Showing posts with label 1962. Show all posts
Showing posts with label 1962. Show all posts

సిరి సంపదలు (1962)

చిత్రం :  సిరి సంపదలు (1962)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  శాంత కుమారి 


పల్లవి :

చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు
చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు
మీరే మా సిరిసంపదలు... వరాల ముద్దుల మూటలు
తరతరాల వరాల పంటలు

చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు


చరణం 1 :


పిల్లలు కిలకిలనవ్వాలి...  ఇల్లే కళకళలాడాలి
పిల్లలు కిలకిలనవ్వాలి...  ఇల్లే కళకళలాడాలి
ఆడాలి బులిబులి బుడిబుడి పాటలలో పుట్టితేనెలే కురవాలి
చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు


చరణం 2 :


కోపాలొలికె గోకులమందు పాలు వెన్న తినినంతా
కోపాలొలికె గోకులమందు పాలు వెన్న తినినంతా
కానీ...  యశోద వాని కడుపును చూచి...
కానీ యశోద వాని కడుపును చూచి..పెట్టిన బువ్వే బలమంతా

చిట్టి పొట్టి పాపలు... చిరుచిరు నవ్వుల పువ్వులు



చరణం 3 :


ఆకాశంలో వెండి తారలకు...  ఒకే చంద్రుడు ఉన్నాడు
ఆకాశంలో వెండి తారలకు...  ఒకే చంద్రుడు ఉన్నాడు
ముద్దులొలుకు ఈ ముగ్గురి కోసం
ముద్దులొలుకు ఈ ముగ్గురి కోసం
వాడే బిరబిర దిగి వచ్చాడు

ఎవరూ... బావా...

బావా బావా పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు...
బావా బావా పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు...

తంతే బావా ఊరుకోడు.. తాళి కట్టి లాక్కెళ్తాడు



***** ******** *********** *********

చిత్రం :  సిరి సంపదలు (1962)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :

గుడిలో దేవుని గంటలా... నా హృదిలో ఆరని మంటలా
కలలు కన్నా కన్నె వలపులు గాలిగోపుర దీపాలా...
గుడిలో దేవుని గంటలా... నా హృదిలో ఆరని మంటలా


చరణం 1 :

ఆలయమందున దేవుడు ఉన్నా...  మనుజులందరికీ మనసులు ఉన్నా
ఆలయమందున దేవుడు ఉన్నా...  మనుజులందరికీ మనసులు ఉన్నా
ఆలకించరా ...
ఆలకించరా... ఆవేదనలూ
ఆదరించరా... అనురాగాలు

గుడిలో దేవుని గంటలా... నా హృదిలో ఆరని మంటలా...


చరణం 2 :


ప్రేమించిన మా పసిహృదయాలను... శాసించెనుగా ముది ద్వేషాలు...
ప్రేమించిన మా పసిహృదయాలను...  శాసించెనుగా ముది ద్వేషాలు...
దేవుడు వ్రాసిన వ్రాతలా... ఇవి పెద్దలు చేసిన చేతలా 

గుడిలో దేవుని గంటలా... నా హృదిలో ఆరని మంటలా


చరణం 3 :


తొలి ప్రేమను చవి చూపిన తల్లే ... విధి లేదనుకుని విడదీసినదా
తొలి ప్రేమను చవి చూపిన తల్లే ... విధి లేదనుకుని విడదీసినదా
ఈ విష బిందువు చిందినదెవరో... జీవితమెడారి చేసినదెవరో



***** ******** *********** *********

చిత్రం : సిరి సంపదలు (1962)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  జిక్కి, సుశీల, జానకి   


పల్లవి :


ఓ.... ఓ.. ఓ.. ఓహో....

వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...
వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...
వేణుగానమ్ము వినిపించెనే...

చరణం 1 :

దోరవయసున్న కన్నియల హృదయాలను..
దోచుకున్నాడని విన్నాను చాడీలను..
దోరవయసున్న కన్నియల హృదయాలను...
దోచుకున్నాడని విన్నాను చాడీలను..

అంత మొనగాడటే ...వట్టి కథలేనటే...
ఏడి కనబడితే నిలవేసీ అడగాలి వాడినే ...

వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే..
వేణుగానమ్ము వినిపించెనే...

చరణం 2 :

మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట...
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట...
లేదు లేదనుచూ లోకాలు చూపాడట

అంత మొనగాడటే... వింత కథలేనటే ...
ఏడి కనబడితే కనులారా చూడాలి వానినే ...

వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...
వేణుగానమ్ము వినిపించెనే...


చరణం 3 :

దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట...
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట...
దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట...
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట

ఘల్లు ఘల్ఘల్లన ...ఒళ్లు ఝుల్ఝుల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట...

వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...
వేణుగానమ్ము వినిపించెనే...


***** ******** *********** *********

చిత్రం :  సిరి సంపదలు (1962)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  జానకి 


పల్లవి :


పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను... పులకరించి ఈ జగమూ నవ్వెను
కొలను నవ్వెను.. కోరిక నవ్వెను .. నవ్వలేక నేనున్నాను...
పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను..

చరణం 1 :

వయసు నవ్వెను.. సొగసూ నవ్వెను.. నవ్వు రాక ఈ మనసే నలిగెను
వయసు నవ్వెను.. సొగసూ నవ్వెను.. నవ్వు రాక ఈ మనసే నలిగెను
వలపు నవ్వెను.. తలపూ నవ్వెను.. పగరగిలీ అవి బలి అయిపోయెను

పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...నవ్వలేక నేనున్నాను...

చరణం 2 :

కడుపు తీపితో కన్నబిడ్డకై హితము కోరి ఏగిన తండ్రికి
చేయని నేరము శిక్ష వేసెను మాయని పాపం శాపాలాయెను ...

పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...నవ్వలేక నేనున్నాను... 


చరణం 3 :

కలిమి చెలిమి వెలసిన ఇల్లు ... వెలుగు మాసి.. వెలవెలపోయెను
కలిమి చెలిమి వెలసిన ఇల్లు ... వెలుగు మాసి.. వెలవెలబోయెను
లోకం నవ్వెను .. శోకం మిగిలెను.. లోలోపల నా గుండెలవిసెను

పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...
నవ్వలేక నేనున్నాను... నవ్వలేక నేనున్నాను


***** ******** *********** *********

చిత్రం :  సిరి సంపదలు (1962)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


గుడిలో దేవుని గంటలా... నా హృదిలో ఆరని మంటలా
కలలు కన్న కన్నె వలపులు గాలిగోపుర దీపాలా...
గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా

చరణం 1 :

ఆలయమందున దేవుడు వున్నా మనుజులందరికీ మనసులు వున్నా
ఆలయమందున దేవుడు వున్నా మనుజులందరికీ మనసులు వున్నా
ఆలకించరా ...
ఆలకించరా...ఆవేదనలూ
ఆదరించరా... అనురాగాలు

గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా...

