Showing posts with label S. Show all posts
Showing posts with label S. Show all posts

సంఘం (1954)

చిత్రం :  సంఘం (1954)

సంగీతం :  ఆర్.సుదర్శనం

గీతరచయిత :  తోలేటి వెంకటరెడ్డి

నేపధ్య గానం : సుశీల


పల్లవి : 

ఆ...ఆఆ... ఆ... ఆఆ...

లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...

లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...

లాలల లాలల లా లల్లల్లా...


భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే

భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే


భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే

భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే


చరణం 1 :


స్వార్థముతో కులమత భేదముతో..

సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..

సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..

కర్షక సౌఖ్యం...

కర్షక సౌఖ్యం...  కార్మిక శ్రేయం..

కర్షక సౌఖ్యం.... కార్మిక శ్రేయం

కలిగే మార్గం చూపిస్తా..ఆ...ఆ

కలిగే మార్గం చూపిస్తా...



చరణం 2 :



రాణీ రుద్రమ... మల్లమదేవీ.. రెడ్డినాగమ్మ..  నేనే

రాణీ రుద్రమ.. మల్లమదేవీ..  రెడ్డినాగమ్మ..  నేనే

రణ తిక్కన భార్యా...  సతి మాంచాల

తిక్కన భార్యా...  సతి మాంచాల

శౌర్య ధైర్యములు నావే..

శౌర్య ధైర్యములు నావే.. 



భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే

భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..


ఆహో..ఓఓఓ...ఆఅహో..ఆ...ఆ...

ఆహో..ఆ... ఆ.. ...




చిత్రం :  సంఘం (1954)

సంగీతం :  ఆర్. సుదర్శనం

గీతరచయిత :  తోలేటి

నేపధ్య గానం :  సుశీల, టి. ఎస్. భగవతి 



పల్లవి :


సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...

నా అందచందములు దాచితి నీకై... రావేలా...

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...

నా అందచందములు దాచితి నీకై... రావేలా...



ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా...

ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా...

ఆ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ...

నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ...



సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...

నా అందచందములు దాచితి నీకై... రావేలా.... 



చరణం 1 :



నీలి కనులలో వాలుచూపుల ఆ వేళా...

నను చూసి కనుసైగ చేసితివోయీ... రావేలా

కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా....

కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా....



ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ....

మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ



సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...

నా అందచందములు దాచితి నీకై రావేలా... 


చరణం 2 :


హృదయవీణ తీగలు మీటీ ఆ వేళా...

అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా

హృదయవీణ తీగలు మీటీ ఆవేళా....

అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా



మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా....

మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా..

పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే...

పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే



సుందరాంగ మరువగలేనోయ్ రావేలా

నా అందచందములు దాచితి నీకై రావేలా...

సైనికుడు (2006)




చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె.


సైనికుడు....సైనికుడు
గొ గొగొగొ గొ గొగొగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
కాలం ఇదిగొ కాలం అదిగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి
లోకమనే మదిలో ఒదిగె నిదురని తట్టి
ఓహో .. శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై
ఓహో.. సాగిపొ నేడే సైనికుడు నువ్వై
గొ గొగొగొ గొ గొగొగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ......గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ......గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

M B A చదివిన MCA లె చదివిన ఈ జగతిని సైతం చదవరా
వేదాలె చదివిన వేమన నీతులు చదివిన అవినీతుల లోతులు చదవర ఆ ఆ

వికాసం మాటున విషాదం వుందిరా విరామం వద్దురా విదానం మార్చరా
ఒంటి సైనికుడల్లె కవాతులె చెయ్యరా కొటి సూర్యులమల్లె ప్రకాశమే పంచరా ప్రకాశమే పంచరా
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
సైనికుడు .. సైనికుడు

ఓహ్ మై లవ్ మాటతొ అమ్మాయి మనసే గెలిచిన ఆ గెలుపే ఇద్దరి మద్యన
ఓహ్ మై ఫ్రెండ్ మాటతొ అందరి మనసులు గెలవరా ఆ గెలుపొక మలుపును చూపురా
ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా
సాటి స్నేహితుడల్లె జనాలతొ నడవరా మేటి నాయకుడల్లె జగాలనే నడపరా
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగె నిదురని తట్టి
ఓహో .. శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓహో.. సాగిపొ నేడే సైనికుడు నువ్వై
సైనికుడు .. సైనికుడు



********   *********   ********



చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత సారథి, లెస్లే లెవీస్, అనుష్క


బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో
బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో

ఓ జనగణమే నిలిచింది నీతో
జన పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే
మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం

బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో

ఓ జనగణమే నిలిచింది నీతో
జన పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే

మెరుపే బంగారాలు మెరవకపోతే రాళ్ళు
అనుకుంటూ ఉన్నాగా ఇన్నాళ్ళు
తెరిపించావోయ్ కళ్ళు విడిపించావోయ్ ముళ్ళు
ముళ్ళైనా నీతో ఉంటే వూలు
కవ్వించాలి ప్రవహించాలి మనసుల్లోనా మమతల సెలయేరు

ప్రేమించాలి నడిపించాలి నలుగురు మెచ్చే నూతన సర్కారు

బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో

ఓ జనగణమే నిలిచింది నీతో
జన పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే


చూపుల్లోని చురుకు ఊహల్లో ఉడుకు దీపాలై అందించాలి వెలుగు
చేయి చేయి కలుపు పాదం పాదం కలుపు ఏరాలి మొక్కల్లోని కలుపు
మెలి తియ్యాలి కలిపెయ్యాలి కాలుష్యాల చీకటి కోణాలు
పండించాలి పాలించాలి సస్యశ్యామల ప్రేమల రాజ్యాలు

బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో

ఓ జనగణమే నిలిచింది నీతో
జన పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే
మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం

మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం



*********   *********   *********



చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, చిత్ర


హొయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ
కాస్కో కుస్కో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా హేయ్

అలకలు వస్తే తళుకులు చూస్తా చతికిల పడకుండా జతయి కలుస్తా
ఇరుకున పెడితే దొరకనిదిస్తా చిలికిన ఎన్నెల్లో వొడే పరుస్తా

నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ... నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ
వడి సొంతమే ఉందిగా హాయీ హామీ
అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

గడపలకొస్తే గడియలు తీస్తా కుడిఎడమవుతుంటే కుదేలు చేస్తా
సొగసులు కోస్తే రవికలు తెస్తా విరవిరజాజుల్తో నిన్నే గెలుస్తా
సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ .. సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ
నడి సందెలో అందెలే సిందెయ్యగా
హేయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ
కాస్కో కుస్కో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా



********   ********   ********


చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రేయా గోషల్


సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ
సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ
నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
హా.. సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా
పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడూ గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా
నన్ను వలచినవాడు వరుడై రాగా ఆదమరచిపోనా
సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా హో
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ
సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ
నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా


********   ********   ********


చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉన్ని కృష్ణన్, యస్. పి. బాలు, కవితాకృష్ణమూర్తి


ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా
మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా రంగంటూ లేనేలేదు లేరా

ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా

ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా
అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా

ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంతే ఉండే దూరం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే
ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా



********   ********   ********


చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రేయగోషల్

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ
నా కళ్ళల్లొ వాకిళ్ళల్లో ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సిందులేసి సూడవమ్మ
వయసునాప తరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మ నాలొ నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ

ఓ చల్ల గాలి ఆ నింగి దాటి
ఈ పిల్ల గాలి వైపు రావా
ఊహల్లొ తేలి నీ ఒళ్ళొ వాలి
నా ప్రేమ ఊసులాడనీవా
పాల నురుగుల పైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్న మధురము కాద ప్రేమ గాధ వినవా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ

డోలారె డోల డోలారె డోల
మోగింది చూడు గట్టి మేళ
బుగ్గె కందేలా సిగ్గె పడేలా
నాకొచ్చెనమ్మ పెళ్ళి కల
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వాన
నన్ను వలచిన వాడు వరుడై రాగా ఆద మరచి పోనా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ
నా కళ్ళల్లొ వాకిళ్ళల్లో ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సిందులేసి సూడవమ్మ
వయసునాప తరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మ నాలొ నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా

ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా

సరదాబుల్లోడు (1996)

చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: వెంకటేష్, నగ్మా, సంఘవి
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: టి. త్రివిక్రమరావు
విడుదల తేది: 09.08.1996

రంగా రంగా సింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా
భారంగా వంగే సొంపులు కోరంగా వచ్చేయ్ సాయంగా
తీయంగా అల్లి తీర్చన నీ బెంగ

రంగా రంగా సింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా

విరిసే వయసా నీ చిక్కని సొంపుల
చక్కదనానికి చిక్కనివాడొక మనిషా
పిలిచే వరసా నులి వెచ్చని ముచ్చట
తెరిచిన కౌగిట నలగని నాదొక సొగసా
నవనవమను నీ పరువం
కువ కువ మను కూసిన తరుణం
పిట పిట మను పడుచుదనం
పద పదమను ఈ నిముషం
అదిరే అందాల పెదవే కందాలి
ముదిరే ముద్దాటలో

రంగా రంగా సింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా

కసిగా కసిరే చెలి కమ్మని తిమ్మిరి
గమ్మున తీర్చగ కమ్ముకు రావే పురుష
సుఖమే అడిగే సఖి ముచ్చట తీరగ
వెచ్చని వేడుక పంచుటకే కద కలిశా
తహతహ మను దాహంతో
తపనలు పడు సంపదలివిగో
అలుపెరుగని మొహంతో
కలపడు మగతనమిదిగో
నడుమే నవ్వేల తడిమే నీ చేతి
చలువే చూపించుకో

రంగా రంగా సింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా
భారంగా వంగే సొంపులు కోరంగా వచ్చే సాయంగా
తీయంగా అల్లి తీర్చన నీ బెంగ



*********  *********  ********


చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

అరె పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో
నాటుకోడి పెట్టోయమ్మ
అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి
ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి
అరె నైసు గుంది కొట్టెయ్ చుమ్మా
అమ్మమ్మమ్మమ్మ ఎంతో రుచి
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి
హొయ్ అబ్బదాని సోకు బాదం పిస్తా కేకు
అమ్మమ్మా దాని వీపు మైసూర్ శాండిల్ సోపు
కౌగిట్లోనే చిక్కిందమ్మా కస్సు బస్సు పాపాయమ్మో

నాటుకోడి పెట్టోయమ్మ
అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి
ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి

అరె భోల్ భోల్ భోల్ భోల్ భోల్ రాధ భోల్
సందిట్లో ఎంచక్కా సంగం హోగానయి
రాకెన్రోల్ రోల్ రోల్ రోల్ రోల్ రాణి రోల్
నాతోటి పెట్కుంటే మోగిపోతాదే డోల్
అరె పట్టేశానే పక్క కొలిపిస్తా జానా బెత్త
ఇక చూస్కోయే నా సత్తా నీ అమ్మని చేస్తా అత్త
మేళం తాళం పెట్టిస్తా ఊరు వాడా తిప్పిస్తా
లవ్వో గివ్వో లాగించేస్తా
అస్కో బుస్కో పాపాయమ్మా

నాటుకోడి పెట్టోయమ్మ
అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి
ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి
అరెరెర్రె నైసు గుంది కొట్టెయ్ చుమ్మా
అమ్మమ్మ మ్మమ్మమ్మ ఎంతో రుచి
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి

అరె కాయ్ కాయ్ కాయ్ పందెం కాయ్ రాజా కాయ్
ఫికర్నేదో చూపించి దుమ్ము దులిపేస్తానోయ్
వామ్మో...
అరెరెర్రె హాయిరె హాయ్ హాయ్ హాయ్
ఐ యామ్ వెరీ బాడ్ బాయ్
చాలంజి చేశావో తింటావే గుత్తోంకాయ్
అరె జారే జారే బచ్చా ఆడిస్తా కచ్చా బచ్చా
పెడతానే ముద్దు మేత మీ నాన్నను చేస్తా తాత
పందిరి మంచం ఎక్కిస్తా పళ్ళు పాలు మెక్కిస్తా
పెళ్ళవకుండా తళ్ళైపోతావ్
అల్లో మల్లో పాపాయమ్మా

నాటుకోడి పెట్టోయమ్మ
అమ్మమ్మమ్మ ఎంతో కసి
ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి
ఆ నైసు గుంది కొట్టెయ్ చుమ్మా
అమ్మమ్మ మ్మమ్మమ్మ ఎంతో రుచి
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి
అబ్బదాని సోకు బాదం పిస్తా కేకు
అమ్మమ్మా దాని వీపు మైసూర్ శాండిల్ సోపు
కౌగిట్లోనే చిక్కిందమ్మా కస్సు బస్సు పాపాయమ్మో



*********  *********  ********




చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

చిత్తా కార్తిలో చినుకులు చిటపట
యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్
రెచ్చే వానలో రవికల రిమ రిమ
అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్
కన్నె పువ్వే ఓ ఓ కెవ్వు మంటే
కుర్ర ఈడే ఓ ఓ కస్సు మంటే
కౌగిట్లో చేరాల కవ్వింతే సాగాల
కానీరో యవారం యమాగ ఓ యారో

పగలంతా ఒకటే పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చి
పుట్టిందే ఎదలో కచ్చి
కచ్చి కచ్చి కచ్చి
మెరుపల్లె గురుడా వచ్చి
వచ్చి వచ్చి వచ్చి
మదనాల మధువే తెచ్చి
తెచ్చి తెచ్చి తెచ్చి
మెచ్చాను రావే మందార మాల
మొదలైంది ఒళ్ళో హాల్లా గుల్లా
కంగారు పడకోయ్ టైముంది చాలా
అందిస్తా అన్నీ ఎల్లాగోలా
అందించ మంట అందాల పంట
నాజూకు నట్టింటా ఓ ఓ

చిత్తా కార్తిలో చినుకులు చిటపట
యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్
రెచ్చే వానలో రవికల రిమ రిమ
అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్

చిరుజల్లు కొడుతూ ఉంటె
ఉంటె ఉంటె ఉంటె
చలి మంట పెట్టే మంటే
అంటే అంటే అంటే
పరువాలు రగిలే టచ్చి
టచ్చి టచ్చి టచ్చి
ఇచ్చెయినా సరదాగొచ్చి
ఇచ్చి ఇచ్చి ఇచ్చి
అల్లాడిపోయే కిల్లాడి సోకు
ఇచ్చేయి షాకు అన్నాడురో
తయ్యారుగుంటే తెల్లారే దాకా
సన్నాయి మోత మోగేనమ్మో
కాదంటే తంటా మోగించ మంట
కౌగిట్లో కసి గంటా హో ఓ

చిత్తా కార్తిలో చినుకులు చిటపట
యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్
రెచ్చే వానలో రవికల రిమ రిమ
అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్
కన్నె పువ్వే ఓ ఓ కెవ్వు మంటే
కుర్ర ఈడే ఓ ఓ కస్సు మంటే
కౌగిట్లో చేరాల కవ్వింతే సాగాల
కానిద్దాం యవారం యమాగ ఓ యారో