Showing posts with label 2008. Show all posts
Showing posts with label 2008. Show all posts

సూర్య s/o కృష్ణన్ (2008)

 



చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)

సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: హారీస్ జయరాజ్, హరీష్ రాఘవేంద్ర, వి. వి. ప్రసన్న, దేవన్ ఏకాంబరం

నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా...

నీతో పొంగే వెల్లువా 
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన...

ఓం శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే 
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యవే

నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా...

ఏదో ఒకటి నన్ను కలచి
ముక్కు చివర మర్మమొకటి
కల్లా కపటం కరిగిపోయి
ముసి నవ్వా బూగమెల్ల
నువ్వు నిలిచిన చోటేదో వెలయంతో పలికెను
నువ్వు నడిచే బాటంతా మంచల్లే అయ్యెనో
నాతోటి రా ఇంటివరకు
నా ఇల్లే చూసి నన్ను మెచ్చు
ఈమె ఎవరో ఎవరో తెలియకనే
హా వెనకే నీడై పోవద్దే
ఇది కలయో నిజమో ఏ మాయో
నా మనసే నీకు వశమాయె - వశమాయె

నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా...

నీతో పొంగే వెల్లువా 
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన...

కంటి నిద్రే దోచుకెళ్లావు
ఆశలన్ని చల్లి వెళ్లావు
నిన్ను దాటి పోతూ ఉంటే
వీచే గాలి దిశలు మారు
ఆగంటు నీవంటే నా కాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్ని వశివాడవు ఏ నాడు
కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువ్వు లేవు లేవు అనకుంటే
నా హృదయం తట్టు కోలేదే

నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా...

నీతో పొంగే వెల్లువా 
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన...

ఓం శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే 
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యవే


చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: సుధా రఘునాథన్

నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ  క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా... 

నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ  క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా... 

చరణం: 1
వయసంతా వసంత గాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారిదారి
చిగురులతో చిలకలతో
యమునకు కే సంగమమే
కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై
నిలిచినది తనకొరకే
పడినముడి పడుచోడి
ఎదలో చిరుమువ్వల సవ్వడి 

నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ  క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా... 

చరణం: 2
అభిమానం అనేది మౌనం
పెదవులపై పలకదులే
అనురాగం అనే స్వరాగం
స్వరములకే దొరకదులే
నిను కలిసిన ఈ క్షణమే
చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే
పులకరించే ఎద రగిలే
యెదుటపడి కుదుటపడే 
మమకారపు నివాళిలే ఇది

నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ  క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా... 


చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: నరేష్ అయ్యర్, ప్రశాంతిని

మొన్న కనిపించావు మయమరచి పోయాను 
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే 
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక 
ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన 

ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత

మొన్న కనిపించావు మయమరచి పోయాను 
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే

చరణం: 1
త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే 
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ 
భలే ప్రేమ చూసిన నేను 
హత్తుకోక పోతానా అందగాడా
ఓ... నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలీ
పొగవోలె పరుగున వస్తా తాకనే చెలీ
వేడుకలు కలలు నూరు వింత ఓ చెలి

మొన్న కనిపించావు మయమరచి పోయాను 
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే

చరణం: 2
కడలి నీళ్లు పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటోంది ఈ వేళలో 
తల వాల్చే ఎడమిచ్చావే 
వేళ్ళు వేళ్ళు కలిపేశావే 
పెదవికి పెదవీ దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే
హృదయమంత నిన్నే కన్నా దరికే రాకనే 
నువ్వ్వు లేక నాకూలేదు లోకమన్నది

మొన్న కనిపించావు మయమరచి పోయాను 
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన 

ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత

వెన్నెలా... వెన్నెలా...  వెన్నెలా...

ఎర్రసముద్రం (2008)




మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు...
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు.
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..
యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు...
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు...

నిలువెత్తు స్వార్ధము నీడలా వస్తుంటే.
చెడిపోక ఏమైతడమ్మా.. చెడిపోక ఏమైతడమ్మా...
ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల.
దిగజారుతున్నడోయమ్మా..దిగజారుతున్నడోయమ్మా...
అవినీతి పెనుఆశ అందకారము లోన..
అవినీతి పెనుఆశ అందకారము లోన...
చిక్కిపోయి రోజు శిదిలమౌతున్నాడు
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు...

ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు.
కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు..
కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు...
వుట్టికి స్వర్గాని కందకుండగ తుదకు.
అస్తిపంజరమై అగుపించనున్నాడు..
అస్తిపంజరమై అగుపించనున్నాడు...
కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ..
కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ...
కనుబొమ్మ లెగిరేసి కాలగమనములోన
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు...

ఇరువై అయిదు పైసల అగరోత్తులు గాల్చి.
అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు..
అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు...
దైవాల పేరుతో చందాలకై దంద.
భక్తి ముసుగు తొడిగి భలే ఫోజు వెడుతాడు..
భక్తి ముసుగు తొడిగి భలే ఫోజు వెడుతాడు...
ముక్తి పేర నరుడు రక్తి లో రాజయ్యి..
ముక్తి పేర నరుడు రక్తి లో రాజయ్యి...
రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు...
మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు.
మానవత్వము ఉన్నవాడు.. మానవత్వము ఉన్నవాడు...

