అక్కాచెల్లెలు (1970)



చిత్రం : అక్కాచెల్లెలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి : 
ఓ పిల్లా పటపటలాడిస్తా
ఓహో.. ఓ పిల్లా... చకచకలాడిస్తా
ఓ పిల్లా... ఓ పిల్లా... ఓ పిల్లా పిల్లపిల్లపిల్లా
ఓ పిల్లా పటపటలాడిస్తా

ఓహో.. ఓ పిల్లా... చకచకలాడిస్తా
తళుక్కుమని నువు మెరుస్తు వస్తే... దాగుడుమూతలు ఆడిస్తా
తళుక్కుమని నువు మెరుస్తు వస్తే... దాగుడుమూతలు ఆడిస్తా
ఓ పిల్లా.. ఓ పిల్లా.. ఓ పిల్లా పిల్లపిల్లపిల్లా

బుల్లోడా... చమచమలాడిస్తా
అహా... బుల్లోడా చిమచిమ వదిలిస్తా
అహా... బుల్లోడ బుల్లోడ బుల్లిబుల్లి బుల్లోడా..
బుల్లోడా... చమచమలాడిస్తా
అహా... బుల్లోడా చిమచిమ వదిలిస్తా
చేతికందితే కదలనీయక కాలికి నిన్ను కట్టేస్తా
చేతికందితే కదలనీయక కాలికి నిన్ను కట్టేస్తా
అహా..బుల్లోడ బుల్లోడ... బుల్లిబుల్లి బుల్లోడా..
బుల్లోడా... చమచమలాడిస్తా
అహా... బుల్లోడా చిమచిమ వదిలిస్తా

చరణం 1 :

చక్కనైన చుక్కవే... చేతినిండ చిక్కావే
చక్కనైన చుక్కవే... చేతినిండ చిక్కావే
రావాలి పిలవంగానె... రావాలి
నువు రావాలి రావాలి... నా కులాస అప్పుడు చూడాలి
ఓ పిల్లా ఓ పిల్లా... ఓ పిల్లా పిల్లపిల్లపిల్లా..ఆ
ఓ పిల్లా పటపటలాడిస్తా
అహా..బుల్లోడా చిమచిమ వదిలిస్తా

చరణం 2 :

వలచిందాక వెంట పడుదురు... వలపు తీరితే పలకరు
పలుకరు పలుకరు పలుకరు పలుకరు... పిలిచినా పలుకరు
వలచిందాక వెంటపడుదురు... వలపు తీరితే పలకరు
అబ్బాయ్లంతా అంతేలే... అబ్బాయ్లంతా అంతేలే... అయ్య చూస్తే పెళ్ళౌతుందిలే
బుల్లోడ బుల్లోడ బుల్లిబుల్లి బుల్లోడా... అయ్య చూస్తే పెళ్ళౌతుందిలే

ఎవడా దుష్టుడు చెప్పవే... వాడికి తన్నులు తప్పవే
ఎవడా దుష్టుడు చెప్పవే... వాడికి తన్నులు తప్పవే
ఇప్పుడు ఎదురుగా ఉన్నాడనుకో... ఏమిటీ ఈ కథా అన్నాడనుకో..యాయ్
ఇప్పుడు ఎదురుగా ఉన్నాడనుకో... ఏమిటీ ఈ కథా అన్నాడనుకో

హా... మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా... ప్రాణం తీస్తుందయ్యా
మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా... ప్రాణం తీస్తుందయ్యా
మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా... మావయ్యా నీ అల్లుణయ్యా
కళ్ళుపట్టుకొంటానయ్యో..ఓ... ఓ..ఫటాఫట్ 


*********** ********** ************ ***********
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల 

పల్లవి : 
సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా
సరదాలు తీర్చుకొందాం నాతో వస్తావా
నాతో వస్తావా... వస్తావా... వా వా వా వా
సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా
సరదాలు తీర్చుకొందాం నాతో వస్తావా
నాతో వస్తావా... వస్తావా... వా వా వా వా

చరణం 1 :

నీ ఇంట్లో తీరని కోరిక... మా ఇంట్లో తీరుస్తా
ఇన్నాళ్ళు చేయని సరసం... ఈనాడే చేయిస్తా
నీ ఇంట్లో తీరని కోరిక... మా ఇంట్లో తీరుస్తా
ఇన్నాళ్ళు చేయని సరసం... ఈనాడే చేయిస్తా
మొగమాటం లేని ముచ్చట... మగవాడా దొరుకునిచ్చట
మొగమాటం లేని ముచ్చట... మగవాడా దొరుకునిచ్చట
విచ్చలవిడి శృంగారం లో... నునువెచ్చని హాయి ఇచ్చట..హాయ్
నాతో వస్తావా... వస్తావా... వా వా వా వా
సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా
సరదాలు తీర్చుకొందాం నాతో వస్తావా
నాతో వస్తావా... వస్తావా... వా వా వా వా 

చరణం 2 : 

చేతకాని వాళ్ళే ఏన్నో నీతులు చెప్తారు
చేతనైన వాళ్ళే నా చెలిమిని చేస్తారు
చేతకాని వాళ్ళే ఏన్నో నీతులు చెప్తారు
చేతనైన వాళ్ళే నా చెలిమిని చేస్తారు
పడుచుతనం పోతే రాదు పరవశిస్తే నేరం కాదు
పడుచుతనం పోతే రాదు పరవశిస్తే నేరం కాద్
కదలక సై అన్నావంటే..ఏ.. ఏ..స్వర్గమెంతో దూరంలేదు..హా..ఆయ్
నాతో వస్తావా... వస్తావా... వా వా వా వా

చరణం 3 :

ఒడిలోన చక్కని చుక్క... ఒళ్ళుమరచి రావాలి
కడుపులోన వేసిన చుక్క... కైపెంతో ఇవ్వాలి
ఒడిలోన చక్కని చుక్క... ఒళ్ళుమరచి రావాలి
కడుపులోన వేసిన చుక్క... కైపెంతో ఇవ్వాలి
కరిగిపోని తిమ్మరలోనా... కన్నెపిల్ల కౌగిలిలోన
కరిగిపోని తిమ్మరలోనా... కన్నెపిల్ల కౌగిలిలోన
కళ్ళుమూసి లోకం మరవాలీ..ఈ..కలకాలం కరగాలీ..హా..ఆయ్
నాతో వస్తావా... వస్తావా... వా వా వా వా
సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా
సరదాలు తీర్చుకొందాం నాతో వస్తావా
నాతో వస్తావా... వస్తావా... వా వా వా వా 


*********** ********** ************ ***********

చిత్రం : అక్కాచెల్లెలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల

పల్లవి : 
చకచకలాడే పడుచుంది... రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా మాటుందీ..
చకచకలాడే పడుచుంది... రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా మాటుందీ.. 

చరణం 1 :

విచ్చీ విచ్చని పూవుంది... వచ్చీరాని వయసుంది
విచ్చీ విచ్చని పూవుంది... వచ్చీరాని వయసుంది
ముసిముసి నవ్వులా మోహముందీ...
ముసిముసి నవ్వులా మోహముందీ
మోజులు తీరే వేళుందీ... చాటుకిరా మాటుందీ
చకచకలాడే పడుచుంది... రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా... మాటుందీ..

చరణం 2 : 

సోగలు తీరిన సొగసుందీ... సొగసుకు తగినా సోకుందీ
హాయ్..సోగలు తీరిన సొగసుందీ...సొగసుకు తగినా సోకుందీ
పచ్చదనాల చనువుందీ... పక్కకు వస్తే ఫలముందీ
చాటుకిరా... మాటుందీ
చకచకలాడే పడుచుంది... రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా... మాటుందీ..

చరణం 3 :

రేయీ ఇంకా సగముందీ... హాయి నీకై నిలుచుంది
రేయీ ఇంకా సగముందీ... హాయి నీకై నిలుచుంది
తీయని మోహం నీలో ఉంటే...
తీయని మోహం నీలో ఉంటే... తీరని దాహం నాలో ఉందీ
చాటుకిరా... మాటుందీ
హోయ్..చకచకలాడే పడుచుంది..రెపరెపలాడే పొగరుంది..
చాటుకిరా... మాటుందీ..

*********** ********** ************ ***********

చిత్రం : అక్కాచెల్లెలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల 


సాకీ : 
న్యాయానికి బంధిగా... న్యాయమూర్తి వెళుతున్నాడమ్మా... ఆ
నీ మాంగళ్యాన్ని... ఈ మానవన్యాయం సవాలు చేసిందమ్మా
పల్లవి : 

ఇది మతికి మనసుకు పోరాటం తల్లి..
మనిషితో దేవుని చెలగాటం..చెల్లి
ఇది మతికి మనసుకు పోరాటం తల్లి..
మనిషితో దేవుని చెలగాటం..చెల్లి
అటు నమ్మిన సత్యం... ఇటు పెంచిన రక్తం
అడకత్తెరలో పడిపోయినది... ధర్మం
అటు నమ్మిన సత్యం... ఇటు పెంచిన రక్తం
అడకత్తెరలో పడిపోయినది... ధర్మం
ఇది మతికి మనసుకు పోరాటం తల్లి..
మనిషితో దేవుని చెలగాటం... చెల్లి


చరణం 1 :

నీవు నేర్పిన నీతి నియమం... నీకే ఎదురై నిలిచిందా
నీవు నేర్పిన నీతి నియమం... నీకే ఎదురై నిలిచిందా
నీ పసుపు కుంకుమలనే బలి కోరిందా..ఆ
నీ పసుపు కుంకుమలనే బలి కోరిందా..
ఇది నీతికి నెలవూ... లేదది నీతికి తావూ..ఊ
కంచే చేనును మేస్తుందా... కన్నతల్లి కడుపునే కోస్తుందా
ఇది మతికి మనసుకు పోరాటం తల్లి..
మనిషితో దేవుని చెలగాటం... చెల్లి
మనిషితో దేవుని చెలగాటం... చెల్లి




*********** ********** ************ ***********
చిత్రం: అక్కాచెల్లెలు (1970)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల




పల్లవి:

శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

చరణం 1:

చెట్టా పట్టగ కాలంగీలం.. నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ.. చుట్టుకు నేపోనా
చెట్టా పట్టగ కాలంగీలం.. నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ... చుట్టుకు నేపోనా
గిలిలేని కౌగిలిలోన.. చలికి చెలికి చెర వేయనా
కలలూరే కన్నుల్లోన.. తొలి చూపుతో బందీ చేయనా
శ్రీవారేమనుకున్నా... శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన

చరణం 2:

పొద్దే తెలియని ముద్దూముచ్చట.. నీలో వింటున్నా
హాద్దే చూడని ఆవేశాలు... నీలో కంటున్నా
పొద్దే తెలియని ముద్దూముచ్చట.. నీలో వింటున్నా
హాద్దే చూడని ఆవేశాలు... నీలో కంటున్నా
వేగం ఉన్నది నాలోనా...బిగువులు ఉన్నవి నీలోనా
ఒదిగి ఒదిగి నీ ఎదలోనా... నేనోడి పోదు నీ ఒడిలోన
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

చరణం 3:

పొంగే పొంగుకు కట్టలు వేసి.. నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే.. నేను ఊర్కున్నా
పొంగే పొంగుకు కట్టలు వేసి.. నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే.. నేను ఊర్కున్నా
మనసు కుదురుగా ఉంటున్నా... సొగసూరించెను పంతానా
పంతాలెందుకు మనలోనా... నీ సొంతం కానని అన్నానా
శ్రీవారేమనుకున్నా... శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన... శ్రీవారు తందాన తాన

ఊహూహు హుహుహుహు....

*********** ********** ************ ***********

చిత్రం: అక్కాచెల్లెలు (1970) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: సుశీల 




పల్లవి: 
పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 

చరణం 1: 

కన్నెగానె బతుకు గడిచిపోతుంది 
నన్నెవరేలుకుంటారు అనుకున్నది 
కన్నెగానె బతుకు గడిచిపోతుంది 
నన్నెవరేలుకుంటారు అనుకున్నది 
జానకి అనుకున్నది 

అయ్యో... జానకి అనుకున్నదీ 
అయ్యో... జానకి అనుకున్నదీ 
శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నదీ 
ఒళ్లంతా ఝల్లన్నదీ ఓయమ్మా.. ఒళ్ళంతా ఝల్లన్నదీ 
ఆ.. హొహోయ్.. పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా ... 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 

చరణం 2: 

నవ మన్మధుని వంటి నాధుని కనులారా ఒక్కసారి చూడగ ఉబలాటపడ్డది.. 
నవ మన్మధుని వంటి నాధుని కనులారా ఒక్కసారి చూడగ ఉబలాటపడ్డది.. 
తుమ్మెదా ఉబలాటపడ్డది... 
ఓ.. హొయ్.. తుమ్మెదా ఉబలాటపడ్డది... 
పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది 
కళ్లలో.. కాని సిగ్గు కమ్మేసింది 
ఓయమ్మా బుగ్గలకుపాకింది... 
అయ్.. ఒహోయ్.. పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా ...
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 

చరణం 3: 

నీ గుండెలోనె నేనుండిపోవాలి 
నీ అండనే నేను పండిపోవాలి 
నీ గుండెలోనె నేనుండిపోవాలి 
నీ అండనే నేను పండిపోవాలి 
నా నోముపంట పండాలి...
నా నోముపంట పండాలి 

రాముడే రాముడు.. జానకే జానకని 
ముందు వెనకందరూ.. మురిసిపోవాలని
జానకి మొక్కుతూ మొక్కుకుంది... 
పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 

హే.. పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా



*********** ********** ************ ***********
చిత్రం: అక్కాచెల్లెలు (1970)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల



పల్లవి:

చిటాపటా చినుకులతో.. కురిసింది వాన.. మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో.. కురిసింది వాన.. మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో...
తళాతళా మెరుపులతో.. మెరిసింది పైన.. ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో.. మెరిసింది పైన.. ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో...

చరణం 1:

వచ్చే వచ్చే వానజల్లు... వచ్చే వచ్చే వానజల్లు
జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది
జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది
వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే..
అది నీ వేగమే ఇది...
కురిసింది వాన.. మెరిసింది జాణ...
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో...

చరణం 2:

నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి
నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి
ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది
ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది
తళాతళా మెరుపులతో.. మెరిసింది పైన.. ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో..

చరణం 3:

మెరిసె మెరిసె రెండు కళ్లు
మెరిసె మెరిసె రెండు కళ్లు
కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి
కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి
వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్లులే అవి
సెలయేళ్లులే ఇవి..
మెరిసింది పైన.. ఉరిమింది లోన....
తళాతళా మెరుపులతో.. మెరిసింది పైన.. ఉరిమింది లోన
చిటాపటా చినుకులతో.. కురిసింది వాన.. మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో...

No comments:

Post a Comment