తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల
ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల
చిరునవ్వు చేరే హొయ్యా
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరీ కన్న కలవో
విశ్వమంతా ప్రేమ పండించగా
పుట్టుకైన ఋషివో
సాటివారికై నీవంతుగా
ఉద్యమించు కృషివో
మా అందరిలో ఒకడైన మనిషివో
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరీ కన్న కలవో
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల
ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల
చిరునవ్వు చేరే హొయ్యా
గుండె లోతులో గాయం
నువ్వు తాకితే మాయం
మండువేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం
పొలమారే ఆశల కోసం
పొలిమేరలు దాటొచ్చావు
తలరాతలు వెలుగయ్యేలా
నేనున్నానన్నావు
అడగందే అక్కర తీర్చే
నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరీ కన్న కలవో
దేవుడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో
గొప్ప మనసు తనై
ఉంటాడు నీకు లాగా
ఏ లోక కల్యాణాన్ని
ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు
నిండారా పండింది
నీలాంటి కొడుకుని మోసే
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జయహో అన్నది
సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరీ కన్న కలవో
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల
ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల
చిరునవ్వు చేరే హొయ్యా
చిత్రం : సరిలేరు నీకెవ్వరూ (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : బి.ప్రాక్
*********** **********************
చిత్రం : సరిలేరు నీకెవ్వరూ (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం :
గానం :
ఎప్పుడూ ప్యాంటేసే వాడు.... ఇప్పుడు లుంగీ కట్టాడు... ఆ..
ఎప్పుడూ షర్టేసే వాడు... ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. హా..
చేతికేమో మల్లెపూలు- కంటికేమో కళ్లజోడు
చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడు...
ఫర్ ది ఫస్ట్ టైం.. హీజ్ ఇన్ ద మాస్ క్రైమ్
బాబూ నువ్ సెప్పు.. ఏంటీ
ఆన్ని కొట్టమని డప్పు.. హూమ్ నువ్ కొట్టరా
మూన్‌వాకు.. మూన్‌వాకు.. పిల్ల నీ నడక చూస్తే మూన్‌వాకు..
అర్త్‌క్వేకు.. అర్త్‌క్వేకు.. పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్‌క్వేకు..
నీ లిప్పులోనా ఉంది కప్పు కేకు... కేకు...
మాటలోనా ఉంది మిల్క్‌షేకు.. షేకు...
సోకులోనా ఉంది కొత్తస్టాకు.. స్టాకు... ‘అమ్మా అమ్మా హబ్బ హబ్బా’
నువ్ హాట్ హాట్‌గున్న పూత రేకు.. రేకు..
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు..
మనసునెర్రజేసే తమలపాకు... పాకు..'అమ్మా అమ్మా హబ్బ హబ్బా'
మైండ్‌బ్లాకు.. మైండ్‌బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ... హుమ్ నువ్ ఊదరా...
నువ్ ఉండరా..
నువ్వు చీరకట్టుకుంటే.. జారుతుందే గుండే..
ఓరకంట చూపే.. భగ్గుమంటు మండే...
అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందో..
నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే..
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే..
అట్టానువ్ చూస్తుంటే.. నా వొళ్లంతా గిలిగింత పుడతాందే..
నీ కళ్లలోన ఉంది.. కళ్లు ముంత.. ముంత
నీ ఒంపుల్లోన ఉంది పాలపుంత.. పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా.. 'అమ్మా అమ్మా హబ్బ హబ్బా'
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
బాబూ తూ బోలే... క్యారే..
ఆన్నీ దంచమనీ ఢోలూ... హుమ్ నువ్ దంచెహే..
హా.. బాబూ ఇటు సూడూ.. ఏంటీ
ఆన్నీ పెంచమనూ స్పీడూ... హుమ్ నువ్ పెంచరా..
నీ ముద్దు ముట్టకుండా.. ముద్ద ఎక్కదంటా..
హగ్గు అంటకుండా... నిద్దరట్టదంటా..
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది.. తీరుస్తా..
నీ టచ్‌లో కరెంటే నన్ను గుచ్చెనంటా...
మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా...
అయితే నిన్ను టచ్ చేస్తా... నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా...
నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా.. లావా
నీ నడుములోన ఉంది పూల నావా.. నావా.....'అమ్మా అమ్మా హబ్బ హబ్బా'
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
*************************************
చిత్రం : సరిలేరు నీకెవ్వరూ (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం :
గానం :
భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా..
జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు..
పెలపెలమంటూ మంచు తుపాను వచ్చినా..
వెనుకడుగేలేదంటూ దాటేవాడే సైనికుడు
దడ దడ దడ దడమంటూ... తూటాలే దూసుకొచ్చినా...
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు...
మారణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురుపంపేవాడు... ఒకడే ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్ళే రహదారికి జోహారూ..
సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు

No comments:
Post a Comment