Showing posts with label 1967. Show all posts
Showing posts with label 1967. Show all posts

అగ్గిదొర (1967)


చిత్రం: అగ్గిదొర (1967)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
గీతరచయిత: జి. కృష్ణమూర్తి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ.. తిరుమలేశా చాలు చాలీ సోధన
భరించలేనయ్యా మొరవిన వేమి... ఓ తిరుమలేశా

పిలిచిన పలికేవు స్వామీ...
పిలిచిన పలికేవు స్వామీ... శిలగా నిలచేవేమీ
పిలిచిన పలికేవు స్వామీ... శిలగా నిలచేవేమీ...
పిలిచిన పలికేవు స్వామీ...

చరణం 1:

కాంతిని చూసే కన్నులలోనే... కన్నీరే నింపేవా
ఆ...కాంతిని చూసే కన్నులలోనే...కన్నీరే నింపేవా
ఏడువ చేసి...వేడుక చూసి...వేడుక చూసేవేమీ
ఏడువ చేసి...వేడుక చూసి...వేడుక చేసేవేమీ....

పిలిచిన పలికేవు స్వామీ... శిలగా నిలచేవేమీ...
పిలిచిన పలికేవు స్వామీ... శిలగా నిలచేవేమీ...
పిలిచిన పలికేవు స్వామీ...

చరణం 2:

మనిషిని చేసి... మనసును కోసి... మలినమునే నింపేవా
మనిషిని చేసి... మనసును కోసి... మలినమునే నింపేవా
పువ్వులలోనా... వాసన తోనే... పురుగుల నింపేవేమీ
పువ్వులలోనా... వాసన తోనే.... పురుగులనింపేవేమీ...

పిలిచిన పలికేవు స్వామీ... శిలగా నిలచేవేమీ...
పిలిచిన పలికేవు స్వామీ.


******************* ******************** ****************

చిత్రం: అగ్గిదొర (1967)
సంగీతం: విజయా కృష్ణమూర్తీ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఎందున్నావో ఓ చెలి... అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి... అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి.. అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి....

చరణం 1:

నిలువ లేను నిముషమైన నీవు లేనిదే...
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే...
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే...
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే...

ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. నీకై ఉన్నాను..
ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. నీకై ఉన్నాను..
ఎందున్నావో ఓ చెలి... అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి....

చరణం 2:

కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా...
కురులలోన తురిమి తురిమి పరవశింతునా....
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా...
కురులలోన తురిమి తురిమి పరవశింతునా....

నీడవోలే యుగయుగాలు నీతో.. నీతో ఉంటాను..
నీడవోలే యుగయుగాలు నీతొ.. నీతో ఉంటాను..

ఎందున్నావో సుందరా... నా ముందు నిలువవేళరా..
ఎందున్నావో సుందరా...
ఇందున్నానే ఓ చెలి... అందుకో నా కౌగిలి
ఇందున్నానే ఓ చెలి...

వసంతసేన (1967)



చిత్రం :  వసంతసేన (1967)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, జానకి 


పల్లవి :


కొండలన్ని వెదికేను.. కోనలన్ని తిరిగేను
చెలియా.. సఖియా.. నీ కోసమే..
రావే వయ్యారి.. నా వలపు మయూరి
రావే వయ్యారి.. నా వలపు మయూరి
నవ్వులు చిందించి నటియించవే..
ఏ..ఏ..ఏ.. నవ్వులు చిందించి నటియించవే

చెంత చేర రావోయి.. చింత తీర్చి పోవోయి
వయసు.. సొగసు.. నీ కోసమే..
నేడే వసంతం.. ఈ జగమున విరిసే
నేడే వసంతం.. నా మనసున విరిసే
కోయిల కొమ్మల్లో కూయన్నది
కూ.. కోయిల కొమ్మల్లో కూయన్నది..


చరణం 1 :

ఝుమ్మని రాగాలు పాడేను భ్రమరం.. 
కమ్మని తేనెల నందించు కుసుమం
జలజల నాట్యాల ప్రవహించు నదులు.. 
సాగర కౌగిట చేరేను తుదకు


చరణం 2 :

నెల రాజు నే వేళ పిలిచేను కలువ.. కలువకై జాబిల్లి కదిలీ వచ్చేను
వలచిన చెలికాని తలచేను చెలియా.. చెలియను మురిపించ చేరేను ప్రియుడు
నిజమైన అనురాగ మదియే కదా..
ఆ..ఆ.. నిజమైన అనురాగ మిదియే కదా..

