Showing posts with label ప్రేమలేఖలు (1977). Show all posts
Showing posts with label ప్రేమలేఖలు (1977). Show all posts

ప్రేమలేఖలు (1977)

చిత్రం :  ప్రేమలేఖలు (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల

పల్లవి:

విన్నానులే.. ఊహుహు
పొంచి విన్నానులే.. ఏమని
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

విన్నానులే.. పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

చరణం 1:

ఉహూహూ హూ హూ
అహాహా ఆ ఆ ఆ ఆ

సుకుమారివి నువ్వు పువ్వులాంటి నువ్వు
పండులాంటి పాపాయిని ఇవ్వు
ఊ ఊ... ఆ ఆ ...
అలసిపోనివ్వను పనులు చేయనివ్వను
అడుగుతీసి అడుగు వేయనివ్వను

ఓహో ఇంటి పనులు వంట పనులు తమరే చేస్తే...
అయ్యగారి ఉద్యోగం ఊహుహుహుహు..

హహహహ..విన్నానులే.. పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

చరణం 2:

పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా ఆ ఆ....
పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా..

అయ్యగారివైపు పడదు నీ చూపు
ఇక ముద్దులన్ని పాపకేన రేపు

అరే అంతలోనే వచ్చిందా తమకు అసూయా
అబ్బాయి తమ పోలిక ఆ ముద్దులు మీకే

విన్నానులే.. పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

చరణం 3:

తొలి చూలి భాగ్యం ఎంతో ఆనందం
విడిపోని అనురాగబంధం
ఆ ఆ ఆ ఆ...
నిజమైన స్వప్నం దిగి వచ్చిన స్వర్గం
పాపాయే మన ఆరోప్రాణం

నవ్వులతో వెలుగులతో నిండును ఇల్లు
పాపాయి మురిపాలే తొలకరి జల్లు

విన్నావులే.. ఊహుహు
పొంచి విన్నావులే.. ఏమని
ఈ అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ 

************ ******************* ***************** *********

చిత్రం :  ప్రేమలేఖలు (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి:

నీ అందం... నీ పరువం
నీ అందం నీ పరువం నాలో దాచుకో
కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో..

ఈ అందం ఈ పరువం నీకే అంకితం
రేయి పగలు వెన్నెల కాదా నీతో జీవితం

చరణం :1

వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి
కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి 
వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి
కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి

ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి 

నీ అందం నీ పరువం నాలో దాచుకో
రేయి పగలు వెన్నెల కాదా నీతో జీవితం

చరణం 2:

వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ
ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ 
వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ
ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ 

ఆ కలియికలోనే నింగి నేల జతగా మురిసేదీ 

నీ అందం నీ పరువం నాలో దాచుకో
కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో..

ఈ అందం ఈ పరువం నీకే అంకితం
రేయి పగలు వెన్నెల కాదా నీతో జీవితం

************ ******************* ***************** *********

చిత్రం :  ప్రేమలేఖలు (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల

పల్లవి:

ఈనాటి విడరాని బంధం... మనకేనాడో వేశాడు దైవం
ఈనాటి విడరాని బంధం... నేను ఏనాడో చేసిన పుణ్యం
అ..హ..హ..అహ..ఆ..ఆ
ఆ..హా..ఆహ..ఆహ..ఆ

చరణం : 1

నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే...
నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే...
నాలోని ప్రేమ నీ పాద సీమా విరిసింది సిరిమల్లెగా...

ఈనాటి విడరాని బంధం... నేను ఏనాడో చేసిన పుణ్యం

చరణం : 2

సొగసెంతొ కలిగే సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే...
సొగసెంతొ కలిగే సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే...
మదిలోన దాచి.. మనసార వలిచి.. పతి నీడ దొరికిందిలే...

ఈనాటి విడరాని బంధం... నేను ఏనాడో చేసిన పుణ్యం

************ ******************* ***************** *********

చిత్రం : ప్రేమలేఖలు (1977)
సంగీతం : సత్యం
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల, వాణీ జయరాం

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ....
ఈ రోజు... మంచి రోజు.. 
మరపురానిది.. మధురమైనది
మంచితనం ఉదయించినరోజు

ఆ ఆ ఆ ఆ...
ఈ రోజు.. మంచి రోజు... 
మరపురానిది.. మధురమైనది
ప్రేమ సుమం వికసించినరోజు

చరణం 1:

తొలిసారి ధృవతార దీపించెను... ఆ కిరణాలే లోకాన వ్యాపించెను
ఆ ఆ ఆ ఆ.. 
తొలి ప్రేమ హృదయాన పులకించెను... అది ఆనంద దీపాలు వెలిగించెను

చెలికాంతులలో.. సుఖశాంతులతో.. జీవనమే పావనమీనాడు

ఈ రోజు మంచి రోజు... మధురమైనది మరపురానిది
ప్రేమ సుమం వికసించినరోజు

చరణం 2:

రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము
రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము

మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు..అభినందనలు
అందించే శుభసమయం నేడు

ఈ రోజు మంచి రోజు... మధురమైనది మరపురానిది
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు

************ ******************* ***************** *********

చిత్రం :  ప్రేమలేఖలు (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు... కురిపించెను ప్రేమలేఖలు
ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి

చరణం 1:

ఆ... హా హా హా... ఆహా... ఆహాహా...
సుజా... 
నడిరాతిరి వేళ నీ పిలుపు.. గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు.. గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో నను పెనవేసి.. నా ఒడిలో వాలును నీ వలపు

 ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి

చరణం 2:

నా మనసే కోవెల చేసితిని.. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని.. ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు.. కనువిందులు చేసే శిల్పాలు

ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి

చరణం 3:

నీ పెదవులు చిలికే మధురిమలు.. అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు.. అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు.. కలకాలం నిలిచే కావ్యాలు

ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు... కురిపించెను ప్రేమలేఖలు.. ప్రేమలేఖలు
ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి