చిత్రం: బ్రోచేవారెవరురా (2019)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: హసిత్ గోలి
గానం: వివేక్ సాగర్, బాలాజీ దాకే, రామ్ మిరియాల, మనీషా ఈరబత్తిని
ఓయే వగలాడి వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి వగలాడి ఏ వగలాడి
పొద్దెక్కి నాదిక పలుకులాపమని
అంటావేంటే వయ్యారి
సురుక్కు మంటూ కుర్రమూకతో ఏంటో ఈ రంగేళి
ఓయే వగలాడి వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి వగలాడి ఏ
హే హల హల
హే హల హల
ససస సరికొత్తైన తమాషా
చవి చూసేద్దాం మరింత
సరిపోతుందా ముకుందా కవి శారదా
ఆ అంతో ఇంతో గురుందా
అంతేలేని కల ఉందా
సింగారించేయ్ సమంగా ఓ నారద హల
ఓయే వగలాడి వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి వగలాడి ఏ వగలాడి
మీరంతా గుంపు కట్టి
వెంటనే సూటిగొచ్చి పోయిన
రానురా నేను రానురా
హే పాత లెక్కలన్ని ఇప్పి చూపే పనిలే
నాకంత ఓపీకింక లేదురా
హే పలికినాదిలే చిలక జోశ్యమే
పనికిరామని మేమే
తెలిసి పిలిసే చిలకవు నువ్వే
కాస్త అలుసిక ఇవ్వే
అరె అప్పనంగా మోగే జాతరే
నువు ఒప్పుకుంటే వెలుగే ఊరే
అది సరికాదంటే వెనక్కి రాదే
మత్తెక్కి జారిన నోరే
వగలాడి వగలాడి (8)
కలుపు తోటలా తోటమాలినే
కులుకులాపిటు చూడే
ఈ కవితలన్ని కలిపి పాడితే
కనుక పటిక రాదే
మనకొచ్చినంత భాషే చాలులే
మరి కచ్చితంగా అది నీకేలే
నువు జతకానంటే మరొక్కమారే
వెనక్కి రాధిక పోవే
వగలాడి వగలాడి
వగలా... డి
వేటకెళ్లి సేతుపతిను
తప్పిపోతే అధోగతి
చింతపండేరో భూపతి
అంగడే నీ సంగతి (2)
వగలాడి వగలాడి
వగలా... డి

No comments:
Post a Comment