చెంత చేర రావోయి.. చింత తీర్చి పోవోయి
వయసు..ఆ.. సొగసు..ఆ.. నీ కోసమే..

రావే వయ్యారి.. నా వలపు మయూరి..
రావే వయ్యారి.. నా వలపు మయూరి..
నవ్వులు చిందించి.. నటియించవే..
ఏ..ఏ..ఏ.. నవ్వులు చిందించి.. నటియించవే
ఓ సుందరీ.. ఓ సుందరీ.. 

రహస్యం (1967)


చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది

నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ

మధువుచిలుకు  గమకమొలుకు వరవీణాపాణీ

మధువుచిలుకు  గమకమొలుకు వరవీణాపాణీ

సుమరదన విధువదన.. దేవి

సుమరదన విధువదన.. దేవి


అంబరాంతరంగ శారదా స్వరూపిని

చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే

అంబరాంతరంగ శారదా స్వరూపిని

చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే


చరణం 1:


శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని

శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని

బింబాధరా.. రవిబింబాంతరా..

బింబాధరా.. రవిబింబాంతరా..

రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా

శ్రీరాజరాజేశ్వరీ  పరమాకామ సంజీవని....

శ్రీరాజరాజేశ్వరీ  పరమాకామ సంజీవని..

శ్రీరాజరాజేశ్వరీ...



చరణం 2:


నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ

నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ

ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ

ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ

అరుణవసన.. అమలహసనా

అరుణవసన.. అమలహసనా

మాడినీ.. మనోన్మణి

నాదబింధు కళాధరీ బ్రామరీ...

నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ

నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ



**************** *************** **************



చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది

నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల, పి.లీల


పల్లవి :


అంబా పరాకు దేవీ పరాకు

మమ్మేలు మా శారదంబా పరాకు

అంబా పరాకు దేవీ పరాకు

మమ్మేలు మా శారదంబా పరాకు


ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా..

బహుపరాక్ బహుపరాక్...


చండభుజాయమండల దోధూయమాన వైరిగణా.. షడాననా

బహుపరాక్ బహుపరాక్..


మంగళాద్రి నారసింహ... బహుపరాక్ బహుపరాక్...

బంగరు తల్లి కనకదుర్గ.. బహుపరాక్ బహుపరాక్..

కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ.. బహుపరాక్...


అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా

అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా

లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులయ్యే

అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా


ఈశుని మ్రోల.. హిమగిరి బాల..

ఈశుని మ్రోల.. హిమగిరి బాల..కన్నెతనము ధన్యమయిన గాథ

కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ..ఆ కోపీ..

కాకలు తీరీ కను తెరచి తను తెలసీ

తన లలనను పరిణయమాడిన ప్రబంధము

అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా..


చరణం 1 :


రావో.. రావో.. లోల లోల లోలంబాలక రావో....

రావో రావో లోల లోల లోలం బాలక రావో

లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా...

రావో రావో లోల లోల లోలంబాలక రావో


చెలువారు మోమున లేలేత నగవులా

కలహంస గమనాన కలికీ ఎక్కడికే

మానస సరసినీ మణి పద్మదళముల

రాణించు అల రాజహంస సన్నిధికే


వావిలి పూవుల మాలలు గైసేసి

వావిలి పూవుల మాలలు గైసేసి

వయ్యారి నడల బాలా ఎక్కడికే

వయ్యారి నడల బాలా ఎక్కడికే


కన్నారా నన్నేల కైలాస నిలయాన

కొలువైన అల దేవదేవు సన్నిధికే ....


తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ ..

 

అండగా మదనుడుండగా

మన విరిశరముల పదనుండగా

నిను బోలిన కులపావని తానై

వరు నరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ..


కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా

కోలనేయనా సరసను కూలనేయనా

కనుగొనల ననమొనల గాసి చేసి.. నీ దాసు చేయనా

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ ..

చరణం 2 :

ఈశుని దాసుని చేతువా... అపసద... అపచారము కాదా

ఈశుని దాసుని చేతువా..

కోలల కూలెడు అలసుడు కాడూ... ఆదిదేవుడే అతడూ...

సేవలు చేసి ప్రసన్నుని చేయ.. నా స్వామి నన్నేలు నోయీ...నీ సాయమే వలదోయీ...

ఈశుని దాసుని చేతువా..


కాని పనీ మదనా.. కాని పని మదనా..

అది నీ చేతకాని పని మదనా...

అహంకరింతువ.. హరుని జయింతువ

అహంకరింతువ.. హరుని జయింతువ

అది నీ చేతకాని పని మదనా ..... కాని పని మదనా...


చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా

చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా

వినకపోతివా ఇంతటితో..

వినకపోతివా ఇంతటితో.. నీ విరిశరముల పని సరి..

సింగిణి పని సరి..  తేజో పని సరి.. చిగురికి నీ పని సరి మదనా

కాని పని మదనా....

చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా... చిలుక తత్తడి రౌత


సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా

ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా


ఇవె కైమోడ్పులు ...  ఇవె సరిజోతలు

వినతులివే అరవిందోజ్వలా... ఇదె వకుళాంజలి మహనీయా

ఇదె హృదయాంజలి... ఈశా మహేశా

సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా

ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా


విరులన్ నిను పూజ సేయగా... విధిగా నిన్నొక గేస్తు జేయగా

దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ...

కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా

మరుడేపున రూపున వర్థిలుగా...

రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ... ప్రభూ... పతిభిక్ష ప్రభూ....


అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో

జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో

అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో...


మనమే నీ మననమై... తనువే నీ ధ్యానమై

నీ భావన లీనమైన గిరిబాలనేలవో


శరణం భవ శరణం భవ శరణం భవ స్వామీ...

పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం స్వామీ..



బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి.. జయమంగళం

జగమేలు తండ్రికి.. జయమంగళం...

విరులచే వరునిచే కరము చేకొనజేయు జగమేలు తల్లికి.. జయమంగళం

కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవా శ్రీ వేణుగోపాల.. మంగళం..

త్రైలోక్య మందార శుభమంగళం...


**************** *************** **************

చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి :


శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా

 శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా


చరణం 1 :


జగముల చిరునగవుల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ

జగముల చిరునగవుల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ

మనసే నీ వశమై స్మరణే జీవనమై

మనసే నీ వశమై స్మరణే జీవనమై

మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి

 

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

 


చరణం 2 :


అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి

అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి

రవ్వల తళుకుల కళలా జ్యోతుల కప్పుర హారతి

సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి

 

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

 

**************** *************** ************** 

చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది

నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల


పల్లవి :


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


ఉన్నదిలే... దాగున్నదిలే

నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


చరణం 1 :


కన్నెపూల వన్నెలేవో... కన్ను గీటుతున్నవీ

కన్నెపూల వన్నెలేవో ... కన్ను గీటు తున్నవి

మేనిలోన ఊహలేవో... వీణ మీటుచున్నవి...

వీణ మీటుచున్నవి

 

ఉన్నదిలే ... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో  సై  అన్నదిలే


చరణం 2 :


గుండెలోన కోరికలేవో...దండలల్లుకున్నవి...ఈ...ఈ..

గుండెలోన కోరికలేవో...దండలల్లుకున్నవి...

అందరాని పోంగులేవో..తొందరించుచున్నవి

..తొందరించుచున్నవి


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే


చరణం 3 :


ఇన్నినాళ్ళ పుణ్యమంతా ... ఎదుటనిలిచి ఉన్నది

ఇన్నినాళ్ళ పుణ్యమంతా ... ఎదుటనిలిచి ఉన్నది

యుగయుగాల ప్రేమగాధ... చిగురువేయుచున్నది...

చిగురువేయుచున్నది...


ఉన్నదిలే... దాగున్నదిలే...

నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే

ఈ వెన్నెలలో సై అన్నదిలే...

  

మంచి కుటుంబం (1967)



చిత్రం :  మంచి కుటుంబం (1967)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

చరణం 1:

రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే...

మనసార నెరనమ్ము తనవారినీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ....
మనసార నెరనమ్ము తనవారిని
కోటి మరులందు సుధలందు తనియింతునే..

చరణం 2:

మనసే అందాల బృందావనం
దనిస దని నిదదమ
మదని నిదదమ
గమద దమమగస
గగ మమ మగస దని
గసా మగా దమా నిద
గమదనిస బృందావనం

మాగ మగస
దామ గమద
నీద నిసమ
గమ మద దనినిస
నిసమద మగస
గమ దనిసగ బృందావనం

సమగస గమదని
గదమగ మదనిస
మనిద మదనిసగ
ఆ...........
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

***************** ****************** ****************

చిత్రం :  మంచి కుటుంబం (1967)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని కోరింది..

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది

చరణం 1:

నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు..ఆ..ఆ..
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు..ఆ..ఆ..
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు...
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు...

నీ ఎదలో పూల పొదలే పూచి... మధువులు చిందాయి
నీ ఎదలో పూల పొదలే పూచి... మధువులు చిందాయి
నా మమతలు పెంచాయి...

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది...

చరణం 2:

నీ అల్లరి చూపులకే ఒళ్లంతా గిలిగింతా..మ్మ్.
నీ తుంటరి చేష్టలకే ..మదిలో పులకింత..ఉహు..
నీ అల్లరి చూపులకే ఒళ్ళంతా గిలిగింత...
నీ తుంటరి చేష్టలకే ...మదిలో పులకింత..

నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం
నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం
అది వలపుల జలపాతం...

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని కోరింది..

చరణం 3:

నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా..ఓహో..
నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా..ఆహ..
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా...
నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా...

నీ సరసన లేని నిమిషం కూడ ఏదో వెలితి సుమా
నీ సరసన లేని నిముషం కూడ ఏదో వెలితి సుమా
ఇక నీవే నేను సుమా..ఇక నీవే నేను సుమా...

నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది ...సొగసులన్ని కోరింది..
నీలో ఏముందో ఏమో...
మనసు నిన్నే వలచింది... సొగసులన్ని ఇమ్మంది...

***************** ****************** ****************

చిత్రం :  మంచి కుటుంబం (1967)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల, జానకి, వసంత


పల్లవి:

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
తుళ్ళి తుళ్ళి పడ్తుంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం 1:

బుగ్గ మీద కెంపులేవో...నిగ్గు లోలికి పోగాబుగ్గ మీద కెంపులేవో...నిగ్గు లోలికి పోగాసిగ్గులేవో నాలో...మొగ్గ తొడిగి రాగాసిగ్గులేవో నాలో...మొగ్గ తొడిగి రాగాసిరి మల్లెల పందిరి లోనా...నవమంగళ వేదిక పైనా...సిరి మల్లెల పందిరి లోనా...నవమంగళ వేదిక పైనా...జరిగేను కళ్యాణ వైభోగం...

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసుమళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసుతుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం 2:

కోరుకున్న వరుడే చేరుకున్న వేళా..కోరుకున్న వరుడే చేరుకున్న వేళా
పొంగి పొంగి తానే చెంగులాగు వేళా...పొంగి పొంగి తానే చెంగులాగు వేళా
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి..
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి..
లతవోలే జత కూడి లాలింతునే...

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం 3:

ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో...ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి...తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
అతడెంతటి మొనగాడైనా...గిలి గింతల చెలికాడైనా
అతడెంతటి మొనగాడైనా...గిలి గింతల చెలికాడైనా
తొలి రేయి పరువాల బంధింతునే....

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు


***************** ****************** ****************

చిత్రం :  మంచి కుటుంబం (1967)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా
ఇంకా.. ఇంకా..ఇంకా.. 
చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..

చరణం 1:

చిలిపి ఊహలే రేపకూ..ఊ.. సిగ్గు దొంతరలు దోచకూ..ఊ..
చిలిపి ఊహలే రేపకూ.. సిగ్గు దొంతరలు దోచకూ
జిలిబిలి ఆశలు.. పెంచకు.. పెంచకు.. పెంచకూ
పెంచి నన్ను వేదించకూ..ఊ..

ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
కలిగిన కోరిక.. దాచకు.. దాచకు.. దాచకూ..
దాచి నన్ను దండించకూ..ఊ..

ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..

చరణం 2:

కాదని కౌగిలి వీడకూ..ఊ.. కలలో కూడ కదలకూ..ఊ..
కాదని కౌగిలి వీడకూ.. కలలో కూడా కదలకూ
కలిగే హాయిని.. ఆపకు.. ఆపకు.. ఆపకూ
ఆపి నన్ను ఆడించకూ..ఊ..

ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
ఉక్కిరి బిక్కిరి.. చేయకు.. చేయకు.. చేయకూ...
చేసి మేను మరిపించకూ..ఊ..

ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
ఇంకా.. ఇంకా..
ఇంకా చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా..ఆ..ఆ..

ప్రాణమిత్రులు (1967)



చిత్రం : ప్రాణమిత్రులు (1967)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, ఘంటసాల 


పల్లవి :

మనసూ మమతా మనిషికి యిచ్చి
మనిషికి మనిషినే శత్రువు చేసే
మనసూ మమతా... మనిషికి యిచ్చి
మనిషికి మనిషినే... శత్రువు చేసే
రాగం కన్నా... త్యాగం గొప్పని
చల్లని నిప్పును... రగిలించి... రగిలించి
నాటకమాడుట నీ లీల...  నలిగినపించుట మా పాలా
ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ 
ఓ భగవాన్ నీదీ... నీదీ..

చరణం 1 : 


ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ
ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ

పరిహాసానికి ఏదో అన్నది...  ప్రళయంగా ఇటు ముగిసినదీ
పరిహాసానికి ఏదో అన్నది...  ప్రళయంగా ఇటు ముగిసినదీ
ప్రణయ జీవులను విడదీసి... బ్రతుకులు బద్దలు చేసినదీ..

ఈ పాపం ఫలితం ఎవ్వరిదీ...  ఓ భగవాన్ నీదీ...నీదీ 


చరణం 2 : 

నాకున్నది ఒకటే హృదయం... అది చేసినదొకటే..స్నేహం
నాకున్నది ఒకటే హృదయం...  అది చేసినదొకటే..స్నేహం

నే నెరిగినదొకటే ధర్మం...  అది చూపిన దొకటే..మార్గం
ఏ కన్నులు కన్నీరైనా....   ఏ కలలే కరిగిపోయినా

ఈ పాపం ఫలితం ఎవ్వరిదీ...  ఓ భగవాన్ నీదీ...నీదీ..



*********** *************** ******************  

చిత్రం : ప్రాణమిత్రులు (1967)
సంగీతం : కె.వి. మహదేవన్
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

గుండె ఝల్లుమన్నదీ... అందె ఘల్లు మన్నదీ
గుండె ఝల్లుమన్నదీ... అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ ..ఈ..ఈ...

గుండె ఝల్లుమన్నదీ ....

చరణం 1:

ఇన్నాళ్ళకు కలిగినదీ ఈ తొలిహాయీ
అమావాస్య చీకట్లో వెన్నెల రేయి
ఇన్నాళ్ళకు కలిగినదీ ఈ తొలిహాయీ
అమావాస్య చీకట్లో వెన్నెల రేయి

ఎన్నాళ్లకు విన్నానూ నీ తొలి పిలుపు...
ఎన్నాళ్లకు విన్నానూ నీ తొలి పిలుపు
నిదురించిన కోరికలకు ఇదే మేలు కొలుపు....

గుండె ఝల్లుమన్నదీ... అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ ..ఈ..ఈ...
గుండె ఝల్లుమన్నదీ....

చరణం 2:

చెక్కిలితో ఒక చెక్కిలి చేరును నేడు
నా సిగలో విరజాజులు నవ్వును నేడు
చెక్కిలితో ఒక చెక్కిలి చేరును నేడు
నా సిగలో విరజాజులు నవ్వును నేడు

కౌగిలిలో ఒక స్వర్గం ఊగును నేడు
కౌగిలిలో ఒక స్వర్గం ఊగును నేడు...
నా పెదవుల నవమధువులు తొణుకును నేడు..

గుండె ఝల్లుమన్నదీ... అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ ..ఈ..ఈ...
గుండె ఝల్లుమన్నదీ...  

పెద్దక్కయ్య (1967)


చిత్రం : పెద్దక్కయ్య (1967)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి :


ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో
రాజు కాని నా రాజూ అనురాగములో రేరాజు 



ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో
చిలక కాని రాచిలక తొలి వలపుల వెన్నెల  తునక 



చరణం 1 :


సిగ నిండ పారిజాతాల దండ వగలొల్క  చేర రావే
గగనాల నీడ..  మేఘాల వాడ..  బిగి కౌగలీయ రావే  


సిగ నిండ పారిజాతాల దండ వగలొల్క  చేర రావే
గగనాల నీడ..  మేఘాల వాడ..  బిగి కౌగలీయ రావే  


నన్ను లాలించి... తెన్ను చూపించి... మిన్నులందించినావే




ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో
చిలక కాని రాచిలక తొలి వలపుల వెన్నెల  తునక 



చరణం 2 :


తొలి చూపులోనే నిను చేరగానే పలికింది మౌనవీణ
మలి చూపులోనే పెనవేయగానే కురిసింది పూల వానా



తొలి చూపులోనే నిను చేరగానే పలికింది మౌనవీణ
మలి చూపులోనే పెనవేయగానే కురిసింది పూల వానా


నీవు నాలోనే... నేను నీలోనే... నిండి ఉన్నాము కాదా


ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో
రాజు కాని నా రాజూ అనురాగములో రేరాజు 



ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో
రాజు కాని నా రాజూ అనురాగములో రేరాజు 

నిర్దోషి (1967)


చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి :

ఈ పాట నీ కోసమే.. హోయ్... ఈ ఆట నీ కోసమే
ఈ పాట నీ కోసమే.. హోయ్... ఈ ఆట నీ కోసమే
ఈ పూలు పూచేది...  ఈ గాలి వీచేది
మనసైన మన కొసమే
ఓ...  ఈ పాట నీ కోసమే..హోయ్... ఈ ఆట నీ కోసమే 


చరణం 1 :


పగలయిన రేయైన నీ ధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
అహహ... ఒహొహొ.... ఓహొహో..ఓఓ
పగలయిన రేయైన నీ ధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
నీ చూపు నా పాలి సుమబాణమే
నీ చూపు నా పాలి సుమబాణమే
నిను చూడ కదలాడు నా ప్రాణమే
ఈ పాట నీ కోసమే..హోయ్... ఈ ఆట నీ కోసమే 


చరణం 2 :


నీ గుండెలో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
అహహ ... ఒహొహొ... ఓహొహో... ఓఓ
నీ గుండెలో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
నీ కళ్ళ వెనకాల నేనుంటిని
నీ కళ్ళ వెనకాల నేనుంటిని
కనరాని వలయాలు కనుగొంటిని
ఈ పాట నీ కోసమే హోయ్... ఈ ఆట నీ కోసమే
ఈ పూలు పూచేది... ఈ గాలి వీచేది
మనసైన మన కొసమే
ఓయి ఈ పాట నీ కోసమే..హోయ్...ఈ ఆట నీ కోసమే


************** ******************** *************** 

చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

మల్లియలారా మాలికలారా... మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా ....

మల్లియలారా మాలికలారా... మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా...

చరణం 1:

జాబిలిలోనే జ్వాలలు రేగే... వెన్నెలలోనే చీకటి మూగే
జాబిలిలోనే జ్వాలలు రేగే...  వెన్నెలలోనే చీకటి మూగే

పలుకగ లేక పదములు రాక...
పలుకగ లేక పదములు రాక... బ్రతుకే తానే బరువై సాగే

మల్లియలారా మాలికలారా... మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా...

చరణం 2:

చెదరిన వీణ రవళించేనా.... జీవన రాగం చివురించేనా
చెదరిన వీణ రవళించేనా.... జీవన రాగం చివురించేనా

కలతలు పోయి వలపులు పొంగి...
కలతలే పోయి వలపులే పొంగి... మనసే లోలో పులకించేనా

మల్లియలారా మాలికలారా... మౌనముగా ఉన్నారా

గృహలక్ష్మి (1967)


చిత్రం: గృహలక్ష్మి (1967)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, భానుమతి

పల్లవి:

కన్నులే నీకోసం కాచుకున్నవి వెన్నెలలే అందుకని వేచియున్నవి

కన్నులే నాకోసం కాచుకున్నవా...వెన్నెలలే అందుకని వేచియున్నవా

చరణం 1:

ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
కొంటెతనం ఈ రేయి కూడదన్నవి...కూడదన్నవి

కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా

చరణం 2:

అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది

తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి
చందురుడే నిన్నుగని జాలిపడాలి...జాలిపడాలి

కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

చరణం 3:

విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది

ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు
మాటలింక చాలునులే మామవున్నాడు...చందమామవున్నాడు

కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి