పరువు ప్రతిష్ట (1963)

చిత్రం:  పరువు ప్రతిష్ట (1963)
సంగీతం:  పెండ్యాల
గీతరచయిత:  శ్రీశ్రీ
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల


పల్లవి:

    ఆ మబ్బు ...తెరలలోన... దాగుంది... చందమామ...
    ఈ సిగ్గుపొరలలోన...బాగుంది... సత్యభామ...
    ఏమంది ...సత్యభామ...

    ఏమందో ..ఏమో కాని...పరిహాసాలే... చాలునంది...
    శ్రీవారిని... ఐదారడుగుల...దూరాన... ఆగమంది...
    దూరాన... ఆగమంది...

చరణం 1:

    ఈ గాలి... ఊయలా ...ఊగించు ...పయ్యెదా...
    ఈ గాలి... ఊయలా ...ఊగించు ...పయ్యెదా...
    ఊరించే ...సైగలతోనే ...ఏమంది.... తియ్యగా...

    పరువాల... తొందరా...నెలరాజు... ముందరా...
    పరువాల... తొందరా...నెలరాజు... ముందరా...
    మర్యాదా... కాదని కాదా....పలికింది ...చల్లగా...
    పలికింది. ...మెల్లగా...

    ఆ మబ్బు....తెరలలోనా ...దాగుంది.... చందమామ...
    ఈ సిగ్గుపొరలలోనా...బాగుంది. ..సత్యభామ...
    ఏమంది... సత్యభామ...

    ఏమందో ..ఏమో కాని...పరిహాసాలే... చాలునంది...
    శ్రీవారిని... ఐదారడుగుల...దూరాన... ఆగమంది...
    దూరాన... ఆగమంది...

చరణం 2:

    సిగలోని... పువ్వులు... చిలికించే నవ్వులు...
    సిగలోని... పువ్వులు ...చిలికించే నవ్వులు...
    ఓ......ఓ.....ఓ....ఓ.....ఓ....
    మనకోసం... ఏ సందేశం ...అందించే ప్రేయసీ...

    ఆనంద సీమలా ....అనురాగ డోలలా...
    ఆనంద సీమలా....అనురాగ డోలలా...
    కలకాలం ....తేలీసోలీ ....ఆడాలి హాయిగా...
    అన్నాయి......... తియ్యగా....

    ఆ మబ్బు....తెరలే తొలగి...ఆగింది... చందమామ...
    ప్రేమికుల ...హృదయము తెలిసి...పాడింది.... చందమామ...
    పాడింది.... చందమామ...

    ఆహా..హా..ఆ...ఆ...ఆ....

No comments:

Post a Comment