శ్రీ మంజునాథ (2001)


చిత్రం: శ్రీ మంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు


ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ... కరమేలా ఈ... కరమేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం

చరణం: 1
మార్కండేయ రక్షపాదం మహాపాదం... ఆ... ఆ...
మార్కండేయ రక్షపాదం మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణా...
ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా అయ్యో...
అందనీ అనాధనైతీ మంజునాథా...

ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
ప్రణతులే చేయలేనీ... ఈ... శిరమేలా ఈ బ్రతుకేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం

చరణం: 2
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ... ఆ... ఆ...
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ...
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
అన్నదాత విశ్వనాథా...
అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా
నన్నేలగా దిగిరాగా అయ్యో...
ఛీ పొమ్మంటినే పాపినైతినే...

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం
తెలుసుకోలేనీ నా ఈ...తెలివేలా ఈ తనువేలా
ఈ పాదం పుణ్యపాదం... ఈ పాదం దివ్య పాదం


******   ******   ******


చిత్రం: శ్రీమంజునాథ (2001)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: జె. కె.భారవి
గానం: యస్.పి. బాలు

ఒక్కడే... ఒక్కడే... మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శక్తి కి రక్తి కి ఒక్కడే
భక్తి కి ముక్తి కి ఒక్కడే దిక్కొక్కడే

నువ్వు రాయి వన్నాను లేనేలేవన్నాను
మంజునాధ మంజునాధ
పరికించె మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు
లోకాల దొరకాదు దొంగవని చాటాను
మంజునాధ మంజునాధ
నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాధ మంజునాధ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాధ మంజునాధ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
శంకర మురహర శంభో హర హరా
మంజునాధ మంజునాధ
మంజునాధ మంజునాధ


******   ******   ******

చిత్రం : శ్రీ మంజునాథ
సంగీతం : హంసలేఖ
సాహిత్యం : శ్రీ వేదవ్యాస
గానం : శంకర్ మహదేవన్

ఓం
మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాద్రి నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకం సౌర గాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం

ఓం..ఓం..ఓం...
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్థ నారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతురదధి సంగమం
పంచ భూతాత్మకం షట్ శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం అష్ట సిద్ధీశ్వరమ్
నవరసమనోహారం దశ దిశా సువిమలం

ఏకాదశోజ్వలం ఏకనాధేశ్వరం
ప్రస్తుతివశంకరం ప్రణత జన కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణిభవతారకం ప్రకృతిహిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషేశం పరేశం 
నటేశం గౌరీశం గణేశం భూతేశం

మహామాధుర పంచాక్షరీ మంత్ర మార్చ్యం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం 
నమో హరాయచ సర్వ హరాయచ
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ
ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢంకా నినాధ నవ తాండవాడంబరం
తధిమ్మి తకధిమ్మి దిధిమ్మి ధిమి ధిమ్మి 
సంగీత సాహిత్య సుమకమలమంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార 
మంత్రబీజాక్షరం మంజునాధేశ్వరం
ఋగ్వేదమాజ్యం ఎదుర్వేదవేద్యం
సామప్రతీతం మధర్మప్రభాతం
పురాణేతిహాసం ప్రసిద్యం విశుద్ధం
ప్రపంచైకసూత్రమ్ విరుద్ధం సుసిద్ధం

నకారం
మకారం
శికారం
వకారం
యకారం
నిరాకార సాకార సారం

మహాకాలకాలం మహానీల కంఠం
మహానందనందం మహాట్టాట్టహాసం
జటాజూట రంగైక గంగా సుచిత్రం
జ్వలత్ఉగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశభాసుం మహాభానులింగం
మహావర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్రసుందరం సౌమనాధేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం
అమరలింగేశ్వరం భామలింగేశ్వరం
కాశివిశ్వేశ్వరం పరంక్రిష్మేశ్వరం
త్ర్యంబాకాధీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ... కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం

అనాదిం.. అమేయం.. అజేయం.. అచింత్యం..
అమోఘం.. అపూర్వం.. అనంతం.. అఖండం..

అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం

ఓం

నమః సోమయచ సౌమ్యాయచ
భావ్యాయచ భాగ్యాయచ శాంతాయచ
శౌర్యాయచ యోగాయచ భోగాయచ
కాలాయచ కాంతాయచ రమ్యాయచ
గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వాయచ


************** ************** **************** *************


ప్రాణాలనే పంచభక్షాలుగా అర్పించెద రా
యమ రాజ ... హ ...శివ
స్వాగతమయ్యా ఓ యమ రాజ
ఓ యమ రాజ ఓ యమ రాజ
స్వాగతమయ్యా ఓ యమ రాజ
ఓ యమ రాజ ఓ యమ రాజ
ఈ మాయ తెరా - దింపెయగా రారా
శ్వాస నువ్వే శాంతి నువ్వే
స్వర్గమిచ్చేసఖుడు నువ్వే ..మృత్యుదేవ...
ఎందరున్నా ఎన్ని ఉన్నా
వెంట వచ్చే చివరి తోడూ మరణమేరా
లేనిదేం పోదు రా - పోనిదేం రాదురా -
ఆలించారా పరిపాలించారా
కొనిపోరా యమ రాజా ... హ .. హరా
తనువొక మాయ ఓ జవరాయ
ఓ జవరాయ ఓ జవరాయ
ఈ మాయ తెరా - దింపెయగా రారా
ముద్దు చేసి ముడిని తెంచి
ఎదను చేర్చి ఎత్తుకెళ్ళే ... తండ్రి నువ్వే
లాలి పాడీ నిదురపుచ్చి
వల్లకాటి ఒడికి చేర్చే ... తల్లి నువ్వే
లెక్కలే చెల్లె రా - బంధమే తీరేరా
పాలించరా .. పంట పండింది రా ..
కరుణామయా కడతేర్చరా .. హ.. ఈశ్వర
స్వాగతమయ్యా ఓ యమ రాజ
ఓ యమ రాజ ఓ యమ రాజ
స్వాగతమయ్యా ఓ యమ రాజ...
ఓ యమ రాజ ఓ యమ రాజ
ఓ యమ రాజ ఓ యమ రాజ


చిత్రం : శ్రీమంజునాథ
సంగీతం : హంసలేఖ
సాహిత్యం : j.k. భారవి
గానం : బాలు


********* *********** ******************

ఓం అక్షరాయ నమః ఆద్యంత రహితాయ నమః దీవరదళశ్యామాయ నమః ఈశ్వరాయ నమః ఉపకార ప్రియాయ నమః ఊర్ధ్వ లింగాయ నమః రుగ్య యజుస్సామ సంభూతాయ నమః ౠకార మాతృకా వర్ణ రూపాయ నమః ఋగ్వతాయ నమః ఓం అక్షరాయ నమః యూనితాఖిల దైత్యాయ నమః యేజితాఖిల సంశ్రయాయ నమః ఐహితామూష్మికా వరదాయ నమః ఓజస్సుతే నమః ఔదార్య నిధయే నమః అంబికా పతయే నమః కపగ్ధినే నమః ఖట్వాంగినే నమః గణనాథాయ నమః ఓం అక్షరాయ నమః ఘనానందాయ నమః యశ్శేవితాయ నమః చంద్రశేఖరాయ నమః చందోవ్యాకరణసారాయ నమః జనప్రియాయ నమః జంఝానిల మహావేదాయ నమః న్యంబంజితాయ నమః పంకార నృత్య విభవాయ నమః థం శబ్దప్రియాయ నమః ఓం అక్షరాయ నమః
ఢం ఢం ఢం ఢం ఢంబాయ నమః ఢక్కా నినాద ముదితాయ నమః గా రి స ని దా ప మ గణథ్రంజితాయ నమః తత్వమసి తత్వాయ నమః థస్వరూపాయ నమః దక్షిణామూర్తయే నమః, ధరణీధరాయ నమః ధర్మస్థల నివాసాయ నమః నందీ ప్రియాయ నమః, ఓం అక్షరాయ నమః పరాత్పరాయ నమః ఫణిభూషణాయ నమః బహుభూరితాయ నమః భవ్యాయ నమః మహమంజునాథాయ నమః యఙ యఙాయ నమః రక్ష రక్షాకరాయ నమః మ గ రి గ మ ప ద ని స రి లక్ష్యాయ నమః, దరేణ్యాయ నమః శబ్దబ్రహ్మణ్యే నమః షఢాధారాయ నమః
Female: స రి గ మ ప ద ని స ని ద ప మ గ రి స Male: సప్తస్వరాయ నమః, ధరాయ నమః క్షమపరాపరాయణాయ నమః నమః నమః సినిమా : శ్రీమంజునాథ(2001), సంగీతం : హంస లేఖ రచన : j.K. భారవి, గానం : K.S.చిత్ర, హేమంత్ కుమార్.

************ **************** ************
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమ పదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
 


సినిమా : శ్రీమంజునాథ(2001),
సంగీతం : హంస లేఖ    
సాహిత్యం : భక్త రుషి 
గానం : రమేష్ చంద్ర,నందిత      

************ **************** ************

చిత్రం: శ్రీమంజునాథ (2001) సంగీతం: హంసలేఖ సాహిత్యం: విశ్వనాథ శాస్త్రి గానం: యస్.పి. బాలు


ఆనందా పరమానందా పరమానందా \\2\\ జగతి నీదే జన్మ నీదే జగదానందా ఆట నీదే పాట నీదే ఆత్మానందా ఆనందా పరమానందా పరమానందా మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆటధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆటమోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట \\2\\ ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేగా ఆది నీవే అంతు నీవే అమరానందా ఆనందా పరమానందా పరమానందా గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావుమధురానందా పుత్రుని కరుణించి పున్నమ లేకుండ చేస్తావు స్వర్గానందా దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు \\2\\ కన్నా వాళ్ళ కర్మ నీదా పుణ్యానందా కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా ఆనందా పరమానందా పరమానందా

No comments:

Post a Comment