గోకులంలో సీత (1997)

చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: చిత్ర, మాల్గాడి శుభ

పల్లవి:

తళక్ తళక్ అని తళకుల తార
మిణక్ మిణక్ అని మిల మిల తార
ఛమక్ ఛమక్ అని చిలిపి సితార
ఓ ఓ...
తళక్ తళక్ అని తళకుల తార
మిణక్ మిణక్ అని మిల మిల తార
ఛమక్ ఛమక్ అని చిలిపి సితార
ఓ ఓ...

మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా...

తళక్ తళక్ అని తళకుల తార
మిణక్ మిణక్ అని మిల మిల తార
ఛమక్ ఛమక్ అని చిలిపి సితార
తళక్ తళక్ అని తళకుల తార
మిణక్ మిణక్ అని మిల మిల తార
ఛమక్ ఛమక్ అని చిలిపి సితార

మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా

చరణం 1:

అలలై ఎగసిన ఆశా నాట్యం చేసే వేళా
ఆలుపే ఎరుగని శ్వాసా రాగం తీసే వేళా
దిశలన్నీ తలవొంచి తొలగే క్షణం
ఆకాశం పలికింది అభినందనం
అదిగదిగో మనకోసం తారాగణం
తళుకులతో అందించే నీరాజనం
మనదారికెదురున్నదా...

మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా

చరణం 2:

నవ్వే పెదవులపైనా ప్రతి మాట ఒక పాటే
ఆడే అడుగులలోనా ప్రతి చోట పూబాటే
గుండెల్లో ఆనందం కొలువున్నదా
ఎండైనా వెన్నెల్ల్లా మురిపించదా
కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా
కష్టాలు కన్నీళ్ళు మరిపించదా
జీవించడం నేర్పదా

మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా
లాలాల..లలలా...






చిత్రం: గోకులంలో సీత (1997) 
సంగీతం: కోటి 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు 


పల్లవి: 


ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా 
వలపుల వనమా ఆ...ఆ...ఆ... 
వెలుగుల వరమా ఆ..ఆ..ఆ... 
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా 


ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా 


చరణం 1: 


ఎంత మధనమో జరగకుండ 
ఆ పాల కడలి కదిలిందా అమృతకలశమందిందా 
ఎన్ని ఉరుములో విసరకుండ 
ఆ నీలినింగి కరిగిందా నేలగొంతు తడిపిందా 
ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా 
ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురుతొడగవ ప్రేమా 
అణువణువూ సమిధలాయే ఈ యాగం శాంతిచేదెపుడమ్మా 


ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా 


చరణం 2: 

ఆయువంతా అనురాగ దేవతకి 
హారతీయదలిచాడు ఆరిపోతు ఉన్నాడు 
మాయమైన మమకారమేది అని 
గాలినడుగుతున్నాడు జాలి పడవ ఈనాడు 
నిలువునా రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు 
ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు 
నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా 


ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా 
వలపుల వనమా ఆ..ఆ..ఆ.. 
వెలుగుల వరమా ఆ..ఆ..ఆ.. 
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా



చిత్రం: గోకులంలో సీత (1997) 
సంగీతం: కోటి 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: చిత్ర 


పల్లవి: 

పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది 
పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది 
పాపం ఏలాలి పాడాలి జాబిలి 
అయినా ఏ జోల వింటుంది నీ మది 
వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్ళే తెరిచేలా 
ఇలా నిను లాలించేదా లేలేమ్మని 
మిత్రమా మిత్రమా మైకమే లోకమా 
మెల్లగా చల్లగా మేలుకో నేస్తమా 


చరణం 1: 


ఎన్నో రుచులు గల బ్రతుకుంది 
ఎన్నో ఋతువులతో పిలిచింది 
చేదోక్కటే నీకు తెలిసున్నది 
రేయొక్కటే నువ్వు చూస్తున్నది 
ఉదయాలనే వెలి వేస్తానంటావా 
కలకాలమూ కలలోనే ఉంటావా 
నిత్యమూ నిప్పునే తాగినా తీరని 
నీ దాహం తీర్చే కన్నీరిది 

మిత్రమా మిత్రమా మైకమే లోకమా 
మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా 

చరణం 2: 

నీలో చూడు మంచి మనసుంది 
ఏదో నాడు మంచు విడుతుంది 
వాల్మీకిలో ఋషి ఉదయించినా 
వేమన్నలో భోగి నిదురించినా 
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాల 
మలినాలనే మసిచేస్తూ మండేలా 
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలదా 
నిను తాకిందేమో ఈ వేదన 

మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా 
మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా 


పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది 
పాపం ఏలాలి పాడాలి జాబిలి 
అయినా ఏ జోల వింటుంది నీ మది




చిత్రం: గోకులంలో సీత (1997) 
సంగీతం: కోటి 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి: 

ఘల్లు ఘల్లుమను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే 
వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే 
ఆ.... 

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా 
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా 
పదుగురి నిందలతో పలుచన కాకయ్యా 
నిలవని అడుగులతో పరుగులు చాలయ్య 
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా 
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా 


చరణం 1: 

ఏ నోట విన్నా నీ వార్తలేనా 
కొంటె చేష్టలేలరా కోణంగిలా 
ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా 
కల్లబొల్లి మాటలే నా రాధికా 
చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా 
ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా 
తెలియని లీలలతో తికమక చేయకయా 
మనసును చూడకనే మాటలు విసరకలా 
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 


గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా 
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా 



చరణం 2: 


ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా 
అంతతోనే ఆగెనా ఆ బాలుడు 
అవతార మూర్తిగా తన మహిమ చాటెగా 
లోకాల పాలుడు గోపాలుడు 
తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు 
మాయని దూరము చేసిన గీతాచార్యుడు 
కనుకనే అతని కధా తరములు నిలిచె కదా 
తలచిన వారి ఎద తరగని మధుర సుధ 
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 


గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా 
అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా 
అందెల సందడితో గుండెలు మురిసెనురా 
నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా 
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే




చిత్రం: గోకులంలో సీత (1997) 
సంగీతం: కోటి 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: మను, చిత్ర 


పల్లవి: 


అందాల సీమలోని పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా 
వరించి నన్ను చేరుమా... సుఖాన ముంచి తేల్చుమా... 
ప్రియాతి ప్రియతమా ఇదేమి సరిగమా 
శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమా 


అందాల సీమలోని పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా 

చరణం 1: 

రా రమ్మంది లేత చెక్కిలి 
రేపెట్టింది కొత్త ఆకలి 
సిగ్గు మొగ్గ మేలుకుంది తియ్యగా 
తేనె ముద్దలారగించు హాయిగా 
అంత భాగ్యమా పంచ ప్రాణమా 
ఒడిలో చేరనీయుమా..హో 


అందాల సీమలోని పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా 


చరణం 2: 

లాగించేస్తే ప్రేమ జిలేబి 
ఏమౌతుందో కన్నే గులాబి 
పాలపొంగులాంటిదమ్మ కోరిక 
పైటచాటు దాచుకోకే ప్రేమికా 
కొంగుజారితే కొంపమునగదా 
వాటే రిస్కు మన్మథా 

అందాల సీమలోని పారిజాత పుష్పమా 
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమా 
వరించి నన్ను చేరుమా సుఖాన ముంచి తేల్చుమా 
ప్రియాతి ప్రియతమా ఇదేమి సరిగమా 
శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమా 

మ్మ్..మ్మ్..మ్మ్...

No comments:

Post a Comment