చిత్రలహరి (2019)



చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కైలాష్ కెహర్, విష్ణు ప్రియ రవి



ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే అంతరీక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే
పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే
మహా సంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం (2)

ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే

వెళ్లే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా
అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేసాక ఆగకుండ సాగాలిర నీ సాధన

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం (2)

ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే


********** ********   ***********



రంగు రంగు పువ్వులున్న
అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల
ఏడు రంగులొక్కటై పరవశించు వేలలో,
నేలకే జారిన కొత్తరంగులా..
వానలా వీణలా వానవీణవాణిలా,
గుండెలో పొంగినా కృష్ణవేణిలా,
ఒంటరి మనసులో ఒంపి వెల్లకే అలా, సరిగమల్ని తియ్యగా ఇలా,
ప్రేమ వెన్నెల, రావే ఊర్మిల.
ప్రేమ వెన్నెల రావే ఊర్మిల..
రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై పరవశించు వేలలో నేలకే జారిన కొత్త రంగులా
దిద్దితే నువ్వలా కాటుకే కన్నులా
మారదా పగలిలా అర్థరాత్రిలా,
నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల
కలవరం గుండెలో కలతపూతలా,
రాయలోరి నగలలోంచి మాయమైన
మనులిలా మారిపోయెనేమో నీ
రెండు కళ్లలా
నిక్కమైన నీలమొకటి చాలు
అంటూ వేమన
నిన్ను చూసి రాసినాడలా.
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిలా.
ప్రేమ వెన్నెల రావె ఊర్మిలా..
నడవకే నువ్వలా కలలలో కోమలా
పాదమే కందితే మనసు విల విల
విడువకే నువ్వలా పలుకులే
గల గల
పెదవులే అదిరితే గుండె గిల గిల
అంతులేని
అంతరిక్షమంతు చూడకే అలా
నీలమంత దాచిపెట్టి వాలు
కన్నులా
ఒక్క సారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా ప్రాణమంత పొంగి పోయేలా..
ప్రేమ వెన్నెలా రావె ఊర్మిలా
ప్రేమ వెన్నెలా రావె ఊర్మిలా..

Movie - Chitralahari
Song - Prema Vennela
Music - Devi Sri Prasad
Singers - Sudharshan Ashok
Lyrics - Srimani

No comments:

Post a Comment