చరణం 2 :

ప్రేమించిన మా పసి హృదయాలను... శాసించెనుగా ముది ద్వేషాలు...
ప్రేమించిన మా పసి హృదయాలను శాసించెనుగా ముది ద్వేషాలు...
దేవుడు రాసిన వ్రాతలా ...ఇది పెద్దలు చేసిన చేతలా..

గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా


చరణం 3 :

తొలి ప్రేమను చవి చూపిన తల్లే ... విధి లేదనుకుని విడదీసినదా
తొలి ప్రేమను చవి చూపిన తల్లే ... విధి లేదనుకుని విడదీసినదా
ఈ విష బిందువు చిందినదెవరో... జీవితమెడారి చేసినదెవరో..



***** ******** *********** *********

చిత్రం :  సిరి సంపదలు (1962)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


ఎందుకో సిగ్గెందుకో.. ఇంతలోనే అమ్మాయికి
అంత సిగ్గు ఎందుకో ...
ఎందుకో సిగ్గెందుకో.. ఇంతలోనే అమ్మాయికి
అంత సిగ్గు ఎందుకో ...

పంతాలే తీరెనని తెలిసినందుకే ... మనసులు కలసినందుకే
అందుకే సిగ్గందుకే . .

చరణం 1 :

చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్ళకు వలపు పిలుపు
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్ళకు వలపు పిలుపు

చిరునవ్వుల చిన్నారీ....
చిరునవ్వుల చిన్నారీ...
ఇంకా సిగ్గెందుకే...
ఎందుకో సిగ్గెందుకో... 

చరణం 2 :

కొనసాగిన కోరికలే.. మురిపించెను వేడుకలై
కొనసాగిన కోరికలే.. మురిపించెను వేడుకలై

తనివారగ ఈ వేళా ...
తనివారగ ఈ వేళా....
మనసే తూగాడెనే
అందుకే... సిగ్గందుకే


చరణం 3 :

నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే

అనురాగం ఆనందం...
అనురాగం ఆనందం... అన్నీ నీ కోసమే
అందుకా.. ఆ . . . సిగ్గందుకా.. ఆ . . .
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే...
అందుకా.. ఆ . . . సిగ్గందుకా.. ఆ . . .

***** ******** *********** *********

చిత్రం :  సిరి సంపదలు (1962)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, జానకి


పల్లవి :


ఈ పగలు రేయిగా.. పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ...  ఆ... ఊఁ..
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి... ఓ... ఓ... ఓ...

చరణం 1 :

మనసున తొణికే చిరునవ్వెందుకు...పెదవుల మీదికి రానీవు?
అహా... ఓహో... అహా... ఆ... ఆ...
మనసున తొణికే చిరునవ్వెందుకు... పెదవుల మీదికి రానీవు?
పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు.. ఊఁ....

వెండి వెన్నెల జాబిలి ... నిండు పున్నమి జాబిలి...
ఆ... ఆ...ఆ... ఆ... ఓ... ఓ... ఓ...

చరణం 2 :

కన్నులు తెలిపే కథలనెందుకు.. రెప్పలార్చి ఏమార్చేవు?
ఆఁ... ఆఁ... ఓ.. ఓ... ఓ...
కన్నులు తెలిపే కథలనెందుకు.. రెప్పలార్చి ఏమార్చేవు?
చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు
ఓహోహో...

వెండి వెన్నెల జాబిలి ... నిండు పున్నమి జాబిలి...
చరణం 3 :

అలుక చూపి అటువైపు తిరిగితే.. అగుపడదనుకుని నవ్వేవు
ఉహుహు..
అలుక చూపి అటువైపు తిరిగితే.. అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను.. ఆహా...

వెండివెన్నెల జాబిలి.. నిండు పున్నమి జాబిలి..
ఆహహాహా... ఆహహాహా...
ఆహహాహా... ఆహహాహా...
ఊహుహూ...

రక్తసంబంధం (1962)

చిత్రం :  రక్తసంబంధం (1962)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత :  అనిసెట్టి
నేపధ్య గానం :  జానకి

పల్లవి :

ఆకాశమేలే..ఏ..ఏ..ఏ...
అందాల రాజే... ఏ..ఏ..ఏ...
నాకెదురురైనాడే... హోయ్

నన్నే చూసి నవ్వులు దాచీ...  కన్నులు కలిపాడే
నన్నే చూసి నవ్వులు దాచీ...  కన్నులు కలిపాడే

ఆకాశమేలే అందాల రాజే... నాకెదురురైనాడే... హోయ్
నన్నే చూసి నవ్వులు దాచీ.. కన్నులు కలిపాడే


చరణం 1 :


నా రాజు తానే నను చూడగానే... లోలో మురిసితినే...  హోయ్
లోలో మురిసితినే... లోలో మురిసితినే

ఆ కళ్ళలోని అందాలు సోకి.. లోకం మరచితినే...  హోయ్..
లోకం మరచితినే... లోకం మరచితినే

దొరలా మెలగి తరుణి హృదయం దోచిన మొనగాడే... హోయ్
దోచిన మొనగాడే... దోచిన మొనగాడే...

ముంగిట నిలచిన మోహన రూపుని ముందుకు పోవేమే...
చెలి వెన్నెల వేళల కమ్మని వలపుల విందు చేయవేమే...

నన్నే చూసి నవ్వులు దాచీ.. కన్నులు కలిపాడే


చరణం 2 :


అహహా.. ఓహోహో..
అహహా.. ఊమ్మ్హు...

నా వన్నెకాణి నయనాలలోనే భావం తెలిసినదే... హోయ్
భావం తెలిసినదే... భావం తెలిసినదే

నాగొంతులోనే ఏనాడు లేని రాగం విరిసినదే... హోయ్
రాగం విరిసినదే... రాగం విరిసినదే

కలగా కదలే కమ్మని తలపే నిజమై నిలచినదే... హోయ్
నిజమై నిలచినదే... నిజమై నిలచినదే


ముంగిట నిలచిన మోహన రూపుని ముందుకు పోవేమే...
చెలి వెన్నెల వేళల కమ్మని వలపుల విందు చేయవేమే...

నన్నే చూసి నవ్వులు దాచీ.. కన్నులు కలిపాడే

***** ******* ********* ******** ********

చిత్రం :  రక్తసంబంధం (1962)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత :  అనిసెట్టి
నేపధ్య గానం :  సుశీల

పల్లవి :
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
 కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం 1 :

ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే...
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం 2 :

అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..

ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం 3 :

మనసైన వాడు వరుడు.. నీ మదినేలుకొనెడు ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళ ళ ళ –హాయి
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

***** ******* ********* ******** ********

చిత్రం :  రక్తసంబంధం (1962)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  అనిసెట్టి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే


చరణం 1 :

అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ పాడనా .. కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కథ పాడనా

కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసే వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే
విధియె విడదీసే.. వెతలలో ద్రోసే.. మిగిలెనీ శోకమే


చరణం 2 :

మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా

కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా

దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే..
లాలి పాపయి హాయి పాపాయి.. లాలి పాపాయి జో జో..
లాలి పాపాయి జో జో ..

మురిపించే మువ్వలు (1962)

చిత్రం :  మురిపించే మువ్వలు (1962)
సంగీతం :  ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  జానకి

పల్లవి :

ఆ...ఆ...ఆ...ఆ...
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా

నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా ....

సింధూర రాగంపు దేవా...
 ఆ..ఆ..ఆఆ.. ఆ..ఆ..ఆ. ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా...
మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా...
ఎలనీ.. నీ లీల పాడెద దేవా...

చరణం 1 :

అనుపమ వరదాన శీల...ఆ...
అనుపమ వరదాన శీల ...
వేగ కనుపించు కరుణాలవాల...
ఎలనీ నీ లీల పాడెద దేవా...

చరణం 2 :

నీ లీల పాడెద దేవా...
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా..
నీ లీల పాడెద దేవా....
సగమపని నీ లీల పాడెద దేవా...
నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస నిదమప గరిని...
నీ లీల పాడెద దేవా....

సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని....
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా...
నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా ....
గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని...
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ..ఆ ఆ..ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ..
సానిపాని ససనీ ససనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా...మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ...

నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా

మహామంత్రి తిమ్మరుసు (1962)

చిత్రం :  మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఎస్. వరలక్ష్మి

పల్లవి:


లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా


చరణం 1:

వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో
వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో

అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు...
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం 2:

నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో

మైమరచిన చెలి మాటే లేదని....
ఆ ..ఆ..ఆ ..ఆ ..ఆ..ఆ..ఆ
మైమరచిన చెలి మాటే లేదని.. ఓరగ చూచే వేణు...


లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...

*****  ************** ***********
చిత్రం :  మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:


మోహన రాగమహా మూర్తిమంతమాయె
మోహన రాగమహా మూర్తిమంతమాయె...

నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
మోహన రాగమహా.. మూర్తిమంతమాయె..

చరణం 1:

చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ...
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా..
మోహన రాగమహా... మూర్తిమంతమాయె

చరణం 2:

నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా...
మోహన రాగమహా... మూర్తిమంతమాయె

*****  ************** ***********

చిత్రం :  మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఎస్. వరలక్ష్మి, సుశీల

పల్లవి:


తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
చెలిమిని విరిసే అలమేల్మంగమ... చెలువములే ప్రియ సేవలయ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ

చరణం 1:

నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా
నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా...
మంజుల వలపుల... మలయానిలముల...
మంజుల వలపుల మలయానిలముల.. వింజామరమున వీతుమయా...

తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ


చరణం 2:

ఆశారాగమే ఆలాపనగా... ఆ..హ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా...
నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస
గరిగపమగరిస...
మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ
మపద మ గ రి పమరి నినిప ససని నినిస
మగరిగ నిసరి నదమపనిస
నిసరి నిదమపదప
దపదమగరిగనిస...

ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా...
అభినయ నటనలే ఆరాధనగా...
అభినయ నటనలే ఆరాధనగా... ప్రభునలరించి తరింతుమయా....

తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ
ఆ...ఆ...అ...అ...ఆ...ఆ...ఆ..
ఆ...ఆ..ఆ...ఆ...ఆ...
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... ఆ...ఆ..ఆ..
తిరుమల తిరుపతి వెంకటేశ్వర.... కూరిమి వరముల కురియుమయ

మదన కామరాజు కథ (1962)

చిత్రం :  మదన కామరాజు కథ (1962)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  జి. కృష్ణమూర్తి
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్, సుశీల


పల్లవి:

నీలి మేఘ మాలవో... నీలాల తారవో
నీ సోయగాలతో...మదినీ దోచిపోదువో..ఓ ఓ ఓ..

నీలి మేఘ మాలనో...నీలాల తారనో
నా సోయగాలతో...మదినీ ఈ ఈ దోచిపోతినో..ఓ ఓ ఓ..

నీలి మేఘ మాలనో...

చరణం 1:

నీ రాక కోసమే చెలి... నే వేచియుంటినే...
ఆరాటమేలనో ప్రియా... నే చెంత నుంటినే...
ఆనంద మధుర గీతములా.. ఆలపింతమా ఆ ఆ ఆ ...

నీలి మేఘ మాలనో....

చరణం 2:

చివురించు వలపు తీవెల... విరి పూలు పూయగా...
చిరునవ్వు విరుపు లోపల... హరివిల్లు విరియదా...
నెలవంక నావలోన మనము కలసిపోదమా ఆ ఆ ఆ ...

నీలి మేఘ మాలవో...

చరణం 3:

మనలోని కలత మాయమై... మన ఆశ తీరెగా...
అనురాగ రాగమే ఇక...మన రాగమాయెగా....
మనసార ప్రేమ మాధురుల సాగి పోదమా ఆ ఆ ఆ ...

నీలి మేఘ మాలనో... నీలాల తారనో...
నీ సోయగాలతో... మదినీ దోచి పోదువో...

మంచి మనసులు (1962)

చిత్రం :  మంచి మనసులు (1962)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  జానకి

పల్లవి :


ఓహో ఓహో...
ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా
ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా

మావారి అందాలు నీవైన తెలుపుమా
మావారి అందాలు నీవైన తెలుపుమా

ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా



చరణం 1 :


మనసు మధురమైనది మమతలు నిండినది
సొగసు నేనెరుగనిది చూడాలని ఉన్నది
మనసు మధురమైనది మమతలు నిండినది
సొగసు నేనెరుగనిది చూడాలని ఉన్నది

అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా?
అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా?
కరవుతీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ

ఓహో ఓహో...
ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా


చరణం 2 :


వలపు కన్న తీయని పలుకులు వారివి
తలచుకున్న చాలును పులకరించు నా మేను
వలపు కన్న తీయని పలుకులు వారివి
తలచుకున్న చాలును పులకరించు నా మేను

మగసిరి దొరయని మరునికి సరియని
మగసిరి దొరయని మరునికి సరియని
అందరు అందురే...  అంత అందమైనవారా

ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా

చరణం 3 :

అందరి కన్నులు అయ్యగారి మీదనే
దిష్టి తగలగలదనీ తెలిపిరమ్మ కొందరు
అందరి కన్నులు అయ్యగారి మీదనే
దిష్టి తగలగలదనీ తెలిపిరమ్మ కొందరు

అన్నది నిజమేనా...  అల్లిన కథలేనా
అన్నది నిజమేనా...  అల్లిన కథలేనా
కన్నులున్న నీవైనా...  ఉన్నమాట చెప్పుమా



ఓహో ఓహో...
ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా
ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా

మావారి అందాలు నీవైన తెలుపుమా
మావారి అందాలు నీవైన తెలుపుమా

ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా


*** ********* * ****************
చిత్రం :  మంచి మనసులు (1962)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల

సాకి :

అహో ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా!
ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా...

పల్లవి: 
శిలలపై శిల్పాలు చెక్కినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు..ఊ..ఊ..శిలలపై శిల్పాలు చెక్కినారు..ఊ..ఊ..

