వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (2013)



చిత్రం: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (2013)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: శ్వేతా మోహన్ , అంజనా సౌమ్య


మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక
మరుమల్లెలా వికసించెనే ఎదలోతులో ఈ కలయిక
పెదవంచు దాటి మౌనమే దిగివచ్చెలే ఇలా
పొగమంచును మీటి కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెళ్ల నిండిపోయెనే నువ్వే నేనులా

I LOVE YOU SO ... I LOVE YOU SO
I LOVE YOU SO ... I LOVE YOU SO

మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక

అనుకోని తీరమైన నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్న చిగురాకులా
నను చూసి ఇలా నాక్కూడా కొత్తగా ఉంది కదా
కల కాదు కదా నీవెంటే ఉన్నది నేనేగా

I LOVE YOU SO ... I LOVE YOU SO
I LOVE YOU SO ... I LOVE YOU SO

మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక

మెరుపల్లె చేరువైతే చినుకల్లే మారనా
నీలోన నేను కరిగి పులకించనా
నీకోసం ఇలా కదిలేటి నిమిషం ఆపేస్తా
నీతోడు అలా సాగేటి కాలమే నేనవుతా

I LOVE YOU SO ... I LOVE YOU SO
I LOVE YOU SO ... I LOVE YOU SO

మెల్ల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరిక

No comments:

Post a Comment