Showing posts with label letter- K. Show all posts
Showing posts with label letter- K. Show all posts

కోడెనాగు (1974)



చిత్రం  :  కోడెనాగు (1974)
సంగీతం  :  పెండ్యాల
గీతరచయిత  :  మల్లెమాల
నేపధ్య గానం  :  ఘంటసాల, సుశీల 

పల్లవి :

సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. జన్మ జన్మ ఋణానుబంధ సంగమం...

సంగమం... సంగమం
ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమం...
సంగమం... సంగమం...
అనురాగ సంగమం.. ఆనంద సంగమం

చరణం 1 :


పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం.... 
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం.... 
సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం  ఆగి చూచు సంగమం.. 
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం..  ఆగి చూచు సంగమం

సంగమం... సంగమం.... 
అనురాగ సంగమం... ఆనంద సంగమం

చరణం 2 :


నింగి నేల.. నింగి నేల ఏకమైన నిరుపమాన సంగమం  
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం.. ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం.. నిలిచిపోవు సంగమం 
.
సంగమం....సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం


చరణం 3 :


జాతికన్న నీతి గొప్పది.. మతము కన్న మమత గొప్పది.
జాతికన్న నీతి గొప్పది.. మతము కన్న మమత గొప్పది...
మమతలు.. మనసులు ఐక్యమైనవి...
ఆ ఐక్యతే మానవతకు అద్దమన్నవీ...  అద్దమన్నవీ...

సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం


********* *************** ***************************
చిత్రం : కోడెనాగు (1974)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల 

పల్లవి :

కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...
నా కథ విందువా

చరణం 1 :


బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
అన్న అనుమాటతో అన్ని తుంచేశావు
పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి
ఉరితాడు నా మెడకు వేయించినావు

కథ విందువా...నా కథ విందువా


చరణం 2 :


తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
కసటు కోరిక మగని రూపాన నిలిచింది
నీ పేరు మెదలిన మధురాధరము పైన
చిరు చేదు చిలికింది... జీవితమె మారింది
చిరుచేదు చిలికింది... జీవితమె మారింది 

కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...నా కథ విందువా

చరణం 3 :


శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
తాళినే ఎగతాళి చేసింది ధనము
కాముకుల కాహుతైపోయింది మానము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము

కథ విందువా... నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...నా కథ విందువా



********* *************** ***************************
చిత్రం : కోడెనాగు (1974)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : ఘంటసాల 

పల్లవి :

ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి
ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి..
ఇదే చంద్రగిరి...  శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి... 

చరణం 1 :
తెలుగుజాతి చరితలోన  చెరిగిపోని కీర్తి సిరి చెరిగిపోని కీర్తి సిరి
తెలుగు నెత్తురుడికించిన వైరులకిది మృత్యువు గరి
ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి...   ఇదే చంద్రగిరి 

చరణం 2 :


తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో
తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము
ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా..ఆ... ఆ.. ఆ.. ..ఆ... ఆ.. ఆ
ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా
వెలసిన దిట స్వర్గము .. వెయ్యేళ్ళకు పూర్వము...  వెయ్యేళ్ళకు పూర్వము
ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి.. ఇదే చంద్రగిరి


చరణం 3 :


ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు
రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు
ఈ మహలే కవి గాయక పండిత జన మండల మొకనాడు
ఈ శిధిలాలే గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు
గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు...  ఈనాడు....

కన్నవారి కలలు (1974)




చిత్రం :  కన్నవారి కలలు (1974)
సంగీతం :  వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల 


పల్లవి : 

sorry so sorry... నా మాట విను ఇంకోకసారి
sorry so sorry... నా మాట విను ఇంకోకసారి 

ప్రేమించలేదు నిన్ను... ఈ బ్రహ్మచారి
పెళ్ళాడితే నిన్ను... నా దారే గోదారి 

sorry so sorry... నా మాట విను ఇంకోకసారి
చూడు.. ఇటు చూడు..
నా వంక చూసి మాటాడు...
చూడు.. ఇటు చూడు..
నా వంక చూసి మాటాడు...
ప్రేమించలేదా నువ్వు.. నన్నే ఏరికోరి
కాదంటే వదలను నిన్ను... ఓ బ్రహ్మచారి 

sorry so sorry... నా మాట విను ఇంకోకసారి 

చరణం 1 : 

నిన్న కాక అటు మొన్ననె కాదా... కళ్ళు కళ్ళు కలిపేవు..
అవునూ.. 

వెన్నలాంటి నా మనసును దోచి... బాసలెన్నో  చేశావు...
అవునూ.. 

నిన్న కాక అటు మొన్ననె కాదా... కళ్ళు కళ్ళు కలిపేవు
వెన్నలాంటి నా మనసును దోచి... బాసలెన్నో  చేశావు
ఆశపెంచి మురిపించిన నువ్వే... మనిషి మారిపోయావు 

తప్పు తెలుసుకొన్నాను... మనసు మార్చుకొన్నాను
నా తప్పు తెలుసుకొన్నాను... మనసు మార్చుకొన్నాను
కాబోయే శ్రీమతి ఇలా.. ఉండ కూడదనుకొన్నాను 

sorry so sorry... నా మాట విను ఇంకోకసారి 

చరణం 2: 

తిండిపోతులా తింటే కాదు... వండే చిన్నది కావాలి...
ఊ..హు..హు...హు... 