చిత్రం :  ఎర్రసముద్రం (06.03.2008)
తారాగణం : ఆర్. నారాయణ మూర్తి
గీతరచయిత : అందెశ్రీ
నేపధ్య గానం : వందేమాతరం 

నేనింతే (2008)

చిత్రం: నేనింతే (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రఘు కుంచె


ఓ నో నో నో నో నో నో... ఓ నో నో నో నో నో నో
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక
ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో…
నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్

ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక

మిల మిల మిల మిల మెరుపుల తార
కలలకు కళ కళ చిలికిన తార
తళ తళ తళ తళ తళుకుల తార
గల గల నగవుల చిలిపి సితార
ఏమంటే ఎందుకంటే కారణాలే లేవంట
నాకంటే ఇష్టమంట నువ్వంటా
నా కంటిముందే ఉంటే చాలనుకున్నా
నువు దూరమైతే ఏదో అయిపోతున్నా

ఓ నో నో నో నో నో నో…
నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్

ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక

నిగ నిగ సొగసులు కురిసిన తార
చనువుగ మనసును తడిపిన తార
తలపుల తలుపును కదిపిన తార
యదసడి పలికిన వలపు సితార
తేదీలే మారుతున్నా నిన్నలో నే ఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితార నువ్వుండాలే పైనా

ఓ నో నో నో నో నో నో…
నువ్వే నా సంతోషం గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు ద డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక ఏమిబాలేదే నువ్వెళ్ళాక
ఏంచెయ్యాలో పాలుపోక ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో... ఓ నో నో నో నో నో నో

కృష్ణ (2008)

చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శివాణి, వాసు


అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువై
నా గుండెలుతడి వెయ్యవా ఓ గొలుసువై
నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వై
నీ చీకటి కరిగించనా కొవొత్తినై
నీ భయమును తొలిగించనా తాయతునై
నీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనై
వేలే పట్టెయ్ ఉంగరమయ్యి నాతో తిరిగెయే బొంగరమయ్యి
ఒళ్ళే మోసెయ్ పల్లకివై నన్నే దాచెయ్ బంగరమయ్యి
ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా
ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా

ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా (3)

నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై
నా నోటికి రుచిలియ్యవానారింజ నీవై
నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై
ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై
నీ ఆశలు తగ్గించనా వలదిళ్ళునేనై
ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపెంగివై
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై
ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా
ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా (3)



***********  ************   ************



చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కునాల్, మహలక్ష్మీ అయ్యర్

దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె మోర్‌ మోర్‌
ఇన్నాళ్ళు బోర్‌ బోర్‌ ఇవ్వాళ జోర్‌ జోర్‌
పట్టాపట్టా నీ ఫోన్‌ నెంబర్‌ పట్టా పట్టా నీ డోర్‌ నెంబర్‌
పట్టన వేళ గుండెకు అయ్యే ఫంచర్‌
చిట్ట నవ్వే సెంటిమీటర్‌ పొట్టి నడుమే మిల్లిమీటర్‌
ఇట్టానన్ను పెట్టేసావే తార్చర్

వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే
ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే
నన్ను ముంచేశావే నీలో నా గుండె దడ
ఇక పెంచేశావే నాలోనా గుండె దడ
నీ మూడే చూశాలే నీ స్పీడే చూశాలే
నే తోడా తోడా సర్దేస్తే నువు తేడా తేడాహే

నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేశావే
మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే
ఓ జెంటిల్‌ మేన్‌లా ఉన్నా నే నిన్నటికి
నన్ను మెంటల్‌ మేన్‌లా మార్చావే ఆఖరికి
నువ్వంటే మంటహే నీతోటి తంటాహే
నా వెంటే ఇట్టా పడుతుంటే టెమిటైపోతాలే



************  ************   ************



చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కౌశల్య, ఫరీద్

మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా
మనసొదిలేసానే నీలోనా
మురిపించేమైనా నా మైనా మైనా
మతిపారేసావే నీ పైనా
నువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా
నీతోనే నడిచొస్తానా హే వెయ్యనా
చెయ్యి వేస్తే నే చిలికవుతున్నా రాస్తేనే పరికవుతున్నా
చేస్తే నీ చెలి మవుతున్నా సరేనా
తు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా

నచ్చావే నువ్వే నాకు చాన పాప
ఇచ్చెయేనా నేనే నీకు రాజ్యాలైనా
నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా
యమధర్జాగున్నా రవితేజం మిన్నా
పోనా పోనా వరదల్లె పొంగిపోనా
కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా
తు లకజు తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా

తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన
మురిపిస్తా నీపై నేను తారల వాన
ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా
నీ మగసిరి మిన్నా నా ముద్దుల కన్నా
జాన జాన కాజెయ్య నా ఖజానా
ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన
తు లకజా తు లకజా లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా లకజా జానే జానా



***********  ************   ************



చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ
తిప్పుకుంటుతిరిగావే నీ ఒంపులు ఊడిపడా
దొంగ చూపు చెబుతుంటే నీ రంగు పెదవి చెబుతుందే
తిక్క నడక చెబుతుందే తై తక్కనడుము చెబుతుందే
నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ

ఎపుడెప్పుడో ఇంకెప్పుడే నీకు నాకు లింకెపుడే
ఎపుడెప్పుడే లవ్వెపుడే నీలో ఒంటికి జివ్వెపుడే
వయసై పోతే ఉడికే ఐసైపోతే
మోజే పోతే కోరిక క్లోజైపోతే
తెలుపవుతుంది తల్లోని జుట్టు వదులవుతుంది ఒంట్లోని
పట్టు అనవసరంగా చెయ్యద్దు బెట్టు అందాలన్ని నా చేత
పెట్టు అతి చెయ్యకుండా

అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే
పైపైనే పంతాలే లోలో తకధిం దింతాలే
వదిలెయ్ అంటే అర్ధం ఇంకా వాటెయ్
నోర్ముయ్ అంటే అర్ధం పెదవే కలిపెయ్
గసిరామంటే కవ్వించినట్టు నసిగా మంటే ఉసిగొలిపినట్టు
తిట్టామంటే తెర తీసినట్టు కొట్టామంటే కను నింపినట్టు
తెలిసిందే జాన



***********  ************   ************



చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రఘుకుంచె, కౌశల్య

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్
తరత్తా మంతరమేస్తా తరత్తా మత్తెకిస్తా తరత్తా పిచ్చెకిస్తా
గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్
ఓ బేబి ఓ బేబి సత్తా చూపిస్తా బేబి
ఓ బేబి ఓబేబి శభాష్ అనిపిస్తా బేబి
నా కోరికనంతా ఓ కొడవలి చేస్తా నీకులుకులు మొత్తం
నే కోసుకుపోతా
రారా కృష్ణా రాధాకృష్ణా బరిలేని ఫన్నీ కృష్ణా
ఛీ పో కృష్ణా సిల్లి కృష్ణా పరువాన్ని కొల్లే కృష్ణా

ఎండ లోన ముద్దిస్తా మై వానలోన వాటేస్తా
ఇక ఎండ వాన కలిపొస్తే ఆ పండు చేతికిస్తా
ఉత్తరాన ఊపేస్తా ఇక దక్షిణాన దులిపేస్తా
ఇక వాస్తు చూసుకోకుండా నీ ఆస్తి కరగదీస్తా
నీ దూకుడు తగ్గిస్తా నా చెడుగుడు సాగిస్తా
పిల్లగోనే తిప్పులు పెడతా పిల్లగో సరి హద్దులు పెడతా
పిల్లగో నిన్ను అల్లాడిస్తా ఆడిస్తా
పిల్లోనే తొందర పెడతా పిల్లో నే పంతంపడతా
పిల్లో నేపైపై కొస్తా పీడిస్తా
రారా కృష్ణా రాధాకృష్ణా రెచ్చావు రౌడి కృష్ణా
గోపికృష్ణా అగ్ని కృష్ణా నాతీపికోరే కృష్ణా

ఊరుకుంటె ఒకటిస్తా నువ్వు కోరుకుంటె రెండిస్తా
ఆ మూడు ముళ్ళు నువ్వేస్తే నా ఏడు జన్మలిస్తాం
అడుగుతుంటే ఇంతిస్తా నువ్వు అడుగకుంటే కొంతిస్తా
నా అడుగులోనా అడుగేస్తా బ్రతుకంతా ధారపోస్తా
నా గడపన దాటొస్తా రా రా రారాటు పిల్లోదాటేస్తా
పిల్లగో నీవేలే పడతా పిల్లగో మురిపాలే పడతా పిల్లగో
సగుపాలై పోతా లాలిస్తా
పిల్లో నీ బరువైనస్తా పిల్లో యెద పరుపే వేస్తా
పిల్లో పిల్లోడిని ఇస్తా కవ్విస్తా
రా రా కృష్ణా రాధాకృష్ణా నచ్చావు నాజికృష్ణా
పెళ్ళి కృష్ణాక్రేజి కృష్ణా నీ ప్రేమ నాదే కృష్ణా


************  ************   ************


చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సాధన సర్గమ్

తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా
తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా
తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమా
తుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమా
తుహిమేరా సర్వస్వమా
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా

నాబడి నువ్వే నా గుడి నువ్వే నా ఒడి నువ్వేగా
ఈ అమ్మవొడి నువ్వేగా
నానా గుస నువ్వే నాదశ నువ్వే పదనిస నవ్వేగా
పడుచు నస నువ్వేగా
కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే
నువ్వే దక్కే దూరమా నువ్వే తేలిక భారమా
తుహిమేరా ఆ భారమా
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా

నాసిగ నువ్వే నాసెగ నువ్వే నా పొగనువ్వేగా
చిలిపి పగనువ్వేగా
నాసిరి నువ్వే నా తరి నువ్వే నా సరి నువ్వేగా
అసలు గురి నువ్వేగా
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా

బలాదూర్ (2008)

చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్

నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడా
ఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడా
నువ్వు కొంచం తేడా నీ నడక కొంచం తేడా
నీ సరుకు కొంచెం తేడా నీ శకలు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావే అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా

చీర చుట్టుకొని రమ్మంటే వోణి కట్టుకొని వస్తావు
వోణి కట్టుకొని రమ్మంటే నైటీ లోనే వస్తావు
గేటు తీసుకొని రమ్మంటే గోడదూకి నువ్వొస్తావు
గోడదూకి నేను రమ్మంటే కిటికీ లోంచే వస్తావు
అందరుంటే కొంతే తేడా ఒంటిగుంటే చాలా తేడా
పట్టపగలు కొద్దిగ తేడా చీకటైతే బాగా తేడా
ఎంతని ఎన్నని చెప్పలోయ్ ఒకటా రెండా ముడా

నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడా
ఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా

హే రపప్పా... హే రపప్పా...
హే రపా రపా రపా రపా హే రపా రపా
హే రపా రపా రపా రపా హే రపా రపా ఆ...
బల్లవేసి బజ్జోమంటే మంచమేయ్యమని అంటావు
మంచమేసి నిదరోమంటే నన్నే ముంచేస్తుంటావు
బుగ్గపైన చెయ్యేస్తుంటే సిగ్గు అంటు అటు జరిగేవు
సిగ్గు అనుకొని వెళుతుంటే సిగ్నల్స్ ఏవో ఇస్తావు
తప్పు అంటే మినిమం తేడా ఒప్పుకుంటే మొత్తం తేడా
బుజ్జగిస్తే స్వల్పం తేడా రెచ్చగొడితే సర్వం తేడా
ఈడును ఎక్కడ దాచాలోయ్ ఎడా ఈడా ఏడా

నువ్వు కొంచం తేడా నీ పనులు కొంచం తేడా
నీ కథలు కొంచెం తేడా సంగతులు కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడా

నువ్వు కొంచం తేడా నీ రూటు కొంచం తేడా
నీ టేస్ట్ కొంచెం తేడా నీ బుద్ది కొంచెం తేడా
అందుకనే నువు నచ్చావే అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా


*********   *********   **********


చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సుజాత మోహన్

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరి రానా తెర తెంపేయనా
శాన పరిశాన సిరి వంపేయన
కానా జతకాన చలి చెంపేయన
మైనా తడిమేయ్ నా తడి సంపాదన
నాకు నీకు నీకు నాకు వానే కదా వంతెన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా

ఊదిలాగ ఒకటి అరె సూదిలాగ ఒకటి
చిరుచినుకులన్ని కురిసే ఈ పైనా
బంతిలాగా ఒకటి అణుబాంబు లాగ ఒకటి
తొలి చినుకులన్ని తగిలాయి లోన
చేయాలంది వాన నీతోనే రవాణా
చూడాలంది వాన నీలోనే దిఖానా
బావిలోన నిలిచిపోర మనసుపైకి నిచ్చన

చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా

చినుకు చీర కట్టి అరె ఒణుకు పూలు పెట్టి
వరదల్లే కదిలి వస్తుంది జాణ
మబ్బు గొడుగు పట్టి మెరుపిట్ట అడుగుపెట్టి
హరివిల్లులాగ ఒళ్లే పరిచేనా
ముంచేసింది వాన నీతోని సుఖానా
పంచేసింది వాన నాలోని నమూనా
వాన లాగా చల్లిపోన వలపు మూల మూలన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరి రానా తెర తెంపేయనా
శాన పరిశాన సిరి వంపేయన
కానా జతకాన చలి చెంపేయన
మైనా తడిమేయ్ నా తడి సంపాదన
నాకు నీకు నీకు నాకు వానే కదా వంతెన

రంగు రంగు వాన ఇది నంగణాచి వాన
నను ముట్టుకుంటే ముద్దై పోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా



*********   *********   **********


చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య, చిత్ర

గుండెలొ ఇల్లుంది ఇంట్లొ చొటుందీ
అందులొ నువ్వె వుంటావా అతిగా ముద్దె ఇస్తావా
గుండెలొ ఇల్లుంటె ఇంట్లొ చొటుంటె
అందులొ నెనె వుంటాగా అతిగా అతిగా నన్నె ఇస్తగా
వెంటనె త్వరపడి వస్తావ
నూరెళ్ళుండె నొటె రాస్తవ వ వ వ వ

నెపురు వయ్యరి దెయ్యం
నీవైపు చూస్తెనె భయం
అయ్యింది నీతొటి కయ్యం
అది ప్రెమకు ప్రారంభం
తీరంగ చూసావు సొద్యం
తగ్గింది నాలొని పైత్యం
ఇది ఇద్దరి సంబందం
మయ్యల నువ్వె ఒచ్చి హాయినె తెచ్చవా
మంత్రమై నువ్వె ఒచ్చి మత్తులొ ముంచవా
కొపించి తప్పించి నాలొన వ్యాపించి ప్రెమ పంచవా

ఇన్నళ్ళు నువ్వంటె భారం
ఒళ్ళంత పూసావు కారం
ఇవ్వళె వెసావు హారం
ఇక నువ్వె నా తీరం
ఇన్నళ్ళు పెట్టాను శాపం
ఇలొన పెట్టాను కొపం
తెలిసింది నాలొని లొపం
ఇక నువ్వె నా లొకం
ఎండల నువ్వె ఒచ్చి నీడల మారవా
ఉప్పెనై ముందె ఒచ్చి ఊయలై చెరవా
సాదించి వాదించి ఆపైన స్పందించి
ప్రాణం అయ్యవా

శశిరేఖ పరిణయం (2008)

చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాహుల్ నంబియర్



ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన
ఎదో గుండెలోని కొంటె భావనా
అలా ఉండి పోక పైకి తేలునా
కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన బ్రాంతివో
కలవనిపించిన కాంతవో ఒహొ ఒహ్ ఒహూ
మతిమరపించిన మాయవో మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో ఒహొ ఒహ్

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన
ఎదో గుండెలోని కొంటె భావనా
అలా ఉండి పోక పైకి తేలునా

చరణం: 1
శుభలేఖల నీకల స్వాగతిస్తుందో
శశిరేఖల సొగసెటు లాగుతూ ఉందొ ఒహొ ఊఒ
తీగల అల్లగ చేరుకొనుందూవో
జింకల అందక జారిపొనుందొ
మన్సున పొచిన కొరిక పెదవుల అంచును దాటక
అదుముతు ఉంచకె అంతగ ఒహ్...
అనుమతి నివ్వని ఆంక్షగ నిలబడనివ్వని కాంక్షగ
తికమకపెట్టగ ఇంతగా ఒహ్...

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన

చరణం: 2
మగ పుట్టుకే చేరని మొగలి జడలోనా
మరు జన్మగా మారని మగువు మెడలోన ఒహ్...
దీపమై వెలగని తరుని తిలకాన
పాపనై ఒదగని పడతి ఒడిలోనా
నా తలపులు తన పసుపుగ నా వలపులు పారణిగా.
నడిపించిన పూదారిగా ఒహ్...
ప్రణయం విలువె కొత్తగ పెనిమిటి వరసె కట్టగ
బతకగనేనే నేర్పానుగా ఒహ్...


***********  ***********  ************


చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని కొలువుంచె మంత్రం నీవవని
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వె నెలవు తీరేలా
నూరెళ్ళు నన్ను నీ నివేదనవని

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని

చరణం: 1
వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమని చెరను దాటించె రామ చంద్రుడా
రాధ మదిని వేదించె శ్యామ సుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని

చరణం: 2
ఆశ పెంచుకున్న మమతకు ఆదారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాప గలిగిన కైలశమా
కొంగు ముళ్ళులోన ఒదిగిన వైకుంటమా
ప్రాయమంత కరిగించి దారపోయన
ఆయువంత వెలిగించి హారతియ్యనా...

నిన్నే నిన్నే  నిన్నే ...
ఓ నిన్నే నిన్నే  నిన్నే ...



***********  ***********  ************



చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రంజిత్

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు
ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ...
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2)

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

ఓ చెలీ...  ఓ చెలీ... ఓ చెలీ... నా చెలీ (2)

చరణం: 1
నిన్నా ఎంచక్కా ఉన్నా మొన్నా దర్జాగా ఉన్నా
ఇవ్వాళ ఏమైందే
గాలే కాటేసినట్టు పూలే కరిచేసినట్టు
ఏదేదొ అవుతుందే
ఎర్రా ఎర్రాని చెంపల్లో సింధూరాలెన్నో చేరాయీ
ఉఱ్ఱూతలూగే ఊహల్లో గందాలే నింపుతున్నాయి...

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ...
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2)

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

Baby you are driving me crazy..
where can you where can you be
why don't you show up and make life easy..

Baby you are driving me crazy..
where can you where can you be
why don't you show up and make life easy..

ఓ చెలీ...  ఓ చెలీ... ఓ చెలీ... నా చెలీ (2)

చరణం: 2
ఇంకా నా వల్ల కాదు ఇంకో క్షణమైనా నన్ను నేనాపలేనేమో
నీకై ఆరాటాలన్నీ నాతో తారాడుతుంటే నే తాళలేనమ్మో
నీ నోట రాని నా పేరే  నాదైనా నాకే చేదేలే
నీ సొంతం కానీ ఈ జన్మే నీరంటూ లేని గోదారే...

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు
ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ...
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2)




***********  ***********  ************

చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైందవి

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
ఉబికి వస్తుంటె సంతోషం అదిమి పెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేను నా వెనక తాను
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం

ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం


ముల్లుల బుగ్గను చిదిమిందా
మెల్లగ సిగ్గును కదిపిందా
వానల మనసును తడిపిందా
వీణల తనువును తడిమిందా

ముల్లుల బుగ్గను చిదిమిందా
మెల్లగ సిగ్గును కదిపిందా
వానల మనసును తడిపిందా
వీణల తనవును తడిమిందా

చిలిపి కబురు ఏం విందో
వయసుకెమి తెలిసిందో
చిలిపి కబురు ఏం విందో
వయసుకెమి తెలిసిందో
ఆద మరుపో, ఆటవిడుపో
కొద్దిగా నిలబడి చూద్దాం
ఆ క్షణంకంటె కుదరంటొంది నా ప్రాణం
కాదంటె ఎదురు తిరిగింది నా హృదయం



********  *********  ********


చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైందవి

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం
కలత పడుతోందే లోలోన కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను నా దిగులు తాను
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం

ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం

పచ్చగ ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా
పచ్చగ ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా

ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా
తప్పటడుగో తప్పుఅనుకో తప్పదే తప్పుకుపోదాం
తక్షణం ఎంతో పట్టుపడుతోంది ఆరాటం
పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం

ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)



చిత్రం: ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సోను నిగమ్, రాహుల్ నంబియర్


ఎంత అందమో ఎంత అందమో
నమ్మలేను నా కళ్ళని
ఎంత  సేపిలా ఎంత చూసినా
నిన్ను వీడి నే వెళ్లనే
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా

ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

సఖి చెలి సఖి చెలి  సుధామాధురి
నిజానికి నువ్వే మరి సదా నా సిరి
గులాబీలో శ్వాసే చేరగా చలాకీగా నీలా మారదా
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
హో చామంతి కైనా పూబంతి కైనా లేదు ఇంత సున్నితం

