Showing posts with label ఆరాధన (1987). Show all posts
Showing posts with label ఆరాధన (1987). Show all posts

ఆరాధన (1987)

చిత్రం: ఆరాధన (1987)

సంగీతం: ఇళయరాజా

నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి :

తీగనై మల్లెలు పూచిన వేళ.. 

ఆగనా.. అల్లనా.. పూజకో మాల..

మనసు తెర తీసినా.. మోమాటమేనా 

మమత కలబోసినా.. మాట కరువేనా

తీగనై మల్లెలు పూచిన వేళ 

ఆగనా అల్లనా పూజకో మాల

చరణం 1 :

తెలిసీ.. తెలియందా?

 ఇది తెలియక జరిగిందా?

ఎపుడో జరిగిందా?  

అది ఇపుడే తెలిసిందా? 

ఆశ పడ్డా అందుతుందా.. అర్హతైనా ఉందా? 

అందుకున్నా పొందికుందా.. పొత్తు కుదిరేనా?

ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా?

తెంచుంకుంటే తీరుతుందా..  పంచుకొంటే మరిచేదా?

చరణం 2 :

కలలో మెదిలిందా?

 ఇది కథలో జరిగిందా?

మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా?

రాసి ఉంటే తప్పుతుందా.. తప్పు నీదవునా?

మారమంటే మారుతుందా.. మాసిపోతుందా?

చేసుకున్నా పుణ్యముందా.. చేరుకొనే దారి ఉందా?

చేదుకొనే చేయి ఉందా.. చేయి చేయి కలిసేనా?

తీగనై మల్లెలు పూచిన వేళ.. ఆగనా.. అల్లనా పూజకో మాల

మనసు తెర తీసినా మోమాటమేనా.. మమత కలబోసినా మాట కరువేనా

తీగనై మల్లెలు పూచిన వేళ.. ఆగనా.. అల్లనా పూజకో మాల

చిత్రం: ఆరాధన (1987) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

అరె ఏమైందీ ... 
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ 
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ 
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది 
అది నీలో మమతని నిద్దురలేపింది 
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ 
అది ఏమైందీ ... 

చరణం 1: 

నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది 
నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచ్చింది 
పూలు నేను చూడలేదు పూజలేమి చేయలేదు 
నేలపైన కాళ్ళు లేవు నింగి వైపు చూపు లేదు 
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో 
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో 
అది దోచావో... 

అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ 
అది ఏమైందీ ... 

చరణం 2: 

ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది 
పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది 
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు 
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు 
రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో 
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు 
మనిషవుతాడూ... 