ఆస్తులు-అంతస్తులు (1987)




చిత్రం: ఆస్తులు-అంతస్తులు (1987) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: ఏసుదాస్ 

పల్లవి: 

మిడిసిపడే దీపాలివి... మిన్నెగసి పడే కెరటాలివి 
మిడిసిపడే దీపాలివి... మిన్నెగిసి పడే కెరటాలివి 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 

ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ 
సుఖదుఃఖాలే ఏకమైన రేవులో..ఓ.. 

మిడిసి పడే దీపాలివి.. మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు.. 

చరణం 1: 

బావి లోతు ఇంతని తెలుసు.. నదుల లోతు కొంతే తెలుసు 
ఆడగుండె లోతు ఎంతో లోకంలో ఎవరికి తెలుసు 

ఏ నిముషం ప్రేమిస్తుందో ఏ నిముషం పగబడుతుందో 
ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు 
రాగం.. అనురాగం.. ఎర వేసి జత చేరి.. కన్నీట ముంచుతుందిరా 


మిడిసిపడే దీపాలివి... మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు.. 



చరణం 2 : 

పాము విషం సోకినవాడు ఆయువుంటె బతికేస్తాడు 
కన్నె వలపు కరిచిన వాడు నూరేళ్ళకి తేరుకోడు 

సొగసు చూసి మనసిచ్చావా...  బందీగా నిలబడతావు 
నీ కలలే విరిగిననాడూ...  కలతే నీ తోడవుతుంది 
లేదు.. ఏ సౌఖ్యం.. రవ్వంత సంతోషం.. ఈ ఆడదాని ప్రేమలో 



మిడిసిపడే దీపాలివి...  మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు.. 

ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ 
సుఖదుఃఖాలే ఏకమైన రేవులో..ఓ.. 

మిడిసిపడే దీపాలివి.. మిన్నెగిసి పడే కెరటాలివి 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు..


No comments:

Post a Comment