ఆలాపన (1986)





చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు 


పల్లవి :

ఆవేశమంతా ఆలాపనేలే...  ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే...  ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన 
నాలో జనించే  స్వరాలా...  

ఆవేశమంతా ఆలాపనేలే...  

చరణం 1 :

అల పైటలేసే సెలపాట విన్నా
గిరివీణ మీటే జలపాతమన్నా
నాలోన సాగే అలాపన... రాగాలు తీసే ఆలోచనా
ఝరుల జతల నాట్యం...  అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగే గానం
నిదురలేచే నాలో హృదయమే  

ఆవేశమంతా ఆలాపనే...  ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనే

చరణం 2 :



వనకన్యలాడే తొలి మాసమన్నా
గోధూళి తెరలో మలిసంజె కన్నా
అందాలు కరిగే ఆవేదన... నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం...  పురివిడిన నెమలి పింఛం
ఎదలు కదిపి నాలో విరిపొదలు వెతికే మోహం..
బదులు లేని ఏదో పిలుపులా

ఆవేశమంతా ఆలాపనేలే...  ఎదలయలో
నాలో జ్వలించే వర్ణాల రచన 
నాలో జనించే స్వరాలా...  

ఆవేశమంతా ఆలాపనేలే...  




*************** **************** *******




చిత్రం: ఆలాపన (1986)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, జానకి



పల్లవి :


ఆరుఋతువుల భ్రమణమున్నా అఖండం కాలాత్మా
ప్రకృతీ పురుషుల మిధునమున్నా అతీతం పరమాత్మా
ఎన్ని బహుముఖ రీతులున్నా ఏకం తదేకం రసైకం నాట్యాత్మా


తాం ధీం తోం తక్కిట తకధిమి తకఝణు తకధీం
ధీం తోం నం ధీంకిట తకధిమి తకఝణు తకధిధిత్తాం
తకతకిట తకధిమితత్తాం తకతకిట తకధిమి
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక
ధీం కిటకతరికితతక తరికిట తరికిట
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక
ధీం కిటకతరికితతక తరికిట తరికిట తా
తరికిట తోకిట నంకిట ధిత్తరికిట తొంకిట నంకిట
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట
తధ్ధిత్తరికిట తొంకిట నంకిట తాం...




నటరాజు నయనాలు దీవించగా
ఆ నటరాజు నయనాలు దీవించగా
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన

నాట్యసుధానిధి అర్పించనా

నటరాజు నయనాలు దీవించగా
ఆ నటరాజు నయనాలు దీవించగా

తకధిమితాం కిటతకథాం తకథజం
దిమిథజం జణుథజం తరికితతకథాం

చరణం 1 :


నిలువెల్ల తులలేని తుదిలేని జాలి .. నెలకొన్న లలితేందు మౌళి
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి .. నెలకొన్న లలితేందు మౌళి

గళసీమ నాగేంద్రహారావళి .. తన కీర్తి తారావళి
గళసీమ నాగేంద్రహారావళి .. తన కీర్తి తారావళి


నగముదదర నభములదర జలధులెగుర జగతిచెదర
హరహరయని సురముని తటికుదు
వధింగిణతోం తధీంగిణతోం తధీంగిణతోం

నటరాజు నయనాలు దీవించగా
ఆ నటరాజు నయనాలు దీవించగా
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన

నాట్యసుధానిధి అర్పించనా

నటరాజు నయనాలు దీవించగా
ఆ నటరాజు నయనాలు దీవించగా


చరణం 2 :
తకధిమి తకఝణు తకిటతంతం త్రిభువన భూర్నిత ఢమరునాదం
ఝణుతక ధిమితక కిటతధీంధిం ముఖరిత రజత గిరీంద్రమూర్ధం
తకిట తంతం చలిత చరణం ఝణుత తంతం జ్వలిత నయనం
తకిటధీం లయధరం తకిటధీం భయకరం
తకిటధీం భయకరం... తకిటధీం భయకరం భయకరం

చండ విజ్రుంభిత శాంభవబింబం శైలసుతా పరితోషిత రూపం

ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ యఘణధం
ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ థగణఝం
యణగణ ధణఘణ పఘణఝం ..యణగణ పణఘణ రగణఝం
యగణమగణం జగణగగనం ఖగనపగణం రగణజగణం
యగమగ జగగన తగఫగ రగజన
యగణ మగణ జగణ ఖగణ ఫగణగఝం

నగరాజ నందినీ అభవార్ధ భాగినీ
నగరాజ నందినీ అభవార్ధ భాగినీ
రుధిరాప్థ జిహ్వికా రుక్షరుద్రాక్షికా
రుధిరాప్థ జిహ్వికా రుక్షరుద్రాక్షికా
క్షుద్రప్రణాషినీ భధ్రప్రదాయినీ
క్షుద్రప్రణాషినీ భధ్రప్రదాయినీ
మదమోహకామప్రమోదదుర్ధమచిత్త
మహిషరాక్షసమర్ధినీ... మహిషరాక్షసమర్ధినీ...  మహిషరాక్షసమర్ధినీ


*************** **************** *******


చిత్రం :  ఆలాపన (1986)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  జానకి

పల్లవి:
తతతతరతరత్త తతరరతరతరత్త
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తతతతరతరత్త తతరరతరతరత్త
చరణం 1:

రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే.. హాయ్..
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే.. హాయ్..
హోయ్.. రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే.. హాయ్..
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే.. హాయ్..

నాలోన లీలగా నాద స్వరాలుగా..
పూసింది లాలస పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో..
రేరాణి వెన్నెల్లలో..
ఈ మోహమెందాక పోతున్నదో
ఈ దేహమింకేమి కానున్నదో
వలపులే పిలువగా...

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తరరరర తరతరత్తర...

చరణం 2:

పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్..
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే.. హోయ్..
హో..  పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్..
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే.. హోయ్..

నా పాన్పు పంచుకో..  ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ ఈ రాతిరి
తేనెల్లు పొంగాలి చీకట్లలో..
కమ్మన్ని కౌగిళ్ళలో..
నీ తోడు కావాలి ఈ జన్మకి
నే నీడనవుతాను నీ దివ్వెకి
పెదవులో..  మధువులా... 

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర...



అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర


*************** **************** *******


చిత్రం: ఆలాపన (1986)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:




కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో
కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో
నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి
నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి


కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో.. 


చరణం 1:



పొంగిపోదా సాగరాత్మ నింగికి
చేరుకోదా చంద్ర హృదయం నీటికి
పొంగిపోదా సాగరాత్మ నింగికి
చేరుకోదా చంద్ర హృదయం నీటికి



సృష్టిలోన ఉంది ఈ బంధమే
అల్లుకుంది అంతటా అందమే
తొణికే బిడియం తొలగాలి
ఒణికే అధరం పిలవాలి
ఆ..ఆ...ఆ...
కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో


చరణం 2:


మేనితోనే ఆగుతాయి ముద్రలు
గుండె దాకా సాగుతాయి ముద్దులు
మేనితోనే ఆగుతాయి ముద్రలు
గుండె దాకా సాగుతాయి ముద్దులు




ఇంత తీపి కొంతగా పంచుకో
వెన్నెలంత కళ్ళలో నింపుకో
బ్రతుకే జతగా పారాలి... పరువం తీరం చేరాలి
ఆ...ఆ...ఆ...ఆ

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో
కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో


నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి
నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో...


*************** **************** *******

చిత్రం: ఆలాపన (1986) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

ఆ కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
ఆ కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 

చరణం 1: 

నిదురించు వేళ ..దసనిస దసనిస దనిదనిమ 
హృదయాంచలాన..ఆ..ఆ..ఆ..ఆ 

అలగా పొంగెను నీ భంగిమ..దదసనిస... 
అది రూపొందిన స్వర మధురిమ 
ఆ రాచ నడక రాయంచ కెరుక 
ఆ రాచ నడక రాయంచ కెరుక 
ప్రతి అడుగూ శృతిమయమై 
కణకణమున రసధునులను మీటిన 

ఆ... కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
ఆ కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 

చరణం 2: 

నీ రాకతోనే ఆ..ఆ..ఆ..ఆ 
ఈ లోయ లోనే ...దసనిస దసనిస దనిదనిమ 

అణువులు మెరిసెను మణి రాసులై 
మబ్బులు తేలెను పలు వన్నెలై 
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని 
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని 
ఆకృతులై సంగతులై 
అణువణువున పులకలు ఒలికించిన 

ఆ... కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండె పిలుపులా 
సంధ్యలోన అందె మెరుపులా 
ఆ... కనులలో కలల నా చెలీ 
ఆలాపనకు ఆది మంత్రమై...

No comments:

Post a Comment