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా

ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియా అని ప్రియా అని పిలుస్తావని
నరాలలో  ప్రతి కణం నిరీక్షించని
సరాగమా నీపై ధ్యాసతో
ప్రతి క్షణం ఉన్నా ఆశతో

ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
ఓ బేబీ యు ఆర్ మై లైఫ్ ఐ కెన్ ఫీల్ యు ఎవ్రీ టైం
హో నీ చేతిలోన ఉన్నాయి నేడు నా చేతి గీతలు

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా

ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాక తీసుకెళ్తావా

హీరో (2008)




చిత్రం: హీరో (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హరిచరన్ , ప్రియ


కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే (2)

వలపంటే అదే .. నీ వలనే అనీ
కలిగిందే అనీ .. వయసన్నదీ

వయసంతా .. పెదవుల్లో
కదిలిందే ఏదో .. కోరిందే
కదిలే ఈ కాలం .. ఆగిందే

కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే

ఊపిరిలో ఆవిరులే వేసాకాలం
వేసవిలో నీ చెలిమే శీతాకాలం
కలకాలం .. కలగాలీ .. కులుకుల్లో జ్వరం
కలిగే .. ఆ జ్వరమే .. ఉడికించే వరం

ఎన్నో వరములనే నువ్వే ఇస్తున్నా
ఇంకా ఇంకొకటీ కావాలంటున్నా !

కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే

ఇంకొకటీ వేరొకటీ నాదౌతుంటే
ఇప్పటికీ ఇచ్చినదీ ఇంకా కొంతే
ఇది కొంతే .. అనుకుంటే .. ఇక ఇస్తాను నా
ప్రాణం .. అది చాలా .. మరి ఈ జన్మకీ

ప్రాణం లో వెలిగే ప్రేమే కావలెనే
ప్రేమించే మదిలో చోటే కావలెనే

కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే (2)

ఆటాడిస్తా (2008)




చిత్రం: ఆటాడిస్తా (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సూరజ్ జగన్

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

పంచె లోన పవరే అది ఉన్నవాడనే స్టైలే
పంచి ఇచ్చెమనసే కలిగున్నవాడినే స్టైలే
ప్రోబ్లేమ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ
డేంజర్ తో స్టెప్స్ వేస్తూ
స్టైలిష్ గా స్మైలే ఇస్తే స్టైల్ స్టైల్...
ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

బ్రాస్లెట్ కాదు రిస్ట్ వాచ్ కాదు
హెల్ప్ చేసే హ్యాండే సూపరు
వాలు కళ్ళు కాదు చేపకళ్ళు కాదు
జాలి ఉన్న కళ్ళే సూపరు
ట్రెండులెన్నో మారుతున్నా
ఫ్యాషనంటే పడి చస్తున్నా
ట్రెడిషనేది మారని వాడిదే   స్టైల్.. స్టైల్..
పాలరాయి ప్యాలస్ ఉన్నా
స్విమ్మింగ్ ఫూల్ లో పన్నీరు ఉన్నా
ముగ్గు వేసే కల్చరుంటే స్టైల్.. స్టైల్..

ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

షర్ట్ కి షర్ట్ కి మధ్య గాప్ లుంటే ఓకే
హార్ట్ కి హార్ట్ కి మధ్య గాప్ నో
హ్యాండ్ ను హ్యాండు ను తాకే టచ్చింగ్ ఉంటే ఓకే
లిప్ కి లిప్ టచ్చింగ్  నో నో
3 స్టార్ లో లంచ్ చేసుకో
5 స్టార్ లో డిన్నర్ చేసుకో
ముద్దపప్పులో ఆవకాయే స్టైల్.. స్టైల్..
పబ్బులోన మగ్గే వేసుకో
క్లూబ్లో న బెగ్గే తీసుకో
కోనసీమ కొబ్బరి వాటర్ స్టైల్.. స్టైల్..

ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

రెచ్చిపో (2009)

చిత్రం: రెచ్చిపో (2009)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల (All)
గానం: గీతామాధురి


ఎత్తుకో నన్ను ఎత్తుకో  ముప్పుటల ముద్దెట్టుకో
నా కొంపకి నిప్పెట్టుకో రా రా..
చుట్టుకో చెయ్యట్టుకో మడికట్టునే చెడగొట్టుకో
నసపెట్టక రసపట్టుకె రా రా..
దందస దందస ధమాయించు తానిషా
జల్దీసే అందించేయ్ భరోసావచ్చశా
మసాల నిషాలో కసే రేగి
పట్టే నా లో ఈ దురాశ

ఎత్తుకో నన్ను ఎత్తుకో  ముప్పుటల ముద్దెట్టుకో
నా కొంపకి నిప్పెట్టుకో రా రా..
చుట్టుకో చెయ్యట్టుకో మడికట్టునే చెడగొట్టుకో
నసపెట్టక రసపట్టుకె రా రా..

సిగ్గేసింది కిక్ రా గోలచేసింది హుక్ రా
నా దిక్కు ముక్కు అన్ని నువ్వే రా
అందం చెక్ బుక్ రా
అది పొందే హక్కు నీదిరా
చెక్కే చెక్కి చోరీ చేసై రా..
వారెవ్వా బాగుంది రా
ఈ మైకమే అదిరింది రా
సరిహద్దులే చెరిపేయరా రారా
అందులో ఇంత ఉందని
నాకు ఇప్పుడే తెలిసింది రా
మహా మత్తులో ముంచేయరా మగాడా

గుండెల్లో గాబరా ఇంకా తగ్గేలాగ లేదురా..
లిప్ లిప్ లింకే పెట్టేరా
నా గల్లీ గల్లీ నీదిరా
నువు గిల్లీ గిల్లీ గిచ్చర
స్పీడో మీటర్ స్పీడే పెంచరా
పైకి రా పైపైకి రా
నన్ను కర కర నమిలేయ్ రా
నడుము వంపులే నలిపేయ్ రా
సోకులే అరిటాకురా
మగ చూపులే పిడిబాకురా
సుఖ జాతరే జరిపించరా త్వరగా

విక్టరీ (2008)




చిత్రం: విక్టరీ (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: కలువ కృష్ణ సాయి
గానం: నితిన్ , మమతా మోహన్ దాస్ , శశాంక్

ఏయ్ స్కూటీ నేర్పకుండా వెళ్లిపోతావెంట్రా
ఏ పోవే
ఏంట్రా మధ్యలోనే వచ్చేశావ్
దానికి నేను చచ్చినా బైక్ నేర్పించనురా
చె నువ్వు మారవురా
ఏంట్రా పోజ్ కొడుతున్నావ్

జన్నీఫర్ లా ఉన్నవంటూ
మార్లిన్ మన్రో షేపుల్ అంటూ
డైలీ నన్నే కాకా పడుతూ
డ్రీమ్ గర్లంటూ ఫిక్స్ అయిపోతూ

రాజేష్ రోహిత్ సైటే కొట్టారే
బన్నీ బూబ్లూ మున్నా చిన్నా వెంటే పడ్డారే

అరే ఎంత చెప్పినా ఫోజులు కొడతావేందిరా
ఇంత ఓవర్ వంటికి మంచిది కాదురా
పిల్ల బైక్ నేర్పమంటే నేర్పవా
వీలుకాదు అంటు వెళ్లిపోతవా
అందులోన కిక్ నీకు తెలుసునా
అంతకన్న లక్కు నీకు దక్కునా
వెళ్ళు వెళ్ళురా ఒక్క ట్రైల్ వెయ్యరా
అందులో ఉన్న మజా తెలుసుకో జరా

చల్ పొబే

వీడి బుర్ర జర మార్చండోయ్
నిజమేనోయ్ మార్చాలోయ్
ఆడపిల్ల తను కాదండోయ్
ఎందుకురా ఏమండోయ్
ఎంత చెప్పినా నీకే అర్ధం కాదురా
విన్నవిందక ఏదో చెప్తున్నావురా

ఇంతకి ఏం చేసిందిరా బాయ్ ఆ పోరి
స్పీడ్ బ్రేకర్ అడ్డురాకపోయినా
చీటిమాటికి బ్రేక్ వేస్తది
మీద మీదకొచ్చి నేను పడినా
నంగానాచిలా నవ్వుతున్నది
వెళ్లలేనురా అది పిల్లకాదురా
నౌకరల్లే వాడుకుంటున్నది

అబ్బాయి చేసే పని అమ్మాయి చేసిందా
బానే ఉంది
అంతకన్న లక్కేముందోయ్
ఇంకేంటోయ్ ఎంజాయ్ చెయ్
అందుకె నాకు మండిందోయ్
ఏమిటోయ్ ఎమ్మనిషోయ్
ఆయ్ అదేంటండి అమ్మాయిగారు
పైనడుతుంటే పట్టించుకోరేంటండి

ఏంట్రా డిస్కషన్ వస్తావా రావా
చూశావారా అరె తురే అంటుంది
లైట్ తీస్కో
మనసుకు నచ్చితే అమ్మాయిలు అలానే పిలుస్తారు
కాఫీడేలు  రెస్టౌరెంట్లు ఉన్నది
నువ్వు నేను ఒక్కటవ్వడానికే
హే కాఫీడేలు  రెస్టౌరెంట్లు ఉన్నది
ఆ నువ్వు నేను ఒక్కటవ్వడానికే
హిచ్కాక్ సినిమా హీరోయిన్ ఇది
డ్రాగుల్లాల పట్టి చంపుతున్నది
ఎంత తిట్టినా కోపం వస్తాలేదురా
ఎందుకంటే ఎంతో నువ్వు నచ్చినావురా
ఈ ముక్క చెవిలో కేళి ఫ్లవర్ పెట్టినోడికి చెప్పు

పాపను ఏడిపించొద్దవోయ్
పాపంరోయ్ వెళ్ళొద్దోయ్
మధ్యలో నువ్వు మొరగొద్దోయ్ జారే బాయ్ నువ్వెవడోయ్
ఏంరా మళ్ళొచ్చినావ్
అది అమ్మాయ్ కాదురా బాబు ఆటం బాంబు
ఓ పోరి వీళ్ళతో కాదుగాని నన్ను రమ్మంటావా
రేయ్ పొట్టోడా భూమికి జానెడున్నావ్ కొట్టానంటే
రేయ్ దానికి నేను నచ్చలేదురా బాయ్
నువ్వే పో
ఊ ఏం చెయ్యాలో చెప్పు
కూల్ డ్రింక్ తెచ్చి కూల్ చెయ్యరా
స్ట్రాలు రెండు వేసి నాతో తాగరా
డబ్బులిస్తా నువ్వువెళ్లి తెచ్చుకో
మిత్తమంత నువ్వుతాగిపో
వీడు ఎవడు సెన్స్ లేని పొరడు
అందమైన ఆడపిల్ల ఆఫర్ ఇస్తే పోతడు
నేను చూస్కుంటాగా
బాయ్ ఫ్రెండ్ అంటే అంతేరో ఎక్కడికోయ్ కూర్చోవోయ్
పిల్లతో లింక్ పెట్టద్ధోయ్
మీకు బాయ్.. దానికి గుడ్ బై