కనుచూపు కరువైన వారికైనా
కనుచూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా
శిలలపై శిల్పాలు చెక్కినారు..ఊ..ఊ..

చరణం 1:

ఒక వైపు ఉర్రూతలూపు కవనాలు
ఒక ప్రక్క ఉరికించు యుద్ధభేరీలు...

ఒక చెంప శృంగారమొలుకు నాట్యాలు
నవరసాలొలికించు నగరానికొచ్చాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు..

శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు..ఊ..ఊ..
శిలలపై శిల్పాలు చెక్కినారు..ఊ..ఊ..

చరణం 2:

ఏకశిల రథముపై లోకేశు వడిలోన
ఓరచూపులదేవి ఊరేగి రాగా
ఏకశిల రథముపై లోకేశు వడిలోన
ఓరచూపులదేవి ఊరేగి రాగా..

రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి
సరిగమా పదనిసా స్వరములే పాడగా....
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ...

శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు..ఊ..ఊ..
శిలలపై శిల్పాలు చెక్కినారు..ఊ..ఊ..

చరణం 3:

రాజులే పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు మారినా గాడ్పులే వీచినా..ఆ..
మనుజులే దనుజులై మట్టిపాల్జేసినా
ఆ... ఆ... ఆ... ఆ...
చెదరనీ కదలనీ శిల్పాల వలెనే
నీవు నా హృదయాన నిత్యమై సత్యమై
నిలిచివుందువు చెలీ.. నిజము నా జాబిలీ..

*** ********* * ****************
చిత్రం :  మంచి మనసులు (1962)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల, జమునారాణి


పల్లవి:

తప్పూ...తప్పూ

మావ మావ మావా..ఆ..ఆ.. మావ మావ మావా..ఆ..ఆ..
ఏమే ఏమే భామా..ఆ..ఆ.. ఏమే ఏమే భామా...

పట్టుకుంటే కందిపోవు.. పండు వంటి చిన్నదుంటే
చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా..
పట్టుకుంటే కందిపోవు.. పండు వంటి చిన్నదుంటే
చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా..
తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుకాదా..
మావ మావ మావా..ఆ..ఆ.. మావ మావ మావా..ఆ..ఆ..

వాలు వాలు చూపులతో గాలమేసి లాగిలాగి.. ప్రేమలోకి దింపువారు మీరు కాదా
ఓహో..
చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా..
ఏమే ఏమే భామా..ఆ..ఆ.. ఏమే ఏమే భామా..

చరణం 1:

నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే.. మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే
నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే.. మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే
సిగ్గు దాచి..
ఓహో..

సిగ్గు దాచి ఒకరొకరు సిగను పూలు కట్టుకోని..
టింగురంగయంటు ఊరు తిరగొచ్చునా
లోకం తెలుసుకోక మగ వాళ్ళు మెలగొచ్చునా..
మావ మావ మావా..ఆ..ఆ.. మావ మావ మావా..ఆ..ఆ..

చరణం 2:

హోయ్ హోయ్ హోయ్..
హోయ్ హోయ్ హోయ్..

కళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే.. అహా కప్పుకున్న సిగ్గు జారి పోకముందే
కళ్ళు కళ్ళు కలుసుకోను రాక ముందే.. అహా కప్పుకున్న సిగ్గు జారి పోకముందే
మాయ చేసి..
ఓహో..
మరులుగొల్పి..
ఓహో..

మాయ చేసి మరులుగొల్పి మాటలోన మాట కల్పి..
మధుర మైన మా మనసు దోచవచ్చునా
నీవు మర్మమెరిగి ఈ మాట అడగవచ్చునా..

ఏమే ఏమే భామా..ఆ..ఆ..
ఏమే ఏమే భామా..
చరణం 3:
పడుచుపిల్ల కంట పడితే వెంట పడుదురు..
అబ్బో వలపంతా వలకబోసి ఆశ పెడుదురూ..ఊ..
పడుచుపిల్ల కంట పడితే వెంట పడుదురు..
అబ్బో వలపంతా వలకబోసి ఆశ పెడుదురు...
పువ్వు మీద..
ఓహో..
పువ్వు పువ్వు మీద వాలు పోతు తేనె టీగ వంటి..
మగవాళ్ళ జిత్తులన్ని తెలుసులేవయ్యా
మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా..
మావ మావ మావా..ఆ..ఆ.. మావ మావ మావా..ఆ..ఆ..

చరణం 4:

హోయ్ హోయ్ హోయ్..హోయ్ హోయ్ హోయ్..

కొత్త కొత్త మోజుల్ని కోరువారు.. రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ..ఊ..
కొత్త కొత్త మోజుల్ని కోరువారు.. రోజు చిత్రంగా వేషాలు మార్చువారు
టక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు..
నీవు చెప్పు మాట కూడ నిజమేనులే
స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే..

అవునే అవునే భామా.. అవునే అవునే భామా..
కట్టు బాటు ఉండాలి గౌరవంగ బతకాలి..
ఆత్రపడక కొంత కాలమాగుదామయా
కట్టు బాటు ఉండాలి గౌరవంగ బతకాలి..
ఆత్రపడక కొంత కాలమాగుదామయా
ఫెళ్ళున.. పెళ్లైతే.. ఇద్దరికి అడ్డులేదయా..

మావ మావ మావా..ఆ..ఆ.. మావ మావ మావా..ఆ..ఆ..

*** ********* * ****************
చిత్రం :  మంచి మనసులు (1962)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే

నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ..
పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ...

తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

చరణం 1:

నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..

తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

చరణం 2:

సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే..

ఓ…
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే

చరణం 3:

తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా...
నీ మేని హొయలు నీలోని వగలు... నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి... ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
పైపైకి సాగే మేఘాలదాటి..కనరాని లోకాలు కనగా...

ఆహా ఓహో ఉహు...ఆ… ఆ…ఓ…
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే..

*** ********* * ****************

చిత్రం :  మంచి మనసులు (1962)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:
ఏమండోయ్..
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏదీ కాని వేళ..
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏదీ కాని వేళ
ఏమండోయ్... హోయ్

చరణం 1:

పసివాని చూచుటకీ తొందరా...
మైమరిచి.. ముద్దాడి... లాలింతురా
లులులుల ఆయి లులులుల ఆయి
ఉహు ఉహు ఉహు ఉహు..

పసివాని చూచుటకీ తొందరా
మైమరిచి ముద్దాడి లాలింతురా
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకు ఏముంది మీదగ్గర...

ఏమండోయ్..
ఏమండోయ్... శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏదీ కాని వేళ
ఏమండోయ్... హోయ్
చరణం 2:

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా...
అపురూపమైన ఆ తల్లిదా...
ఒహొహొ ఓ
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా...
అపురూపమైన ఆ తల్లిదా...
అయగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ది రానీకు భగవంతుడా...
ఏమండోయ్..
ఏమండోయ్... శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏదీ కాని వేళ
ఏమండోయ్... హోయ్

చరణం 3:

ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే...
తలదాచుకొన మీకు తావైన లేదే...
అయ్యో పాపం...
ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన...
కపటాలు మానేసి నా మదిలోన..
కాపురము చేయండి కలకాలము...
ఏమండోయ్..
ఏమండోయ్... శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏదీ కాని వేళ
ఏమండోయ్... హోయ్...హోయ్...హోయ్...హోయ్

భీష్మ (1962)

చిత్రం :  భీష్మ (1962)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  జమునా రాణి 

పల్లవి :


ఓ... ఓ... ఓ..ఓ... ఓ... ఓ..
అహా.. హా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

హైలో హైలెస్స... హంస కదా నా పడవ
హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ

ఓ... హొయ్... ఓ... హొయ్


చరణం 1 :

ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ...

నదిలో నా రూపు...  ఓ... ఓ... ఓ...
నదిలో నా రూపు నవనవలాడినది...
మెరిసే అందములూ మిలమిలలాడినవి...
నదిలో నా రూపు నవనవలాడినది...
మెరిసే అందములూ మిలమిలలాడినవి...

వయసు వయ్యారము పాడినవి పదేపదే
వయసు వయ్యారము పాడినవి పదేపదే

హైలో.. హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ

ఓ... హొయ్... ఓ... హొయ్


చరణం 2 :


ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ...

ఎవరో మా రాజూ..ఓ..ఓ..
ఎవరో మా రాజూ... ఎదుటా నిలిచాడు
ఎవరో మా రాజూ... ఎదుటా నిలిచాడు
ఏవో చూపులతో సరసకు చేరాడు...
ఏవో చూపులతో సరసకు చేరాడు...

మనసే చెలించునే మాయదారి మగాళ్ళకి...
మనసే చెలించునే మాయదారి మగాళ్ళకి...

హైలో.. హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ

ఓ... హొయ్... ఓ... హొయ్


****** ******** ********* **********

చిత్రం : భీష్మ (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓ ఓ ...
మహేశా గిరీశా ప్రభో దేవ దేవా
మొరాలించి పాలించ రావా....

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓ..ఓ

చరణం 1:

జటాఝూటధారి.. శివా... చంద్రమౌళీ..
నిటాలాక్ష... నీవే సదా నాకు రక్ష
జటాఝూటధారి.. శివా.. చంద్రమౌళీ..
నిటాలాక్ష... నీవే సదా నాకు రక్ష..
ప్రతీకార శక్తి ప్రసాదించ రావా
ప్రసన్నమ్ము కావా.. ప్రసన్నమ్ము కావా...

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓఓ..

మహేశా.. గిరీశా.. ప్రభో దేవ దేవా..
మొరాలించి పాలించ రావా
మహాదేవ శంభో...
శివోహం... శివోహం... శివోహం... శివోహం..


****** ******** ********* **********


చిత్రం :  భీష్మ (1962)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్, సుశీల

పల్లవి:

మనసులోని కోరిక.. తెలుసు నీకు ప్రేమికా...
మనసులోని కోరికా ...

మనసులోని కోరిక.. తెలుసు ప్రేమ మాలికా...
మనసులోని కోరికా ...

చరణం 1:

ప్రియుని పటము పాడుట.. వింత వింత వేడుక..ఆ..ఆ
ప్రియుని పటము పాడుట.. వింత వింత వేడుక
పడతి చేతి మహిమ వలన...
పడతి చేతి మహిమ వలన.. పటము పాడె గీతికా

మనసులోని కోరిక.. తెలుసు ప్రేమ మాలికా
మనసులోని కోరికా ...

చరణం 2:

చెలియ నీదు ప్రేమయే.. విలువలేని కానుక..ఆ..ఆ
చెలియ నీదు ప్రేమయే.. విలువలేని కానుక
మనసు తీర హాయి హాయి ...
మనసు తీర హాయి హాయి .. మనసుధా కధానిక..

మనసులోని కోరిక.. తెలుసు నీకు ప్రేమికా
మనసులోని కోరికా ...

గులేబకావళి కథ (1962)

చిత్రం : గులేబకావళి కథ (1962)
సంగీతం : జోసఫ్ కృష్ణమూర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి :


ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను...

చరణం 1 :


నాపై ఆశలు నిలుపుకున్న... నా తల్లి ఋణము చెల్లించనైతిని
నాపై ఆశలు నిలుపుకున్న... నా తల్లి ఋణము చెల్లించనైతిని
ఎవరికీ గాక...  ఏ దరిగానక
ఎవరికీ గాక...  ఏ దరిగానక
చివికి చివికి నే మ్రోడైపోతిని

ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను...


చరణం 2 :


నన్నే దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని
నన్నే దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని
బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి... ఈ
బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి... ఈ బండలలో ఒక బండనైతిని

ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను...


చరణం 3 :


వలచిన కన్యను వంచనజేసి... నలుగురిలో తలవంపులుజేసి
వలచిన కన్యను వంచనజేసి... నలుగురిలో తలవంపులుజేసి
గుండె ఆవిరైపోవుచుండ...
ఈ గుండె ఆవిరైపోవుచుండ
ఈ మొండి బ్రతుకు నేనీడ్చుచుంటిని


ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను... నే  ఒంటరినైపోయాను... 



******** ******* ************ ********
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసఫ్ కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
 నేపధ్య గానం: సుశీల

పల్లవి:

మదనా సుందర నా దొరా...
ఓ మదనా సుందర నా దొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర..
ఓ మదనా సుందర నాదొరా...

చిన్న దానను నేను వన్నెకాడవు నీవు
చిన్న దానను నేను వన్నెకాడవు నీవు
నాకూ నీకూ జోడు …. నాకూ నీకూ జోడు రాకా చంద్రుల తోడు...
మదనా సుందర నాదొరా...

చరణం 1:

మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెల పైన...
మిసిమి వెన్నెలలోన... పసిడి తిన్నెల పైన
రసకేళి తేలి … రసకేళి తేలి... పరవశామౌద మీవేళ

మదనా సుందర నా దొరా

చరణం 2 :

గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి...
గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి
వుడికించ కింకా ….. వుడికించ కింక
 చూడొకమారు నా వంక

మదనా సుందర నా దొరా...

చరణం 3 :

మరులు సైపగ లేను.. విరహామోపగ లేను....
మరులు సైపగ లేను.. విరహామోపగ లేను
మగరాయడా రా రా …… మగరాయడా రా రా బిగి కౌగిలీ తేర...
మదనా సుందర నా దొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర....
 ఓ మదన సుందర నా దొరా...

******** ******* ************ ********
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసఫ్ కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి

చరణం 1:

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె

ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి

చరణం 2:

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో

ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం...

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి

******** ******* ************ ********

చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్-కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

కలల అలలపై తేలెను... మనసు మల్లెపూవై...
ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
కలల అలల పై..

చరణం 1:

జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
తడిసి తడియని కొంగున... ఒడలు దాచుకున్నందుకు..
తడిసి తడియని కొంగున... ఒడలు దాచుకున్నందుకు..

చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము... మరులు గొలుపుతున్నందుకు..
విరిసీ విరియని పరువము... మరులు గొలుపుతున్నందుకు..
కలల అలల పై..

చరణం 2:

సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికాణిని... జంట గూడి రమ్మన్నది
జవరాలిని చెలికాణిని... జంట గూడి రమ్మన్నది

విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము... బిగికౌగిట కలదన్నది..
అగుపించని ఆనందము... బిగికౌగిట కలదన్నది..

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై...
ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
కలల అలల పై..

గుండమ్మ కథ (1962)

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల, లీల

పల్లవి:

వేషము మార్చెను... హోయ్..
భాషను మార్చెను... హోయ్..
మోసము నేర్చెనూ..ఉ..ఉ....
అసలు తానే మారెను...

అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు..
మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు..

చరణం 1:

కృరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
కృరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను

హిమాలయముపై జండా పాతెను
హిమాలయముపై జండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు...

చరణం 2:

పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను..వాదము చేసెను..
వేదికలెక్కెను..వాదము చేసెను..
త్యాగమె మేలని బోధలు చేసెను

అయినా మనిషి మారలేదు
ఆతని బాధ తీరలేదు..

చరణం 3:

వేషమూ మార్చెను.. భాషనూ మార్చెను,
మోసము నేర్చెను.. తలలే మార్చెను...
అయినా మనిషి మారలేదు... ఆతని మమత తీరలేదు..

ఆ...ఆహహాహాహ ఆహాహహా...
ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...

******* ********* ********* ***********
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ అహహ అహహ
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో

తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో.. అహహ అహహ
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో

చరణం 1:

చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
...అహహ.. అహహ.. అహహ ఆహహహ
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊటి శాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో...

చరణం 2:

కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
అహహ.. అహహ... అహహహ.. ఆహహహ
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా.. అహహ.. అహ..హ
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా

తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో...
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము... యేలనో

******* ********* ********* ***********
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం

చరణం 1:

ఎపుడో చెప్పెను వేమనగారు..అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఎపుడో చెప్పెను వేమనగారు..అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా ఆ...
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

చరణం 2:

పల్లెటూళ్ళలో పంచాయితీలు..పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు..పట్టణాలలో ఉద్యోగాలు

అది ఇది ఏమని అన్ని రంగముల ఆ...
అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరుల నెదిరించారు ... నిరుద్యోగులను పెంచారూ...

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

చరణం 3:

చట్టసభలలో సీట్ల కోసం..భర్తలతోనే పోటీ చేసీ
చట్టసభలలో సీట్ల కోసం..భర్తలతోనే పోటీ చేసీ

ఢిల్లీ సభలో పీఠం వేసీ..ఈ ...
ఢిల్లీ సభలో పీఠం వేసీ
లెక్చరులెన్నో దంచారు ... విడాకు చట్టం తెచ్చారూ

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది.. నిద్ర లెచింది..నిద్ర లెచింది మహిళాలోకం

***** ******** ******** ********* *******

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

చరణం 1:

కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృత వాహిని ఓలలాడి మైమరచితిలే

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

చరణం 2:

ముసిముసినవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముసిముసినవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ వలపు పాశమని బెదరితిలే

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

******* ********* ********* ***********
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు
కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు
మేలుమేలోయన్న మేలో నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు ...
మేలుమేలోయన్న మేలో నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు ..
ఈ ముద్దుగుమ్మలకు చూడాలి జోడు !
ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...

చరణం 1:

బాలబాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల
బాలబాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల

బేలబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా
బేలబేలోయన్న దిద్దినకదిన దిద్దినకదిన దిద్దినకదిన దిన్ ..హేయ్..
బేలబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా ..
ఈ బేల పలికితే ముత్యాలు రాల.. ఊ..ఊ..ఊ...

కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు
ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...

చరణం 2:

ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమొ మంచిదే పాపం...
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమొ మంచిదే పాపం..ఓ..ఓ..ఓ..
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంటచూసిన పోవు తాపం
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంటచూసిన పోవు తాపం ..
జంటుంటే ఎందు రానీదు ఏ లోపం... ఊ..ఊ..ఊ..

కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు
ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...

******* ********* ********* ***********

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

సన్నగ వీచే చల్ల గా...లికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై ఆ......
కలలో వింతలు కననాయే

సన్నగ వీచే చల్ల గాలికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై
ఆ కలలో వింతలు కననాయే..

అవి తలచిన ఏమో సిగ్గాయే

కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచినా నీవాయే

చరణం 1:

నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే
నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే

కలవరపడి నే కనులు తెరువ
నా కంటి పాపలో నీవాయే
ఎచట చూచినా నీవాయే

కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచినా నీవాయే

చరణం 2:

మేలుకొనిన నా మదిలో యేవో
మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో యేవో
మెల్లని పిలుపులు విననాయే

ఉలికిపాటుతో కలయ వెతక
నా హృదయ ఫలకమున నీవాయే

కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవేనాయే

******* ********* ********* ***********
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఎంత హాయీ...
ఎంత హాయి  ఈ రేయి ఎంత మధురమీ హాయి
ఆ ఆ ఆ ఆ..
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగ మత్తుమందు చల్లగా
ఆ..చందమామ చల్లగ పన్నీటిజల్లు చల్లగా

ఎంత హాయీ..
ఎంత హాయి ఈ రేయి ఎంత మధుర మీహాయీ.. ఎంత హా యీ

చరణం 1:

ఆ ఆ ఆ ఆ..
ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఆ ఆ ఆ..
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
ఆ..విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా

చరణం 2:

ఆ ఆ ఆ ఆ.......
కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధురభావ లాహిరిలో మనము తూలిపోవగా
ఆ..మధురభావ లహరిలో మనము తేలిపోవగా

******* ********* ********* ***********

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

అలిగిన వేళనె చూడాలి.. గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి..
రుసరుసలాడే చూపుల లోనే...
రుసరుసలాడే చూపుల లోనే ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి

చరణం 1:

అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ...
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ...
అల్లరిదేమని అడిగినందుకే...
అలిగిన వేళనె చూడాలి.. గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

చరణం 2:

మోహన మురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా
మోహన మురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద..
దృష్టి తగులునని జడిసి యశోద.. తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి..
రుసరుసలాడే చూపుల లోనే... ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి

కులగోత్రాలు (1962)

చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : పిఠాపురం, మాధవపెద్ది సత్యం

పల్లవి :


అయ్యయ్యో ... చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో ... జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో...  చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో ... జేబులు ఖాళీ ఆయెనే

ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది
ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా... తిరుక్షవరమై పోయింది


అయ్యయ్యో...  చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో...  జేబులు ఖాళీ ఆయెనే


చరణం 1 :


