ముద్దుల మావయ్య (1989)





మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవ
నా కన్నుల్లో కన్నీళ్లు చిందవ

అమ్మగా లాలించాడు నిన్ను  నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్ని తానైనాడు

తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
మా అమ్మలాంటి అన్న ఈ లోకాన లేడు

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

ఆరు ఏడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్ని పండగ
తేవాలి బంగారు ఊయల .. కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా .. పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా .. నీ పాపకు జోల పాడనా

ఇది అరుదైన ఒక అన్న కధ
ఇది మురిపాల ఒక చెల్లి కధ
ఇది చెల్లెలే కాదులే నను కన్నా తల్లి

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు


చిత్రం: ముద్దుల మావయ్య (1989)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర, యస్.పి.శైలజ

************ ************** **************** *******

పల్లవి :


ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకువేసి మారాలుచేసే గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్..మామ..మామ..మామ..మామ..మామ..మామ
మామ..మామ..మామ..మామ..మామ..మామ

హోయ్... ఆకు చాటున పిందె తడిసెనా భామ
మారాకులోన మారాలు చేసి గారాలు
దోచుకోనా నేరాలు చేసుకోనా
భామ..భామ..భామ..మామ..మామ..మామ



చరణం 1 : 

పందిరి నువ్వై తీగల్లే అల్లుకుపోనీ
అందాలూరె నీ పాటకు పల్లవి కానీ
వేసిందమ్మా జాబిల్లి వెన్నెల ఓణి
నవ్విందమ్మా నడకల్లో కిన్నెరసాని

అండదండ నువ్వే నాకింకా...
కైదండ లేకా ఉండలేను.. రారా నా వంక
కొండమల్లి పువ్వే నువ్వంట
నా గుండెలోన ఉండిపోతే అంతే చాలంట

ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకువేసి మారాలుచేసే గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్.. మామ..మామ..మామ..
హోయ్..భామ..భామ..భామా..  


చరణం 2 : 


తళుకుల పుట్ట వచ్చింది తపనల పుట్ట
కులుకుల పిట్ట నచ్చింది వదిలేదెట్ట

అక్కరకొచ్చె అందాల చక్కని చుక్క
చక్కర ముద్దే ఇచ్చింది చెక్కిలి నొక్క
హోయ్..పట్టరాని పాలపిట్టరో పండంటి ఈడు
ముట్టబోతే ముద్దు పుట్టెరో
పుట్టతేనె పట్టు పెదవిరో ఓ చిట్టి ముద్దు
పెట్టకుంటే ఆగేదెట్టారో

అరె..ఆకు చాటున పిందె తడిసెనా భామ
మారాకులోన మారాలు చేసి గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ..భామ..భామ..మామ..మామ..మామ
హోయ్..భామ..భామ..భామ..





చిత్రం : ముద్దుల మావయ్య (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు,  జానకి 

*************** ************ ************ *******


పల్లవి :

చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
చెంగున దూకే ఒయ్యారంగా...  తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా...  ఈ ముద్దుల దొంగ

చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా...  ఈ ముద్దుల దొంగ 


చరణం 1 : 

అందాలు దాచి పెట్టి ఊరిస్తే పాపం
అందిస్తే తీరుతుంది సందిట్లో తాపం
ఒళ్ళంతా కళ్ళు జేసి వెయ్యోద్దు తాళం
ముళ్ళంటి చూపుతోటి తీయొద్దు ప్రాణం

వయసేమో రెగుతుంది...  చకచకచెమ్మచెక్క
మనసేమో ఆగమంది.. చకచకచమ్మచక్క 

ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు
పందిట్లో మొగనీవోయ్ పెళ్ళి బాజాలు
ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు
పందిట్లో మొగనీవోయ్ పెళ్ళి బాజాలు
ఈ పొద్దే మన ముద్దు ఇక హద్దు పొద్దు వద్దే వద్దు

చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
చెంగున దూకే ఒయ్యారంగా...  తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా...  ఈ ముద్దుల దొంగ


చరణం 2 : 


గారాలు పొంగు వేళ గోరంత ముద్దు
కోరింది కొంగుజోల గోరింటపొద్దు
చీరల్లే చుట్టేనమ్మా నీ చూపు నేడు
ఆరాలు తీసేనమ్మ  మారాల ఈడు

తియ్యంగా కొంటెరంగ...  చక చక చెమ్మచెక్క
తీరాలి సామిరంగ...  చక చక చెమ్మచెక్క
చుక్కల్లే దూసి నీకే  హారమేసేయ్ నా
అందాల కన్నెసోకు హారతిచ్చేనా
చుక్కల్లే దూసి నీకే  హారమేసేయ్ నా
అందాల కన్నెసోకు హారతిచ్చేనా
సందిళ్ళే పందిళ్ళు ఈ అల్లరి మల్లెల జల్లులోన


చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
చెంగున దూకే ఒయ్యారంగా...  తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా...  ఈ ముద్దుల దొంగ



చిత్రం : ముద్దుల మావయ్య (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, జానకి  

No comments:

Post a Comment