శ్రేయా ఘోషల్




ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..

శ్రేయా ఘోషల్‌ గురించి చెప్పడం అంటే ఆమె పాటల గురించి చెప్పడమే. సంగీతానికి.. శ్రేయాకు మధ్య విడదీయలేని ఒక అనుబంధం. తీయని గొంతుతో ఆమె పాడే పాటలు వినేవారికి మత్తెక్కించకమానవు. ఏ భాషలో పాడితే ఆ భాషను సొంతం చేసుకోవడం శ్రేయా ఘోషల్ మరో ప్రత్యేకత. బెంగాలీ అయిన శ్రేయా మొత్తం 14 భాషల్లో పాటలు పాడింది

శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం "దేవదాస్"తో ప్రారంభించారు. ఆమెకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. అలా ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.

ఆమె హిందీ లోనే కాకుండా దక్షిణాది భాషలలో ఎన్నో పాటలు ఆలపించారు. ఆమె, తమిళ్ చిత్రం 'ఆల్బం' లోని "చెల్లామే చెల్లామ్" అనే పాటతో దక్షిణ భారత చలన చిత్ర సీమ లోకి రంగప్రవేశం చేశారు. 'ఒక్కడు' చిత్రంలో "నువ్వేం మాయ చేసావో గాని " ఆమె మొదటి తెలుగు పాట. 'బిగ్ బి' చిత్రంలో "విదా పరయుకాయనో " శ్రేయ పాడిన మొట్ట మొదటి మలయాళ పాట. ఆమెకు ఇప్పటిదాకా ఆమె పాడిన హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ పాటలకు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు మరియు మలయాళం, తమిళ్ రాష్ట్ర పురస్కారాలు లభించాయి. 2010 సంవత్సరంలో ఆంగ్ల చిత్రమైన వెన్ హేరీ ట్రైస్ టు మేరీ ('When Harry Tries to Marry') లో ఆమె పాడారు.

జయసింహ (1955)




చిత్రం: జయసింహ (1955) 
సంగీతం: టి.వి. రాజు 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: ఘంటసాల, పి. లీల 

పల్లవి: 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి.. 

చరణం 1: 

నీ ఊహతోనే పులకించి పోయే.. ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. 
నీ ఊహతోనే పులకించి పోయే.. ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. 
నీ కోసమే ఈ అడియాశలన్ని.. నా ధ్యాస నా ఆశ నీవే కదా 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి.. 

చరణం 2: 

ఏ నోము ఫలమో ఏ నోటి వరమో.. ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. 
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో.. ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. 
మనియేములే ఇక విరితావిలీల.. మన ప్రేమ కెదురేది లేదే సఖి.. 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి.. 

చరణం 3: 

ఊగేములే తుల తూగేములే.. ఇక తొలి ప్రేమ భోగాలా.. 
ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే.. ఇక తొలి ప్రేమ భోగాలా.. 
మురిపాలతేలే మన జీవితాలు.. 
మురిపాలతేలే మన జీవితాలు.. దరహాస లీలావిలాసాలులే.. 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ.. 
ఈనాటి ఈ హాయి..
************** *********** *************** **********

చిత్రం : జయసింహ  (1955)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపథ్య గానం : సుశీల 


పల్లవి : 

నడిరేయి గడిచేనే చెలియా...
రాడాయెనే సామి... నా సామి
రాడాయెనే సామి... నేడూ

నడిరేయి గడిచేనే

ఎదురు తెన్నులు చూచి చూచి..ఓ... చెలియా వానికై వేచి వేచి నేడు
నడిరేయి గడిచేనే చెలియా... రాడాయెనే సామి... నేడూ

నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...


చరణం 1 : 


గగనాన నెలరేడు దిగజారిపోయె
సిగలోని విరులన్ని పసివాడిపోయె...
గగనాన నెలరేడు దిగజారిపోయె
సిగలోని విరులన్ని పసివాడిపోయె... 


దిగులాయనే... ఏ..ఏ..ఏ...ఏ..
దిగులాయనే... మది వగలే మిగులాయే...
మగరాయడే వాడ మనలేనో నేడూ...

నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...


చరణం 2 :

గడిపా పడిగాపు పడియుండలేనే
ఘడియొక్క యుగమూగా గడుపగా లేనే
గడిపా పడిగాపు పడియుండలేనే
ఘడియొక్క యుగమూగా గడుపగా లేనే


ఎడబాటుతో.. ఓ..ఓ..ఓ..
ఎడబాటుతో... గమరిస రిసనిసదప గమరిగమ
ఎడబాటుతో.... సా..నీ..దా..సానీ సనిదపమ... నిదప నిదపమగ
మపమగమగమ పదప మపమస
దనిద పద పద నినిసని పపదమప

ఎడబాటుతో ఈ సడిలేని రేయి
కడలేని కన్నీరై నిలువాగలేనే 


నడిరేయి గడిచేనే చెలియా... రాడాయెనే సామి... నేడూ
నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...

****************** ***************** ****************

చిత్రం : జయసింహ (1955)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల  


పల్లవి : 


జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా
జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా

త్రిభువనజన నయనాభిరామా
త్రిభువనజన నయనాభిరామా
జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా


చరణం 1 :


తారకనామా...
తారక నామా... దశరథరామా
తారక నామా... దశరథరామా
దనుజవిరామా...  పట్టాభిరామా
దనుజవిరామా...  పట్టాభిరామా

జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా


చరణం 2 :


రామా రఘుకుల జలనిధిసోమా
రామా రఘుకుల జలనిధిసోమా... భూమిసుతాకామా
రామా రఘుకుల జలనిధిసోమా... భూమిసుతాకామా

కామితదాయక కరుణాధామా
కామితదాయక కరుణాధామా
కోమల నీల సరోజ శ్యామా
కోమల నీల సరోజ శ్యామా


జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా

త్రిభువనజన నయనాభిరామా
త్రిభువనజన నయనాభిరామా
జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా



************ * *************** *************************
చిత్రం : జయసింహ (1955)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : రావు బాలసరస్వతి,  ఏ.పి. కోమల

పల్లవి : 
ఆ.. ఓ..ఓ.. ఓ... 

మనసైనా చెలీ పిలుపూ...
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా 

మనసైనా చెలీ పిలుపూ ... 

చరణం 1 :


పిలిచే నిన్నే నే వలచాననా బిగిసేరూ మగవారలూ
పిలిచే నిన్నే నే వలచాననా బిగిసేరూ మగవారలూ
ఓ..ఓ.. ఓ...

తలచేరులే చెలి నిను చౌకగా...  వలచేనే ననూ జాబిలీ
ఓ..ఓ.. ఓ... అదొ నవ్వేను నను చూచి...

అదొ నవ్వేను నను చూచి... నను కవ్వించి ఆడేను దోబూచి ...
అదొ నవ్వేను నను చూచి...


చరణం 2 :

లే నవ్వుల తొలి లాలింతురే...  తుది కన్నీట తేలింతురే
లే నవ్వుల తొలి లాలింతురే...  తుది కన్నీట తేలింతురే
ఓ..ఓ.. ఓ...

నమ్మేదెలా మనసమ్మేదెలా మనసనాడో ఆ రాజు సొమ్మాయెనే
ఓ..ఓ.. ఓ...


మనసైనా చెలీ పిలుపూ...
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా
మనసైనా చెలీ పిలుపూ...