అయ్యప్ప జన్మ రహస్యం :
మోహిని అందం - భస్మాసుర
అంతం
పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలతో ప్రతి యుద్దంలోను ఓటమి లేని వాడిగా, మరియు దేవతలను నాశనం చేయాలన్న దుర్బుద్ధితో శివుని కోసం కఠోర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై “ఏమి వరం కావాలో కోరుకో” అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక "అమరత్వం (మరణం లేకపోవటం)" ప్రసాదించమని కోరతాడు. దానికి శివుడు నిరాకరించగా భస్మాసురుడు -
"నేను ఎవరి తలపై నా చేయి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి"
అని వరం కోరతాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. భస్మాసురుడు ఆ వరమును పరీక్షించేందనని శివుని తలపైన తన చేయి వేయ ప్రయత్నించగా, శివుడు పారిపోవలసి వచ్చింది. భస్మాసురుడు వెంబడించాడు. శివున్ని కాపాడుటకై విష్ణుమూర్తి
"మోహిని" అవతారం దాలుస్తాడు.
విష్ణుమూర్తి, మోహిని అవతారంలో, భస్మాసురుని ఎదుట నిలుస్తాడు. మోహిని యొక్క అందమును చూసి భస్మాసురుడు వ్యామొహంలో పడిపోతాడు. భస్మాసురుడు మోహినితో “నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అనగా అప్పుడు మోహిని "నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కావున నాలాగ నాట్యం చేసిన వారినే పెళ్ళాడుతాను" అని అంటుంది. భస్మాసురుడు ఆ పందెమును అంగీకరించి నృత్యం మొదలుపెడతాడు. అలా నృత్యం చేస్తూ మోహిని ఒక భంగిమలో తన చేయి తన తల పైన పెట్టుకుంటుంది. భస్మాసురుడు మోహిని యొక్క భంగిమను అనుకరించగా తన తలపైన తనే చేయి పెట్టుకుంటాడు. శివుని వరప్రభావము వలన భస్మాసురుడు భస్మమైపోతాడు. దేవతలు ఆనందిస్తారు!
క్షీరసాగర మథనం
- అయ్యప్ప
జననం
దుర్వాస మహర్షి (శివుని అంశలో అత్రి మహర్షి, సతీ అనసూయకు కుమారునిగా జన్మించాడు, బ్రహ్మదేవుని మనవడు) మహా కోపి. అతను ఒక రోజు భూలోకమున తిరుగుతున్నప్పుడు వనదేవత నుంచి పుష్పగుచ్ఛాన్ని పొందుతాడు. తను ఆ పుష్పగుచ్ఛాన్ని స్వీకరించి తన ప్రయాణమును కొనసాగించుచుండగా ఇంద్రుడు ఐరావతం మీద కనపడతాడు. దుర్వాసుడు ఆ పుష్పగుచ్ఛాన్ని ఇంద్రునికి ఇవ్వగా ఇంద్రుడు ఐరావతం మీద పెడతాడు. ఆ పూల సువాసనకు చిరాకు వచ్చి ఐరావతం ఆ పుష్పగుచ్ఛాన్ని క్రిందకు పడవేస్తుంది. అది చూసి దుర్వాసుడికి మిక్కిలి కోపం వచ్చి - "మీ దేవతలు కూడా ఈ పుష్పగుచ్ఛంవలే
త్రిలోకమల నుండి పడిపోవుదురు గాక" అని శపిస్తాడు.
దుర్వాస మహర్షి శాపం వలన దేవతలు శక్తిని
కోల్పోతారు. ఇదే సమయమని రాక్షసులందరు కలిసి దేవతలపైన యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు
దేవతలందరు బ్రహ్మదేవుని వద్దకు తరలిపోగా బ్రహ్మదేవుడు వారిని విష్ణుమూర్తి వద్దకు పంపుతాడు.
అప్పుడు విష్ణుమూర్తి దేవదేవదానవులందరు కలిసి క్షీరసాగర మథనం చేసి అందులో నుంచి వచ్చే
“అమృతం" (ఇది తాగినివారికి చావు ఉండదు) అందరం పంచుకుందాము అని అంటాడు. దానికి
దేవతలు మరియు రాక్షసులు అంగీకరిస్తారు. కాని విష్ణువు ఆ అమృతం దేవతలకి మాత్రమే అందేటట్లు
చేస్తానని హామి ఇస్తాడు. "అదే విష్ణు మాయ!". "మందరగిరి" అనే పర్వతమును
కవ్వముగా, "వాసుకి"ని(నాగలోకానికి రాజు) రజ్జుగా చేసి దేవతలు వాసుకి తోక
వైపు రాక్షసులు పడగ వైపు నిలిచి క్షీరసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆధారము లేక
మందరగిరి క్షీరసాగరములోనికి జారిపోతుండగా విష్ణుమూర్తి కూర్మావతారం దాల్చి మందరగిరిని
తన వీపు పై ధరిస్తాడు.
మొదట ప్రపంచాన్ని దహిచేంతటి “హాలాహలం”
వచ్చింది. దాన్ని శివుడు తన కంఠంలో దాచి అందరిని కాపాడతాడు. ఆ పిమ్మట దేవదానవులు మరల
చిలుకుతుండగా సంపన్నమైన అనేక వస్తువులు, ఇంకా వరాలు తీర్చే కామధేనువు వస్తుంది. చివరికు
"ధన్వంతరి" (విష్ణువు అంశ, దేవతల వైద్యుడు, ఆయుర్వేద దేవుడు) అమృతకలశాన్ని
చేతబట్టుకొని అవతరిస్తాడు.
విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెడతాడు. విష్ణుమూర్తి మోహిని రూపంలో శివుని వద్దకు వచ్చి తను ఇచ్చిన మాటను పూర్తిచేశాను అని చెప్తాడు. శివుడు మోహిని యొక్క అందానికి ఆకర్షితుడై మోహినిని కవ్విస్తాడు. లోకకళ్యాణం కోసమే హరి-హర కలయిక. ఆ (హరిహరాద్వైత)కలయిక ఫలమే మన "అయ్యప్ప".
మహిషాసురినికి వరం - దుర్గాదేవి అవతారం
మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు మరియు దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం ఆ వరగర్వంతో స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందరిని తరిమికొడతాడు.
బ్రహ్మ వరానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా "దుర్గ"ను సృష్టిస్తారు. దుర్గ మహిషున్ని ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఆ రాక్షసున్ని వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని "మహిషాసుర మర్ధిని” అని పూజిస్తారు
దత్తాత్రేయ శాపం - మహిషి కోపం
రాజశేఖరుని ఆవేదన - అయ్యప్ప ఆరాధన
అయ్యప్ప కథ - మహిషి వధ
అడవిలో ఇంద్రుడు
ప్రత్యక్షమై మహిషి చేసే అరాచకాలను, దారుణాలను వెల్లడించి కారణజన్ముడైన మణికంఠునికి
జన్మరహస్యం వివరిస్తాడు. అది విన్న మణికంఠుడు కర్మ వీరుడై, ఖడ్గ హస్తుడై, కాలరూపురుడై
మహిషితో యుద్ధం మొదలుపెడతాడు. దేవలోకము నుండి భూమి మీదకు విసిరితే మహిషి అళుదా
నది తీరాన పడుతుంది. ఆ నదీ తీరము వద్దనే మహిషి వధ జరుగుతుంది. పశువైన మహిషి ఛాతి మీదకెక్కి అయ్యప్ప నృత్యం చేస్తాడు. ఈ నృత్యం చేసేది సాక్షాత్ హరిహర పుత్రుడేనని మహిషికి అర్దమై మణికంఠునికి సాష్టాంగ ప్రణామం చేసి మరణిస్తుంది. ఈ నృత్యమును శివుడు, మహావిష్ణువు "కలకెట్టి" అనే ప్రదేశము నుండి ప్రత్యక్షముగా తిలకించినారు. మహిషికి శాపవిముక్తి కలిగి "మాలికాపురతమ్మ"గా అవతరిస్తుంది. మాలికాపురతమ్మ పెళ్ళి చేసుకోమని మణికంఠుని ప్రార్దించగా, "ఎప్పుడైతే నన్ను దర్శించడానికి కన్నెస్వామి రాడో అప్పుడు పెళ్ళి చెసుకుంటాను, అప్పటి వరకు బ్రహ్మచారిగానే ఉంటాను" అని చెప్తాడు. మహిషి వధ చూసి మనసా, శిరసా నమస్కరించి పులిగా మారి అయ్యప్పకు వాహనంగా తనమీద కూర్చొపెట్టుకొని రాజ్యానికి తీసుకొని వెళ్తాడు మహేంద్రుడు.
నది తీరాన పడుతుంది. ఆ నదీ తీరము వద్దనే మహిషి వధ జరుగుతుంది. పశువైన మహిషి ఛాతి మీదకెక్కి అయ్యప్ప నృత్యం చేస్తాడు. ఈ నృత్యం చేసేది సాక్షాత్ హరిహర పుత్రుడేనని మహిషికి అర్దమై మణికంఠునికి సాష్టాంగ ప్రణామం చేసి మరణిస్తుంది. ఈ నృత్యమును శివుడు, మహావిష్ణువు "కలకెట్టి" అనే ప్రదేశము నుండి ప్రత్యక్షముగా తిలకించినారు. మహిషికి శాపవిముక్తి కలిగి "మాలికాపురతమ్మ"గా అవతరిస్తుంది. మాలికాపురతమ్మ పెళ్ళి చేసుకోమని మణికంఠుని ప్రార్దించగా, "ఎప్పుడైతే నన్ను దర్శించడానికి కన్నెస్వామి రాడో అప్పుడు పెళ్ళి చెసుకుంటాను, అప్పటి వరకు బ్రహ్మచారిగానే ఉంటాను" అని చెప్తాడు. మహిషి వధ చూసి మనసా, శిరసా నమస్కరించి పులిగా మారి అయ్యప్పకు వాహనంగా తనమీద కూర్చొపెట్టుకొని రాజ్యానికి తీసుకొని వెళ్తాడు మహేంద్రుడు.
శబరిమల పుణ్యక్షేత్రం - మణికంఠుని స్తోత్రం
"శివాయ విష్ణురూపాయ శివరూపాయ
విష్ణవే - శివస్య హృదయం విష్ణోః విష్ణశ్చ హృదయం శివః"
!!! సంధ్యావందన గీతం, శివకేశవుల అనుబంధం, ఆదిశంకరుల అద్వైతం అదే శబరిగిరీషుని అవతారం !!!
!!! సంధ్యావందన గీతం, శివకేశవుల అనుబంధం, ఆదిశంకరుల అద్వైతం అదే శబరిగిరీషుని అవతారం !!!



No comments:
Post a Comment