హాయ్ (2002)




చిత్రం: హాయ్ (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సందీప్ , సుజాత


నిను చూసిన ఆ తొలి నిమిషాన
నా మనసుకి తెలుసా ఏమైనా
నిను చూసిన ఆ తొలి నిమిషాన
నా మనసుకి తెలుసా ఏమైనా

నిను చూసిన ఆ తొలి నిమిషాన
నా మనసుకి తెలుసా ఏమైనా
తనప్రేమలోన పుడుతుందో
తను ప్రేమలోన పడుతుందో
అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో
మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో

నిను చూసిన ఆ తొలి నిమిషాన
నీ మనసుకి తెలుసా ఏమైనా

చూపులతో చెప్పుకునే భాషే ఇది
ఊపిరితో అక్కుకొనే బంధం ఇది
ఇద్దరికే సొంతమయే లోకం ఇది
ముద్దులతో ఏకమయే లోకం ఇది
ఏ జాతీయని ఏ దేశమని ఏ జంటని అడగని కౌగిలిలో
సరిహద్దులని చలిపొద్దులని కరిగించని వెచ్చని కోరికలో
ఎంత మధురమో... ప్రేమ అన్నది

అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో
మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో
నిను చూసిన ఆ తొలి నిమిషాన
నీ మనసుకి తెలుసా ఏమైనా
నిను చూసిన ఆ నిమిషాన

ఎన్నటికీ తీరననే దాహం ఇది
చెరిసగము పంచుకునే ప్రాయం ఇది
ఏ ఋణమో తీర్చుకునే స్నేహం ఇది
ఇష్టపడి పెంచుకునే భారం ఇది
నీ చెలిమి నిజం ఈ క్షణము నిజం
అణువణువు మీటిన హాయి నిజం
ఈ వలపు నిజం మైమరపు నిజం
ఎడబాటుకి అందని మనం నిజం
కోటి కలలతో... కొత్త జీవితం

అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో
మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో
నిను చూసిన ఆ తొలి నిమిషాన
నీ మనసుకి తెలుసా ఏమైనా
తనప్రేమలోన పుడుతుందో
తను ప్రేమలోన పడుతుందో
అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో
మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో

No comments:

Post a Comment