ఏడుపు అంటే నాకు గిట్టదు... ఎపుడూ నవ్వుతు వుండాలీ..
అలాగా.. 

తిండిపోతులా తింటే కాదు... వండే చిన్నది కావాలి
ఏడుపు అంటే నాకు గిట్టదు... ఎపుడూ నవ్వుతు వుండాలీ
చీటికి మాటికి అలగకూడదు... తోడూ నీడగ వుండాలి 

వంట నేర్చుకొంటాను... రియల్లీ..
నవ్వులు చిందిస్తాను... ప్రామిస్ ... 

వంట నేర్చుకోంటాను... నవ్వులు చిందిస్తాను
నీతోటే నేనుంటాను... నీమాటే వింటాను 

అయితే ఇక రేపే మ్రోగేను పెళ్ళి సన్నాయి
ఎల్లుండే నీ చేతుల్లో ఉంటుంది పాపాయి
జో...హాయీ హాయీ జో హయీ...హాయీ జో...



****************** ****************************


చిత్రం :  కన్నవారి కలలు (1974)
సంగీతం :  వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  బాలు  

పల్లవి :

చెలి చూపులోన కథలెన్నో తోచే.. చలి గాలిలోన పరువాలు వీచే . . .
చెలి చూపులోన కథలెన్నో తోచే.. చలి గాలిలోన పరువాలు వీచే


చరణం 1 :

నీ సొగసు పిలిచింది నా వయసు పలికింది.. నడిరేయి సై అంది.. మౌనమిక చాలంది
నీ సొగసు పిలిచింది నా వయసు పలికింది.. నడిరేయి సై అంది.. మౌనమిక చాలంది
ఈ జగమమతా కొత్తగవుంది.. ఈ క్షణమేదో మత్తుగవుంది... పొంగేనులే యౌవ్వనం               
చెలి చూపులోన కథలెన్నో తోచే.. చలి గాలిలోన పరువాలు వీచే 

చరణం 2 :

జడివాన పడుతున్నా ఏమిటో ఈ దాహం.. ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం
జడివాన పడుతున్నా ఏమిటో ఈ దాహం.. ఎదురుగా నీవున్నా ఎందుకో ఈ తాపం
ఆరని జ్వాలలే మనసున రేగే..  తీరని కోరికలే చెలరేగే.. కలిగేనులే పరవశం                
చెలి చూపులోన కథలెన్నో తోచే.. చలి గాలిలోన పరువాలు వీచే



****************** ****************************

చిత్రం :  కన్నవారి కలలు (1974)
సంగీతం :  వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :

బాబూ..  చిన్నారి బాబూ.. 
బాబూ...  చిన్నారి బాబూ
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను.. నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను . .
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను.. బాబూ చిన్నారి బాబూ

చరణం 1 :


మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న.. ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా. . .
మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న.. ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా
అతడు లేని నా బ్రతుకే చీకటిరా..  ఆ చీకటిలో నీ నవ్వే దీపికరా 
బాబూ...  చిన్నారి బాబూ

చరణం 2 :

అమ్మా అని ఒక్కసారి నువ్వంటే..  నా అణువణువున ఆనంద గోదావరి . .
అమ్మా అని ఒక్కసారి నువ్వంటే.. నా అణువణువున ఆనంద గోదావరి
నాన్నేడని ముందు ముందు అడిగితే..  నా గుండెల్లో కన్నీటి కావేరి 

బాబూ...  చిన్నారి బాబూ


చరణం 3 :


నెలవంకలా నీవు పెరగాలి.. నా కలలన్నీ నీ కళలై వెలగాలి . . .
నెలవంకలా నీవు పెరగాలి.. నా కలలన్నీ నీ కళలై వెలగాలి
ఆ వెలుగే నా కంటి వెలుగు కావాలి..  అది చూసి మీ నాన్న మురిసి పోవాలి.. 

బాబూ...  చిన్నారి బాబూ        
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను.. నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను . .
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను.. బాబూ చిన్నారి బాబూ 




****************** ****************************

చిత్రం :  కన్నవారి కలలు (1974)
సంగీతం :  వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  రామకృష్ణ

పల్లవి :

అందాలు  కనువిందు చేస్తుంటే..
ఈ అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా..