ఆ మహా మహా నలమహారాజుకే... తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ

మరి నువు చెప్పలేదు భాయీ... అది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగ... చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ


అయ్యయ్యో...  చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో...  జేబులు ఖాళీ ఆయెనే


చరణం 2 :


నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది... గోవిందా గోవిందా
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది... చక్కెర పొంగలి చిక్కేది

ఎలక్షన్లలో ఖర్చుపెడితే... ఎం.ఎల్.ఏ దక్కేది
మనకు అంతటి లక్కేదీ

అయ్యయ్యో...  చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో...  జేబులు ఖాళీ ఆయెనే


చరణం 3 :


గెలుపూ ఓటమి దైవాధీనం...
చెయ్యి తిరగవచ్చు... మళ్ళీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు... ఇల్లు కుదవ చేర్చవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో... మన కరువు తీరవచ్చు
పోతే...  అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు

అయ్యయ్యో...  చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో...  జేబులు ఖాళీ ఆయెనే


*** **** ********** *****
చిత్రం: కులగోత్రాలు (1962)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, జమునారాణి

పల్లవి:

రావే రావే బాలా ... హలో మై డియర్ లీల
రావే రావే బాలా...హలో మైడియర్ లీల
ఇటురావే ఇటురావే ... ఐ లవ్ యు

పోవోయ్ పోవోయ్ బావా...ఎందుకీ పెడత్రోవా
పోవోయ్ పోవోయ్ బావా...ఎందుకీ పెడత్రోవా
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీవేషాలూ ... చాలునే సరసాలు
ఇకచాల్లే...ఇక చాల్లే

చరణం 1:

టిప్పుటాపు దొరసాని ..అప్టుడేటు అలివేణి
టిప్పుటాపు దొరసాని ..అప్టుడేటు అలివేణి
ఈ రోజుల్లో మనఫోజుల్లో...
ఈ రోజుల్లో మనఫోజుల్లో ..ఇది దొరలఫేషనే రాణీ

పెద్దవాళ్ళు చూస్తారు ... దేహశుధిచేస్తారు
" వా " ....
పెద్దవాళ్ళు చూస్తారు .. దేహశుధిచేస్తారు
పచ్చి పచ్చి లవ్ చూపావంటే .. పిచ్చాస్పత్రిలో వేస్తారు
" నో...నో.... "
పచ్చి పచ్చి లవ్ చూపావంటే పిచ్చాస్పత్రిలో వేస్తారు
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
ఈ పల్లెల్లో మన పల్లెల్లో
సాగవీవేషాలూ ... చాలు నీ సరదాలు
ఇకచాల్లే..." ఐ లవ్ యు " ..

రావే రావే బాలా ... హలో మై డియర్ లీల
రావే రావే బాలా...హలో మైడియర్ లీల
ఇటురావే ఇటురావే ... ఐ లవ్ యు

చరణం 2:

తప్పేమున్నది మేడం ..నాతో షికారు రావడం
ఇక్కడ పుట్టినవాళ్ళం ..ఎందుకు మనకీ మేళం
ఈ పల్లెల్లో మన పల్లెల్లో...
ఈ పల్లెల్లో మనపల్లెల్లో...
సాగవీవేషాలూ... చాలునీ సరదాలు
ఇక చాల్లే..." ఐ లవ్ యు "

రావే రావే బాలా...పోవోయ్ పోవోయ్ బావా
రావే రావే బాలా...పోవోయ్ పోవోయ్ బావా
లవ్ యు.....ఇక చాల్లే..

*** **** ********** *****
చిత్రం: కులగోత్రాలు (1962)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా..

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..

చరణం 1:

నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ...
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ

కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ

అహహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ ఆ

చరణం 2:

నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే

అహహా ... అహా ఒహోహో .....
అహహా ఒహో.......అ ఆ ...

చరణం 3:

నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ

అహహా...అహా ఒహోహో....
హహా ఒహో...అ ఆ . .

*** **** ********** *****

చిత్రం: కులగోత్రాలు (1962)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ . . ఆ ఆ ఆ . . ఓ . .
చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా.. నిలుపుకొందురా వెల్గులమేడ

నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల

చరణం 1:

కనులముందు అలలు పొంగెనూ .. ఓ . . .
మనసులోన కలలు పండెనూ . .
కనులముందు అలలు పొంగెనూ .. ఓ . . .
మనసులోన కలలు పండెనూ . .
అలలే కలలై ..కలలే అలలై
అలలే కలలై ..కలలే అలలై
గిలిగింతలు సలుపసాగెనూ ఊ ఊ ఊ . . .

చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ

చరణం 2:

కొండలు కోయని పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
గుండెలు హోయని పలికినవీ ..ఆ ఆ ఆ . . .
కొండలు కోయని పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
గుండెలు హోయని పలికినవీ ..ఆ ఆ ఆ . . .
కోరికలన్నీ బారులుతీరీ
కోరికలన్నీ బారులుతీరీ
గువ్వలుగా ఎగురుతున్నవీ ఈ ఈ ఈ. . .

నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల

చరణం 3:

జగము మరచి ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ . . .
జగము మరచి ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ . . .
నింగీ నేలా కలిసిన చోటా
నింగీ నేలా కలిసిన చోటా
నీవు నేను చేరుకొందమా ఆ ఆ ఆ . . .

చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ

ఓ ఓ ఓ . . .
ఓ ఓ ఓ . . .

కానిస్టేబుల్ కూతురు (1962)

చిత్రం: కానిస్టేబుల్ కూతురు (1962)
సంగీతం: ఆర్. గోవర్ధన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్

పల్లవి:

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి
నీ చూపులకేనా నాపై కోపం తూపులు దూసినవి

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

చరణం 1:

బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగ మారినదో
పీటలపైన పెళ్ళిదినాన మాటలు కరువైనా
నన్ను ఓరచూపుల కోరికలూరా చూడవా నీవైనా..

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

చరణం 2:

మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
ఓ..ఓ..ఓ.. మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

****** ******* ******************* *********

చిత్రం: కానిస్టేబుల్ కూతురు (1962)
సంగీతం: ఆర్. గోవర్ధన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల

పల్లవి:

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో... నా మనసును చిలికేవో..ఓ..ఓ
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

చరణం 1:

నీ అడుగుల జాడలలో... నా నీడను కలిపేనా
నీ చూపుల కాంతులలో... నా రూపును నిలిపేనా..ఆ..ఆ..అ

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

చరణం 2:

నా దారిలో నిను జూచి... నును సిగ్గుతో తొలగేనా ఆ ఆ ఆ
కలలో నిను కనినంతా నిజమే అని పిలిచేనా..ఆ..ఆ..ఆ

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో.. మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ..
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

చరణం 3:

విరిపూలతో ఆడును లే... చిరుగాలితో పాడును లే
మా చెల్లెలు బాల సుమా.. ఏమెరుగని బేల సుమా..ఆ..ఆ..ఆ

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో.. మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ..
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

కలిమిలేములు (1962)

చిత్రం: కలిమిలేములు (1962)
సంగీతం: అశ్వత్థామ
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

గాలిలో... గాలిలో...
తేలే పూలడోలలో... డోలలో...
పన్నీరు చల్లే వెన్నెల తీవ
కన్నుల కలకల ఏమో
చిననాటి ఆనందసీమలో...

అలనాటి ఆనందసీమలో
అదే చెలిమిగ విహరించేయమని
అనుకున్న కన్నె కలలే
చిననాటి ఆనందసీమలో...

చరణం 1:

గాలిలో... గాలిలో...
అలారుగ... అలారుగ...
గాలిలో అలలు అలలుగ అలారుగ
గానమేలే కనకవీణ
నగుమోమున తళతళ ఏమో
చిననాటి ఆనందసీమలో...

అలనాటి కలల వేడుకలే
మనసైన వాని చేరువచేయ
మోదములో ఆదమరచే పరవశమే
చిననాటి ఆనందసీమలో...

చరణం 2:

గగనాన వెలిగే రేరాజు
చెంగల్వకు కలకాలము చేరువె
ఆ పలుకే నిజమై ఆ మనసే తనదై
కన్నెవలపు మాయని పున్నమి వెలుగాయే
చిననాటి ఆనందసీమలో...

ఆత్మ బంధువు (1962)

చిత్రం : ఆత్మ బంధువు (1962)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : సుశీల, జమునా రాణి 

పల్లవి :


మారదు మారదు మనుషుల తత్వం మారదు
మారదు మారదు మనుషుల తత్వం మారదు

మాటలతోటి మారిందనుకుని... మాటలతోటి మారిందనుకుని
ఎవ్వరు భ్రమపడకూడదు... మ్మ్....  మ్మ్
మారదు మారదు మనుషుల తత్వం మారదు 



చరణం 1 : 

సూర్య చంద్రులూ మారలేదులే... చుక్కలు మొలవకా మానలేదులే
సూర్య చంద్రులూ మారలేదులే... చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం...
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం...
మారటమంటే సుళువు కాదులే...
మారటమంటే సుళువు కాదులే
మారదు మారదు మనుషుల తత్వం మారదు 

చరణం 2 : 


పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు...  దగ్గర బంధువులంటారు
పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు...  దగ్గర బంధువులంటారు

పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు... చెవులకు చేటలు కడతారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు... చెవులకు చేటలు కడతారు

మారదు మారదు మనుషుల తత్వం మారదు


చరణం 3 :


కాసుపడనిదే తాళి కట్టరు... పెళ్ళిపీటపై వారు కాలుపెట్టరు
కాసుపడనిదే తాళి కట్టరు... పెళ్ళిపీటపై వారు కాలుపెట్టరు

కట్నములేనిదే ఘనతే లేదనీ...
కట్నములేనిదే ఘనతే లేదనీ
చదువుకున్నవారే కలలుకందురూ...
చదువుకున్నవారే కలలుకందురూ... 

మారదు మారదు మనుషుల తత్వం మారదు


చరణం 4 :


ఆకలికన్నం పెట్టేవాడే... ఏ... ఏ... ఏ..
ఆపదలో కాపాడేవాడే..ఏ... ఏ... ఏ..
ఆకలికన్నం పెట్టేవాడే..ఆపదలో కాపాడేవాడే
బంధువూ అతడే... బంధువూ...  ఆత్మబంధువూ
ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ  

మారదు మారదు మనుషుల తత్వం మారదు
మనుషుల తత్వం మారదు

*************  ******** ******** ********

చీరగట్టి సింగారించి

చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:



చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్
చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్



చరణం 1:

ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా
ఒయ్యారము ఒలకబోసినావా.. వాలుచూపులతో గాలమ్ము వేసినావా
పెళ్ళికొడుకును పట్టినావా .. పెళ్ళికొడుకును పట్టినావా ..
ఓసి కోడలుపిల్లా ఛాన్సు కొట్టినావా

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్



చరణం 2:

చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు
చందమామవంటి భలే అందగాడు.. బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు
నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు.. నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు
ఏడాది తిరగకుండ వచ్చు.. ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్



చరణం 3:


ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం
ముక్కుమీదే ఉంది నీకు కోపం..అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం
వలపు దాచావంటే పరితాపం .. వలపు దాచావంటే పరితాపం..
అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం

చీరగట్టి సింగారించి.. చింపితలకు చిక్కుదీసి
చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా.. చిన్నదానా.. హోయ్

*************  ******** ******** ********

చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల


పల్లవి:

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో..
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం 1:

ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను...
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం 2:

తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు..
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

చదువు రాని వాడవని దిగులు చెందకు..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

********** ************* ****************

చిత్రం : ఆత్మ బంధువు (1962)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల


అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి


రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు వొట్టి చవటలయ్యారు
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివెయ నెంచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసేను
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసెను
కంటిపాప కంటె యెంతో గారవించేను
కంటిపాప కంటె యెంతో గారవించేను
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగేను తానుండసాగేను

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమి గలవారంతా కొడుకులేనురా
కూరిమి గలవారంతా కొడుకులేనురా
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా... కుక్క మేలురా...

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి


ఆరాధన (1962)

చిత్రం :  ఆరాధన (1962)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
నేపధ్య గానం :  జానకి    


పల్లవి :
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్
నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ 

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్


చరణం 1 :

మిఠారి నవ్వులే మిఠాయి తీపులు.. కటారి రూపులోన కైపులున్నవి
రంగేళి ఆటకు రడీగా ఉన్నది
రంగేళి ఆటకు రడీగా ఉన్నది...  కంగారు ఎందుకోయీ 
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

చరణం 2 :

ఖరీదు లేనివి ఖరారు అయినవి...  గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి
ఖరీదు లేనివి ఖరారు అయినవి... గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి
మజాల సొగసులే ప్రజెంట్ చేసెద..
మజాల సొగసులే ప్రజెంట్ చేసెద...  సుఖాల తేలవొయీ

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్
నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ 

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

ఆరాధన (1962)

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతి గా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి..

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా 

చరణం 1 :

వాడని పూవుల తావితో..కదలాడే సుందర వసంతమీ కాలము
కదలాడే సుందర వసంతమీ కాలము..

చెలి జోలగ పాడే వినోద రాగాలలో...
చెలి జోలగ పాడే వినోద రాగాలలో... 
తేలెడి కల సుఖాలలో... నిదురించుము ఈ రేయీ..
నిదురించుము ఈ రేయీ

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా 

చరణం 2 :

భానుని వీడని చాయగా... నీ భావము లోనే చరింతునోయీ సఖ
నీ భావములోనే చరింతునోయీ సఖ

నీ సేవలలోనే తరింతునోయీ సదా...
నీ సేవలలోనే తరింతునోయీ సదా..
నీ ఎదలోనే వసింతులే... నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ

వెన్నెలలోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి... నిదురించుము ఈ రేయి

చిత్రం :  ఆరాధన (1962)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల