరు జన్మ రావాలనీ 
వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా 
ఎగిరిపోవాలనీ... 
పాడవే.. పాడవే.. కోయిలా 
పాడుతూ పరవశించు జన్మజన్మలా 

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా 
పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మజన్మలా 

తానానె తననానా..... 
తానానె తననానా....