జల్సా (2008)



చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె


మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

Hey I wanna be with you forever
Hey I wanna live with you forever

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే ధమ్ రె ధమ్ అని తూలే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ



********  *******   ********



చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: జి. సాహితి, గోపికా పూర్ణిమ, టిప్పు

పల్లవి:
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి

చరణం: 1
హే నిదుర దాటి కలలే పొంగె
పెదవి దాటి పిలుపే పొంగె
అదుపుదాటి మనసే పొంగె నాలో
గడపదాటి వలపే పొంగె
చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

చరణం: 2
తలపుదాటి తనువే పొంగె
సిగ్గుదాటి చనువే పొంగె
గట్టుదాటి వయసే పొంగె లోలో
కనులుదాటి చూపే పొంగె
అడుగు దాటి పరుగే పొంగె
హద్దు దాటి హాయే పొంగె నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికి



********  *******   ********


చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: బాబా సెహగల్ ,  రీటా


సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో
అరె తెలియకపోతే చూడర బాబూ
హిజ్ హ్యూమన్ సునామీ
తెలియాలనుకుంటే డేంజర్ బాబూ
యు హావ్ గాట్ బిలీవ్ మి
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స
వన్ మోర్ టైమ్ జల్సా

చరణం: 1
హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ
అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు
ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై
సరాసరి వార్డుకి చేరుస్తాడు
అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే
గడ్డపార నమిలేస్తాడు
గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే
కొండ తవ్వి పారేస్తాడూ
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా

చరణం: 2
మనవాడనుకుంటే చెలికాడవుతాడు
హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
హే దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే
తోటలన్నీ నొల్లుకొస్తాడు
యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే
దానితోటి ఊయలూగుతాడు
సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా
సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా స జల్సా


********  *******   ********


చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బెన్నీ దయల్ , ప్రియా


హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
హే Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి
ఓ నడుమే చూస్తే Shakira దాన్ని అంటుకున్న చెయ్యే లక్కిరా
నడకే చూస్తే Beyonce  బేబి నవ్విందంటే ఖల్లాసే
ఓ జీన్స్ పాంట్ వేసుకున్న James Bond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురో
బ్లాక్ బెల్ట్ పెట్టుకొని Jackie Chan లాగా నాన్ చాక్ తిప్పమాకురో

చరణం: 1
హే లేడికళ్ళ లేజరే నువ్వా పారడైజ్ ఫ్లేవరే నువ్వా
Oxyzen నింపుకున్న ఆడబాంబువా సాక్సోఫోన్ వంపువే నువ్వా
ఓ Volcano కి బెస్ట్ ఫ్రెండ్ వా వెయ్యి వోల్ట్స్ హై కరెంటువా
వయసు మీద వాలుతున్న Tornedo నువ్వా Earth Quack థండరేనువ్వా
నీ రెండు కళ్ళు Radium డయల్సా నీ పెదవులు ప్లాటినం ఫ్లవర్సా
నువ్వు Hello అంటే రొమాన్సా నీ సైలెన్స్ అయినా వాయిలెన్సా
హే టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వని నవ్వుతున్న మోనలిస మొత్తుకోదా
Playboy చూపులున్న సమురాయ్ నువ్వని సుమోలంత సలాం కొట్టరా

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి

చరణం: 2
హే DTS రింగుటోన్ వా హార్ట్ షేపు మూనువే నువ్వా
అందమన్న సాఫ్ట్ వేరు CD-ROM వా కమ్మనైన క్లోరోఫామ్ వా
హో రోమెయోకి క్లోనువే నువ్వా రెయిన్బోకి ట్విన్నువే నువ్వా
Dream University కి డీనువే నువ్వా నా Zodiac సైనువే నువ్వా
హే 24 Carrot Vanila నువ్వు హాట్ హాట్ మెక్సికన్ Taquilla
Fully Loaded రైఫుల్లా నన్ను రైడ్ చేసావే రాంబోలా
హే మడొన్నాను బంతి చేసి బౌన్సరేసినట్టుగా పల్స్ రేటు పెంచినావే ఫ్రెంచ్ మోడలా
Maradona లాగిపెట్టి గోల్ కొట్టినట్టుగా Flying Kiss పెట్టమాకురో

హే Jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి




********  *******   ********



చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దేవీ శ్రీ ప్రసాద్

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా  ఆగిందా ఆటంబాంబేేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే
హకునామ టాటా అనుకో తమాషగా తలఊపి
వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి
అదే మనం తెలుగులో అంటే డోంట్‌ వర్రీ బిహ్యాపీ
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే

చరణం: 1
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా
బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు
మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరి భాషలో మధురమైన కధలు

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా  జీరో అయిందా  ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే

చరణం: 2
పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ రిస్కంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే హిస్టరీ లిఖనా
ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం
ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం

యు అండ్‌ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే
లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే




********  *******   ********


చిత్రం: జల్సా (2008)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్


చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2)

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2)

చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ
మరిచాం ఎపుడో సొంత ముఖం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2)