చూసే కనులకు నోరుంటే.. మధురగీతమే పాడదా.. మధురగీతమే పాడదా                                                   
అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా

చరణం 1 :

చల్లగాలుల పల్లకీలలో నల్ల మబ్బులూరేగెనూ..
అంబరాన ఆ సంబరాలుగని గిరులబారులు మురిసెనూ
పలుకు రాని ప్రకృతి  నాకు పలికె స్వాగతాలు..
నిండుగా కలలు పండగా.. నాదు డెందమే నిండగా                                     
అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా

చరణం 2 :

ఎవరి కురులలో నలుపు చూసి తుమ్మెదలు  చిన్నబోయెనూ
ఎవరి బుగ్గల ఎరుపు చూసి చెంగలువ సిగ్గు చెందేనూ
అవే సోయెగాల కురులూ.. అవే మిసిమి బుగ్గలూ
చిలిపిగ మనసు చెదరగా.. కనుల కెదురుగా వెలిసెనూ                            
అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా


చరణం 3 :


ఈ సరస్సులో ఇంద్ర ధనుస్సులో..  వింత సొగసు ఏముంది
ఓర చూపుల సోగకనులలో కోటి సొగసుల గని వుంది
 చెలియ పాలనవ్వులోన మరులు జల్లు వాన కురిసెనే .. 
వలపు విరిసెనే.. తలపు చిందులే వేసెనే       
                           
అందాలు  కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా

చూసే కనులకు నోరుంటే..మధురగీతమే పాడదా...
మధురగీతమే పాడదా       


****************** ****************************

చిత్రం: కన్నవారి కలలు (1974) 
సంగీతం: వి. కుమార్ 
గీతరచయిత: రాజశ్రీ 
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల 

పల్లవి: 

మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు 
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 
మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు 
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు 
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 

చరణం 1: 

అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ 
అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ 
తలవకనే కలిగినచో అదిప్రేమ బంధమూ 
బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ 
మనసు మనసుతో... ఊసులాడనీ 
మూగభాషలో... బాసచేయనీ 
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ 

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు 
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 

చరణం 2: 

గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ 
తలపులకు.. వలపులకు.. సరిహద్దు లేదనీ 
కుసుమముతో ఆ భ్రమరం తెలిపినది ఏమనీ 
జగమునకు మన చెలిమి ఆదర్శమౌననీ 
కలలు తీరగా... కలిసి పొమ్మనీ 
కౌగిలింతలో... కరిగి పొమ్మనీ 
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ 

మధువొలకబోసే... హా.. 
ఈ చిలిపి కళ్ళు...ఆ.. 
అవి నాకు వేసే.. ఆ.. 
బంగారు సంకెళ్ళూ...


****************** ****************************

చిత్రం: కన్నవారి కలలు (1974)
సంగీతం: వి. కుమార్
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల



పల్లవి:

ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...
ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...
తొలినాటి ప్రేమదీపం.. కలనైన ఆరిపోదు...
తొలినాటి ప్రేమదీపం..కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు..

చరణం 1:

ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో ...
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో....
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో...
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో...


పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ ...
గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ...
కలసిన కౌగిలిలో ...కాలమే ఆగినదీ....

ఒకనాటి మాట కాదు ...ఒక నాడు తీరిపోదు...

చరణం 2:

చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా..
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ...
ఆహా..చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా...
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ...

ఆ....కొంటెగా నిన్నేదో కోరాలనివుంది...
ఆ....తనువే నీదైతే దాచేదేముంది ...
మనసులవీణియపై ...బ్రతుకే మ్రోగిందీ...

ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు...
తొలినాటి ప్రేమదీపం... కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు...

కొండవీటి దొంగ (1990)




చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు


జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకు కన్నీళ్ళూ
అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ
ఎదురే నాకు లేదు నన్నేవరూ ఆపలేరు
ఎదురే నాకు లేదు నన్నేవరూ ఆపలేరు

జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట

అనాద జీవులా... ఉగాది కోసం...మ్మ్
అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
బూర్జు వాలకు  భూస్వాములకు
బూర్జు వాలకు భూస్వాములకు
బూజు దులపకా తప్పదురా
తప్పదురా తప్పదురా తప్పదురా

జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట

న్యాయ దేవతకు...కన్నులు తెరిచే...
న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా
న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా
పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా
దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం
దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చకా తప్పదురా
తప్పదురా తప్పదురా తప్పదురా అహా

జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకు కన్నీళ్ళూ
అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ

ఎదురే నాకు లేదు నన్నేవరూ ఆపలేరు
ఎదురే నాకు లేదు నన్నేవరూ ఆపలేరు
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
జీవితమే ఒక ఆట సాహసమే పూబాట


*********   *********   **********


చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

(ఈ పాటని సాయిధరమ్ తేజ్  నటించిన ఇంటిలిజెంట్ సినిమాలో  రీమిక్స్ చేశారు.
పాడినవారు: యస్.పి.బి.శరణ్, హరిణి ఇవటూరి.  సంగీతం: యస్.యస్.థమన్ )

అరె చమ్మక్కు చమ్మక్కు చాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చక్కచాం చక్కచాం చాం
త్వరగా ఇచ్చై నీ లంచం
చాం చాం చక్కచాం చక్కచాం చాం
చొరవే చేసే మరికొంచెం

అరె చమ్మక్కు చమ్మక్కు చాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
హే ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా

నాగ స్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
తాగు పొగరుతో రేగిందయ్యా
కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అందే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా కరారుగ
కథ ముదరగ

ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా
అరె చమ్మక్కు చమ్మక్కు చాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
హొయ్యారే హొయ్య హొయ్యా
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా

చాం చాం చక్కచాం చక్కచాం చాం
చొరవే చేసే మరికొంచెం
చాం చాం చక్కచాం చక్కచాం చాం
త్వరగా ఇచ్చై నీ లంచం

అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేక పోతున్నా
ఈతముల్లులా ఎదలో దిగెరో జాతి వన్నెదీ జాణ
అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యందియ్యాలయ్యా
తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా
రాజీ కొస్తాలే కాగే కౌగిళ్ళో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఓళ్ళో
ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా
పదపదమని

అరె చమ్మక్కు చమ్మక్కు చాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా
హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్యా
హొయ్ అయ్యారే తస్సాదియ్యా

చాం చాం చక్కచాం చక్కచాం చాం
త్వరగా ఇచ్చై నీ లంచం
చాం చాం చక్కచాం చక్కచాం చాం
చొరవే చేసే మరికొంచెం
అరె చమ్మక్కు చక్కచాం చాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య
అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం
పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా


*********   *********   **********


చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర


(ఈ పాటని రాంచరణ్ తేజ్  నటించిన నాయక్ సినిమాలో  రీమిక్స్ చేశారు. పాడినవారు: హరిచరన్, శ్రేయఘోషల్.  సంగీతం: యస్.యస్.థమన్ )

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
అది మీకు పంపుకున్న అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో

చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లెమబ్బు లాడెనేమో బాలనీలవేణికి
మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే, కథ అంతేలే, అదంతేలే

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచివున్నా వేణుపూల తోటలో
వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు
ఒళ్ళో దాటి వెళ్ళ సాగే ఎన్నో వాంఛలు
అంతేలే, కథ అంతేలే, అదంతేలే

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
అది మీకు పంపుకున్న అపుడే కలలో
శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో


*********   *********   **********


చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట
నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగ కౌగిళ్ళు ఇచ్చి మాటుకోమంటావా

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట
నా ముద్దు పుచ్చుకోవా

చరణం: 1
కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసేలే కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరేలే సోకి నా ఒళ్ళు కోకలో గళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలను
చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకు
కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లో
పడేసాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో
సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే
తణక్కు దిన

చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట
నా ముద్దు పుచ్చుకోవా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా

చరణం: 2
మెత్తగా తాకు చూపుకే మేలుకున్నాయి సొగసులే
కోత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే
కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా
కళ్ళతో నీకు కళ్ళెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా
భరోసాల వీరా రారా భరిస్తాను నీ సత్తా
శృతేమించు శృంగారంలో రతే నీకు మేనత్తా
ముద్దు ఆ వైపు రుద్దు ఈ వైపు హద్దులే లేవులే
తణక్కు దిన

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట
నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగ కౌగిళ్ళు ఇచ్చి మాటుకోమంటావా

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
హే చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట
నా ముద్దు పుచ్చుకోవా


*********   *********   **********


చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి

దేవి శాంభవి దీన భాందవి
పాహి పార్వతి కృపా సరస్వతి
దేవి శాంభవి దీన భాందవి
పాహి పార్వతి కృపా సరస్వతి

లోకమాతవి ప్రాణదాతవి
శోక గాదని కాపాడు శాంభవి
అశ్రుదారాతో నీ కాలు కడగమా
రక్త గంగతో పారాణి దిద్దమా
దేవుదంటి మా ప్రభువు కోసము
నీవు కోరితే మా ప్రాణమివ్వమా
శ్రీ దుర్గా ఘన దుర్గా కొండదేవత
కొంగుపట్టి అడిగినాము నీ స్వాహన


*********   *********   **********


చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం
నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం
నా ప్రేమ గేయం ప్రియం

రామ అంటే నీకు ప్రేమ భామ అంటే నాకు ప్రేమ
ప్రేమ భిక్ష నాకు పెట్టరా
ఆకు పూజ నీకు నోము సోకుపూజ నాకు నోము
జంటకింక గంట కొట్టగా
ముద్దులేక ముచ్చటాడు పొద్దులేక పొందులేక
ముక్కు మూసుకున్న నాకు దిక్కు చూపరా
మొహనాలు మోయలేక సోయగాలు దాయలేక
మోజు పడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా
జింక లాంటి కంట్లో జిగేలు మంది ప్రాయం
జివ్వు మన్న ఒంట్లో  చివుక్కు మంది ప్రాణం
ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేళలోన

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం
నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
స్వామి నిన్నే స్మరించి మదిస్తే అజేయం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం
నా ప్రేమ గేయం ప్రియం

కోడె గాలి కొట్టగానే కొంగు జారి
కొంప తీసి ఒంపు సోంపు గంప కెక్కెరా
ఆడగాలి సోకగానే కచ్చె పుట్టి రెచ్చగొట్టి
కన్నెనీడ కౌగిలించరా
పూటకొక్క పువ్వు పెట్టి పూల బాణమేసికొట్టు
మన్మధున్ని ఆపలేని మత్తు పుట్టెరా
మాపటేల మల్లెలెట్టి చీకటేల చిచ్చుబెట్టు
పిల్లదాన్ని చూడగానే పిచ్చె పట్టెరా
పెట్టలేదు కామా ఇదేమి ప్రేమ గీతం
చెప్పలేను రామ మదీయ మౌన భావం
మంత్ర పుష్పం మనస్సు మదించు వేళలోన

శ్రీ ఆంజనేయం నీ నామ దేయం
నా ప్రేమ గేయం ప్రియం
నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
చేసి పెట్టు సాయం జయం
ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం
బ్రహ్మచారి భరించలేడు గాయం
స్వామి నిన్నే స్మరించి మదిస్తే అజేయం

శ్రీ ఆంజనేయం నీ నామ దేయం
నా ప్రేమ గేయం ప్రియం
నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం
నా ప్రేమ గేయం ప్రియం
నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
చేసి పెట్టు సాయం జయం


*********   *********   **********


చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి

టిప్ టాప్ లుక్  లిప్ మీద క్లిక్
ఎప్పుడంటే అప్పుడే రెడీ
పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి
తాకితేనే పిచ్చ తాకిడి
లక్కు కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే...
రంప బంప బప్ప బప్ప

పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి
తాకితేనే పిచ్చ తాకిడి
టిప్ టాప్ లుక్  లిప్ మీద క్లిక్
ఎప్పుడంటే అప్పుడే రెడీ

వేళలేని పాలలేని వెర్రిలో
వేడిబుగ్గ లంటుకొంటె వేడుక
జుర్రుకుంటే కుర్రకారు జోరులో
పాల ఈడు పాయసాల కోరిక
సమ్మరింటే సాల్ట్ సందెవేళ బోల్ట్
అందమైన స్టార్ట్ ఆకశాన హాల్ట్
సొమ్ములప్పజెప్పేటి సోకు చూసి పోనా
సొంతమైనదిచ్చేసి సొమ్మసిల్లిపోనా
షేకునిన్ను చేసేసి షాకు చూసుకోన
బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోన
పడుచురుకుల వడిదుడుకులు
ముడిసరుకుల ముడి విడుపులలో హో

పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి
తాకితేనే పిచ్చ తాకిడి
టిప్ టాప్ లుక్  లిప్ మీద క్లిక్
ఎప్పుడంటే అప్పుడే రెడీ

మత్తు మత్తు ఊగులాట మధ్యలో
ఎత్తుకున్న పాటకేది పల్లవి
హా కొత్త కొత్త కొంగులాట మధ్యలో
మొత్తుకున్న మోజులన్ని పిల్లవి
పైన కోక నట్టు లోన చాకిలెట్టు
ఈడి స్పీడ్ జెట్ లేండ్ కాదు ఒట్టు
టన్ను మాటలమ్మేసి నిన్ను కమ్ముకోన
ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోన
చంప చేతికిచ్చేసి చెమ్మగిల్లిపోన
తేనే పట్టు వంచేసి తెప్పరిల్లి పోనా
కచటతపల కసివయసుల
కెచట ఎపుడు చలి ముడి పడునో హో

టిప్ టాప్ లుక్  లిప్ మీద క్లిక్
ఎప్పుడంటే అప్పుడే రెడీ
పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి
తాకితేనే పిచ్చ తాకిడి

లక్కు కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే...
దాద దివుద దీద దాద

టిప్ టాప్ లుక్  లిప్ మీద క్లిక్
ఎప్పుడంటే అప్పుడే రెడీ
పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి
తాకితేనే పిచ్చ తాకిడి
హే రప్ప పాబ బప్ప
రప్ప పాబ పప్ప
రంప పాబ రంప పాపపా

కన్యాశుల్కం (1955)




చిత్రం : కన్యాశుల్కం (1955)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : మల్లాది రామకృష్ణశాస్త్రి
నేపథ్య గానం : సుశీల 


పల్లవి : 

ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం


ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం


 చరణం 1 :

నీ కంకణ నిక్వాణంలో..
నా జీవన నిర్వాణంలో...
నీ మదిలో డోలలు తూగీ...
నా హృదిలో జ్వాలలు రేగీ... 

నీ తలపున రేకులు పూస్తే... నా వలపున బాకులు దూస్తే...
నీ తలపున...
నీ తలపున రేకులు పూస్తే... నా వలపున బాకులు దూస్తే...
మరణానికి ప్రాణం పోస్తాం... స్వర్గానికి నిచ్చెన వేస్తాం
మరణానికి ప్రాణం పోస్తాం... స్వర్గానికి నిచ్చెన వేస్తాం


ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం


చరణం  2 :

హసనానికి రాణివి నీవై...
వ్యసనానికి బానిస నేనై...
విషమించిన మదీయ ఖేదం...
కుసుమించిన త్వదీయ మోదం... 

విషవాయువులై ప్రసరిస్తే... విరితేనియలై ప్రవహిస్తే...
విషవాయువులై ప్రసరిస్తే... విరితేనియలై ప్రవహిస్తే...
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం

ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం

ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... 

******* *************** ************

చిత్రం : కన్యాశుల్కం (1955)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : మల్లాది రామకృష్ణశాస్త్రి
నేపథ్య గానం : ఘంటసాల 



పల్లవి : 

చిటారు కొమ్మను....
చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడా
వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడా
హోయ్...  చిటారు కొమ్మను 



చరణం 1 :  


పక్కను మెలిగే చక్కని చుక్కకు... చక్కిలిగింత లేదేం గురుడా
ఆ పక్కను మెలిగే చక్కని చుక్కకు... చక్కిలిగింత లేదేం గురుడా

కంచు మోతగా కనకం మోగదు... నిదానించరా నరుడా
కంచు మోతగా కనకం మోగదు... నిదానించరా నరుడా 

వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడ
హోయ్...  చిటారు కొమ్మను


చరణం 2 : 

పండంటి పిల్లకు పసుపు కుంకం  నిండుకున్నవేం గురుడా
పండంటి పిల్లకు పసుపు కుంకంనిండుకున్నవేం గురుడా

దేవుడు చేసిన లోపాన్ని... నీవు దిద్దుకురారా నరుడా
దేవుడు చేసిన లోపాన్ని... నీవు దిద్దుకురారా నరుడా
కొద్దిగ హద్దు మీరరా నరుడా

చిటారు కొమ్మను మిఠాయి పొట్లం... చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడ
హోయ్...  చిటారు కొమ్మను

చరణం 3 :


విధవలందరికి శుభకార్యాలు... విధిగా చెయమంటావా గురుడా
విధవలందరికి శుభకార్యాలు... విధిగా చెయమంటావా గురుడా

అవతారం నీదందుకోసమే..ఏ..
అవతారం నీదందుకోసమె... ఆరంభించర నరుడా

వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడ
హోయ్...  చిటారు కొమ్మను

చిటారు కొమ్మను మిఠాయి పొట్లం... చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి... వంచర కొమ్మను నరుడ
హోయ్...  చిటారు కొమ్మను


సంతానం (1955)





చిత్రం :  సంతానం (1955)
సంగీతం :  సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత :  అనిశెట్టి
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి :


దేవి.. శ్రీదేవీ..
దేవి.. శ్రీదేవీ.. మొరలాలించి పాలించి నన్నేలినావే
దేవి.. శ్రీదేవీ.. మొరలాలించి పాలించి నన్నేలినావే
దేవి.. శ్రీదేవీ...
మదిలో నిన్నే మరువను దేవీ
మదిలో నిన్నే మరువను దేవీ
నీ నామ సంకీర్తనే జేసెద...
దేవి.. శ్రీదేవీ.. మొరలాలించి పాలించి నన్నేలినావే
దేవి...  శ్రీదేవీ

చరణం 1 :

నీ కనుసన్నల నిరతము నన్నే
నీ కనుసన్నల నిరతము నన్నే
హాయిగా ఓలలాడించ రావే
నీ కనుసన్నల నిరతము నన్నే
హాయిగా ఓలలాడించ రావే

ఇల దేవతగా...ఆ..ఆ..ఆ..ఆ
ఇల దేవతగా వెలిసితి నీవే
ఇల దేవతగా వెలిసితి నీవే
ఈరేరే ఈరేరే నా కోర్కెలీనాటికే

దేవి... శ్రీదేవీ... మొరలాలించి పాలించి నన్నేలినావే
దేవి...  శ్రీదేవీ



************ *************** **************
చిత్రం :  సంతానం (1955)
సంగీతం :  సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత :  అనిశెట్టి
నేపధ్య గానం :  లతా మంగేష్కర్   

పల్లవి :


ఊఁ.....ఊఁ....నిదురపో..నిదురపో..
నిదురపో...నిదురపో...నిదురపో..నిదురపో...
నిదురపోరా.. తమ్ముడా.. నిదురపోరా.. తమ్ముడా..

నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా
నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా.. 

నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...


చరణం 1 :

 కలలు పండే కాలమంతా కనులముందే కదలిపోయే ఆ..ఆ....
కలలుపండే కాలమంతా.. కనులముందే కదిలిపోయె
లేతమనసున.. చిగురుటాశ.. పూతలోనే.. రాలిపోయే..  

నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ... 


చరణం 2 :


ఆఁ....ఆఁ....ఆఁ....ఆఁ
జాలితలచి.. కన్నీరు తుడిచే.. దాతలే కనరారే..
ఏ..ఏ.. జాలితలచి కన్నీరు తుడిచే దాతలే..కనరారే..

చితికిపోయినా జీవితమంతా చింతలో చితి ఆయే
నీడ చూపే నెలవు మనకూ నిదురయేరా తమ్ముడా 

నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...నిదురపోరా.. తమ్ముడా...

************ *************** **************

చిత్రం :  సంతానం (1955)
సంగీతం :  సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత :  అనిశెట్టి
నేపధ్య గానం :  ఘంటసాల  


పల్లవి :


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

చల్లని వెన్నెలలో ... చల్లని వెన్నెలలో...ఓ..ఓ..ఓ..
చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో ...ఓ..ఓ..
చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో ...
అందమే నాలో లీనమాయెనే...ఆనందమే నా గానమాయెనే..
చల్లని వెన్నెలలో... 


చరణం 1 :

తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన ... గాలి పెదవులే మెల్లగ సోకిన...
పూలు నవ్వెనే నిద్దురలో....  

చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో ...
అందమే నాలో లీనమాయెనే...ఆనందమే నా గానమాయెనే..
చల్లని వెన్నెలలో... 


చరణం 2 :


కలకలలాడే కన్నె వదనమే కనిపింతును ఆ తారలలో..ఓ
కలకలలాడే కన్నె వదనమే కనిపింతును ఆ తారలలో...
కలకాలము నీ కమ్మని రూపము ... కలకాలము నీ కమ్మని రూపము
కలవరింతులే నా మదిలో...ఓ..ఓ.. 

చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో ...
అందమే నాలో లీనమాయెనే... ఆనందమే నా గానమాయెనే..
చల్లని వెన్నెలలో... 

ఖైదీ నంబర్ 786 (1988)

 


చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో

ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో..
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో 
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో 
పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..

చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో
ఎందిట్లో ఏమౌతాదో... అందిట్లో ఏమౌతాదో..
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో 
పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..

నా సలహా ఒకటే చలి వేళా
ఓం నమః ఒడిలో చదవాలా
నీ తరహా తెలిసే పిలగాడా
యం యమః కలిశా కసితీరా
ఆస్తో పాస్తో చదివించుకో కాస్తో కూస్తో కవ్వించుకో
జోడు కుంపట్లు కావాలా ఈడె తంపట్లు వెయ్యాలా
ఒకటే దుప్పట్లో దూరాలా
నీ ముద్ద మందార గంధాలు పుయ్యాల
ఓ..ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..

చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో.. ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో.. ఎందిట్లో

నా నడుమే కసిగా ఊగాలా
నీ నడకే ఉసిగా సాగాలా
నీ రుచులే ఒడిలో చూడాలా
నా పెదవే తడిగా మారాలా
పిచ్చో వెర్రో ప్రేమించనా గిల్లో గిచ్చో వేధించనా
ఊరే పొద్దెక్కి పోవాలా ఈడే తెల్లారి పోవాలా
చల్లో కొంకర్లు పోవాలా
ఈ కొండకోనల్లో తుళ్ళింతలాడాలా
ఓ...ఓ..ఓ... ఓ... ఓ.. ఓ... ఓ.. ఓ..

చలిగాలి కొట్టిందమ్మ అందెట్లో... ఎందిట్లో
చెలిగాలి కుట్టిందమ్మ ఎందిట్లో... ఎందిట్లో

ఎందిట్లో ఏమౌతాదో అందిట్లో ఏమౌతాదో
సందిట్లో వచ్చేదాక నేనెట్ట చెప్పేదమ్మో
ఏ ముద్దు ఏ మూలున్న కొద్దోగొప్పో
పారెయ్యాలమ్మో.. ఓ.. ఓ.. ఓ..ఓ..ఓ..

చిత్రం : ఖైదీ నంబర్ 786 (1988)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, జానకి

******* *********** *************** ************
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 
ఆడుకోవాలి గువ్వలాగ
పాడుకుంటాను నీ జంట గోరింకనై
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట
 
జోడుకోసం గోడ దూకే వయసిది
తెలుసుకో అమ్మాయిగారు
అయ్యొపాపం అంత తాపం
తగదులే తమరికి అబ్బాయిగారు 
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం 
కోరుకున్నానని ఆట పట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు  
చుట్టుకుంటాను సుడిగాలిలా ...

హోయ్... గువ్వ.. హా.. గోరింకతో.. హా.. 
ఆడిందిలే బొమ్మలాట
హోయ్.. నిండు.. హా.. నా గుండెలో హా.. 
మ్రోగిందిలే వీణపాట.. హోయ్.. హోయ్..

కొండనాగు తోడు చేరి
నాగిని బుసలలో వచ్చే సంగీతం 
సందెకాడ అందగత్తె
పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పువ్వులో మకరందము ఉందే నీ కోసం  
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు 
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వమూ ...
 
హోయ్... గువ్వ.. హాయ్.. గోరింకతో.. హాయ్.. 
ఆడిందిలే బొమ్మలాట
అహా.. నిండు.. హా.. నా గుండెలో హా
మ్రోగిందిలే వీణపాట.. ఆడుకోవాలి గువ్వలాగ
పాడుకుంటాను నీ జంట గోరింకనై



చిత్రం : ఖైదీ నంబర్ 786 (1988)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, జానకి

ఖడ్గం (2002)



గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...

నుదిటిరాతలు మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా
స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడూ నీడా

గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా...
అరె బాగు చెయ్ నను గోవిందా... బాగు చెయ్ నను గోవిందా...
జూబ్లిహిల్స్ లో బంగ్లా ఇవ్వు...లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు
హైజాక్ అవ్వని ఫ్లైటొకటివ్వు...వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయిరా వచ్చీ

గోవిందా... గోవిందా...
బాగు చేయ్ నను గోవిందా
పై తియ్ నను గోవిందా
గోవిందా... గోవిందా...

పెట్రోలడగని కారు ఇవ్వు...బిల్లు అడగని బారు ఇవ్వు
కోరినంత ఫూడ్డు పెట్టి డబ్బులడగని హోటల్ ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకరు పోస్టో.. రాజ్యసభలో ఎం.పీ సీటో
పట్టుబడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాములా సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు...లాసుకాని షేరులివ్వు
సింగిల్ నంబరు లాటరీలివ్వు
టాక్సులడనగి ఆస్తులివ్వు...

పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి 
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయిరా వచ్చీ

గో... గో... గో...
గోవిందా... గోవిందా...
బాగు చేయ్ నను గోవిందా

వందనోట్ల తోటలివ్వు...గోల్డు నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాసు హీరో చాన్సులివ్వు......హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగ ఇవ్వు
హాలీవుడ్ లో స్టుడియో ఇవ్వు...స్విస్సు బాంకులో బిలియన్లివ్వు
కోట్లు తెచ్చే కోడుకులనివ్వు... హీరోలయ్యే మనవళ్ళనివ్వు
నన్ను కూడా సీ.ఎం చెయ్యి.. లేకపోతే పీ.ఎం చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని తరిగిపోనీ లైఫు నివ్వు

గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా...
బాగు చెయ్ నను గోవిందా
బాగు చెయ్ నను గోవిందా
పైకి తే నను గోవిందా
గోవిందా... గోవిందా...

లక్కుమార్చి నను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏ.సీ చేస్తా...
ఎయిత్ వండరు నీ గుడి చేస్తా...
గో గో గో గోవిందా... గోవిందా...

అయ్ బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటి..


చిత్రం : ఖడ్గం (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : విజయకుమార్
గానం : శ్రీ

*************** ********************* *************

చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుమంగళి


నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ ముగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వూ...

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

చరణం: 1
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వూ నువ్వూ
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టమ్ నువ్వూ నువ్వూ... నువ్వూ...

నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

చరణం: 2
నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూ నువ్వూ
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ నువ్వూ... నువ్వూ...

నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ...

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ




**********   **********  *********




చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కల్పన

పల్లవి:
ఊఁ ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
హే ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో

ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటె ఏంటిరా

హా ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో

చరణం: 1
సూర్యుడైనా చూపగలడ రేయిచాటున్న రేపుని
అఁ చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
హా దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ల ముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా...?
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు

ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఊఁ ముసుగు వెయ్యద్దు, వలలు వెయ్యద్దు
ఎగరనివ్వాలి, తుఫాను వేగాలతో...

చరణం: 2
కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా
కోటలైనా కొంపలైనా ఏవీ స్ధిరాస్ధి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా
నిన్న లేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలసినడుద్దాం
సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం

ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరురా
మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటె ఏంటిరా

ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద




**********   **********  *********




చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఓం... ఓం...
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం

ఓంకారనాదంతో అంకురించిన
వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం
హ్రీంకారనాదంలో సంచరించే
ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం
యుగయుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం
తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం

తన కళ్ళ ముందే సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైనా
క్షణమైన తన గాథ గతములో విడిచి
ధ్రుతి ఒడి చేరనిదీ ఖడ్గం
ఊటతో పడమరను దాటి పూర్వార్ధిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ భరత ఖడ్గం

కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం

కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం

మూడువన్నెల కేతముగ మింటికి ఎగసి
కాలానికెదురేగు యశోరాశి ఈ ఖడ్గం

ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం

హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం
నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తిమార్గం
ఆర్తరక్షణకై ధరించిన ధీరగుణమీ ఖడ్గం
ధూర్తశిక్షణకై వహించిన కరకుతనమీ ఖడ్గం
హూంకరించి అహంకరించి
అధిక్రమించిన ఆకతాయిల
అంతు చూసిన క్షాత్రసత్వం
అస్తమించని అర్థఖడ్గం

శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన
అన్ని జాతుల పొదువుకున్న ఉదారతత్వం
జగతి మరువని ధర్మఖడ్గం

నిద్దుర మత్తును వదిలించే గెంజాయల జిలుగీ ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
గెంజాయల జిలుగీ ఖడ్గం
తెలతెల్లని వెలుగీ ఖడ్గం
సిరిపచ్చని చిగురీ ఖడ్గం

ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం