చిత్రం: అమరశిల్పి జక్కన (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
నిలువుమా నిలువుమా నీలవేణీ
నీ కన్నుల నీలినీడ నా మనసు నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ
చరణం 1:
అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా
అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా
సడిసేయక ఊరించే...
సడిసేయక ఊరించే... ఒయారపు ఒంపులా
కడకన్నుల ఇంపులా గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణీ
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
చరణం 2:
అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయశీ..
అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి
అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి
నా ఊర్వశి రావే రావే అని పిలువనా
నా ఊర్వశి రావే రావే అని పిలువనా
ఆ సుందరి నెర నీటూ నీ గోటికి సమమౌనా
నా చెలి నిను మదీ దాచుకోనీ
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ..
******* ************ ************ ************
చిత్రం: అమరశిల్పి జక్కన (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
నగుమోము చూపించవా గోపాలా
నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ
చరణం 1:
ఎదుట … ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట...
ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట ...
ఎదుట వెన్నెల పంట... ఎదలో తీయని మంట...
ఇక సైపలేను నీవే నా... ముద్దుల జంట
నగుమోము చూపించవా గోపాలా…..
చరణం 2:
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ...
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ...
మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల..
నగుమోము చూపించవా గోపాలా ….
చరణం 3:
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య...
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య...
నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య...
నగుమోము చూపించవా గోపాలా …
నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ
******* ************ ************ ************
చిత్రం: అమరశిల్పి జక్కన (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఏదో..ఏదో..
ఏదో.. గిలిగింత...ఏమిటీ వింత..ఆ..
ఏమని అందును... ఏనాడెరుగను ...
ఇంత పులకింత..ఆ..ఆ...కంపించె తనువంత
ఏదో..ఏదో.. ఏదో.. గిలిగింత...ఏమిటీ వింత..
ఏమని అందును... ఏనాడెరుగను ...
ఇంత పులకింత.....కంపించె తనువంత
చరణం 1:
వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే..ఏ..ఏ..
అహ.....ఆ...ఆ...ఆ...ఆ...
వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే..
నీవు తాకినా నిముషమందె నా యవ్వనమ్ము పూచే..ఏ..ఏ..
ఏదో..ఏదో..
కన్ను కన్ను కలిసే...బంగరు కలలు ముందు నిలిచే..
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
కన్ను కన్ను కలిసే...బంగరు కలలు ముందు నిలిచే..
పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిసే...ఏ..ఏ..ఏ...
ఏదో..ఏదో..
చరణం 2:
గానమైన నీవే..నా ప్రాణమైన నీవే...
గానమైన నీవే..నా ప్రాణమైన నీవే...
నన్ను వీణగా మలచుకొనెడు గంధర్వ రాజు వీవే...
ఏదో..ఏదో..
నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ..
నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ..
యుగయుగాలు నీ నీలి కనుల సోయగము చూడనీవే..ఏ..ఏ...
ఏదో..ఏదో..
ఏదో.. గిలిగింత...ఏమిటీ వింత..
ఏమని అందును... ఏనాడెరుగను ...
ఇంత పులకింత...ఆ..ఆ....కంపించె తనువంత
ఏదో..ఏదో..
******* ************ ************ ************
చిత్రం: అమరశిల్పి జక్కన (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి:
ఓహో ఓ ఓ....
ఓహోహో....
ఓ ఓ....
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఓ .. ఓ ..
చరణం 1:
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ..ఈ నల్లని రాలలో
చరణం 2:
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే....
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు ..ఈ నల్లని రాలలో..
చరణం 3:
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ..ఈ నల్లని రాలలో..
******* ************ ************ ************
చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..
అందాల బొమ్మతో ఆటాడవా..
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..
అందాల బొమ్మతో ఆటాడవా
చరణం 1:
కనులు చేపలై గంతులు వేసె..
మనసు తోటలో మల్లెలు పూసె..
దోసిట వలపుల పూవులు నింపీ..
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ..
అందాల బొమ్మతో ఆటాడవా...
చరణం 2:
చల్ల గాలితో కబురంపితిని ...
చల్ల గాలితో కబురంపితిని...
చందమామలో వెదకితి నోయీ...
తార తారనూ అడిగితి నోయీ....
దాగెద వేలా? రావోయీ...
అందాల బొమ్మతో ఆటాడవా...
చరణం 3:
నల్లని మేఘము జల్లు కురియగా...
నల్లని మేఘము జల్లు కురియగా...
ఘల్లున ఆడే నీలినెమలినై....
నిను గని పరవశమందెద నోయీ...
కనికరించి ఇటు రావోయీ...
అందాల బొమ్మతో ఆటాడవా..
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..
అందాల బొమ్మతో ఆటాడవా...

No comments:
Post a Comment